అల్లుడు వచ్చిందాకా అమావాస్య ఆగదు.
కార్తికమాసం వచ్చిందంటే కోటిలింగాల పల్లెలో రోజూ పండగే. కోటిలింగాల పల్లెలో కోటేశ్వరరావు గారు పెద్ద రైతు. ఆయనకు అనేక ఎకరాల పొలాలేకాక, మామిడి, నిమ్మ, అరటి వంటి అనేక పండ్ల తోటలు కూడా ఉన్నాయి.
ఐశ్వర్యవంతుడినన్న గర్వం లేకుండా ఊర్లో అందరికీ తలలో నాలుకలా ఉండి అందరి బాగోగులూ కూడా చూసేవాడు.
అందరి కీ ఆయనంటే గౌరవాభిమానాలు.
ఆయనకు నలుగురు కొడుకులు, ఒకే ఒక కుమార్తె. నలుగురు కొడుకులకూ చక్కగా చదువులు చెప్పించి, పెళ్ళిళ్ళూ చేశాడు. అంతా రెక్కలొచ్చిన పక్షుల్లా వారి చదువులకు తగిన ఉద్యోగాల తో దేశంలోని వివిధ నగరాలకు చేరిపోయారు.
చివరగా పుట్టిన కూతురంటే కోటేశ్వర్రావు దంపతులకు ప్రాణం, గౌరీదేవి అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచు కు న్నారు.
అన్నలు మాత్రం గారాబంతో చెడగొట్టక నేటికాలానికి తగినట్లు ఆడపిల్లని ఇంట్లో కూర్చోబెట్టనివ్వక తండ్రికి నచ్చజెప్పి చక్కగా చదివించారు.
ఎమ్మెస్సీ గోల్డ్ మెడలిస్టై, పీహెడీ చేసి, డాక్టరేట్ చేసి తిరుపతి మహిళా కళాశాలలో ప్రొఫెసరైంది. ఆమెకు తగిన చక్కటి వరుడి ని అన్నలంతా కలసి వెదికి ఘనంగా వివాహం చేశారు. అల్లుడికీ తిరుపతిలోనే ఉద్యోగం.
ఐతే, ఎవరెక్కడున్నా తండ్రి కోరిక ప్రకారం అంతా కార్తిక మాసపు వన మహోత్సవాలకు మాత్రం తప్పక వస్తారు. కొడుకు లందరితో పాటుగా కూతురూ అల్లుడూ కూడా ఆ రోజుకు తప్పక వచ్చేవారు.
కార్తిక పున్నమిరోజున కోటేశ్వర్రావు గారి నిమ్మ తోటలోప్రత్యేకం గా పెంచుతున్న ఉసిరి వనంలో అనేక ప్రాంతాలనుంచి అనేక మంది వచ్చి కార్తీక భోజనాలు చేసుకుని అక్కడే ఉన్న శివాల యం లో పూజలూ నోములూ, వ్రతాలూ, చేసుకుని వెళ్లేవారు.
ఉదయం నుంచి సాయంకాలం వరకూ సందడే సందడి. కోటిలింగాల పల్లెకు గుర్తింపంతా కోటేశ్వర్రావు ఉసిరివనమే. కార్తీ కమాసం వచ్చిందంటే చాలు పల్లెంతా ఆ తోటలోనే ఉంటుంది.
ఆ ఏడాది కోటేశ్వర్రావు గారి వివాహమై 60సం. కావటాన ఆ దంప తులకు ప్రత్యేకంగా సన్మానం జరపాలని, సహస్ర చంద్ర దర్శ నం భారీగా నిర్వహించాలని ఆ ఊరి పెద్దలంతా నిశ్చయించి వారి బిడ్డలకంతా తెలియపరచారు.
అంతా ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాదుల నుంచి మూడు రోజులు ముందే తల్లిదండ్రులకు అనేక బహుమతులతో వచ్చి చే రారు. గౌరీ కూడా వచ్చింది కానీ, ఆమె భర్త భాస్కర్ రావు ఆఫీ సు పనిమీద వేరే దేశం వెళ్ళినందున ఆ రోజుకు తప్పక వస్తానని ఫోన్ ద్వారా బావలందరికీ తెలిపాడు.
ఆ పున్నమి రోజు రానే వచ్చింది. పూజలు అన్నీ అయ్యాక కోటేశ్వర్రావు దంపతులను సన్మానించే సమయం వచ్చింది. ఊరు ఊరంతా ఉసిరి తోటలో ఏర్పాటుచేసిన అందమైన తాటా కు పందిళ్ళ క్రిందచేరి ఆ సన్మాన కార్యక్రమాన్ని, ఆపైన వారిచ్చే విందారగించనూ కాచుక్కూర్చున్నారు.
మధ్యాహ్నమైంది అల్లుడు రాలేదు. సూర్యుడు క్రింది కి వాలు తున్నాడు.
అందరికీ ఆకళ్ళవుతున్నాయి. కోటేశ్వర్రావు గారు మాత్రం అల్లుడు రాందే ఏ పనీ కానిచ్చేది లేదని ఖరాఖండీగా చెప్పే శాడు. చిన్నా, పెద్దా కూర్చుని కూర్చునీ ఆకలికి సోలిపోతున్నారు.
కోటేశ్వర్రావు పెద్దకొడుకు బావగారికి ఫోన్ చేశాడు.
భాస్కర్ "బావగారూ నేను రాత్రికి కానీ రాలేను నాఫ్లైట్ లేటైంది. మీరుకానివ్వండి. అంతా ఆకళ్ళతోఉసూరుమంటున్నారు.బావుం డదు.” అని అంటూ ఆయన మామగారైన కోటేశ్వరరావు గారికి ఫోనివ్వమని "మామగారూ! అల్లుడు వచ్చేవరకూ అమావస్య ఆగదంటారు కదా! దయచేసి కార్యక్రమంకానివ్వండి" అని చెప్పాక కోటేశ్వర్రావు గారు అంగీకరించారు.
అదిరా మనవడా- అల్లుడు వచ్చేవరకూ అమావాస్య ఆగదు - అంటే ఎవరికోసమూ కాలం ఆగదన్నమాట. ఎవరిపని వారు అవ కాశాన్ని బట్టి చేసుకుపోవాలి. కాలం భగవత్ స్వరూపం, కాలయ నమః, కాల్కాలాయ నమః, కాలస్వరూపాయ నమః అని భగవం తుని నామాలురా!, తెలిసిందా?" అని తాతగారు చెప్పగా విని, తెలిసిందని తల ఊపి 'మా స్నేహితులు వచ్చారు, నా ఆటల సమయమైంది. వెళ్ళొస్తాను తాతా' అంటూ తుర్రుమన్నాడు మనవడు.
****
No comments:
Post a Comment