Tuesday 9 April 2019

10. అతి వినయం ధూర్త లక్షణం.


10. అతి వినయం ధూర్త లక్షణం.
మాదాపురంలో మల్లన్న అనేరైతుకు పాతికెకరాలమాగాణి పొలం ఉంది. నీటి వసతి బాగా ఉండటాన, ప్రతి ఏడాదీ రెండు పంటలు పండించే వా డు. పిల్లలంతా చదువు కుని నగరాల్లో స్థిరపడటాన, అతడికీ వయస్సు మీరు తుం డటాన ఎవరైనా మంచి పాలేరుని ఇంట్లో ఉంచుకుంటే సాయానికి సాయం పొలం పనులకు  పనులూ సాగుతా య ని యోచించ సాగాడు.
 మల్లన్నా , భార్య ,మాంచాలీ ఇద్దరూ మంచి మనస్సున్న వారు. అమాయ కులుకూడా. తమ వద్ద ఉన్నది దాచుకోక అవసరానికి  వచ్చిన వారిని ఆదుకునేవారు. పెద్దలోగిలి ఉన్న ఇల్లు, పాడీ పంటా అన్నీ ఉన్నా వయ స్సు వల్ల వచ్చే బలహీనత మల్లన్న, మాంచాలీ లలో కూడా వచ్చిం ది. వయస్సులో ఉండగా పాతికెకరాలూ తానే దున్ని  పొలా నికి నీరుపెట్టేవా డు. మాంచాలీ తగినంత సాయం చేసేది. ఒళ్ళుదాచుకున్నవారుకాదు. ఇప్పుడేమో ఒళ్ళు దాచుకోమంటోంది  వయస్సు వస్తుండటాన .
                 పిల్లలేమో ఐనకాడికి పొలం అమ్మేసి నగరానికి వచ్చేయమని పోరసా గా రు." ఎందుకు నాన్నా! ఇంకా పాకులాడుతారు? మేం సంపాదిస్తున్నాం కదా! మీరు మా కు బరువా? నగరానికి వచ్చేయండి " అని పెద్ద పండుక్కు వచ్చిన ప్రతి ఏడాదీ మరీమరీ చెప్పసాగారు.
       మాంచాలి " నిజమే నాయన్లారా! కానీ మాకు అక్కడ కాలం గడవదయ్యా! ఇలా మట్టిపనుల్లో పుట్టిపెరిగిన వా ళ్ళం. మాకూ పనిలేకపోతే ప్రాణం నిల వదు. మీకూ ఇబ్బందే, కానీ చూద్దాం " అంటూ  చెప్పేది.
    ఒక కార్తీ కమాసంలో పొలంపనిలో మంచుకు తిరిగిన మల్లన్నకు జ్వర మొచ్చి బాగా బలహీన మయ్యాడు. సమయంలో తనకు బాగా ఎరిగు న్న రైతు స్నేహితులకు ' ఒక పాలేరును  బాగాతెలిసిన వాడిని చూడండయ్యా! మాకు సాయానికి ,'అనిచెప్పగా , పక్క ఊర్లో ఉన్న ఒక మనిషిని పిలి పించాడు తోటిరైతు రామన్న.
    " రామన్నా! నీకు ఇతగాడిని బాగా తెలుసు కదా!మేమా వయసుడు గుతున్నవాళ్ళం. నీతీ  నిజాయితీ, ఉంటే ఫర వాలేదు కానీ లేకుంటే మాకు ఇబ్బంది కదా! " అని అడి గాడు.
    దానికి రామన్న " లేదు మల్లన్నా! మా బావమరిది దగ్గర ఐదేళ్ళు చేసా డు. వాడూ పొలం అమ్ముకుని నగర మెళ్ళి పోయక ఊరికే ఉన్నాడు. అందుకే పిలిపించాను. నాకు తెలిసినంత వరకూ కామయ్య నిజాయి తీ పరుడే, మీరే చూడండి మల్లన్నా , నచ్చకపోతే పంపించేద్దారి " అని చెప్పాక , ఇద్దరూ కామయ్యను పనికి పెట్టుకున్నారు.
        కామయ్య  ఉదయాన్నే మల్లన్నకు ముఖప్రక్షాళనకు నీళ్ళు  అందించే దగ్గర నుంచీ, స్నానానికి ఏర్పాట్లూ, నిద్ర పోయేప్పుడు పక్కలేయడం, కాళ్ళు పిసకడం వరకూ  చేసే వాడు. ఇంత ప్రేమగా అడక్కుండానే పనులు చేసి పెడుతున్న కామయ్యంటే మల్లన్నకూ, మాంచాలికీ ఇద్ద రికీ నెలరోజుల్లోనే అతనిపై సద్భావం ఏర్పడింది.
   క్రమ క్రమేపీ చాలా పనులు కామయ్యకే అప్పగించ సాగా డు మల్లన్న. ఎరువులు కొనడం, కూలీలకు రోజు కూలీ పంచడం వంటి డబ్బుతో కూడిన పనులన్నీ అప్పగించ సాగాడు.
  పెద్ద పండక్కు మల్లన్న పిల్లలంతా దిగారు .ఇల్లంతా కళకళ లాడ సాగింది.                                                                       మల్లన్నపిల్లలు  కామయ్య తన తండ్రికే కాక తమకూ అడక్కుండానే చేసే అనవసరపు పనులన్నీ చూసి కొంత అనుమానం రాసాగింది. చేతులు కట్టుకుని నిల్చోడం , తమ కూ కాళ్ళు వత్తుతానని రావడం  వంటి పనులు వారి కి కొంత అనుమానం కలిగించాయి.
          తండ్రిని అడిగి ఆసంవత్సరం పొలంపనులకెంత ఖర్చైందీ , ఇలా పొలం సాగుచేయడం మేలా ,వృధానా చూద్దామని లెక్కలు అడిగి చూసా రు. దాన్లో వారికి కొంత మోసం కనిపించింది.
    రహస్యంగా మల్లన్నతో "నాన్నా! కామయ్య నమ్మ దగి న వ్యక్తిగా అని పించడంలేదు. కొద్దిగా జాగ్రత్తగా ఉండ టం మంచిది. మేమున్న వారంలో పరీక్షిస్తాం.ఇతని ప్రవర్తన ' అతివినయం ధూర్త లక్షణం ' అన్న ట్లుంది. నీవుమామూలుగానే ఉండు " అనిహెచ్చరించి పొలంలో పండిన వడ్ల బస్తాలు  ఇంటికి చేరేసే సమయంలో రహ స్యంగా గమనించారు. ఐదో వతు ధాన్యం పక్కకు వెళ్ళ డం,అది పొరుగూరు చేరడం , కొబ్బరితోటలో దింపిన కొబ్బ రి బోండాలు కూడా కొన్ని బస్తాలు పక్క ఊరుచేర డం గమనించాక  , ఇహ ఏమార డం మంచిదికాదని తల చి " నాన్నా! పొల మంతా కౌలు కిచ్చి మీరు సంవత్సరం లో కొద్దిరోజులు మాదగ్గరా, కొద్ది రోజులు ఇక్కడా గడపం డిఅదేమేలు. " అని పొలాన్నంతా కౌలుకిచ్చేసి , కామ య్యను పనిమానిపించి అమ్మానాన్న లను కొద్ది కాలం అనిచెప్పి తమతో తీసు కె ళ్ళారు పిల్లలు. అమాయకులైన మల్లన్న  దంపతులు కామయ్య  చేయ 
నున్న ప్రమాదం నుంచీ  తప్పించుకు న్నారు  .
                                               ****

No comments:

Post a Comment