Tuesday 4 August 2020

దేశమాత దీవెన.


దేదేశమాత దీవెన. 


   ఆరోజు తమ మేనకోడలికి పెళ్ళి కుదిరిందని వచ్చిన ఉత్తరం పట్టుకుని ఆఘమేఘాలమీద బయలుదేరి వచ్చింది మేనత్త మేఘన.
   " ఏంటీ! ఒక్కగా నొక్క కూతుర్ని మీలటరీలో పని చేసేవాడికిచ్చి చేస్తున్నారా రాఘవా!అన్నయ్యా!వారికి లేకపోతే నీకన్నా ఆలోచన ఉండద్దూ! మీ అందరికీ ఏమన్నా పిచ్చా? ఎం.ఏ. చదివి టీచరుద్యోగం చేస్తున్న రుద్రమణికి పెళ్ళికొడుకే దొరకడా! ముగ్గురన్నలముద్దుల చెల్లాయి రుద్రమణి!.."అంటూ ఏదేదో మాట్లాడుతున్న మేనత్త మాటలకు అడ్డొచ్చాడు మణి పెద్దన్న ప్రదీప్ రాఘవన్  .
"అత్తా! మణి ఇష్టపడ్డాకే ఈ సంబంధం స్థిరం చేశాం. వాళ్ళ స్కూల్లో పని  చేసే పెద్ద పంతులు ప్రకాశం గారి ఏకైక కుమారుడు శివాజీ.వారిది దేశభక్తి గలకుటుంబం. చాలా మంచి మనుషులు .అంతా సెటి లైంది మేఘనత్తా! ముందుగా నీకే తెలియపరచాము. నీకంటే మాకు ముఖ్యులు ఎవరున్నారు చెప్పు!వివాహం కూడా చాలా సింపుల్గా చేయమన్నారు.నీకు తెల్సుగా మణికి దేశభక్తి ఎక్కువని, దేశానికి సేవచేసేవాడే తనకు భర్తగా కావాలని పెట్టు పట్టింది అత్తా!"  అని ఆమెను స్థిమిత పరిచాడు ప్రదీప్ రాఘవన్  .
 అంతావిన్నాక అంగీకరించింది మేఘన. ఆమెకు రుద్రమణి అంటే ప్రాణం.తనకు కొడుకులు లేక పోడాన తన ఇద్దరు కూతుళ్ళతో కలుపుకుని మూడో కూతురిలా ప్రేమిస్తుంది ఆమె రుద్రమణిని.కొడుకు వుంటే  మణిని వదులుకునేది కాదు. 
అంతా తానేఐ చకచకా పెళ్ళిపనులు చేసింది మేఘన. అలా అనుభవమున్న మేఘనత్త తోడుగా వుండి అన్నీ చేయడం అందరికీ చాలా సంతోషాన్నీ ,తృప్తినీ ఇచ్చింది. పెళ్ళిపనులన్నీ కుదురుగా పూర్తై  శివాజీకీ రుద్రమణికీ వివాహం జరిగిపోయింది.
  శివాజీ శలవు పూర్తై తిరిగి డ్యూటీలో జాయినవను వెళ్తూ మణితో ఇలా అన్నాడు.
"మణీ! నీలాంటి భార్య నాకూ, నీవంటి ఉత్తమురాలు కోడలుగా మా తలిదండ్రులకూ లభించడం మా అదృష్టం. ఒకరకంగా నీకుమాత్రం అన్యాయమే! నేను యాడాదికి మూడు నెలలు మాత్రమే రాగలను. అదీ నమ్మకం వుండదు ఒక్కోమారు. అందాకా అమ్మా నాన్నలకు నీవే దిక్కు, వారే నీకు అండా దండా." అంటూ బాధ పడ్దాడు.
" మీరేమీ విచారించ కండి, వారిని మీలాగా చూసుకుంటాను. దేశమంటే ఇలా భక్తి ఉన్న వ్యక్తి నాకు భర్తగా లభించాలని కోరుకున్నాను. నా కోరికను భగవంతుడు తీర్చాడు. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి. మీ రాక కోసం మేమంతా వేయికళ్ళతో ఎదురుచూస్తుంటాం" అంటూ ధైర్యం చెప్పి పంపింది రుద్రమణి.
మరుసటి సంంవత్సరం లాభంగానే వచ్చాడు  శివాజీ. ప్రెమోషన్ తో. అతడికీ లాభాన్ని అందించింది రుద్రమణి వంశోధ్ధారకునితో.
మరి రెండేళ్ళకు  శివాజీకి ఇంకోప్రెమోషన్ వచ్చింది. అలా అలా శివాజీకి పెద్ద మిలటరీ ఆఫీసరయ్యాడు. రుద్రమణి ముగ్గురు పిల్లల తల్లైంది.ఇద్దరు కొడుకులూ ఒక కుమార్తె.
 భర్త దూరంగా ఉన్నా బిడ్దలను బాగాచదివించి దేశ భక్తులుగా తయారు చేసింది. తండ్రి మరణ వార్త విని వచ్చిన శివాజీ  చివరి రోజుల్లో తాను దగ్గర లేనందుకు  ఎంతో బాధ పడ్డాడు. కర్మ క్రతువులు పూర్తవు తుండగానే దేశ సరిహద్దుల్లో , మనదేశ సరిహద్దులను నియమాలను అతిక్రమించి దాటను యత్నించే విద్రో హుల కదలికలు పసి కట్టిన అధికారులు శివాజీని   వెంట నే రమ్మని టెలిగ్రాం ద్వారా కబురంపారు.
 శివాజీ ఆఘమేఘాలమీద బయల్దేరి తిరిగివెళ్ళాడు . అతడికి దేశమంటే  ప్రాణం. దేశ రక్షణలో తన సర్వస్వాన్నీ అర్పించను వెనుకాడని అద్వితీయ దేశ భక్తుడు  .
 వెళ్ళేముందు" మణీ! ఈ సం.రిటైరై వచ్చేస్తాను. నిన్నూ ,అమ్మనూ, పిల్లల్నూ చూసుకుంటాను." అని చెప్పివెళ్ళాడు.
రుద్రమణి పెద్దకొడుకు మీలటరీ డాక్టర్, రెండో కొడుకు విమానాలు తయారు చేసే కంపెనీలో ఇంజనీర్.కుమార్తె లక్ష్మీబాయి కేంద్రీయ విద్యాలయంలో లెక్చరర్. శివాజీ  రాగానే ముగ్గురికీ పెళ్ళిళ్ళు చేయాలని ఆలోచిస్తూన్న రుద్రమణికి అశనిపాతంవంటి వార్త అందింది.
శివాజీ మరికొందరూ వెళుతున్న యుధ్ధవిమానం మాయమై పోయిందని ఎంతవెతికినా కనపడలేదని దాన్లో శివాజీ  తోపాటుగా పది మందిమిలటరీ ఆఫీసర్లు ఉన్నారనీనీ.
 అతడి తాలూకూ వస్తువులన్నీ పంపుతున్నామని వార్త అంది మణి దిగ్భ్రమలో పడిపోయింది. ఆదిగులుతో భాస్కర్ తల్లి తుది శ్వాస విడిచింది.                                   
 "ఎంతకాలమని చింతిస్తాం చెప్పు చెల్లాయ్! బావగారు దేశభక్తులు, దేశంకోసమే ప్రాణం అర్పించారు. దేశ రక్షణ లో ప్రాణాలను పణంగా పెట్టే అసలైన దేశభక్తులు మిలటరీ ఉద్యోగులు. ఏంచేస్తాం చెప్పు మణీ! కావల్సిన పనులు వేగవంతం చేసుకో, గుండెదిటవు చేసుకో, అన్నీ తెలిసే కదా నీవీ సంబంధం అంగీకరించావు. బావ మనస్సు నీవు దుఃఖించి కష్టపెట్టకు.బావ గారి ఆత్మకుశాంతి ఉండదు. 'ధైర్యే సాహసే మణిః.'అని ఋజువు చేసుకుని బావ ఆత్మకు శాంతి కలిగించు. నీపేరే రుద్రమదేవి నాన్నగారు రుద్రమణి అని నీకు పేరు పెట్టారుకదా! రుద్రమదేవంత ధైర్యం ఉండాలినీకు ఎప్పటికీ. " అని ధైర్యం చెప్పారు అన్నలు ముగ్గురూనూ. 
       మణి అన్నల మాటలు మనస్సుకు పట్టించుకుని ముగ్గురు పిల్లలకూ చక్కని సంబంధాలు అన్నల సాయంతో చూసి వెంట వెంటనే మూడేళ్ళలో ముగ్గురిపిల్లల పెళ్ళుళ్ళూ  చేసేసింది.
    "అమ్మా! ఇంతకాలం ఎంతో ఓర్పుతో నేర్పుగా మమ్మల్ని పెంచి పెద్దచేశావ్. ఇహ నీవు హాయిగా విశ్రాంత జీవనం గడుపు, పెద్దన్నతో హిమాచల్ ప్రదేశ్ లోనో,చిన్నన్నతో బెంగుళూరులోనో, నాతో అలహాబాద్ లోనో ఉండు.వంటరిగా మాత్రం ఇక్కడ ఉండటం మే మెవ్వరం అంగీకరించం." అంది కుమార్తె లక్ష్మీబాయి.                                                         " తల్లీ లక్ష్మీ! మీఅందరికీ అమ్మమీద ఉన్నప్రేమకు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ మీనాన్నతో వివాహం, మీ అందరి పుట్టుకలూ, తాతా, బామ్మగార్లూ నివసించిన ఈ ఇంటిని వదలి నేనెక్కడికీ రాలేను. ఏమో మీనాన్నగారు ఎక్కడైనా బ్రతికి ఉండి ఎప్పటికైనా తిరిగివస్తే నేనిక్కడ లేకపోతే ఎలా? అందరం ఏమయ్యా మో అని ఆయన భయపడరూ?మన జాడ ఆయనకెలా తెలుస్తుంది చెప్పూ?" అంది కళ్ళలోనీరుకారుతుండగా.                                                                                                          " అమ్మా!  నీదెంత పాజిటివ్ థింకింగ్ అమ్మా!ఇలాంటి మనస్సు , ఆలోచన మాకూ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. పాజిటివ్ థింకింగ్ వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి, దానివల్ల శుభపరిణామాలు లభిస్తాయి. అమ్మా! నీవెంతో  గొప్ప ఆలోచనాపరురాలివి! " అంటూ తల్లిని ఆలింగనం చేసుకుంది లక్ష్మీబాయి .
 తల్లి అలా అన్నాక ఎవ్వరూ ఆమెను బలవంత పెట్ట లేదు. 
అంతావెళ్ళిపోయాక రుద్రమణి తన ఉపాధ్యాయ వృత్తిలో  మునిగి పోయింది. ఆమెకు వృత్తిపట్ల చాలా ప్రేమ, అంకిత భావమూనూ. బాలబాలికలను దేశభక్తులుగా చేయనేఆమె ఆవృత్తి చేపట్టింది,                                                                                                                 
      ఆరోజు శివాజీ జన్మదినం .రుద్రమణి పనిచేసే స్కూల్లో అతడి సేవల గురించీ , దేశభక్తి గురించీ ఆ నగరం లోని పెద్దలు ఎంతో గొప్పగా ఉపన్యసించారు. సర్కార్ స్కూళ్లలో  పేద పిల్లకందరికీ, వృధ్ధా శ్రమంలో వృధ్ధులకూ, అనాధ శరణాలయాల్లో బిడ్డలకూ , బట్టలూ స్వీట్సూ పంచి వచ్చింది రుద్రమణి  అందరిసహాయంతో.
 రోజులు సాగుతున్నాయి ఎవ్వరిప్రేమేయం లేకుండానే.
శివాజీని అతడి పుట్టిన రోజున అంతా పొగట్టం, అతడి దేశభక్తిని గూర్చి మాట్లాడటం ,విన్నప్పటినుంచీ శివాజీ పదేపదే గుర్తువస్తుండగా మరునాడు ఉదయం అతడి చిత్రపటం ముందు జ్యోతి వెలిగించి ,
" మీ బిడ్డల నందరినీ నా శాయ శక్తులా పెంచిపెద్దచేసి, దేశభక్తులుగా తీర్చిది ద్దాను. మీరు లేరన్న లోటుతప్ప నా బాధ్యత లన్నీ తీర్చుకుని దేనికోసమో తెలీకుండానే ఎదురు చూస్తున్నా ను."అంటూ కంటనీరు పెట్టుకుంటుండగాడోర్బెల్ మోగింది.. 
                                                                                                           వెళ్ళి చూసి ఒక్క క్షణం నిరుత్తరురాలైంది మణి. వచ్చింది ఎవరో కాదు, తాను ఎవరికోసం ఇంతకాలంగా కళ్ళలో వత్తులు వేసుకుని , తప్పక తిరిగి వస్తారని నిండు మనస్సుతో ఎదురుచూస్తూ ఉందో  ,తన సర్వస్వం ఐన శివాజీ!.
 "మణీ ! నేనే!  "అంటూ దగ్గరకొచ్చి ఆలింగనం చేసు కుంటున్న వ్యక్తిని పట్టి పట్టి చూస్తూ "మీరు -- నిజమే నా ! నాకళ్లను నేను నమ్మవచ్చా?" అంది ఉద్వేగం తో.
"మణీ! నేనే! నమ్ము. విమాన ప్రమాదంలో ఎక్కడో పడి పోయాం మేమంతా . అడవిలోంచీ ఎలా బయట పడ్డామో మాకే తెలీదు.కోయ దొరలు కాపాడారు. మాలో కొందరు ఇంకా కోలుకోనే లేదు. మరికొందరు ఏమయ్యా రో తెలీనే లేదు.మా విమానాన్ని ముష్కరులు పేల్చే శారు. క్రిందపడి ప్రాణాలతో ఉండటం చిత్రమే! మెదడుకు తగిలిన దెబ్బవల్ల ఙ్ఞాపకశక్తి పోయింది. నేనేవరో నాకే తెలీకుండా ఈ ఎనిమిదేళ్ళూ గడిచి పోయింది. మనిషిగా ఉన్నానేగానీ ఏమీ తెలియలేదని కోయదొరచెప్పాడు. ఆ ధన్వంతరి కోయదొర వాడిన  మూలికావైద్యం వల్ల 10 రోజులక్రితం తిరిగి నాకు మెల్లిగా ఙ్ఞాపక శక్తి వచ్చింది. మా అధికారులకు సమాచారం తెలిపాను. వారు నిన్ననే నన్ను హెలికాప్టర్ ద్వారా తెచ్చి రాజధానిలో దింపారు. మిగతావారిని వైద్యశాలలకు తరలించారు. తప్పక నీవు ఇక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటావని భావించి నేను వెంట నే వచ్చాను మణీ! నిన్న ఆంధ్ర దేశంవచ్చాక అదృష్టవశాత్తూ పాత న్యూస్ పేపరొకటి దొరికింది. నీవు నా జన్మదినం నాడు చేసిన సేవాకార్యక్రమాల విశే షాలు చదివి ఎంతో సంతోషించాను.ఇదో ఈ పేపర్ వల్లే నీవు ఇంకా ఇక్కడే నాకోసం ఎదురుచూస్తూ ఉన్నావని వచ్చేశాను. "అంటూ శివాజీ చెప్పాక రుద్రమణి వెంటనే ఆశుభ సమాచారం తన బిడ్డలకూ  అన్నలకూ, మేత్తకూతెలియపరిచింది .                                                                              
అంతా  ఆఘమే ఘాల మీద వచ్చి వాలారు.
 అన్నలంతా " అమ్మా! మణీ! నీ జీవితంలో తిరిగి వసంతం వచ్చిందమ్మా! మీ దేశభక్తే మిమ్ము కాపా డింది. దేశమాత కరుణ చాలా గొప్పది." అని సంతోషంతో ఆమె నుదురుపై ముద్దులు పెట్టి ఆనందించారు.
" అమ్మ పాజిటివ్ ఎనర్జీ నాన్నగారిని తిరిగి తెచ్చింది మా ఇంటికి వెలుగు తెచ్చింది. మా నాన్న దేశభక్తీ, మా అమ్మ మంచి మనసూ మా ఇంట తిరిగి వెలుగు నింపింది .మేం మీ పిల్లలం కావడం నిజంగా మా అదృష్టం " అంటూ అమ్మా నాన్నల చుట్టూ తిరుగుతూ క్లాప్స్ కొట్టారు పిల్లలంతా.
మేనత్త వారందరినీ చిరునవ్వు తో మురిపెంగాచుసుకుంటూ అందరికీ పెద్ద పళ్ళెంలో ఎర్రనీటిలో కర్పూరం వెలిగించి దిష్టి తీసింది.     

Friday 31 July 2020

గాయత్రీ మంత్రం జప విధానాలు


                        గాయత్రీ మంత్రం జప విధానాలు
ఓం భూర్భువస్వః
తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియోయోనఃప్రచోదయాత్
తల్లిని మించి న దైవము లేదు.  గాయత్రీమంత్రమును మించినమంత్రం  మరొకటి లేదు.-
గాయత్రీ మత్ర ద్రష్ట విశ్వామిత్ర మహషి.ఆయన పేరులోనే విశ్వానికి మిత్రుడని తెలుస్తున్నదికదా! ఈ గాయత్రీ మత్రం లోకానికి ప్రసాదించడం ద్వారా ఆయన నిజంగానే లోకానికంతా మిత్రుడయ్యాడనవచ్చు. 
గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదము లో చెప్పబడినది.
గాయత్రి అనే పదము 'గయ', 'త్రాయతి' అను పదములకూడికతో ఉంది.
 "గయాన్‌ త్రాయతే ఇతి గాయత్రీ" అని ఆదిశంకరుల వారు వివరించారు. 'గయలు' అనగా ప్రాణములు ‘త్రాయతే' అనగా రక్షించడం. ప్రాణములను రక్షించేది  గాయత్రీ మంత్రం.
వాల్మీకి మహర్షి ప్రతి వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్ష రమునుచేర్చి 24 అక్షరములతో 24,000 శ్లోకాలతో శ్రీ మద్రామాయణమును రచించారు. 
అనగా గాయత్రీ మంత్రజపం చేయడం అంటే రామాయణాన్ని పఠించడంతో సమానం అనిభావించవచ్చు.
  గాయత్రీ మంత్రం లోని ప్రతి అక్షరం బీజాక్షరము. మహిమాన్వితమైనది.  ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించి నట్లే.
ఈ మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి.
ఓం = సర్వరక్షకుడైనపరమేశ్వరుడు .
భూః = సత్ స్వరూపం
భువః = చిత్ స్వరూపం .
స్వః = ఆనంద స్వరూపం.
తత్ = ఆయన ఇలాంటి సచ్చినానంద లక్షణములు గల పరమేశ్వరుడు.
సవితుః = ఈ సృష్టి కర్త.
వరేణ్యం = సుఖ స్వరూపుడగుటచే జీవులందరి చేత ఆరాధింపబడే వాడు.
భర్గః = శుద్ధ స్వరూపుడు అనగా పాపరహితుడు.
దేవస్యః = అట్టి అనేక దివ్యగుణములు కలిగిన దేవుని యొక్క దివ్యమంగళస్వరూపము.
ధీమహి = హృదయాంతరాళాల్లో నిల్చి,
యః = ఆ పరమేశ్వరుడు.
నః ద్యః = మా బుద్ధులను.
ప్రచోదయాత్ = సత్కర్మలయందు ప్రేరేపించి అభ్యుదయ, శ్రేయములు పొందుటకు సమర్ధులముగా చేయుగాక.
గాయత్రీ మంత్రంలో 24 అక్షరములతో పాటు 24 మంది దేవతా మూర్తుల శక్తి అంతర్గతంగా ఉన్నది.
24 గాయత్రీ మూర్తులకు చతుర్వింశతి 'గాయత్రీ  అనిపేరు.
గాయత్రీమంత్రములోని 24 అక్షరాలలో 24 మంది దేవతామూర్తులు కొలువై ఉన్నారు.
తత్- విఘ్నేశ్వరుడు
-   నరసింహస్వామి
వి -   మహావిష్ణువు
తుః- శివుడు
-శ్రీకృష్ణుడు
రే -   రాధాదేవి
ణ్యం -      శ్రీ మహాలక్ష్మి
-   అగ్ని దేవుడు
ర్గోః - ఇంద్రుడు
దే -  సరస్వతీ దేవి
-   దుర్గాదేవి
స్య - ఆంజనేయస్వామి
ధీ -  భూదేవి
- సూర్య భగవానుడు
హి -  శ్రీరాముడు
ధి -  సీతాదేవి
యో -చంద్రుడు
యో  - యముడు
నః - బ్రహ్మ
ప్ర -  వరుణుదు
చో - శ్రీమన్నారాయణుడు
-  హయగ్రీవుడు
- హంసదేవత
త్ -  తులసీమాత
24మంది దేవతా మూర్తులకు మూలాధారమైన ఈ గాయత్రీ మంత్రాన్ని జపిస్తే 24 మంది దేవతామూర్తులనూ స్మరించినట్లే, వారి మంత్రాలు జపిచినట్లే.గాయత్రీ మంత్రజపంవలన కీర్తి, దివ్యమైన తేజస్సు, సకల సంపదలు, సమస్త శుభాలు , జ్ఞానవృధ్ధి కలుగుతాయి.
సర్వశ్రేష్టమైన ఈ గాయత్రి మంత్రాన్ని గురుమంత్రము అంటారు. ప్రాచీనకాలం నుండి ఈమంత్రాన్ని అనేకమంది మునులు, సాధకులు మహాపురుషులూ  జపిస్తూ వచ్చారు.. —
సమస్త జీవులకు తేజస్సును, మనస్సును, బుద్ధిని ప్రేరేపించేది, మంచి మార్గాన నడిపించేది, సర్వలోకాలను సృష్టించేది, జ్ఞాన స్వరూపమైనది ‘గాయత్రి’. వేదమాత గాయత్రి కరుణామయి. పరమశాంత స్వరూపిణి. అడిగిన వారికి లేదనకుండా అన్నీ ఇచ్చే దయాసాగరి. 
పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం వీటి తేజస్సును తనలో ఇముడ్చుకుని పంచముఖాలతో మనకు దర్శనమిచ్చి కాపాడు తుంది గాయత్రీమాత.
గాయత్రీమాత ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాల వలన తెలుస్తున్నది. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. 
గాయత్రీమాత ఐదుకుఖాల రంగులూ ఇలా ఉంటాయి.
మొదటి ముఖం -ముత్యపు రంగు, 
రెండవముఖం -విద్రుమ అనగా పగడపు రంగు, 
మూడవముఖం- హేమము అనగా  బంగారపు రంగు,
నాల్గవ ముఖం నీలవర్ణము.
ఐదవముఖం తెల్లని రంగు కలిగి తనను స్మరించిన జపించిన వారికంతా ఆరోగ్యము, ఐశ్వర్యము, జ్ఞానము, సర్వము ప్రసాదిస్తుంది.
గాయత్రీమంత్రంలోని  ప్రతి అక్షరంలోనిదేవతలకూ  గాయత్రీ మంత్రాలున్నాయి.

1.తత్       -విఘ్నేశ్వరుడు-
గణేశ గాయత్రి - ఓమ్ ఏకదంష్ట్రాయ విద్మహే వక్రతుండాయ ధీమహి, తన్నోదంతిః ప్రచోదయాత్.
       
2.  నరసింహస్వామి-
నృసింహ గాయత్రి - ఓం ఉగ్రనృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి, తన్నోనృసింహః ప్రచోదయాత్.
       
3.వి  మహావిష్ణువు-
విష్ణు గాయత్రి - ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోవిష్ణుః ప్రచోదయాత్.
       
4.తుః        శివుడు      -
శివ గాయత్రి - ఓం పంచవక్త్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి, తన్నోరుద్రః ప్రచోదయాత్

5.  శ్రీకృష్ణుడు -
కృష్ణ గాయత్రి - ఓమ్ దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోకృష్ణః ప్రచోదయాత్.

6.రే   రాధాదేవి  -
రాధా గాయత్రి - ఓం వృషభానుజాయై విద్మహే కృష్ణ ప్రియాయై ధీమహి, తన్నోరాధా ప్రచోదయాత్.

7.ణ్యం-శ్రీ మహాలక్ష్మి -
లక్ష్మీ గాయత్రి - ఓం మహాలక్ష్మ్యేచ విద్మహే విష్ణుప్రియాయై ధీమహి, తన్నోలక్ష్మీః ప్రచోదయాత్.

8.  అగ్ని దేవుడు    -
అగ్ని గాయత్రి - ఓమ్ మహా జ్వాలాయ విద్మహే అగ్నిదేవాయ ధీమహి, తన్నో అగ్నిః ప్రచోదయాత్.

9.ర్గోః ఇంద్రుడు -
ఇంద్ర గాయత్రి - ఓమ్ సహస్ర నేత్రాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి, తన్నోఇంద్రః ప్రచోదయాత్.

10.దే సరస్వతీ దేవి   -
సరస్వతీ గాయత్రి - ఓం సరస్వత్యై విద్మహే బ్రహ్మపుత్ర్యై ధీమహి, తన్నోదేవీ ప్రచోదయాత్.

11. దుర్గాదేవి  ,
దుర్గా గాయత్రి - ఓం గిరిజాయై విద్మహే శివప్రియాయై ధీమహి, తన్నోదుర్గా ప్రచోదయాత్.

12.స్య       ఆంజనేయస్వామి    
హనుమద్గాయత్రి - ఓం అంజనీ సుతాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి, తన్నోమారుతిః ప్రచోదయాత్.

13.ధీ భూదేవి-
పృథ్వీ గాయత్రి - ఓం పృథ్వీదేవ్యై విద్మహే సహస్రమూర్త్యై ధీమహి, తన్నోపృథ్వీ ప్రచోదయాత్.

14.       సూర్య భగవానుడు.
సూర్య గాయత్రి - ఓం భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి, తన్నోసూర్యః ప్రచోదయాత్.

15.హి        శ్రీరాముడు.
రామ గాయత్రి - ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి, తన్నోరామః ప్రచోదయాత్.

16.ధి సీతాదేవి.
సీతా గాయత్రి - ఓం జనక నందిన్యై విద్మహే భూమిజాయై ధీమహి, తన్నోసీతాః ప్రచోదయాత్.

17.యో     చంద్రుడు.
చంద్ర గాయత్రి - ఓం క్షీర పుత్రాయ విద్మహే అమృతతత్త్వాయ ధీమహి, తన్నోశ్చంద్రః ప్రచోదయాత్.

18.యో     యముడు.
యమ గాయత్రి - ఓం సూర్యపుత్రాయ విద్మహే మాహాకాలాయ ధీమహి, తన్నోయమః ప్రచోదయాత్.

19.నః       బ్రహ్మ.
బ్రహ్మ గాయత్రి - ఓం చతుర్ముఖాయ విద్మహే హంసారూఢాయ ధీమహి, తన్నోబ్రహ్మః ప్రచోదయాత్.

20.ప్ర        వరుణుదు.
వరుణ గాయత్రి - ఓం జలబింబాయ విద్మహే నీల పురుషాయ ధీమహి, తన్నోవరుణః ప్రచోదయాత్.

21.చో       శ్రీమన్నారాయణుడు.
నారాయణ గాయత్రి - ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోనారాయణః ప్రచోదయాత్.

22. హయగ్రీవుడు.
హయగ్రీవ గాయత్రి - ఓం వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి, తన్నోహయగ్రీవః ప్రచోదయాత్.

23.      హంసదేవత.
హంస గాయత్రి - ఓం పరమహంసాయ విద్మహే మాహాహాంసాయ ధీమహి, తన్నోహంసః ప్రచోదయాత్.

24. త్       తులసీమాత.
తులసీ గాయత్రి - ఓం శ్రీతులస్యై విద్మహే విష్ణుప్రియాయై ధీమహి, తన్నో బృందాః ప్రచోదయాత్.
గాయత్రీ మంత్రం జపంలోని వివిధ రీతులు.
1.వాచకజపము -అనగా గాయత్రీ మంత్రాన్ని పైకి జపించడం. మనకే కాక చుట్టూ ఉన్నవారికి కూడా వినిపించేలాగా మంత్ర జపం చేయడం.

2.రహస్య జపం-[మర్మరింగ్-] నాలుక కదులు తుండ గా మన చెవులకు మాత్రమే మంత్రం వినిపించే లాగా జపించడం.

3.అంతర్ముఖ - 'హం' చేయడం. నాలుక కదులు తుండగా నోటినుండీ మాటలు రాకుండా,కేవలం కంఠంలో మాత్రమే కదలిక ఉండేలాగా మాటలు  కాక కేవలం శబ్దం మాత్రమే బయటికి వినిపించేలాగా జపించడం.  అందుకే 'హం ' చేయడం అంటున్నాం.  

4.ఖండజపం నాలుక కదులుతుందికానీ శబ్దం పైకి రాకుండా మంత్రజపం చేయడం.ఇది పైకి వినిపించదు...
5.హృదయజపం- గాయత్రీమంత్రంలోని పదాలు మనస్సులో చూస్తూ ,చదువుకుంటూ మంత్రం జపించడం.పైకి శబ్దం రాదు.మానశికంగా జపించడం.

6.ప్రాణజపం -ఉఛ్వాస,అనగా గాలి లోనికి పీల్చడం, నిశ్వాస అనగా గాలివదిలేప్పుడు గాయత్రి మంత్రం జపించడం. ముందుగా డీప్ బ్రీద్ తీసుకుని  , గాయత్రి చేయడం.దీనివలన ఎక్కువ సమయం గాలిపీల్చి ,మెల్లిగా వదలడం వలన పూర్తిగా ప్రాణవాయువు మనలోకి వస్తుంది.రెండు మార్లు అనగా గాలిపీల్చేప్పుడు ,వదిలేప్పుడు పైకే ,బయటికి వినిపించేలాగా మంత్రజపం చేయడం. ఇలా గాయత్రిని రెండుమార్లు చేసి ఒకటిగా లెక్కించాలి.

7.మస్తిష్క జపం- నుదుటిపై [మూడవకన్ను దగ్గర] దృష్టి నిల్పి గాయత్రీ మంత్రం పైకే వినిపించే లాగా జపించడం.

ఈ సప్త విధ గాయత్రీజపాల్లో మనకు ఏది అనుకూలమో దాన్ని మనం ఆచరించవచ్చు.అంతేకాక ఇలా రహస్య జపం-[మర్మరింగ్-]  అలవరచుకుంటే మనం నిరంతరం
 ఏపనిచేస్తున్నా గాయత్రీమాత ను జపించుకుంటూ ఉండటం జరుగుతుంది.ఖండజపం కూడా చాలామేలైనది. ఇలా  నిరంతరం   జపించవచ్చు. ప్రాణజపం ఇంకా ఉత్తమం గాలిపీల్చి వదిలేప్పుడంతా లోపల జపించుకోవచ్చు.అందుకే మనకు వీలైన విధా నాన్ని ఎంచుకుని నిరంతర గాయత్రీ జపం ఆచరించి అమ్మ కృపకు ప్రాత్రులమవుదాం.

మనవి--  కొన్ని అంశాలు నా గ్రంధాలయం నుండి, కొన్ని ఉపన్యాసాల్లో విన్నవి, కొన్ని గూగుల్ నుండీ గ్రహించినవాని సంకలనం ఈవ్యాసం.