ఫిబ్రవరి
28 జాతీయ విజ్ఞానశాస్త్ర
దినోత్సవం
మనం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల 28న 'జాతీయ సైన్స్ దినోత్సవం' జరుపుతూనే
ఉన్నాం. నోబెల్ బహుమతి గ్రహీత సర్ సి.వి.రామన్ కనిపెట్టిన 'రామన్ ఎఫెక్టు 'కు గుర్తింపుగా
ఈరోజున 'జాతీయ విజ్ఞాన శాస్త్ర' దినోత్సవాన్ని జరపా లని 1986లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి,ఈ ఉత్సవాన్ని1987
లో ప్రారంభించారు.విజ్ఞానశాస్త్ర ఫలాలు సమాజంలోని అందరికీ , అందాలని మనఆకాంక్ష.గత ఐదేళ్లలో చేసిన కృషి ఆధారంగా
విజ్ఞానశాస్త్రాన్ని సమర్థవంతంగా ప్రచారం చేసిన వ్యక్తికి లేదా సంస్థకు, ప్రచార మాధ్యమానికి
,బాలల్లో శాస్త్రీయ దృక్పథాన్ని ప్రచారం చేసిన వారికి వేరువేరుగా ఈ సందర్భం లో జాతీయ
పురస్కారాలు ఇస్తారు. శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం వైపు బాలల్ని ఆకర్షించేందుకు ఈ రోజున
వివిధ పరిశోధనా సంస్థలు బాలల్ని ఆహ్వానించి తమ పరిశోధనల్ని చూపుతాయి.
సైన్స్ ప్రదర్శనలు, పోటీలు, ఇతర
కార్యక్రమాలు భావిపౌరులైన బాలల్లో శాస్త్ర విజ్ఞానం, శాస్త్రీయ దృక్పథంపై అవగాహనను
పెంచుతుంది. దీనికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాం. శాస్త్రీయదృక్పథంవిస్తరిస్తున్న
మేరకు ఈ ఉత్సవాల లక్ష్యాలు నెరవేరినట్లుగా భావించాలి.విజ్ఞాన శాస్త్ర ప్రయోజనాలను ప్రజలకు
తెలియజెప్పి వారిఅనుభవంలోకితెచ్చేప్రయత్నా లలో జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం (నేషనల్
సైన్స్ డే ) ఒకటి. జాతీయ వైజ్ఞానిక, సాంకేతిక ప్రచారమండలిప్రతీసంవత్స రం ఈ ఉత్సవాన్ని
నిర్వహిస్తోంది. ఈ ఉత్సవంలో భాగంగా చర్చలు, ప్రదర్శనలు, ఉపన్యాసాలతోపాటు క్విజ్ పోటీలను
కూడా నిర్వహిస్తున్నారు. పాఠశాల, కళాశాల విద్యార్ధులను, అధ్యాపకులను ప్రోత్సహించడం
ద్వారా వైజ్ఞానిక దృక్పథాన్ని వ్యాప్తి చేయడం ఈ ఉత్సవాల ముఖోద్దేశం.
వైజ్ఞానిక విషయాలను ఉపయోగాన్ని
ప్రజలకుతెలియజెప్పడం వలన వైజ్ఞానికపురోభివృద్ధివేగవంతమవుతుంది. దీనికై ఈ విషయాలను తేలికైన
భాషలో విడమర్చిచెప్పేకమ్యూనికేటర్లనుఅభివృద్ధిచేసుకోవడంముఖ్యం. జాతీయ వైజ్ఞానిక దినోత్సవం నిర్వహణ ద్వారా మన జాతి
మెత్తం ఏడాదికి ఒకసారి తన పూర్తి దృష్టిని శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన అంశాలపై
కేంద్రీకరించడానికి వీలవుతుంది.ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు ప్రజల్లో సైన్స్
పట్ల ఆసక్తిని, వైజ్ఞానిక పరిశోధనల ఫలితాలను తెలుసుకొనే అవకాశాన్ని కలిగిస్తాయి. శాస్త్ర
వేత్తలు సాధారణ ప్రజలతో ముఖాముఖీ కలవడం ద్వారా శాస్త్ర సాంకేతిక పురోగతిని జనబాహుళ్యపు
అవసరాలకు తెల్సుకునే వీలు కలుగుతుంది. జనాభాలో అత్యధిక శాతం ప్రజలు ఆధారపడుతున్న వ్యవసాయరంగానికి
ఆధునిక పద్ధతులను, వంగడాలను తెలియపరచాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఆ దిశగా అవసరమైన భూమికను
అభివృద్ధి చేయడానికి ఉత్సవం కొంతమేరకు దోహదపడుతుంది. శాస్త్ర పరిశోధనల్లో తలమునకలై
ఉండే వైజ్ఞానికులు, జీవన సమరంతో తీరికలేని సామాన్య ప్రజలు ఇద్దరిని ఒక్కచోటకు చేర్చే
అరుదైన రోజుగా ఈ విజ్ఞానిక దినోత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. జాతీయ వైజ్ఞానిక, సాంకేతిక
ప్రచార మండలి ప్రతీ సంవత్సరం ఒక ప్రత్యేక అంశాన్ని ఎంచుకుంటూ వస్తోంది. ప్రాధమిక విజ్ఞాన
శాస్త్రం పట్ల ఆసక్తిని పెంపొందింపచేయడం, సమాచార సాంకేతిక విజ్ఞానం సాయంతో సైన్స్ బోధన, వ్యర్ధం నుంచి సంపద, డి.ఎన్. ఏ ఆవిష్కరణ
స్వర్ణోత్సం, భౌతిక శాస్త్రం పురోభివృద్ధి, మోర్ క్రాప్ ఫర్ డ్రాప్ పేరిట సమర్ధ సేద్యపు
నీటి వినియోగం వంటి అంశాలను సైన్స్ డే ఉత్సవాలకు ముఖ్యాంశాలుగా ఎంచుకుంటున్నారు. శాస్త్ర అంశాలని సులభగ్రాహ్యంగా మార్చి ప్రజలకు తెలియజెప్పడానికి ఎంతో ప్రాధాన్యత వుంది. దీనిని గుర్తించిన జాతీయ వైజ్ఞానిక సాంకేతిక ప్రసార మండలి కేంద్ర ప్రభుత్వంలోని శాస్త్ర సాంకేతిక శాఖతో ‘కల్టివేషనల్ సైన్స్ పాపులరైజేషన్ ‘ అవార్డులను ఇస్తుంది. సమాజపు సంపూర్ణ అభివృధికి తోడ్పడే విధంగా వైజ్ఞానిక అంశాలను గుర్తించి అవార్డులు ప్రధానం చేస్తున్నారు.
అభివృద్ధి చెంది
ఆధునిక దృక్పథాన్ని అలవరుచుకొన్న వర్గాల సంఖ్య క్రమంగా పెరిగుతున్నప్పటికీ,
సమాజం మొత్తం శాస్త్ర దృక్పథాన్ని అనుసరించడం ఇంకా పూర్తిగాని లక్ష్యంగానే
మిగిలివుంది. ఈ జాతీయ సైన్స్
దినోత్సవాన్ని పాటించడం, ఉత్సవాలు జరపడం పౌరుల్లో శాస్త్ర
దృక్పథాన్ని అలవరుచుకునే వారి సంఖ్యను పెంచుతుంది.
తిరుగులేని హేతుబద్ధమైన ఆలోచనను రేకెత్తించండం మానవ సంక్షేమంలో శాస్త్ర
విజ్ఞానాల పాత్ర. ప్రయోగాత్మక పరిశీలనలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేయడంవలన కచ్చితమైన ఫలితాలు లభిస్తాయి.
భౌతిక శాస్త్రంలో
భారత కీర్తి కిరీటి సి.వి రామన్.
ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటాను ఎగురవేసి, భారతదేశపు వైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి
విజేతగా, అన్నింటికీ మించి భారతరత్నగా మనందరికి
సుపరిచితుడు శ్రీచంద్రశేఖర్ వెంకటరామన్ (సి.వి.రామన్).1888నవంబరు7 న తమిళనాడులోని తిరుచినాపల్లిలో
జన్మించి,చిన్నతనంనుంచి విజ్ఞానశాస్త్రవిషయాల పట్ల అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవారు.
ఆయన తండ్రి భౌతిక అధ్యాపకులవడంతో అతడు పసితనం నుండే భౌతికశాస్త్రం వైపు కుతూహలం పెంచుకున్నాడు. చిన్నతనం
నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తన 12వ ఏట మెట్రిక్యులేషన్ (ఫిజిక్స్
లో గోల్డ్ మెడల్ సాధించి) పూర్తి చేశాడు.
1907లో ఎం.యస్.సి (ఫిజిక్స్)లో యూనివర్సిటీకి ప్రధముడిగా నిలిచారు. తన 18 వ ఏటనే కాంతికి
సంబంధించిన ధర్మాలపై ఈయన పరిశోధనా వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్లో
ప్రచురితమైంది. ఆయనలోని పరిశోధనాభిరుచిని పరిశీలించిన అధ్యాపకులు ప్రోత్సహించి ఇంగ్లాండు
వెళ్ళి పరిశోధన చేయమన్నారు. కానీ ప్రభుత్వం నిర్వహించిన వైద్య పరీక్షలో ఒక వైద్యుడు
ఆయన ఇంగ్లాండు వాతావరణానికి సరిపడడని తేల్చడంతో అతను ఇంగ్లాండు ప్రయాణం విరమించుకున్నాడు.
‘నన్ను అన్ఫిట్
అన్న ఆ డాక్టరుకు నేనెంతో రుణపడి ఉన్నాను ‘ అని తర్వాత రామన్ పేర్కొన్నారు. ఆ తర్వాత
తల్లిదండ్రుల కోరిక మేరకు ‘ఐసిఎస్ ‘ పాసై కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్
జనరల్ గా చేరారు. ఉద్యోగంలో చేరే ముందు ‘లోకసుందరి అమ్మాళ్తో ‘ పెళ్ళయింది. ఒకసారి
కలకత్తాలో ప్రయాణం చేస్తున్నప్పుడు బౌబజారు స్ట్రీట్ వద్ద ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్
ఆఫ్ సైన్స్ అనే బోర్డు చూసి పరుగు పరుగున వెళ్ళాడు. ఆ సంస్థ గౌరవ కార్యదర్శి డాక్టర్
అమృతలాల్ సర్కార్ను కలిసి పరిశోధన చేయడానికి అనుమతిని పొందాడు. పరిశోధనలపై ఉన్న ఆసక్తి
వలన తెల్లవారుజామున ఐదున్నరకే ఐసిఎస్కు వెళ్ళేవారు. తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం
5 గంటల వరకు ఉద్యోగం, తిరిగి సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరిశోధన, ఆదివారాలు,
సెలవు దినాలు పరిశోధనలోనే గడిచేవి.
అతని తల్లి పార్వతి
అమ్మాళ్ కు సంగీతంలో మంచి అభిరుచి ఉండేది. ఆమె వీణను అద్భుతంగా వాయించేది. అందుకే రామన్
తొలి పరిశోధనలు వయోలిన్, వీణ, మృదంగం వంటి సంగీతవాయిద్యాల గురించి సాగాయి. విజ్ఞాన
పరిశోధన తృష్ణ వలన తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీ ఫిజిక్స్
ప్రొఫెసరుగా చేరారు. 1921లో లండన్లో తను అధ్యయనం చేసిన సంగీత పరికరాల శబ్ద రహస్యంపై
ఉపన్యాసాలు ఇచ్చాడు. అప్పుడు శ్రోతల్లోని ఒకరు ‘ఇలాంటి అంశాలతోరాయల్ సొసైటీ సభ్యుడవు
కావాలనుకుంటున్నావా !’ అంటు నవ్వులాటగా అన్నప్పుడు ఆయనలో పరిశోధనలపై మరింత ఆసక్తి పెరిగింది.
శబ్దశాస్త్రం నుంచి తన పరిశోధనలను కాంతి శాస్త్రం వైపు మార్చాడు.
ఒకమారు ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం
నీరు రెండింటికి నీలిరంగు ఉండటం ఆయనను ఆలోచింపచేసింది. అప్పటిదాకా అనుకుంటున్నట్లు
సముద్రపు నీలి రంగుకు కారణం ఆకాశపు నీలిరంగు సముద్రం మీద ప్రతిఫలించడం కాదు. సముద్రపు
నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే కారణం అని ఊహించాడు. కలకత్తా
చేరగానే తన ఊహను నిరూపించడానికి ద్రవాలు,వాయువులు,పారదర్శక ఘనపదార్థాలు కాంతి పరిక్షేపణం
గురించి పరిశోధనలు చేశారు. అందుకు యువశాస్త్రవేత్తలైన కె.ఆర్.రామనాధన్, కె.యస్ .కృష్ణన్
ఆయనకు అండగా నిలిచారు.
కె.యస్.కృష్ణన్ 1927 డిసెంబరులో ఒకరోజు సాయంత్రం
రామన్ వద్దకు పరుగెత్తుకొని వచ్చి కాంప్టన్ (భౌతిక శాస్త్రవేత్త)కు నోబెల్ బహుమతి వచ్చిందని
ఆనందంతో చెప్పగానే రామన్ ఎక్సలెంట్ న్యూస్ అని సంతోషపడ్డా, కాంప్టన్ ఫలితం ఎక్సరేయిస్
విషయంలో నిజమైనపుడు, కాంతి విషయాలలో నిజం కావాలి కదా అనే ఆలోచనలో పడ్డాడు. ఆ ఆలోచనే
రామన్ ఎఫెక్టుకు దారితీసింది. తగినంత అధునాతనమైన పరికరాల్లేకపోయినా, రామన్ తన ఆలోచనకు
ప్రయోగ రూపంలో జవాబు లభిస్తుందని నమ్మకంగా ఉన్నాడు.
అతను అనుకున్నట్లే
1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్టు అంటే పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం
గుండా కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది. ఈ దృగ్విషయాన్ని
1928 మార్చి 16 న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞులసదస్సులో చూపించాడు. అందుకే బ్రిటీష్
ప్రభుత్వం 1929లో నైట్హుడ్ బిరుదుతో సత్కరించింది. ఈ’రామన్ ఎఫెక్టు‘అసామాన్యమైనదని,
అందులో 200 రూపాయలు కూడా ధరచేయని పరికరాలతో ఆ దృగ్విషయ నిరూపణ జరగడం అద్భుతమైనదని ప్రపంచ
శాస్త్రజ్ఞులందరూ రామన్ను అభినందించారు. ఈయన పరిశోధన యొక్క విలువను గుర్తించి 1930లో
నోబెల్ బహుమతి ప్రధానం చేశారు. ఆ మహనీయుని సేవలను భారత ప్రభుత్వం గుర్తించి 1954లో
'భారతరత్న' అవార్డు బహుకరించిన సమయంలో సందేశాత్మక ఉపన్యాసం ఇస్తూ 'విజ్ఞాన శాస్త్ర
సారాంశం, ప్రయోగశాలల పరికరాలతో వికసించదు. నిరంతర పరిశోధన, స్వంతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి
ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మధించి వేస్తాయి' అన్న మాటలు నేటికి ఆలోచింపచేసేవి. ఆయన
పరిశోధనల అధారంగా భౌతికశాస్త్రంలో' రామన్ స్పెక్ట్రోస్కోపి 'అనే కొత్త విభాగం ప్రసిద్దిగాంచింది.
ఆయన’నాజీవితంలో
ఒకవిఫల ప్రయోగం. ఎందుకంటే నేను నామాతృభూమిలో నిజమైన సైన్స్ నిర్మాణం చేయగలననుకున్నాను.
,అంటూ చివరి వరకు భారతదేశంలో సైన్స్ అభివృద్దికై పాటుపడ్డ ఆ మహనీయుడు 1970 నవంబరు
20 న భౌతికంగా కన్నుమూసినా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించుకొని
ఆయనను చిరంజీవిగా మనమధ్యే నిలిపేలా కొన్ని సంస్థలు ఆయన పేరు మీద టాలెంట్ టెస్ట్ లు,
సైన్స్ కు సంబంధించిన కార్యక్రమాలు చేపడుతున్నాయి. విద్యార్ధినీ, విద్యార్ధుల్లో ఆయన
స్పూర్తిని నింపుతూ సైన్స్ అంటే మక్కువ కలిగేలా చేస్తున్నాయి.
'కొత్త
విషయాలను కనిపెట్టి దేశాభివృద్ధికి తోడ్పడిన శాస్త్రజ్ఞులకు ఈరోజున దేశం కృతజ్ఞతలతో,
గౌరవాభివందనలను తెలుపుతుంది. ఈ రోజున జరిగే విద్యాకార్యక్రమాలు బాలల్ని 'విజ్ఞానశాస్త్రం'
వైపు ఆకర్షించి, వృత్తిగా స్వీకరించేందుకు ప్రోత్సహిస్తుంది. శాస్త్రజ్ఞులందరూ నాణ్యమైన
పరిశోధనలతో దేశాభివృద్ధికి పునరంకితం కావడానికి, వీరి పరిశోధనలతో దేశం గర్వపడడానికి
ఈ రోజు అవకాశం కల్పిస్తుంది. దేశప్రగతికి, జాతిపురోభివృద్ధికి శాస్త్రవిజ్ఞానం అత్యవసరమని
ఈ రోజు ఉత్సవాలు దేశప్రజలకు సందేశాన్నిస్తాయి.
ఈ
సందర్భంగా పిల్లలందరికీ పూర్వం నుండీ సాధారణ మానవాళికి ఉపయోగపడే అనేక పరికరాలను కనిపెట్టినవారినీ,
శాస్త్రేవిఙ్ఞానాన్ని కొత్తపుంతలు తొక్కించినవారినీ, భారతదేశానికి చెందినవారినేగాక
, ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవిఙ్ఞానానానికి ఎనలేని సేవలు అందించిన శాస్త్రఙ్ఞులందరినీ
పరిచయం చేయటం ధర్మ.కనీసం వారిని స్మరించేలాచేయడమ్మనధర్మ.
ఆనేక రంగాలకు చెందిన ఫ్రాచీనకాలపు శాస్త్ర విఙ్ఞానవేత్తలు—
పాణిని(క్రీ.పూ.4],పింగళుడు,వరాహమిహిరుడు
(క్రీ.శ.505-587),ఆర్యభట్టు,బ్రహ్మగుప్తుడు -అంకగణితం లో "సున్న" భావన తెచ్చుటకు
దోహదపడినవాడు (క్రీ.శ 598-670),మొదటి భాస్కరుడు (క్రీ.శ 600 నుండి 680), శ్రీధరుడు (క్రీ.శ 650-850 ల మధ్య) - గోళం యొక్క
ఘనపరిమాణం కనుగొనుటకు ఉత్తమ సూత్రములు ప్రతిపాదించినవాడు,మహావీరుడు (9 వ శతాబ్దం),పావులూరి
మల్లన - మొదటి తెలుగు గణిత శాస్త్రవేత్త, ఆచార్య
హేమచంద్రుడు (క్రీ.శ 1087 నుండి 1172),
రెండవ భాస్కరుడు (క్రీ.శ 1114 నుండి 1185 వరకు).
మధ్య యుగం నుండి మొఘల్ కాలం వరకు--నారాయణపండితుడు,మాధవుడు--కలన గణితంలో
కొన్ని భావనలు],పరమేశ్వరుడు (1360–1455)[దృ క్ -గణితం, ఖగోళ శాస్త్ర ఆధారంగా పరిశీలనలు],నీలకంఠ
సోమయాజి 1444–1545 – గణిత శాస్త్రవేత్త మరియు ఖగోళ శాస్త్రవేత్త,మహేంద్ర సూరి ,(14
వ శతాబ్దం),శంకర వారియార్ (చ్.1530),రఘునాధ శిరోమణి (1475–1550)--తర్క శాస్త్రము, నవద్వీప
పాఠశాల;జ్యేష్టదేవుడు (1500–1610)"యుక్తిభాస" గ్రంధ రచయిత;అచ్యుత పీషరటి
(1550–1621)ఖగోళ శాస్త్రవేత్త,గణిత శాస్త్రవేత్త;మునీశ్వరుడు (17 వ శతాబ్దం),కమలాకరుడు
(1657),జగన్నాధ రాయలు (1730).
ఆధునిక యుగపు శాస్త్రవేత్తలు(1800లలో జన్మించినవారు)--
రామచంద్ర
లాల్,గణేష్ ప్రసాద్,శ్రీనివాస రామానుజన్,ఎ.ఎ. కృష్ణస్వామి అయ్యంగార్.
1900లలోజన్మించినవారు---తిరుక్కన్నపురంవిజయరాఘవన్(19021955);దత్తాత్రేయరామచంద్రకప్రేకర్(19051986),సర్వదమన్చౌలా(19071995),లక్కోజుసంజీవరాయశర్మ(19071998),సుబ్రహ్మణ్యచంద్రశేఖర్(19101995),ఎస్.ఎస్.శ్రీఖండే[1917),హరీశ్చంద్ర(19201983),సీ.రాధాకృష్ణరావు[1920),మతుకుమిల్లివెంకటసుబ్బారావు(19212006),పి,కెశ్రీనివాసన్(19242005),శ్రీరాంశంకర్అభయంకర్(1930),ఎం.ఎస్నరసింహన్[1932),సీ.ఎస్శేషాద్రి(1932),కె.ఎస్.ఎస్నంబూద్రిపాద్[1935),వినోద్జోహ్రీ(1935),ఎస్.రమణన్(1937),సి.పి.రామానుజన్(19381974),వి.యన్.భట్(19382009),ఎస్.ఆర్.శ్రీనివాసవరదాన్(1940),ఎం.యస్.రఘునాథన్[1941),పాల్ప్రసాద్[1945),విజయ్కుమార్పటోడి(1945–1976),ఎస్.జి.దాని[1947),రామన్
పరిమళ(1948),నవీన్ఎం. సింఘి[1949),నరేంద్ర కర్మాకర్ ( 1957),మణీంద్రఅగర్వాల్
1966),మధుసూధన్[1966),చంద్రశేఖర్ ఖరె [1968),మంజుల్ భర్గవ [1974),అమిత్ గార్గ్
(1978),అక్షయ్ వెంకటేష్ (ఈందీన్ ఒరిగిన్ ఆఉస్త్రలీన్) (1981),ఊ.శ్.ఋ.మూర్తి,విజయ్వజరాని,ఉమేష్వజరాని,సంతోష్వెంపల,కన్నన్సౌందరరాజన్[1982),సుచరిత్శంకర్[1983),ఎల్.మాధవీన్,ఆనంద్కుమార్.అయ్యగారిసాంబశివరావు,నారాయణంనరసింహమూర్తి,
యలవర్తి
నాయుడమ్మ,యల్లాప్రగడ సుబ్బారావు.
కొందరు
శాస్త్రవేత్తలను కొద్దిగా పరిచయం చేసుకునేప్రయత్నం చేద్దాం-
అమార్త్య కుమార్ సేన్ (1933] భారతీయ తత్త్వ శాస్త్రవేత్త.'ఆర్థిక శాస్త్రం'లో నోబెల్
బహుమతి స్వీకరించిన తొలి భారతదేశపు ఆర్థిక శాస్త్రవేత్త. 1998లో కరువు, మానవ అభివృద్ది
సిద్ధాంతము, సంక్షేమ ఆర్థిక శాస్త్రము, పేదరికమునకు కారణములు మరియు పొలితిచల్ లిబెరలిస్మ్
లలో చేసిన విశేష కృషికి,'సోషల్ ఛాయిస్ 'అనే నూతన సూత్రీకరణను ప్రవేశపెట్టాడు.
యూక్లిడ్
-ఇతడి రచన’ఎలిమెంట్స్ ‘గణితశాస్త్రపు చరిత్రలో ఒక ప్రసిద్ధ మైన రచన.. దీనిలోని సూత్రాలను
‘యూక్లీడియన్ జియోమెట్రి ‘గా పిలుస్తారు. ఆల్బర్ట్ ఐన్ స్టీన్ అంతటివాడు కూడా తన సాపేక్ష
సిద్ధాంతము వివరించటం కోసము యూక్లిడ్ జామెట్రి పద్ధతిని వాడు కోవడం మరో దృష్టాంతం అంతే
కాదు. " జ్యామితీయ గణితంలో తర్క బధ్ధమైన
ఆలోచనకు తావు కల్పించిన గొప్ప మేధావి యూక్లిడ్ అని కూడా ఐన్ స్టీన్ ప్రశంశించాడు
యొనార్డో డావిన్సి - ఇటలీ కు చెందిన ఒక శాస్త్రజ్ఞుడు, గణితజ్ఞుడు, ఇంజనీర్,
చిత్రకారుడు, శిల్పకారుడు, ఆర్కిటెక్ట్, వృక్షశాస్త్రజ్ఞుడు, సంగీతకారుడు. ఇతడు చిత్రించిన
చిత్రాలలో ప్రసిద్ది చెందినది మొనాలిసా చిత్రం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన "లాస్ట్
సప్పర్" చిత్రాన్ని2సం కాలం చిత్రించాడు.విమానాల వంటిఎగిరే యంత్రాలకు నమూనాలను
తయారుచేసాడు. నీటి గడియారాన్ని అందించాడు.బరువైన వాటిని తేలికగా తొలగించే "క్రేన్"
లను యేర్పాటు చేశాడు.
విలియం హార్వే
--ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్యశాస్త్రవేత్త.
గుండె పనిచేసే తీరును, శరీరంలో రక్తప్రసరణ జరిగే పద్ధతినికనిపెట్టాడు. రక్తం ప్రవహించే మార్గంలో వాల్వులు ఎలా పనిచేస్తాయో
కనిపెట్టాడు. మనిషి గుండె నిమిషానికి ఎన్ని సార్లు కొట్టుకుంటుందో, ఎంత రక్తాన్ని పంప్
చేస్తుందో చెప్పగలిగాడు. తన పరిశీలనలతో’అసటామికల్ ఎక్సర్ సైజ్ ఆన్ ది మోషన్ ఆఫ్ ది
హార్ట్ అండ్ బ్లడ్’ , లో "ఎక్సర్ సైజస్ ఆన్ ది జనరేషన్ ఆఫ్ ఆనిమల్స్" అనేరెండు
అమూల్యమైన గ్రంథాలను వెలువరించాడు.హంప్రీ డేవి—'డేవీ దీపం' పేరుతో ఈయన కనుగొన్న దీపాన్ని పిలుస్తారు.గనులలో మీథేన్ వాయువు వల్ల
జరిగే ప్రమాదాలు ఈ 'డేవి సేఫ్టీ 'దీపంతో తగ్గిపోయాయి. నైట్రస్ ఆక్సైడ్ లేదా లాఫింగ్
గ్యాస్ (నవ్వించె వాయువు] నుకూడాకనుగొన్నాడు. "ఎలిమెంట్స్ ఆఫ్ కెమికల్ ఫిలాసఫీ"పుస్తకాన్ని
ప్రచురించాడు.
హిప్పోక్రేట్స్ -- ప్రాచీన గ్రీకు పెరికల్స్ యుగానికి చెందిన "వైద్యశాస్త్ర
పితామహుడు" అనే బిరుదు గల వైద్యుడు.రోగి లక్షణాలను నిశితంగా పరిశీలించాకే రోగాన్ని
గురించి తెలుసుకోవాలని చెప్పాడు.దీన్ని హిప్పోక్రటిస్
భావన గాప్ గా పిలిచేవారు.హిప్పోక్రటిస్ కు ఎముకల గురించి,కండరాలగురించి, నరాల గురించి,
రక్త నాళాల గురించి ఎంతో తెలుసు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఈయన రాసిన "ఎములు
విరుగుట,బెణుకుట" అనే గ్రంధం. చేతివేళ్ళ క్లబ్బింగ్ చేయుటలో ఇతను మొదటి సారిగా
సఫలీకృతుడయ్యాడు, దీర్ఘకాలిక రోగాలైన ఊపిరితిత్తుల కేన్సర్ మరియు సయానోటిక్ గుండె జబ్బు
లను నిర్ధారించి, వైద్యవిధానాలను రూపొందించాడు, చేతివేళ్ళను జోడించడంలో సఫలుడైనందు
వలన ఈ వేళ్ళను "హిప్పోక్రటిక్ ఫింగర్స్" అనికూడా వ్యవహరిస్తారు.
ఆర్యభట్టు --
భారతదేశ అత్యున్నత గణిత, ఖగోళ శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు. ఇతను క్రీ.శ. 476-550 ప్రాంతంలో
నివసించినట్లు అంచనా. ఇతను ఆర్యభట్టీయం, ఆర్య సిధ్ధాంతం, గోళాధ్యాయం,సంస్కృత గణిత సంఖ్యా
శాస్త్రాన్ని రచించాడు. ఆర్యభట్టు ‘పై ‘విలువను సుమారుగా కనుకున్నట్లు చెప్తారు. గణితం
లో మనం నేర్చుకున్న' సైన్' 'కొసైన్ 'లను ఇతను "జ్యా" మరియు "కొ జ్యా"
గా నిర్వచించాడు. భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహానికి ‘ఆర్యభట్ట’ అని పేరు పెట్టారు.ఆర్యభట్టు
తన పుస్తకంలో మేరు పర్వతం హిమాలయాల్లో సుమారు యోజనం ఎత్తున ఉందని ప్రతిపాదించాడు"
. క్షేత్రగణితం, మరియు త్రికోణమితి ,ఆరవ గణిత పాదంలో త్రిభుజం యొక్క వైశాల్యాన్ని ఆర్యభట్ట
వివరించాడు.బీజ గణితం ఆర్యభట్టీయంలోనే శ్రేణుల మొత్తాన్ని గణించడానికి సూత్రాలు ప్రవేశ పెట్టాడు. భూమి నీడ చంద్రుని మీద
పడడం వల్లే గ్రహణాలు వస్తాయని, రాహు కేతువులు అనేవి నిజంగా లేవని వాదించాడు గ్రహాలకుస్వయంప్రకాశం
లేదనీ సూర్యకాంతి పరివర్తన వలన వచ్చినదని చెప్పాడు. సూర్య గ్రహణాల ను ఖచ్చితంగా లెక్క
కట్టాడు.భూమి తన చుట్టూ తాను తిరగటానికి పట్టే సమయం 23 గంటల, 56 నిమిషాల, 4.1 సెకనులు
గా లెక్కగట్టాడు. ఈనాటి ఆధునిక లెక్కల ప్రకారం అది 23 గంటల, 56 నిమిషాల, 4.091 గా తేలింది.
సర్ జగదీష్ చంద్ర బోస్ --బెంగాల్ కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త. ఇతడు రేడియో మరియు
మైక్రోవేవ్ ఆప్టిక్స్ తో వృక్షశాస్త్రంలో గణనీయమైన ఫలితాల్ని సాధించారు. ఇతన్ని రేడియో
విజ్ఞానంలో పితామహునిగా పేర్కొంటారు.వృక్ష భౌతిక శాస్త్రంలో అద్భుతమైన ఆవిష్కరణలు చేశాడు.
తాను రూపొందించిన పరికరం ‘క్రెస్కోగ్రాఫ్ ను ఉపయోగించి వివిధరకాలైన పరిస్థితుల్లో మొక్కలు
ఎలా స్పందిస్తాయో పరిశోధనాత్మకంగా నిరూపించాడు.
ఆర్కిమెడిస్ --
ప్రముఖ గ్రీకు గణిత, భౌతిక శాస్త్రవేత్త , ఇంజనీరు, ఆవిష్కర్త మరియు ఖగోళ శాస్త్రజ్ఞుడు
. భౌతికశాస్త్రంలో ఆయన చేసిన హైడ్రోస్టాటిస్టిక్స్, స్టాటిస్టిక్స్ , లేవేర్ సిద్దాంతాలు
ముఖ్యమైనవి . సీజ్ ఇంజిన్స్ మరియు స్క్రూ పంప్ లతో పాటు క్రొత్త యంత్రాల రూపకల్పనలు
ఆయనకు ప్రతిష్టనిచ్చాయి. ఆధునిక ప్రయోగాల అర్హత అంతర రూపకల్పనల పరిశోధించు సామర్ద్యంగల
ఆర్కిమెడిస్ సూత్రం గా ఆవిష్కరింపబడింది.
టోలెమీ -"భూకేంద్రక
సిద్ధాంతము"ఆవిష్కరించాడు... దృక్ శాస్త్రం గురించి రాశాడు. కాంతి కిరణాలు పరావర్తనం చెంది మన కంటిని
చేరినప్పుడు మనకు కనిపిస్తాయి. ఇలాగే కాంతి కిరణాలు యానకాలను మారేటఫ్ఫుడు మార్గాలలో
మార్పులు తెచ్చుకుని వక్రీభవనం ప్రదర్శిస్తాయని తె;లిపాడు.
పాస్కల్--'
పాస్కల్ సూత్రం ' తెలియని వారు ఎవరూ ఉండరు. ద్రవ పదార్థంలో ఏదైనా ఒక విందువు వద్ద పీడనాన్ని
ఉపయోగించడం జరిగితే ఆ పీడన ప్రభావం ఆ ద్రవ
పదార్థం అన్ని పైపులకు సమానంగా విస్తరిస్తుంది. ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని'సిరెంజ్ని,
హైడ్రాలిక్ ప్రెస్ ను, హైడ్రాలిక్ బ్రేక్ 'ను రూపొందించటం జరిగింది. పాస్కల్ నిర్మించినత్రిభుజాన్ని'
పాస్కల్ త్రిభుజం 'అంటారు. పాస్కల్ లెక్కలు చేసే యంత్రాన్ని రూపొందించాడు. ఈ కాలిక్యులేటింగ్
మెషిన్ కూడికలు,తీసివేతలు, గుణింతాలు,భాగహారాలు వంటివి చేసిపెట్టేది.
పైథాగరస్ --ప్రపంచ
ప్రసిద్ధి గాంచిన గ్రీకు గణితశాస్త్రజ్ఞుడు.'పైధోగొరస్
సిద్ధాంతం 'శాస్త్రములో ముఖ్యంగా -జ్యామితి విభాగాములో ఈయన గురించి తప్పక చదవుతాం.ఒక
త్రిభుజం లోని కోణాల మొత్తం అంటే 180 డిగ్రీలు లేదా రెండు లంబకోణాలని ఆయన చెప్పారు.
బ్లెయిస్ పాస్కల్ కూడా అదే విషయాన్ని ఋజువు చేసారు. అదే విధంగా ఒక లంబ కోణ త్రిభుజంలో
కర్ణం మీదివర్గం మిగిలిని భుజాల మీది వర్గాల మొత్తానికి సమానం అనేది పైథాగరస్
సిద్ధాంతం.
నికోలాస్ కోపర్నికస్ --మధ్యయుగానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. శాస్త్రీయంగాసూర్యకేంద్ర
సిధ్ధాంతాన్ని నిరూపిస్తూ సిద్ధాంతీకరించాడు.
అరిస్టాటిల్ -ప్రముఖ
ప్రాచీన గ్రీకు తత్వవేత్త. ప్లేటో కి శిష్యుడు మరియు అలెగ్జాండర్ కి గురువు.ఈయన భౌతిక
శాస్త్రము, గణితము, కవిత్వము, నాటకాలు, సంగీతం, తర్కము, రాజకీయం, ప్రభుత్వం, నీతి నియమాలు,
జీవశాస్త్రం మొదలగు చాలా విషయాలపై పుస్తకాలు రాశాడు."జీవ శాస్త్ర పిత" గా
బహళ ప్రాచుర్యం పొందాడు.
గెలీలియో
--మొట్టమొదటి టెలిస్కోప్ నిర్మాత.
చార్లెస్ రాబర్ట్ డార్విన్ -ఇంగ్లాండుకు చెందిన వాడు. ఇతని జీవపరిణామ
సిద్ధాంతాన్ని ప్రదిపాదించాడు. సకల జీవరాశులు క్రమానుగతంగా పరిణామం చెందుతూ ఏర్పడతాయని,.
వానరుని నుంచి నరవానరుడు, నరవానరుని నుంచి నరుడు పరిణామ పరంగా ఉద్భవించాడని తెలిపి
సంచలనం రేపిన ప్రకృతి శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్.
టోరసెల్లి
-- భారమితి ని కనుగొన్న మాహనీయుడు.
జాన్ నేపియర్.--
లాగరిథమ్స్ సృష్టి కర్త .ఆట్టో వాన్ గెరిక్-- మొట్టమొదటి ఎయిర్ పంపుని రూపొందించిన
వాడు గెరిక్.వైద్యునిగా, ఇంజనీరుగా, తత్వవేత్తగా ఆట్టో వాన్ కు శాస్త్ర లోకంలో ఎంతో
పేరుంది.
ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ -- డైనమైట్ ఆవిష్కర్త. ఈయన ఆఖరి వీలునామాలో నోబెల్
బహుమతి స్థాపన కొరకు చాలా పెద్ద మొత్తంలో ధనాన్ని కూడబెట్టాడు. కృత్రిమ మూలకము నోబెలియం
ఇతని పేరు మీదుగా నామకరణం చేసారు.
సర్ ఐజాక్ న్యూటన్--ఒక ఆంగ్లేయ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. న్యూటన్ సూత్రాలు-
వైఙ్ఞానిక ప్రపంచంలొ పేరుగాంచినవి.
జేమ్స్ క్లార్క్ మాక్స్ వెల్ –స్కాట్లాండుదేశీయుదూ. భౌతిక/గణిత శాస్త్రజ్ఞుడు.
ఆతని విశేషమైన కృషి వల్ల’మాక్స్‌వెల్ సమీకరణాలు ‘ఉత్పత్తి అయినాయి. మొదటి సారి మాక్స్‌వెల్
విద్యుత్ ను అయస్కాంతత్వాన్ని ఏకీకరించే సూత్రాలను ప్రరిపాదించెను.
జీన్ బాప్తిస్తే జోసెఫ్ ఫోరియర్—ఫ్రాంన్స్ దేశీయుడు. ఒక భౌతిక మరియు గణిత
శాస్త్రవేత్త.'ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ nu ఫోరియర్ సీరీస్' ను కనుగొన్న శాస్త్రవేత్తగా
లోకానికి సుపరిచితుడు.
డిమిట్రి ఇవనోవిఛ్ మెండలీఫ్-- సోవియట్ యూనియన్కు చెందిన రసాయన శాస్త్రవేత్త.
ఇతడు మొట్టమొదట రసాయనిక మూలకాలతో ఆవర్తన పట్టికను ఆవిష్కరించాడు. అతని స్మృత్యర్ధం
101 పరమాణు సంఖ్య ఉన్న మూలకానికి మెండెలీవియం అని పేరు పెట్టారు.
లియొనార్డ్ ఆయిలర్ --స్విట్జర్లాండు కు చెందిన గణిత శాస్త్రజ్ఞుడు మరియు భౌతిక
శాస్త్రజ్ఞుడు.ఇతడు ‘కలన గణితము ‘మరియు టోపోలజీ ‘లలో చాలా ముఖ్యమైన విషయాల కనుగొనెను.
నవీన గణిత శాస్త్రము లో ప్రత్యేకంగా విశ్లేషక గణితములో చాలా మటుకు వ్యావహారిక పదాలను
సంకేతాలను చాలా మటుకు ఆయనే ప్రతిపాదించెను.ఆయిలర్
ఆతని గతి శాస్త్రము,. జామెట్రీ, కలన గణితము, త్రికోణ శాస్త్రము,బీజ గణితము మరియు సంఖ్యా
సిద్ధాంతము.
సుబ్రహ్మణ్య చంద్రశేఖర్—భారతీయుడు. విలియం ఆల్ఫ్రెడ్ ఫోలర్ తో
కలిసి నక్షత్రాలపై ఈయన చేసిన పరిశోధనకు గాను నోబెల్ బహుమతిని అందుకున్నాడు. ఇతని మేనమామ
ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ సి.వి.రామన్. చంద్రశేఖర్ కు భారతప్రభుత్వం పద్మ విభూషణ్
బిరుదు తో సత్కరించింది.
మేరీ క్యూరీ--
ప్రసిద్ధ భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త. రెండు నోబెల్ బహుమతులు (భౌతిక, రసాయన శాస్త్రాలలో)
ప్రప్రధమంగా ఈమెకే లభించాయి. ఇప్పటికీ మరే శాస్త్రవేత్తకూ రెండు వేరువేరు వైజ్ఞానిక
రంగాలలో నోబెల్ బహుమతులు లభించలేదు. రేడియో ధార్మికతలో ఈమె పరిశోధనలు ఆ విషయంలో తరువాతి
శాస్త్రవేత్తలకు మార్గదర్శకాలయ్యాయి. ఈమె భర్త, సహ పరిశోధకుడు అయిన పియరీ క్యూరీ వారి
మొదటి నోబెల్ బహుమతిని ఈమెతో కలసి అందుకొన్నాడు. ఈమె కుమార్తె ఇరీన్ జూలియట్ క్యూరీ
మరొక నోబెల్ బహుమతి గ్రహీత. ఇలా వీరి కుటుంబంలో ముగ్గురికి నోబెల్ బహుమతులు లభించాయి.
ఇలా
కొంతవరకూ సందర్శకులకు శాస్త్రవేత్తలను పరిచయం చేసి, వారి కృషిఫలితంగా మనం ఎలా సౌఖ్యంగా
జీవించగలుగుతున్నామో తెలిపి, వారివలె విద్యార్ధులు కూడా కొత్తకొత్త ఆవిష్కరణలకు కృషిచేయాలని
ఉద్భోధించడం ఎంతైనా అవసరం.