Wednesday 5 September 2012

గురువులే దేశానికి మార్గ నిర్దేశకులు.


               గురువులే దేశానికి మార్గ నిర్దేశకులు.

            తల్లి దండ్రులు జన్మ నిస్తే , గురువుప్రపంచంలో బ్రతకవలసినఉత్తమమార్గాన్నిచూపే దిక్సూచి వంటివాడు. జన్మించినప్రతివారూజన్మసార్ధకతకు శ్రమించాల్సిఉంటుంది.,దానికైఉత్తమఉపాధ్యాయుల బోధలూ,వారిసందేశాత్మక ప్రబోధాలూ,ఆశీర్వాదాలూఅవసరం.పౌరాణికయుగంలోశ్రీరామచంద్రాదులూ,కృష్ణబలరాములూ,సాక్షాత్ భగవత్ స్వరూలులైనా గురుపాదసేవ చేయటం గురుబోధలుపొందటం, గురువుఆశీర్వచనాలతో ఉన్నతినీ, విజయాన్నీ సాధించడంమనకుతెల్సు,పాండవులుద్రోణాచార్యునివద్దవిద్యగడించిఉత్తమమార్గంలోచరించిఆదర్శప్రాయులయ్యారు.
వారంతామానవజాతికిఉపాధ్యాయులపట్లమెలగవలసినతీరుతెన్నులనుఆచరించిచూపారు.చారిత్రకయుగంలోశివాజీ తనగురువైన సమర్ధ
రామదాసును రుద్రమదేవితనగురువైనతాంతియాతోపేనుసేవించివిజయమార్గాన్నిఅందుకున్నారు.ఈయుగంలో వివేకానందుడురామకృష్ణపరమహంసగురువుకృపతోకాళీమాతదర్శనాన్నిపొందగలిగాడు.ఇలాఅనేకమందిమహామహులు గురుకృపతోఅసాధారణప్రఙ్ఞాపాటవాలనూ,అమోఘకార్యాలనూసాధించగలిగారు ఈకలియుగంలోసైతం అనేకమంది మహానుభావులుగురుఆశీర్వాద,బోధనలతో జీవితంలో విజయాలు సాధించారు, సాధిస్తున్నారు. గురువు లేనివిద్య గురిలేని బాణంవంటిది. 
            పూరం నుండీ భారతదేశంలో గురువుకిచ్చినస్థానం గొప్పది. గురువును గౌరవించడమన్నది భారతీయుల ప్రత్యేకసంస్కారం.గురువునుసాక్షాత్దైవస్వరుపంగామనంభావిస్తాం.ఈఆధునికయుగంలోసైతంఎంతోమందితామువిద్యపుర్తిచేసిఉన్నతపదవులుఅలంకరించినాతమనుతీర్చిదిద్దిసుద్దులునేర్పిన గురువులనుగుర్తుంచుకునిగౌరవిస్తూనేఉన్నారు.స్వాతంత్ర్యభారతదేశంలోమనభారతమాజీరాష్ట్రపతిఐనడా.సర్వేపల్లిరాధాకృష్ణన్ పుట్టినరోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి , ఉత్తమఉపాధ్యాయులనుభారతప్రభుత్వంగుర్తించి పురస్కారాలు అందించడమెంతైనా ఆనందదాయకం. విద్యార్థుల జీవితాల్లో జ్ఞానజ్యోతులు వెలిగించే గురువులకు మనదేశంలో మాత్రమే ఇలాంటి ప్రత్యేక గుర్తింపు లభించడం మనదేశానికే గర్వకారణం.
                నేటి తమిళనాడు లోని తిరుత్తణిలో సర్వేపల్లి వీరాస్వామి, సీతమ్మ దంపతులకు సెప్టంబర్ 5, 1888 లోజన్మించినబిడ్దడేసర్వేపల్లిరాధాకృష్ణన్.వారిదిఅతిసాధారణబ్రాహ్మణకుటుంబం.తండ్రివీరాస్వామిజమీందారువద్ధచిన్నఉద్యోగం చేసేవారు.తిరుత్తణి లోజన్మించిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మాతృభాషతెలుగు.చిన్నతనంతిరుత్తణి,తిరువల్లూర్, తిరుపతి లో గడచింది. మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి ఎం ఏ ఆర్ట్స్ డిగ్రీ పొందారు.రాధాకృష్ణన్  కు ఆయన 16వయేటనే  శివకామమ్మ తో 1904 లో వివాహం జరిగింది. వీరికి ఐదుగురు ఆడపిల్లలు, ఒక మగపిల్లడు.
చిన్నతనంలోనే భారతీయ తత్త్వం, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మ సూత్రాలలో మంచి అవగాహన సాధించారు. ఇవివారిభవితవ్యానికిచక్కటిపునాదివేశాయి.భారతీయతత్వవాణిని,అందరికీఅర్ధమయ్యేలా సులభసైలిలో వ్రాశారు రాధాకృష్ణన్ పండితుడు..
1918 లో మైసూర్ విశ్వవిద్యాలయంలో తత్వ శాస్త్రబోధకునిగాతన ఉద్యోగజీవితాన్నిప్రారంభించారు. అప్పటికే అయన చాలా రచనలు చేశారు.అవి ది క్వెస్ట్, జర్నల్ ఆఫ్ ఫిలాసఫీ, ఇంటర్నేషల్ జర్నల్ ఆఫ్ ఎతిక్స్ వంటి ప్రముఖ పత్రికలలో ప్రచురింపబడ్డాయి.
1931 లో ఆయన  ఆంధ్ర విశ్వవిద్యాలయానికి, 1939 లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయ, 1953 నుండి1962 వరకు ఢిల్లీ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గానూ,భారత దేశానికి స్వాతంత్రంవచ్చిన తర్వాత యూనివెర్సిటి ఎడ్యుకేషన్ కమీషన్ అధ్యక్షుడనిగానూ , 1949 లో సోవియట్ యూనియన్ (రష్యా)లో భారత రాయబారిగా నూ చేశారు.ఈపదవులన్నీ ఆయనవిద్వత్తుకు ,ఙ్ఞానానికీ నిదర్శనాలు. 1954 లో, భారత దేశం అత్యున్నత గౌరవం - భారత రత్న అందుకున్నారు. భారత ఉప రాష్ట్రపతిగా వ్యవహరించి, 1962 నుండి 1967 వరకుభారతదేశరెండవరాష్ట్రపతిగాదేశానికితమసేవలు అందించారు . రాధాకృష్ణన్ మంచిఉపాధ్యాయునిగా ,గొప్ప తత్త్వవేత్తగా,రాజకీయనాయకునిగాగుర్తింపుపొందాడు.సర్వేపల్లిరాధాకృష్టన్‌కిఉపాధ్యాయవృత్తిపట్లఅభిమానం.దేశాన్నితీర్చిదిద్దేమేధావులుఉపాధ్యాయులే అని ఆయన విశ్వాసం. రాధాకృష్ణన్ రాష్ట్రపతిగాఉన్నపుడుకొందరు విద్యార్థులు, స్నేహితులుఆయన్నికలిసిఆయన జన్మదినోత్సవాన్నిఘనంగా జరపాలనిఉందని కోరగా,’ ఆయన తన జన్మదినోత్సవాన్నీ జరపటానికిబదులుగా ఈరోజునుటీచర్స్‌డేగాజరిపితేసంతోషంగాఉంటుందనిచెప్పారు.ఆయనకోరికమేరకురాధాకృష్ణన్‌జన్మదినోత్సవాన్నిఉపాధ్యాయ దినోత్సవంగాప్రభుత్వంప్రకటించింది.1962నుంచియేటా సెప్టెంబర్ 5న గురుపూజోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్నది. మండల, జిల్లా  ,రాష్ట్ర , జాతీయ స్థాయిలలో ఎంపికైన గురువులను సన్మానించడ ఆనవాయితీగా వస్తున్నది.
గురుపూజోత్సవంనాడుఎవరిగురువులనువారుతమకుతోచినరీతిలోసత్కరిస్తూవేడుకలుజరుపుకుంటారు.ఈరోజునపాఠశాలలవిద్యార్థులు,ఉపాధ్యాయులనుగౌరవించడం,సమావేశాలుఏరాటుచేసుకోడంజరుగుతున్నది.ప్రతిసంవత్సరంభారతదేశంలోవిశిష్ఠసేవలుఅందించినఉపాధ్యాయులనుఅధ్యాపకులనుఎంపికచేసిజాతీయస్థాయిలోనూఢిల్లీలోనివిఙ్ఞానభవన్లోవారికిఅప్పటిరాష్ట్రపతిచేతులమీదుగాఅవార్డులుఅందించిగౌరవిస్తున్నారు. రాష్ట్రపతి భవన్లో వారికి తేనీటి విందు ఏర్పాటుచేస్తున్నారు.ఇలా డాక్టర్సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినంఉత్తమ ఉపాధ్యాయులకుగుర్తింపు నిచ్చేపవిత్రదినంగా జరుగుతుండటం ఆనందించవల్సిన విషయం .
    ప్రాధమికపాఠశాలలోఅఆలునేర్పినటీచర్నుండీవిద్యాభ్యాసంపూర్తయ్యేవరకుహైస్కూల్,కాలేజ్,విశ్వవిద్యాలయంవరకూ పాఠంచెప్పినప్రతిఒక్కరూగురువే.జీవితంలోఉత్తమస్థానాన్నిఅందుకోవాలనిపైపైకిఎదగాలనీగురువులుతమవిద్యార్ధులనుఆశీర్వదిస్తారు.తమవిద్యార్ధులుఉన్నతపదవులుఅలంకరించి,ఉత్తమసంస్కారవంతులుగాగుర్తింపుపొందినవిషయంతెలిస్తేముందుగాసంతోషపడేవ్యక్తి గురువే! .
        పూర్వపుగౌరవంగురువులకుక్రమేపీతగ్గుతూవస్తున్నది.గురుశిష్యులమధ్యఅనుబంధంకూడామారింది.గురుశిష్యబంధాలుగుంటలోపాతిపెట్టబడుతున్నాయి. నేడువిద్యార్థులుగురువులకుసరైనగౌరవ,మర్యాదలుఇవ్వడంలేదు.దానికికొంతవరకూకారణంకొందరుగురువులువిద్యార్థులపట్లఅసభ్యంగా అభ్యంతరకరంగాప్రవర్తించడంకావచ్చు,విద్యాబుద్ధులనుబోధించడంలోసరైనశ్రద్ధచూపకపోడంకావచ్చు.                  ప్రతిఏటా సెప్టెంబర్‌ 5న జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవంనాడుగురుశిష్యులపవిత్ర బంధం గురించి స్మరించడంవల్లతిరిగివారిమధ్యసరైనఅవగాహన,సాన్నిహిత్యంఏర్పడేఅవకాశంకలుగవచ్చు..విద్యార్ధులు తమగురువులనుగౌరవించడంనేర్చుకోవాల్సిఉంది,అదేవిధంగాగురువులుకూడావిద్యార్థులనుతీర్చిదిద్దడంలో
పూర్తిశ్రద్ధవహించాల్సినఆవశ్యకతనుకూడాఈఉపాధ్యాయదినోత్సవంగుర్తు చేస్తుంది.ఈసందర్భగా దేశంమొత్తంలోగురుస్థానంలోఉండివిద్యబోధించేగురువులంతాతమబాధ్యతలకుపునరంకితమై ఉత్తమ విద్యార్ధులనుఈభారతదేశానికిఅందించిబాధ్యతాయుతమైనపౌరులనుతయారుచేసినపుడేమనదేశ
పూర్వ ఔన్నత్యం తిరిగి పొందే భాగ్యం పొందగలుగుతాం.  
        ****************  వార్త దినపత్రికలోసెప్టెంబర్ 5 న ప్రచురితం ********************


గురుతరమైన గురువులబాధ్యత..


                       గురుతరమైన గురువులబాధ్యత..
                  గురుబ్రహ్మా గురుర్విష్ణుః - గురుదేవో మహేశ్వరః
                  గురుస్సాక్షాత్ పరబ్రహ్మా -తస్మైశ్రీ గురవేన్నమః-  అనే పవిత్రమైన భారతీయసంస్కృతి మనది. గురువులోబ్రహ్మావిష్ణుఈశ్వరస్వరూపాలను దర్శించి,స్మరించి,నమస్కరించేమనం ఈనాడు గురు స్వరూపంలో రక్కసులనూ యమదూతలనూ ,కర్కశ కరాళులనూచూస్తుండటంసిగ్గుచేటుకాదా!    
' గు 'కారో అంధకారస్య -'రు ' కారో తన్నిరోధకృత్ --అంటూగురువుకు అఙ్ఞా నాంధకారాన్ని పారద్రోలి ,  ఆ అఙ్ఞానాన్ని తిరిగి దరిచేరనివ్వని భగవత్ స్వరూపునిగా సృష్ట్యాదినుండీ గురువుకు అమోఘమైన గౌరవంఉంది.వేదకాలంనుండీ'గురు'స్థానంగౌరవప్రదమైనదిగాచెప్పుకుంటాం.శ్రీమహావిష్ణువుమానవా
కారంతోశ్రీరామునిగావచ్చినపుడుఆయనతనగురువులైనవశిష్టుని ,విశ్వామిత్రునిమాటలనుమన్నించి,గౌరవించాడు.శ్రీకృష్ణుడుతనగురువైనసాందీపునీమహర్షికిశిశ్రూషచేసిగురుపుత్రునియమధర్మరాజు
నుండీబ్రతికించితెచ్చిగురుదక్షిణఇచ్చుకున్నాడు.పాండవమధ్యముడుఅర్జునుడుతనగురువైనద్రోణాచార్యులకు,ద్రుపదునిపట్టితెచ్చిఅప్పగించిగురుదక్షిణచెల్లించుకున్నాడు.ఇలాపురాతనకాలంనుండీశిష్యులుతమకువిద్యాదానంచేసినగురువుపట్లతమకృతఙ్ఞతనుచూపుతూవచ్చారు.
గురువులుసైతంతమశిష్యులనుతమబిడ్డలవలె ప్రేమించి,అభిమానించి,ఎంతోఅప్యాయతతోఆదరించి విద్యబోధించడంజరిగేది.శిష్యులశారీరక,మానసికపరిస్థితులనుగమనిస్తూవారిఅవసరాలుగుర్తిస్తూవిద్యాబోధనచేపట్టేవారుగురువులు.పురాణకాలంనుండీగురుకులాల్లోఉండిగురువులకుపనులుచేస్తూవారు
పెట్టేభోజనంతింటూవిద్యనభ్యసించేవారుశిష్యులు..నేడు-- అదంతామారిపోయింది .“గురుశిష్యబంధాలు గుంటలోపాతేసివిద్యలన్నియువిప్రవవీధికొచ్చె!అన్నట్లుఅటుఆడమగగురువులుసైతంఅనేకరకాలుగాతమవిద్యార్ధులనుహింసించడంచదువుతూనేఉన్నాం.గురువులుతమబాధ్యతలను,కర్తవ్యాలనుమరు
వడం, జరుగుతున్నది.డబ్బుఎరవేస్తేఎంతటిడిగ్రీసర్టిఫికేట్లయినాచేతుల్లోపడుతున్నాయ్.అలాంటిడిగ్రీలు పొందినఉపాధ్యాయులుఎలాంటి విద్య అందిస్తారో మనం ఊహించవచ్చు.     
      ఎంతోప్రేమతోవిద్యాబోధనచేయవలసినగురువులునేడువికృతచేష్టలతోవిలన్సైపోతున్నారు .ఈనాడు వార్తాపత్రికల్లో,టీ.వీఛానల్స్ లోప్రసారమవుతున్నసంఘటనలుసభ్యసమాజంసిగ్గుతోతలవంచుకేనేలా  ఉన్నాయి.ఒకపాఠశాలలో ఏదోదొంగిలించిఉంటుందన్నఅనుమానంతోబట్టలన్నీవిప్పించి ఒకబాలికను ఉపాధ్యాయినివెతికిందిట!, తెలుగు[మాతృభాష] మాట్లాడారని పిల్లలను అతి క్రూరంగా దండించడం , వాతలుపెట్టడం,రాత్రిబట్టతడిపిందనిహాస్టల్వార్డన్స్అరాచకంగా[ ఇంగ్లీషుపాలకులుసైతంఇంతనీచంగాదండించలేదేమోఆరోజుల్లో]ఆచిన్నారిచేనాలుకతోనాకించి,ఆమెవంటిబట్టలతోతుడిపించడం!ఇదాఆచరించ
వలసినవిధానం !ఇదాఉపాధ్యాయ సర్టిఫికేట్తోఉద్యోగాలకువచ్చినగురుస్థానంలోనివారుచేయవలసిన పని!దేశద్రోహులకో,దారుణనేరాలుచేసినవారికోవిధించేశిక్షలుకూడాఇంతక్రూరంగాఉండవేమో!కేవలంఆపిల్లలకుప్రభుత్వంఅందిస్తున్నసహకారానికికాపలాదారుగాఉండి ,తనకర్తవ్యంనిర్వహిస్తున్నందుకేతానుజీతంతీసుకుంటూతనకుటుంబాన్నిపోషిoచుకుంటున్నవిషయంమరచితనస్వంత సొమ్మేదోవారికిదోచి పెడుతున్నధోరణిలోఇలాంటికిరాతకచర్యలుచేపట్టడంఏట్రైనింగ్లోబోధింపబడిఉందో!లేకమరేదైనాకులమతభేదాలుపాటిస్తూఇలాంటిపనులుచేయడంజరిగిఉంటేఅదిఏమాత్రంక్షమించరానినేరం.ఉధ్యోగాలకువచ్చినపుడుఉద్యోగధర్మంతప్పమిగిలినవన్నీపక్కనపెట్టితనవృత్తిధర్మంపాటించగలిగితేనేఇలాంటిఉధ్యోగాలకురావాలి.లేదామడికట్టుకునిఇళ్ళలోకూర్చోవాలి.పూర్వంఉపాధ్యాయులనుతల్లిదండ్రులు'తమబిడ్డలను శిక్షించైనాచదువుచెప్పమనేవారు.అనాటిఉపాధ్యాయులదృష్ణంతాకేవలంతమవద్దకువచ్చినచిన్నారులకువిద్యాబోధనచేయటంమీదేఉండేది.!అందుకేతల్లిదండ్రులుతమపిల్లలనుదండించినాపట్టించుకునేవారుకారు,ఐతేఆదండనతీరువేరుగాఉండేది,దండనఎందుకోఅటుతల్లితండ్రులకూ,ఇటుపిల్లలకూతెలిసేది, వంటిపై పడిన ఆదండన మనస్సుపైకాక బుధ్ధిపై పడేది.అందుకే దండనపొందినపిల్లలుఆతర్వాతబాగా చదివేవారు,నేటి\శిక్షలతీరేమారిపోతున్నది!,అందుకేపిల్లలనుశిక్షించడంనేరంగామారింది.నేడుఆశిక్షకుభయపడిఎంతోమందిప్రభుత్వబళ్ళలోచదివేపేదవిద్యార్ధులుచదువులుమానేసిపనులకువెళుతుంటేఅదే
కార్పొరేట్,కాన్వెంట్స్కూళ్ళలోచదివేపిల్లలనుబాధిస్తేకేసులుపెట్టిఉపాధ్యాయులనురచ్చకీడుస్తున్నారు.
ఐనాఅలాంటివారినిచూసిమరొకరూమరొకరూమారకపోగామనస్తత్వంవికృతంగామారటంఎక్కువైపోతున్నది.సర్వులకూసమానహక్కులూ, సమాన హోదాలూ, సమానబాధ్యతలూ, ఇస్తున్నమన స్వతంత్ర భారతదేశంలో విదేశీ ఉద్యోగులవలెభారతీయవిద్యార్ధులనిలాక్రూరమైనశిక్షలువిధించడంఏమాత్రంసమం జసం!మానవతనూ,మానవీయవిలువలనూవిధ్యార్ధులమనస్సుల్లోనాటవలసినహాస్టల్స్ ,విద్యాలయా లూ,జైళ్ళవలెతయారవటంహేయంకాదూ!గురుపూజోత్సవాలు,గురువులకుసన్మానాలూ,గౌరవాలూ, సమాజంపట్ల వారి బాధ్యతలను గుర్తు చేసేందుకే అనేవిషయం గుర్తుంచుకోడం అతిముఖ్యం. 

Tuesday 4 September 2012

' సరస్వతీ నమస్తూభ్యం '


                                         ' సరస్వతీ నమస్తూభ్యం '    
        సిస్టం ముందుకూర్చుని సీరియస్ గా పనిచేసుకుపోతున్న హరి తన సెల్ మోగటంతో తీసు కున్నాడు"హలో!హరీ!నేనురాసూరిని!"అనేమాటలువిని,ఆశ్చర్యంగా"ఓ!నువ్వా!సూరీ!ఎక్కడ్నుంచీ!ఎన్నాళ్ళైందిరా! నీగొంతువిని! ఎక్కడ్నుంచీరా ఫోన్?"  
" అవన్నీ తర్వాత ముందునీవు  అర్జంట్గా బయల్దేరి ఇంటికొచ్చెయ్ !అదే రా బందర్లోని మాపాత ఇల్లే కారుందిగా ! బయల్దేరు "  అనిఫోన్ కట్ చేసిన సూరిని తల్చుకుని వీడెప్పుడూ ఇంతే ఆకాశంలో మెరుపులామెరుస్తుంటాడు. తప్పుతుందా! ప్రాణ స్నేహితుడాయె!' అనుకుంటూ లేచి తనక్యాబిన్  లోంచీబయటపడి  ,బాస్ వద్ద లీవ్ తీసుకుని బయల్దేరాడు హరి. డ్రైవ్ చేస్తుంటే హరి కారు ముందు కెళుతుండగా అతడిమనస్సు వెనక్కు మళ్ళింది .
                              **********************
   ఆరోజుల్లోతానూసూరిఎంతస్నేహంగా ఉండేవారు!తనకెంతోగుర్తుఒకటోక్లాస్లోసూరిజాయినవ్వడం , అందరికీబొరుగులూబెల్లాలూ,పలకలూ,బలపాలూ, పిప్పరమెంట్లూపంచి,సూరి చేత తరగతి టీచరైన  సరస్వతిగారికిపాదాలకునమస్కారంచేయించారు,ఆమెకుపండ్లుపులుఇప్పించారు.వాడినాన్నగారు.
పలకమీద ఓంనమశ్శివాయఅనిటీచర్ రాసి,సూరికి అక్షరాభ్యాసంచేయించినరోజునవాడినితనపక్కనే కూర్చోబెట్టారుటీచర్. అంతేఆరోజునుండీసూరి,తనూ బెస్ట్ ఫ్రండ్సఐపోయారు . 
       వాడేమో ప్రతిరోజూ సరస్వతీ టీచర్ గారి పాదాలకు నమస్కరించందే క్లాస్ లోకూర్చునేవాడుకాదు, తానేమోకనీసంఆమెకునమస్కారంమన్నాపెట్టేవాడుకాదు. సూరికి ''పలికేదికాదు.సబదులు పలికే వాడు,టీచర్నిచరచ్వతీ టీచర్అనిపిలిచేవాడు.మిగిలినపిల్లలతాఊరికేటీచర్!’అంటేసూరిమాత్రం ' చరచ్వతీ టీచర్ !' అనేవాడు.ప్రతిరోజూటీచర్ వాడికి స స అనిపలికిస్తేవాడు చ చ అంటుంటే అంతా నవ్వుకునేవారం. చీదర్,ఆచ,చరణ్,చచి,చేచు అంటూ శ ష, స లకు బదులూ అన్నింటికీ చ నే పలికే వాడు. కావాలనివాడికితోఉన్నపదాలుచెప్పిపలకమనినవ్వుకునేవాళ్లంఅంతా.స్కూల్ అనమంటే వాడు చ్కూల్ అనేవాడు.తర్వాత్తర్వాతవాడుక్లాస్ లోఫస్ట్ వచ్చేవాడు,ఏక్లాస్ కెళ్ళినావాడు ఫస్టే !తాము   టెంత్ క్లాస్ కెళ్ళినా సూరి సరస్వతీటీచర్ గారికిపాదనమస్కారంచేయందేక్లాస్కెళ్ళేవాడుకాదు .వాడికి ఆటీచరంటేఅంతభక్తి ,ఆమెకూసూరిపైఎంతోఅభిమానం,తానుమాత్రంవాడిపక్కనేఉన్నాకనీసంచేతులెత్త కపోయినానమస్కారంఅనన్నా,చెప్పేవాడుకాదు.ఐనా టీచర్మాత్రంముందుగాతననే పలకరించేవారు .
" ఏమోయ్! హరీ! బావున్నావా!' అనో బాగా చదువుతున్నావా! ' అనో అడిగేవారు.   
తానూ సూరి స్నేహంతో పట్టుదలగా చదివి టెంత్ లో వాడు స్టేట్ ఫస్ టైతే ,తాను సెకండ్ వచ్చాడు. స్కూల్ లో తమకెంత గౌరవం! అదంతా సూరి స్నేహంవల్లే ! వాడిపట్టుదలేతనకూఅబ్బింది.ఆతర్వాత తాము జూనియర్ కాలేజ్ లో చేరారు. కావాలని సరస్వతీ టీచర్ స్కూల్ కువచ్చేచుట్టుదారెంటే సూరి వచ్చేవాడు కాలేజ్ కి. దార్లో సరస్వతీటీచర్ కనపడగానేరోడ్లోనేవంగిపాదనమస్కారం చేసేవాడు సూరి , తానుమాత్రంపక్కకు తప్పుకునేవాడుఆవిడదూరంగావెళ్ళేవరకూ." ఒరే సూరీ! నీకిదేంపిచ్చిరా!ఎక్కడో ఒకటో తరగతిలోచదువుచెప్పెన ఆటీచర్ కుఇలానడిరోడ్లోనూ పాదనమస్కారం చేయాలిట్రా! అందరూ నవ్వుతున్నార్రా మనల్నిచూసి" అంటే " ఒరే హరీ! నీవేంఆమెకునమస్కారం చేయట్లేదు,నేనూ నిన్ను ఎప్పుడూఆమెకునమస్కారంచేయమని చెప్పనూలేదు.ఇహనీకేంబాధరా! నవ్వేవారునన్నుచూసిగానీ నిన్నుచూసికాదుగా!నేనంతేరా!ఆటీచర్గారిదయవల్లేనాకు',,'లకుబేధంతెల్సిసరైనఉఛ్ఛారణనేర్చి
పదాలుసరిగాపలకడమేకాక,గణితంపట్లఆటీచర్ నాకుఏర్పరచినఆసక్తివల్లేఈనాడునేనింతబాగాచదువు తున్నాను, అదంతాఆమెనాకుప్రసాదించినవరంరా! నేనింతే హరీ !" అనేవాడు."ఐతేనేనీదారినరానురా!మనకుదగ్గరదారివదలి,నడుచుకుంటూఈచుట్టుదారినఆటీచర్ కోసం రావడం చాదస్తం రా! " అనితానంటే , " ఒకే హరీ ! రేపట్నుంచీనీవుఆదగ్గరదారినేవెళ్ళు,నేనుమాత్రంఇటేవస్తాను " అన్నాడు .తనకెంతో గుర్తు,నాల్గురోజులుసూరినివదలితానువంటరిగావెళ్తే ఏదోలోటుగా ,దిగులుగ అని పించింది.సూరిచెప్పేవాడు" సరస్వతీటీచర్ నిన్నురోజూఅడుగుతూనేఉన్నార్రా!నీఫ్రెండ్రావట్లేదేమని    . ఆరోజు తనకు తలకొట్టేసినట్లైంది ,తాను ఏనాడూనమస్కరించకున్నా,టీచర్ నాగురించీఅడిగేరంటే ఆమెకు తనపైనా సూరిపైనున్నంత ప్రేమాభిమానాలున్నాయనీ, టీచర్లు తమకు తమస్టూడేంట్స్ నమస్కరించాలనికాక వారు క్షేమంగాఉంటూ ,చదివి వృధ్ధిలోకి రావాలనిమాత్రమే కోరుకుంటారని! .
ఆమర్నాడుతానూసూరితోపాటుఆచుట్టుదారంటేవెళ్ళడం, సరస్వతీటీచర్ గారికినమస్కరించడం ప్రారంభించాడు.ఆరోజు టీచర్ సూరిలాకాక , చేతులుజోడించినమస్కరిస్తున్నతనతలపై చేయివేసి అప్యాయంగా తడుతూ," హరీ ! నీనమస్కారంకోసంకాదోయ్నీగురించీఅడిగింది,మీరిద్దరూవిడబాయని జంటకదా! నీవుకనిపించకపోడంతోనాకేదోలోటుగాఅనిపించి అడిగానంతే! అదేంటో నోయ్ !  మీరిద్దరూ కనిపించనిరోజు నాకేదో వెలితిగా ఉంటుంది " అన్నారు.ఆతర్వాతతానుఇంజనీరింగ్లోచేరడంతో బందర్ వదిలేసివరంగల్ వెళ్ళిపోయాడు.తానైతేఆస్కూల్ నూసరస్వతీటీచర్ నూఒకరకంగామరచిపోయినట్లే!  సూరిహైదరాబాద్ లోజె.ఎన్ టి యు లో చేరి,తనలక్ష్య మైన ఐ.ఏ.ఎస్ కోచింగ్ సైతంఏకకాలంలో తీసు కుంటూ,చివరకుతనలక్ష్యంసాధించాడు.ఇప్పుడువాడుజిల్లాకలెక్టర్ !తమస్నేహాన్నినెమరువేసుకుంటూ ఎంతస్పీడ్ గాకారు డ్రైవ్ చేశాడోగానీ విజయవాడనుండీబందర్ చేరిపోయాడు.
      గేట్లోఅడుగుపెట్టగానే,ఎదురొచ్చి" నాకు తెల్సుహరీ! నీవింతత్వవగావచ్చేస్తావని, పదపద వెళదాం " అంటున్న సూరిని వింతగా చూసి ," ఎక్కడికిసూరీ! " అడిగాడుహరి. " చెప్తాపదవోయ్ ! " అంటూ హరి కార్లోనే ఇద్దరూ ఎక్కి బయల్దేరారు." హరీ నీకు గుర్తుందా ! ఆరోజునేనుమొదటిసారిబడికి వచ్చినపుడు, నేనునీపక్కనేకూర్చున్నాను, నీవు నాపెద్ద బలపంతీసుకునినీచిన్నబలపం నాకిచ్చావు. నేను పెద్దగా ఏడుస్తూ " చరచ్వతీటీచర్ చరచ్వతీ టీచర్ ! వీడునాపెద్ద బలపంతీచేచుకున్నాడు " అని అరిచాను. టీచర్ మనవద్దకువచ్చిపెద్ద బలపాన్నిసగానికితుంచి " ఇదో ఇప్పుడుఇద్దరికీ సమానమైన బలపాలు సరా! చక్కగా రాసుకోండి, కొట్లాడకూడదు, ఒకరివి ఒకరు తీసుకోకూడదు, ఒకరికున్నవిమరొకరితో  సమంగా పంచుకోవాలి సరా! ఏమైనా కావలిస్తే నన్నడగండి" అనిమొదటినీతిపాఠంనేర్పారు, ఆక్షణం మహిమేంటో గానీమనం ఇద్దరంమంచిస్నేహితులమై, మనంతయారుచేసుకున్ననోట్సులు పంచుకుని శ్రధ్ధగాచదివిఇంతవారమయ్యాం ,ఆమెనేర్పినంమొదటినీతిపాఠంనామదిలోనిల్చిపోయిందిహరీ!దేశానికి ఏదైనా మంచిచేయాలని,నేను కలెక్టర్నైపేదలకుచేతనైనసాయంచేయాలనేనాకోరికఇలానెరవేరనుచిన్న తనంలోమనసరస్వతీటీచర్చెప్పిననీతులుమనస్సులోనాటుకోడమే !నేనుసరస్వతీటీచర్ చక్కగా చెప్పే పాఠాల గురించీమాట్లాడితే నీవుఅనేవాడివిగుర్తుందా !వాళ్ళుప్రభుత్వంనియమించినఉపాధ్యాయులు, చదువుచెప్పడంవారిధర్మం,ఎందుకంటేవారుప్రభుత్వంజీతంతీసుకుంటున్నారుగనుక' ,అనేవాడివి. ఎందుకోరా నాకు మాత్రం  మొదటఅక్షరాలు దిద్దటం నేర్పించిన సరస్వతీ టీచరంటే అభిమానం!ఆమె చిన్నప్పుడు చెప్పిన నీతికధలూ, పాటలూ, షేరిగ్ గేంస్ నాకింకా గుర్తు.ఆటీచర్ నునేనుమరువలేను, ఆమెఆశీస్సులతోనే మనమింతవారమయ్యాం, గురుదీవెనఅమోఘమైనది " అంటున్నసూరితో
సూర్యనారాయణఐ.ఏ.ఎస్.గారుమంచిపరిపాలనఅందివ్వటమేగాకబాగానేఉపన్యాసాలూఇస్తారన్న
మాట!ఎంతైనా నీవు సరస్వతీ ప్రియుడివోయ్ ! ఆమాత దయతోపాటు సరస్వతీ టీచర్ గారి దీవెనలూ నిన్ను గొప్పవాడ్ని చేశాయేమో!" అన్నాడు హరి..
" నీవుమాత్రం తకువా హరీ! ఇంజనీర్ గా మంచి పేరు తెచ్చుకుంటున్నావ్!గొప్పజీతం తీసుకుంటున్నావ్! " స్నేహితుని భుజం తడుతూ సూరి అన్నాడు. ఇంతలో" కారాపు హరీ "అని సూరిదిగి, ఒక మంచి కంచిపట్టుచీర ,శాలువా, ఒకబుట్టెడురకరకాలపండ్లూ,ఒకపెద్దపూలమాల ,బొకే తీసుకుని కారెక్కాడు. కలెక్టర్ క్యాంప్ ఉందనితెల్సియ.ఆర్.ఓ ,ఇతరఆఫీసర్లంతావచ్చిపాఠశాలముందు బారులుతీరారు,వినతిపత్రాలుఅందించాలనిఎంతోమందిప్రజలూవచ్చిగుంపుగాచేరారు.సూరికారుదిగ్గానే యం.ఆర్వో.వచ్చి , నమస్కరించి మెడలో దండవేయబోతూ "సార్!కాదనకండిమొదటిమారుమాఊరికి వచ్చారు " అనగాసూరిమర్యాదగావారించి,"రండిలోపలికి"అంటూపాఠశాల్లోకిదారితీశాడు.అప్పటికేవచ్చి ఉన్నబిళ్ళబంట్రోతు సూరికంటి చూపుఅర్ధంచెసుకున్నట్లు కార్లో ఉన్నబుట్టలన్నీదింపుకుతెచ్చాడు. 
హెడ్మాస్టర్తోఏదోమట్లాడిఅతడుదారిచూపగాఒకతరగతిగదిలోప్రవేశించారుకలెక్టర్సూర్యనారాయణతోపాటుగా అంతా. గదిలోపాఠంచెప్తున్నఏజ్డ్లేడీటీచర్వారినంతాచూసిభయంగాలేచినమస్కరించారు.హెడ్మాస్టర్ "మన జిల్లాకొత్త  కలెక్టర్ గారు " అని పరిచయంచేయగా ఆమెమరోమారునమస్కరించికుర్చీచూపారు. కలెక్టర్ సూర్యనారాయణ ఆమెదగ్గరగా వెళ్ళి ముందుగా ఆమెకు పాదనమస్కారంచేసి, తాను తెచ్చిన పూలమాలవేసి , చీరరవిక,పసుపుకుంకుమలూ, పూలూ పండ్లూ ఉన్నపెద్ద ట్రే ఆమెకుఅందించి, శాలువాకప్పి,నమస్కరించాడు. తెల్లబోయిచూస్తున్నఆమెతో " బావున్నారా చరచ్వతీ టీచర్ ! వీడు నాపెద్దబలపంతీచుకున్నాడుచరచ్వతీ టీచర్ ! "అంటూ హరిని చూపాడు.
ఆమెసంభ్రమంతో"ఓసూరీ!ఇతనుహరిఔనా!!"అన్నారు."ఔనుటీచర్ !మీరెలాఉన్నారు?మిమ్మల్నిచూసిఎంతకాలమైంది!పెద్దవాళ్ళైపోయారుటీచర్! ఈరోజుమిమ్మల్నిచూసిమీదీవెనలుఅందుకోవాలనివచ్చాం " అన్నాడు హరి." హరీ! సారీ ! కలెక్టర్ సూర్యనారాయణగారు మీరు ! " అంటున్నటీచర్ నువారించి ,
" మేం మీకెప్పటికీ సూరి, హరీలమే టీచర్! మీ దీవెనలవల్లే ఇంత వాళ్ళమయ్యాం,మనహరిపెద్ద ఇంజనీర్ టీచర్ త్వరలోఅమెరికాకూడా వెళ్ళబోతున్నాడు " అన్నాడు సూరి. " ఇంతగొప్పవాడివైనా ఒకటో క్లాస్ లో ఓనమహాచెప్పిన టీచర్ను మరువలేదంటే నీవునిజంగాఎంత గొప్పవాడివో అందరికీ అర్ధ మవుతున్నది, హరీనీవూనన్నుగుర్తుంచుకునిచూడనురావటంచాలా సంతోషమయ్యా! ఇలానా విద్యార్ధులిద్దరూఇప్పటికీ ఎడబాయని జంటగాఉండటంనాకెంతో గర్వంగాఉంది." అంటూ "ఈపురస్కారం నీకేతగునయ్యా!"అంటూతనమెడలోనిపెద్దపూలమాలతీసిసూరిమెడలోవేస్తుండగామీడియాకెమెరాలన్నీ వారిని క్లిక్ చేశాయి. హరినవ్వుతూ" బావుంది పరస్పర పురస్కారం , ఇద్దరూ ఈపురస్కారానికి తగినవారే !గురువుకు తగిన శిష్యుడు " అంటూ ఆపూలమాలను ఇద్దరిమెడల్లోనూసర్ది ," ఇప్పుడూ తీయండయ్యా ఫోటోలు "అన్నాడు.  కరతాళ ధ్వనులతో ఆ పాఠశాలప్రాంగణం  మారుమ్రోగింది...   

******వార్త దినపత్రిక చెలిలో ఉపాధ్యాయ దినోత్స్వం సందర్భంగా సెప్టెంబర్ 5 న ప్రచురితం ***********

Sunday 2 September 2012

అల్లంబెల్లం చట్నీ రెస్పీ


     
అల్లంబెల్లం చట్నీ రెస్పీ:- 

1అల్లం ఒక చిన్నకప్పు, 

2. బెల్లం అంతే కప్పు.

3.మినప్పప్పు- 2స్పూన్స్ 

4,. ఆవాలు 1స్లూన్.

5. ధనియాలు-3స్పూన్స్.

6.మెంతులు 1స్పూన్ .

7. కొద్దిగా ఇంగువ.

8. ఎండుమిర్చి -4,5 [ కారాని బట్టి]

9. చింతపండు ఒక [ అదేకొలత] కప్పు.

10. ఉప్పు- తగినంత.

తయారుచేసేవిధానం -  ముందుగా మూకుడు స్టౌ మీద ఉంచి వెలిగించి 4 స్లూన్స్ నూనె వేయాలి. నూనెకాగాక పోపుసామానంతా వేసి బాగా బంగారు రంగువచ్చేవరకూ వేయించి, పక్కన పెట్టుకోవాలి. ముందుగా చింతపండు నీళ్ళలో నానబెట్టి ఉంచుకుని నానాక గుజ్జుతీసి ఉంచుకోవాలి, పోపుసామాను 
మిక్సీలోవేసి గ్రైండ్ చేసి , బాగామెదిగాక అల్లం వేసి అది మెదిగాక చింతపండు గుజ్జు, బెల్లం [తురిమినది] , ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి, తగినంత నీరు పోసి గరిట జారుగా చేసుకోవాలి. ఇది ఇడ్లీల్లోకి, వడల్లోకీ, దోసె, బజ్జీ , చపాతీ, పూరీల్లోకి కూడా చాలారుచిగా ఉంటుంది.

ఒకమారు తిన్నారంటే వదలరు. చేసి చూస్తారుగా! 

హిమాలయం

                 హిమాలయం
                ------------
        పర్వతం  పర్వతం-హిమాలయపర్వతం
                           హిమ మయమీ పర్వతం 
     1.చల్లదనం - తెల్లదనం 
      స్వచ్చ మైన ఔన్నత్యం 
       హిమాలయం పెన్నిధి 
       భరతావని  నున్నది                                          : పర్వతం:  
                              2.జీవ నదుల జన్మ స్థలి      
                                మునులకిది  తపోస్థలి 
                                వన మూలిక లందించే  
                                వన దేవత నిలయమిది                :పర్వతం:  
                                               3.ఘనమైన లొయలతో 
                                                  గొప్పపుణ్య తీర్ధాలతొ
                                                  అలరా రే శిఖరాలతొ 
                                                 నెలకొన్నది ఉత్తరాన       :పర్వతం:
                     4. మన ఎల్లగ నిలచింది  
                        మనజీవన దేవతైంది 
                        సహజ వనరుల ఖజాన  
                        కట్టనిమన కోట ఇది.                                   :పర్వతం: 
 
క సమావేశంలో శ్రోతలకోరికపై హిమాలయం గురించీ ఆశువుగా చెప్పినకవిత.