Sunday, 2 September 2012

నేతగాని నేర్పితనం


                                         నేతగాని నేర్పితనం 
పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్ళి , చెట్టుపైనుండీ శవాన్ని దించి, భుజాన వేసుకుని ఎప్పటిలగే మౌనంగానదవసాగాడు.సవంలోని కరాళుడు " రాజా!ణీకు శ్రమకలుగకుండా ఒక కధ చెప్తా ను విను.తనకు ఎంతో ఆదాయం లభిస్తుందని తెలిసినా , తన వృత్తిలోని వారు సుఖపడాలనే మంచి స్వభావంగల నేత వీరయ్య కధవిను."అని ఇలాచెప్పసాగాడు 
                                   వెంకటగిరి సంస్థానంలో ప్రతియేటా తమ నగరపు నేతగాళ్ళు నేసిన జరీ పట్టునేత బట్టల ప్రదర్సన జరిపి అందరూ ప్రసంసించే బట్టలకు బహుమతు లీయడంరాజా రామ రాయలు 'వాడుక .ఆయేడాది ప్రదర్శనకు ఎన్నో రాజ్యాల రాజులు తమ అంతఃపుర రాణి వాసంతో తరలి వచ్చారు.  మహారాణులంతా అన్నింటికంటే అందమైన , విలువైన చీరలు ముందుగా తామే కొను బడిచేసి స్వంతం చేసుకోవాలనే ఉబలాటంతోఉన్నారు.రాజారామరాయలవారుపచ్చజండా   ఊపి ప్రారంభాన్ని చాటగానే సాధారణ జనంతోపాటుగా మహారాణులుసైతం,ప్రదర్శానలోకిజొరబడ్డారు .ఆఏటి మేటి చీరను తామే కొనాలని వారిపంతం.
               వెంకటగిరి సంస్థానంలో ఎంతోకాలంగా ' మంచి నేర్పరని ' పేరుగాంచిన నారయ్యమనుమడు  వీరయ్య నవయువకుడు.బాగాచదువుకుని, చిత్రలేఖనంలోనూ అందెవేసినచేయిగా పేరుగాంచాడు.తన తాతలనాటి వృత్తినే నమ్ముకుని  నేతలోమరింత  నేర్పరితనాన్ని తాత,తండ్రుల పని చూసి నేర్చుకుని , రాత్రింబవళ్ళూ శ్రమించి ఒక గంధపువన్నె జరీపట్టుచీరను నేశాడు. దాన్ని ఒక పెద్ద కొయ్య బొమ్మకు కట్టి  ప్రదర్శనలో ఉంచాడు.చీర కట్టినతీరు ఎంత చాక చక్యంగా ఉందంటే అతగాడు నేసిన ఉద్దేశ్యాన్ని చక్కాగా చూపుతోంది.ప్రదర్శకులంతా గుంపుగా చేరి దాని అందాన్ని చూడసాగారు.ముందుగా అక్కడి కి వచ్చిన ఉదయగిరిమహారాణిఆశ్చర్యంగాఅక్కడేనిల్చిపోయింది.బొమ్మఎడమభుజంపైనుండీ   నెమలి తల,పింఛం  క్రిందికి వచ్చి  చాతీమీదకుతల , కళ్ళు రాగా మెడ కుడి చేతిక్రిందనుండీ వెనక్కు పోయి , వీపుపైకి పొట్ట రెక్కలు వచ్చి ముందుకుచ్చిళ్ళపైకి నెమలి' పురివిప్పి 'ఉన్నట్లు అద్భుతంగాచూపరుల ను ఆకట్టుకుని కళ్ళు  త్రిప్పనీయకుండా చేసిన, ఆచీరకట్టినతీరుచీరఅందాన్నిపూర్తిగాచూపుతున్నది. 

                          మైసూరి మహారాణి వచ్చి చూసి ఆశ్చర్యంతో అచేతన ఐంది. మణిపురి రాణి,ఉదయ పురి రాణి, ప్రశాంతిపురమహారాణి  వచ్చి అలాగే నిల్చిపోయారు.ముందుగా వచ్చిన ఉదయగిరి రాణి , ఆచీరవెల అడిగింది.వీరయ్య " మన్నించాలి మహారాణీ వారు. ఇది మావెంకటగిరి రాణీవారికిఅర్పించనే  తయారుచేశాను.వెలకోసంకాదు. తమరి శలవైతే  మరొకటి తయారుచేసి సమర్పించుకుంటాను ." అన్నాడు వినయంగా.   ఉదయగిరిరాణి మరేమీ అనలేక " మంచిది నాకు వీలున్నo స్వల్ప వ్యవధి లో ఇలాంటి చీరతయారుచేసి సమర్పించుకో. ఈచీర నేతకు ఎంత వెండి పట్టిందో దానికి రెండురెట్లు ధనం నేను ఇస్తాను." అంటూ,విచారించి  పదివేల వెండి రూకలు సంచీతో ఇచ్చివెళ్ళింది.
           ఆతర్వాత  విషయంవిన్న మైసూరురాణి "  వీరప్పా !నాకూ ఇలాంటి చీరేకావాలి.ముందునాకే నేసివ్వు" అంటూ 20వేల వెండినాణాలు ఇచ్చి పోయింది.తర్వాత మణిపురి, ఉదయపురి,ప్రశాంతిపురి రాణులు వచ్చి వరుసగా ముందుతనకే ఇవ్వాలని 40వేలు,80వేలు 160వేల వెండి రూకల సంచీలు ఇచ్చి పోయారు.వీరయ్యకు ఆయేటీ మేటి నేత గాని ' బహుమతి వచ్చినా ,భయంపట్టుకుంది ఆమహా రాణు లందరికీ ఎలా సరైనసమయానికి ' ఆనెమలి ' చీరలు నేసి ఇవ్వాలా అని .తన శక్తి సామర్ధ్యాలపై నమ్మక మున్నా , తాత తండ్రుల సాయంతో రాత్రింబ వళ్ళూ శ్రమించ సాగాడు. ముందుగా ఉదయగిరి మహారాణికి పంపాడు. అలా వరుసగా అందరికీ చీరలను త్వర త్వరగా  పంపాక , వారంతా తమతమ చీరలనుఇతరులతోపోల్చుకునిఅందరివీఒకేలాఉన్నాయోలేదోతాముఅడిగినట్లుతమకేముందుగాపంపాడోలేదోతెల్సుకోవాలనిఅనుకున్నారు.ఇంతలోవారoతాకల్సుకునేసమయంరానేవచ్చింది .అదే  మైసూరు  మహారాణి ' పుట్టినరోజు 'పండుగ. అంతా మైసూరుతరలివచ్చారు.దేనికైనా మంచిదని వారంతా చీర నేతగాడైన వీరయ్యను వెంటబెట్టుకురమ్మని కోరారు.వెంకటగిరిమహారాణి వీరయ్యను రమ్మని కబురం పింది.అంతా మైసూర్లో కలసి విందుభోజనాలయ్యాక తమవెంట తెచ్చిన వెంకటగిరి నెమలి చీరలను బయటికి తీశారు. మడతల్లోవున్న చీరలు ఒక్కోరిచీర ఒక్కో విధంగా కనిపించి , ఆగ్రహంతో వీరయ్యను పిలిపించారు." ఏం వీరయ్యా! ఈపనేంటి? మనరాజ్యపు పరువు తీశావు,మహారాజు గారికి అపకీర్తి తెస్తావాఈచీరలనేతేంటి, ఇంత వ్యత్యాసంగాఉంది? అంతా ముందుగానే నీకు పైకంచెల్లిం చా రుగదా!" అని గద్దించింది వెంకటగిరిమహారాణి.
           " మహారాణీ! మన్నించండి , తమరు మడతల మీంచీ చూస్తే అలాగేఉంటుంది . తమరంతా వాటిని ధరించి చూడండి.తప్పుంటే శిక్షించండి ." అన్నాడు  వినయంగా వీరయ్య." అలాగే " అని మహా రాణులంతా  అంతః పురంలోనికెళ్ళి తమ, తమ చీరలు ధరించి వచ్చారు, వెంకటగిరిమహారాణి తో సహా.అంతా అద్దం ముందు నిల్చుని చూసుకున్నారు.అందరికీ చీరలు వీరయ్య కొయ్యబొమ్మకు కట్టినట్లే వచ్చాయి.  ఆశ్చర్యంగా  వారంతా వీరయ్యను చూడగా , వీరయ్య తమ ప్రభువైన ' వెంకట రిగి  రాజా రామరాయలు వైపు చూశాడు . ఆయనతలపంకించి , మీసమ్మెలేసి " భళీ! వీరయ్యా  ! నీ చాతుర్యo మహాగొప్పది " అని తన మెడలోని వరహాల హారాన్ని బహూకరిoచాడు. "మహా ప్రభో ! మహారాజు లందరికీ నాదొకమనవి , మైసూరు ప్రాంతం పట్టు తయారీకి నాణ్యమైనతావు , తమరూ మాప్రభువులలానేతగాళ్ళనుప్రోత్సహిస్తే ,మాకంటేఉత్తమమైన ,అందమైనచీరలునేయగలరు  ,బహుదూరం నుండీ మీరు వచ్చేశ్రమ తప్పుతుంది, మాకూ సుదూరప్రాంతాలకు సత్వరమే అందించే కష్టమూతప్పుతాయి. తమరు ప్రోత్సహించాలేగానీ  మీప్రాంతపు నేతగాళ్ళు తీసిపోయినవారేంకారు. నిన్నంతా తమరి రాజ్యంలో తిరిగి నేతపనులు చూసివచ్చాను.మన్నించండి ఎక్కువ మాట్లాడి నట్లు న్నాను.తోటినేతగాళ్ళ ఇబ్బందులు చూసి ఈమాటలు చెప్పాలనిపించింది.శలవు." అన్నాడు ఎంతో వినయంగావీరయ్య.అంతాతలలుఊపారు."వీరయ్యా!నీమంచిమనస్సుకుసంతోషిస్తున్నాం  .మాకుఇంతకాలంగా తోచని విషయాన్ని తెలియజేసినందుకు ఆనందంగాఉంది.  , నీతోటి వృత్తివారిపట్ల నీవు చూపుతున్న బాధ్యతకు , నీనిజాయితీకి ఇదిగో బహుమానం " అంటూ మైసూరుమహారాజు మరో హారాన్ని అందించాడు.  " ఇహ నీవు వెళ్ళవచ్చు " అని అనుమతించగానే వీరయ్య  తన ఊరికి గుఱ్ఱం మీదతిరుగు  ప్రయాణమయ్యాడు.
“"ఓ విక్రమాదిత్య మహారాజా!రామరాయలుకు ,వెంకయ్యకుమాత్రమేఅర్ధమైనఆరహస్యమేంటి? రాణులకు చీరలు మడతలపైనుండీ వేరుగా కనిపించినా చీరలు కట్టుకున్నాక ఒకేవిధగా నెమలిని చుట్టుకున్నట్లు  కనిపించాయికదా ! ఎందువల్ల? వీరయ్య చీరలను అందరికీ సరైన సమయానికి పంపాడా  ?ఎలా? తాను నేతగాడైనా  , తన ఆదాయంపోతుందని భావించక వీరయ్య , మైసూరు మహారాజుతో సహా అందరికీ తమ రాజ్యంలో నేతవారిని ప్రోత్సహించమని ఎందుకు సలహా ఇచ్చాడు ?    రాజా !ఈప్రశ్నలకు సమాధానంతెలిసికూడా చెప్పకపోయావో నీతల వేయివక్క లవుతుంది " అన్నాడు శవంలోని కరాళుడు.
                అందుకు విక్రమాదిత్యుడు   " ఉదయగిరిమహారాణి వెంకటగిరి రాణికంటే కొచెం మందం, ఆమెకంటే ఒక్కోరూ కొంచెంకొంచెం లావవటాన మడతల్లో ఉన్నచీరతేడాగాకనిపించింది.   కట్టుకున్నాక అందరూనెమలినిధరించినట్లే, చుట్టూనెమలి పురివిప్పినట్లే అద్దంలో తమను చూసుకుని మురిసి పోయారు..వారికి  తేడాలోనిమర్మఅవగతంకాలేదు ,రాజాగారికితప్ప,ప్రతియేడదీ చీరలకు బహు మతులిస్తున్న అనుభవశాలిగనుక  . ఇహ వీరయ్య మంచి మనస్సు గలవాడుకావడoతో ,మైసూరు వెళ్ళినా అక్కడి తన లాంటి నేతగాళ్ళనుకలిసి వారి కష్ట సుఖాలు విచా రించి వారి వేదనను అర్ధం చేసుకుని  , వారికి సహాయం చేయగలనేమో అని మైసూరు మహారాజుగారికిఅలాచెప్పాడు  .అందరికీ ఒకే సారి చీరలను ఐదుమంది ద్వారాపంపాడు దగ్గరనే ఉన్న ఉదయ గిరికి  త్వరగా అందింది. దూర ప్రాంతాల వారికి  ప్రయాణ సమయాన్ని బట్టి అందింది.ఈవిషయంలో వీరయ్య తను చదివిన తెలివిని ఉపయోగించి వారుకోరిన విధంగా చీరలను అందించగలిగాడు. అన్నాడు విక్రమార్కుడు .రాజుకు ఈవిధంగా మౌనభంగం కాగానే శవంతోసహా కరాళుడు మళ్ళీ చెట్టెక్కాడు.
               ****చంద్రబాల పిల్లలమాసపత్రికలో ప్రచురితం..****

No comments:

Post a Comment