అక్టోబర్ --15.-- ప్రపంచ అంధుల
సహకారదినోత్సవం .
‘ సర్వేంద్రియాణాం నయనంప్రధానం ‘అన్నారుపెద్దలు.ఏది
ఉన్నాలేకపోయినా కళ్ళంటూ ఉంటేతన వారినీతననూచూసుకోవచ్చు.జన్మనిచ్చినతల్లి,తండ్రులతోపాటుప్రకృతిసౌందర్యానితిలకించవచ్చు.
'ది రైట్ టు సైట్'' అనేది ఈసారి’ ప్రపంచదృష్టిదినోత్సవ‘నినాదం.మానవులంతాఆనందంగాజీవించాలని కోరుకుంటారు. జీవితంలో విసిగి
వేసారినపుడు,స్నేహితులెవరైనాపలకరిస్తే"ఏముందోయ్ జీవితమంతా
అంధకారంబంధురంగాఉంది"అంటారుఅంధకారంఅంటేతెలీకపోయినాఅదివాడుకపదం.ఎన్నోసేవాసంస్థలు'తమసేవల్లోభాగంగా’కంటిపరీక్షలునిర్వహించిపేదసాదలకుఆపరేషన్లుచేయించిఉచితంగాకంటిఅద్దాలుఅందిస్తుంటారు.’ప్రపంచఆరోగ్యసంస్థ’కంటిచూపుకైతీసుకోవల్సినజాగ్రత్తలుజనావళికిఅందిస్తూనేఉంది. అలాగే’విషన్ 2020ని’మరింతగా ప్రచారంచేసేందుకు’ గాలా టూర్‌ను’ ఏర్పాటుచేస్తోంది.
కంటిప్రాముఖ్యతచదువులేనిసామాన్యులకుసైతంఅర్ధమయ్యేలాప్రముఖులచేతప్రచారంచేయిస్తున్నది.
ప్రకటనలను, ప్రోగ్రాములనుఅన్నిపత్రికలలోనూ,జాతీయ,అంతర్జాతీయటీవీఛానళ్ళలోప్రసారమయ్యేలా
చూస్తోంది .
ప్రాధమికపాఠశాలస్థాయినుండేకంటిపరీక్షలుజరిపిఏవైనాలోపాలుంటేముందేసులువైనమార్గాలుచేపట్ట
డంమంచిది.దానికైపాఠశాలసిబ్బందికివాటియాజమాన్యాలు సహకరించాల్సి ఉంటుంది.కంటిపరీక్షలు,
5సం వయస్సులోనూ ,తర్వాత ఇరవై ఏళ్ళవయస్సులోనూ,ముప్పై ఏళ్ళప్పుడూ,చేయించుకోడం వల్ల గ్లకోమా,రెటీనా వంటి సమస్యలు ఏమైనా ఉంటేవాటిని త్వరగా గుర్తిస్తే
... చికిత్స సులువవుతుంది .
40 సం. వయసు రాగానే ప్రతి రెండు నుంచి నాలుగేళ్ళకు
ఒకసారి కంటిపరీక్షలు చేయించుకోవాలి .
65 ఏళ్ళు చేరేకఏడాదికొకసారిపరీక్షలుఅవసరము .ఈపరీక్షలుఏసమస్యలులేనప్పుడుసాధారణముగా చేయించుకోవాలి .సమస్యఉన్నట్లుఅనుమానంవస్తేతప్పకవెంతనేనిపుణులైనవైద్యులనుసంప్రతించాలి..
షుగర్ వ్యాధిగ్రస్తులు,వంశపారంపర్యంగా డయాబెటిస్
,కంటిసంబంధితసమస్యలు ఉన్నవారూ, 40సం. రాగానే తరచూ కంటి పరీక్షలు చేయించుకోవాలి
.
అంధత్వసమస్యలపై ప్రజలనుజాగృతపరిచే ఉద్దేశంతోప్రపంచఆరోగ్యసంస్థ
ప్రతిసంవత్సరము అక్టోబర్ రెండోగురువారము, ప్రపంచ దృష్టిదినోత్సవం,నిర్వహించాలని నిర్ణయించి,1998నుండీజరుపుతూ ఉన్నారు.కంటిచూపుతోమనస్సునుతెలుపవచ్చు.ప్రపంచంలోనివిషయాలన్నీతెల్సుకోవచ్చు.కనుసన్నల్తో
పనులుజరిపించుకోవచ్చు.అదేచూపులేనివారుఏమీచేయలేకపోగాతమపను లన్నింటికీ ఇతరులపై ఆధారపడి బ్రతుకే
భారమైపోతుంది..రంగుల ప్రపంచము గురించీ ఏమీతెలీదు. ఆ కటిక చీకటిలో ఆత్మీయులనే గుర్తించలేకపోతారు.
అందువల్లే చూపును ఎప్పుడూ పదిలంగా కాపాడుకోవాలి .కళ్ళు ప్రపంచానికి వాకిళ్ళు!
అంధత్వము అంటే పూర్తిగాకాని పాక్షికం గాకాని
చూడలేని స్థితి. కంటి చూపు పోవడాన్ని గుడ్డితనం లేదా అంధత్వం అంటాం.ఇదినేత్రసంబంధమైనలేదానరాలసంబంధమైనకారణాలవలనకలుగవచ్చును.
అంతర్జాతీయ అంధుల ఆసరా దినోత్సవం అక్టోబర్
15 న ఆచరిస్తూ అంధులకు దారి చూపేది, ఆస రాగా నిలిచే ది’ తెల్లటి చేతి కర్ర.’ ఈ తెల్లటిచేతికర్రను అంధత్వానికి సంకేతంగా గ్రహించి ఐక్య రాజ్య
సమితి 1981వ సంవత్స రంలో అక్టోబర్ 15 వ తేదీని ‘వరల్ట్ వైట్ కేన్
డే’గా గుర్తించింది.
దృష్టి మాంద్యాన్ని కొలిచే వివిధ కొలమానాలు
ఇంకా అంధత్వ నిర్వచనాలు అభివృద్ధి చేయబడ్డాయి." పూర్తి అంధత్వంఅంటే చూపు పుర్తిగా లోపించడం. దీనిని వైద్య పరిభాషలో
" నో లైట్ పెర్సెప్షన్స్’ అంటారు. ఇంకా కొంతచూపుమిగిలివున్నవీరుకాంతి ఉన్నదీ
లేనిదీ,ఆకాంతి ఏదిక్కునుండి వస్తున్నదీ మాత్రమే గుర్తించగలరు.
అంధులలో ఎవరికి ప్రత్యేకమైన సహాయం అవసరం అనే
విషయం మీద వివిధ ప్రభుత్వ చట్టాలు క్లిష్టమైన నిర్వచనాలు తయారుచేశాయి. వీటిని’ చట్టపరమైన అంధత్వం ‘అంటారు. ప్రపంచ ఆరోగ్య
సంస్థ ప్రకారం దృష్టి మాంద్యం అంటే సవరించిన దృష్టి తీవ్రత 6/18 కంటే తక్కువగా ఉండడం, కానీ 3/60 కంటే మెరుగ్గా ఉండడం. అంధత్వం ,అనగా దృష్టి తీవ్రత 3/60 కంటే తక్కువగా ఉండడం.
కొన్ని రంగుల మధ్య భేధాన్ని గుర్తించలేకపోవడాన్ని
వర్ణ అంధత్వం లేదా వర్ణాంధత ,కలర్ బైండ్నెస్ అంటారు.
రాత్రి సమయంలో విటమిన్ ఎ. లోపం మూలంగా కలిగే దృష్టి మాంద్యాన్ని రేచీకటి , నైట్ బ్లైండ్ నెస్ అంటారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క అంచనాల ప్రకారం
2002 సంవత్సరంలొ ప్రపంచంలో సుమారు 161 మిలియన్ మంది కంటిచూపు లోపాలతో బాధపడుతున్నారని వీరిలో 124 మిలియన్ మందిలోదృష్టి మాంద్యంఉన్నట్లుమరియు37మిలియన్మందిఅంధులుగాప్రకటించింది.అంధత్వంచాలాకారణాలమూలంగా కలుగుతుంది:కంటి జబ్బులు,దృష్టి మాంద్యం ఎక్కువగాపౌష్టికాహారలోపంమూలంగాకలుగుతాయి. ప్రపంచఆరోగ్యసంస్థఅంచనాలప్రకారంప్రపంచవ్యాప్తంగాఅంధత్వంకలగడానికిముఖ్యమైనకారణాలు:శుక్లాలు
,గ్లకోమా ,యువియైటిస్ ,
ట్రకోమా ,కార్నియల్ తెలుపుదనము
,చక్కెరవ్యాధి, ఇంకా కొన్ని ఇతర కారణాలు.అభివృద్ధి చెందుతున్న దేశాలలో అంధత్వానికి
ఎక్కువగా నివారించగలిగే కారణాలవల్లేజనం బాధ పడటం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా
అంధులలో వృద్ధులుఎక్కువగాఉన్నా పిల్లల్లో అంధత్వం పేద దేశాలలో ఎక్కువగా కనిపిస్తుందనిఅంచనావేసిన
40 మిలియన్ అంధులలో 7080శాతంమందిలో సరైన వైద్యంతో దృష్టిని కొంత లేదా పూర్తిగా తిరిగి పొందవచ్చును.పాశ్చాత్యదేశాలలో
కలిగే అంధత్వం వయోసంబంధమైన మాక్యులా లేదా రెటినా లోపాల వలన కలుగుతుంది. మరొక కారణం
నెలలు నిండ కుండా పుట్టే పిల్లలలో కలిగే’ రెటినోపతీ.’
అతిప్రమదకరమైనదైనకల్తీసారా...తాగటంవలనఅంధత్వంకలుగవచ్చును.కానీమనదేశంలో,ముఖ్యంగా మనరాష్ర్ట్రంలో తాగుడుమాన్పించడఅసాధ్యం.అందువల్ల కనీసంకంటిపరీక్షలైనాసరిగాచేయించుకుంటూ
కంటిచూపుకోల్పోకుండా జాగ్రత్తపడేలాగా జనాలనుజాగృతిపరచాలి.కంటికిసంబంధించినఏసమస్యనైనా
అశ్రద్ధ చేస్తే ప్రమాదమనీ కంటిచూపు మందగించినా,
కళ్ళనుండి నీరు కారుతున్నా, కళ్ళు ఎర్రబడినా,
పుసులు కడుతున్నా, తలనొప్పి వస్తున్నా వెంటనే కంటి డాక్టరును సంప్రదించాలనీ తాగుబోతుల కుటుంబాలకుతెలియజెప్పాల్సినబాధ్యతసమాజసేవాసంఘాలపైనఉంది..మసకవెలుగులో,ప్రయాణాల్లో చదవడంవలనకూడా కంటి చూపుతగ్గే ప్రమాదం ఉందని తెల్సినా
ఎవ్వరూ ఖాతరుచేయట్లేదు..
అంధత్వ లెక్కలను ఒకసారి పరిశీలిస్తే 50 ఏళ్ళ క్రితం
ప్రపంచవ్యాప్తంగా నాలుగున్నర కోట్లమంది అంధులు. ప్రస్తుతం ప్రతి ఐదు సెకన్లకీ ప్రపంచంలో
ఒకవ్యక్తికి చూపు పోతోందని, ప్రతి ఐదునిమిషాలకి
ఓ చిన్నారిచూపు కోల్పోతున్నదని అంచనా. అలాగే ఏటాదాదాపుడెబ్భయ్ లక్షలమంది అంధులుగా
మారుతున్నట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. ప్రపంచంలోదాదాపు32 కోట్లమందిఅంధులులేదా దృష్టి లోపాలతో బాధపడుతున్నవారున్నారు.
వారిలో నాలుగున్నర కోట్లమందిగుడ్డివారు కాగాఇరవయ్యేడు న్నరకోట్లమందికికంటిసమస్యఅవగాహనలేనికారణంగాచిన్నచిన్నఇన్‌ఫెక్షన్లుకూడాఅంధత్వాన్నితెచ్చిపెడ్తున్నాయి.
స్త్రీలకంటేపురుషులే కంటిజాగ్రత్తలుఎక్కువగాతీసుకుంటారని,అంధులలోరెండింటమూడు వంతులు స్త్రీలు,
పిల్లలేఉన్నారనిసర్వేలుతెలియజేస్తున్నాయి.వృద్ధాప్యంమీదపడినకొద్దీకంటిసమస్యలు
అధికమవడంసాధారణం.సరైనఆహారంలేనందునఅభివృధ్ధిచెందుతున్నదేశాల్లోపేదప్రజలుఅంధత్వబారిన
పడుతున్నారు. 90 శాతంఅంధులుపేదదేశాల్లోనివసిస్తున్నవారేనితెలుస్తున్నది..నిజానికిఅంధులలో
దాదాపు 80 శాతం మందికి చూపు తెప్పించగలిగే అవకాశం వుంది.
ఆర్థిక ఇబ్బంది కారణంగాఅంధుల శ్రేయస్సు కుంటుపడుతోంది.దురదృష్ణవశాత్తూ నేటి వైద్యాలయాల్లోని
అశ్రధ్ధకారణాంగా కొంత మంది పేదలు కంటుచూపుకోల్పోతున్నారనడంలో అతిశయోక్తిలేదు.
కంటిజాగ్రత్తకైఅంతాగుర్తుంచుకోవలసినకొన్నివిషయాలు:ఎప్పుడూకూడానెంబరులేనికళ్ళ
జోళ్ళనుధరించరాదు.చలువకళ్ళద్దాలువాడేప్పుడుఅవిఅల్ట్రావైలెట్‌కిరణాలనుంచికాపాడేవిగాఉండాలి.కంట్లోనలుసుపడినప్పుడుచేత్తోగట్టిగానలపడంకానీరుద్దడంగానీచేయకూడదు.చేతికున్నమట్టి,ధూళికణాలు ,సూక్ష్మక్రిములుకంటిలోకిచేరిఅలర్జీలేదాఇన్‌ఫెక్షన్‌నుకలిగించేప్రమాదముంది.మహిళలువంటచేసేటప్పుడు
, వేడిఅవిరికళ్ళకు తగిలినప్పుడు లేదా కూరగాయలు శుభ్రం చేసే సమయంలోధుమ్ముపడితే
వెంటనే చేతులు శుభ్రం చేసుకుని చేతి వేళ్ళతో నీటిని కళ్ళమీద చిలకరించి మెత్తని గుడ్డతో
కళ్ళు తుడుచుకోవాలి. కళ్ళను చన్నీళ్ళతో కడగాలి.కంటికి శ్రమకలిగించకండాకడగాలి. కళ్ళలో
మంట ఏర్పడి ఎరుపెక్కినపుడు చిట్కావైద్యాలుచేయక
కంటి డాక్టరుకు చూపాలి.
అంధులకోసం
ప్రవేశపెట్టాల్సిన పథకాలగురించి, అలాగే నిరుపేదలకుఉచిత
కంటిచికిత్స చేయించాల్సిన అవసరంగురించి, ఆరోగ్యశాఖా
మాత్యులు,ఇతరప్రభుత్వఅధికారులనుఆలోచించాల్సిన అవసరం
ఎంతైనాఉంది. ఈ అంతర్జాతీయ అంధుల ఆసరా దినోత్సవం అక్టోబర్ 15 సందర్భంగా సభలు, సమావేశాలు ఏర్పాటు
చేసి కళ్ళు ఎంత ముఖ్యమో, వాటినెలా కాపాడుకోవాలో
అనేఅంశాలపై సభలు సమావేశాలుజరపడమేకాకసాధారణజనావళికిస్పందనకలిగేలాచూడటంప్రతిఒక్కరిబాధ్యతగాభావించాల్సి
ఉంది. మనచూపును కాపాడుకోవడంతోబాటు, మనపిల్లలు కంటి సంబంధిత
అనారోగ్యాలతో పుట్ట కుండా జాగ్రత్తతీసుకోమని
హెచ్చరించాల్సిఉంది స్కూలు, కాలేజి పిల్లలకుకంటిచూపుకు
సంబంధించిన విషయాలపైవక్తృత్వ,వ్యాసరచనపోటీలునిర్వహించాలి.పుట్టుఅంధులైనవారికిఆసరాఇవ్వనుప్రతిఒక్కరూ
కంకణం కట్టుకోవాలి. 2020 నాటికి లోకంలో అంధత్వం
అనేది లేకుండా చేయాలనేదిప్రపంచఆరోగ్య సంస్థ ఆశయం. దీని ఆవస్యకతనుఅందరికీ తెలియపరచిఅందరూ
అంధత్వనివారణకైప్రపంచవ్యాప్తంగా ప్రయత్నించాలి. కంటి డాక్టర్లు,మెడికల్‌సంస్థలు,ఐడోనార్సు
,ఇతరకంటిసేవాసంస్థలుకూడాప్రజలందరికీ అవగాహన కల్గించి సహాయం అందించాలి..
విషన్ 2020 వెబ్‌సైట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్టుతో
సహా కళ్ళకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రచురిస్తుంది.
మనిషి తల్చుకుంటే సాధ్యంకానిదేమీ లేదని ఎన్నోసార్లు రుజువైంది. ప్లేగు,
మసూచి, కుష్టు లాంటి అనేక
భయంకర వ్యాధులనివారణకు కృషి జరిగింది. ఇంకెన్నోనయం కావనుకున్నఅనారోగ్యాలునామ రూపాల్లేకుండాపోయాయి.కొన్నివేలజబ్బులతోబాటుటీబీ,క్యాన్సర్‌లాంటిఅమితప్రమాదకరమైనరోగాలకు సైతం మందు కనిపెట్టాడు.పోలియోదాదాపుగా
అంతరించింది.తీవ్ర దృష్టిలోపాలను ఆపరేషన్ ద్వారా సవరించగలుగుతున్నారు. పుట్టినతర్వాత
ప్రాప్తించేఅంధత్వాలులేకుండాచేయడంఎంతమాత్రంఅసాధ్యం కాదు. ఎందరో కంటి నిపుణులు ఇప్పుడీ
విషయంమీద గట్టిగా కృషిచేస్తున్నారు. కనుక, 'విషన్ 2020' ఆశయం నెరవేరుతుందని, అంధత్వం లేని ఆదర్శవెలుగువంతమైన సమాజంవస్తుందని ఆశిద్దాం.
********అక్టోబర్ 15 ప్రపంచ అంధుల సహకారదినోత్సవం సందర్భంగా వార్త దినపత్రికలో ప్రచురితం. ********