Sunday 23 December 2012

డిసెంబర్ 22 - మేథమెటిక్స్ డే--ß---- శ్రీనివాస రామానుజన్‌ జయంతి.

                                  
            డిసెంబర్ 22 - మేథమెటిక్స్ డే--ß---- శ్రీనివాస రామానుజన్‌ జయంతి.

         ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త  శ్రీనివాసరామానుజన్‌కు నివాళిగా 2012 సంవత్సరాన్ని జాతీయ గణిత శాస్త్ర సంవత్సరంగా ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు.. రామానుజన్ పుట్టిన రోజైన డిసెంబర్ 22ను ఏటా జాతీయ గణిత దినోత్సవం గా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
            భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త శ్రీనివాసరామానుజన్. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు శ్రీనివాసరామానుజన్‌ . తమిళనాడులో ' కోమలతామ్మాళ్‌, శ్రీనివాస అయ్యంగార్‌ 'దంపతులకు , ఓ పేద బ్రాహ్మణ కుటుంబంలో ,డిసెంబర్ 22వతేదీన 1887 సంవత్సరంలోజన్మించారు  శ్రీనివాసరామానుజన్‌. విద్యార్థి దశ నుంచే గణితశాస్త్రం పట్ల అమితాసక్తి కలిగిఎన్నోగణితసిద్ధాంతాలను ఆవిష్కరించారు.
     చిన్నతనంనుంచేరామానుజన్గణితంపట్లఅద్భుతమైనతెలివితేటల్నిప్రదర్శించేవాడు .13ఏళ్లచిరుప్రాయం లోనే గణితశాస్త్రంలోని ట్రిగనోమెట్రీ (త్రికోణమితి) అనే క్లిష్టమైన అంశంపై పట్టు సాధించాడు. లెక్కల పుస్తకాల్లోని అనేక సిద్ధాంతాల్ని రూపొందించారు. రామానుజన్ కఠినమైన లెక్కల్నిసునాయాసంగా చేసేవాడు, చదువులో పెద్దపెద్ద డిగ్రీలు లేకపోయినప్పటికీ గణితశాస్త్రంలో అసమాన ప్రతిభ కనబర్చిన మహనీయుడు శ్రీనివాస రామానుజన్. 15 ఏళ్ల వయసులో ఆయన చేసిన లెక్కల పుస్తకాలని ఈనాటికీ గణిత శాస్తవ్రేత్తలు అధ్యయనం చేస్త్తూనే ఉన్నారు.

రామానుజన్ తండ్రి కె శ్రీనివాస అయ్యంగార్ ఒక చీరల దుకాణంలో గుమస్తాగా పని చేసేవారు. ఈయన తంజావూరు జిల్లాకి చెందిన వారు.తల్లి కోమలటమ్మాళ్ గృహిణి మరియు ఆ ఊరిలోని గుడిలో పాటలు పాడేది. వీరు కుంబకోణం అనే పట్టణంలో, సారంగపాణి వీధిలో, దక్షిణ భారతదేశ సాంప్రదాయ పద్దతిలో నిర్మించబడ్డ ఒక పెంకుటింట్లో నివాసం ఉండేవారు. దాన్నిప్పుడు మ్యూజియం గా మార్చారు.. డిసెంబరు 1889 లో రామానుజన్ కుమశూచి (అమ్మవారు) వ్యాధి సోకింది. కానీ ఎలాగో బ్రతికి బయట పడగలిగాడు. తరువాత రామానుజన్ తల్లితోపాటు చెన్నైకి దగ్గరలో ఉన్న కాంచీపురంలో ఉన్న అమ్మమ్మ వాళ్ళింటికి చేరాడు.
రామానుజన్ అదే ఊళ్ళో ఉన్న చిన్న పాఠశాలలో ప్రాధమిక విద్యాభ్యాసాన్ని ప్రారంభించాడు. రామానుజన్ తాత కాంచీపురం న్యాయస్థానం లోని ఉద్యోగం పోవడంతో రామానుజన్ తల్లితో సహా తిరిగి కుంబకోణం వచ్చి అక్కడ కంగయాన్ ప్రాథమిక పాఠశాలలో చేరాడు. అతడిప్రాధమిక విద్య సరిగాఒకే చోట సాగలేదు, మద్రాసు, కుంభకోణం కాంచీపురం అలామారసాగింది.
  రామానుజన్ తండ్రి రోజంతా పనిలో లీనమవడంవల్ల  చిన్నపుడు అతని భాద్యతలు తల్లే చూసేది. కాబట్టి తల్లితో చాలాగాఢమైన అనుబంధం కలిగిఉండేవాడు. ఆమెనుంచి రామానుజన్ సాంప్రదాయాల గురించి, కుల వ్యవస్థ గురించి, పురాణాల గురించి తెలుసుకున్నాడు. భక్తిగీతాలు ఆలపించడం నేర్చు కున్నాడు. ఆలయాలలో పూజలకు తప్పక హాజరయ్యేవాడు. మంచి ఆహారపు అలవాట్లు అలవరచు
కున్నాడు. ఒక మంచి బ్రాహ్మణబాలుడిగా ఉండాలంటే ఈలక్షణాలన్నీ తప్పనిసరి.కంగయాన్ పాఠశాల లో రామానుజన్ మంచి ప్రతిభావంతమైనవిద్యార్ధిగా పేరుతెచ్చుకున్నాడు.పదేళ్ళకేఆంగ్లం,తమిళం  ,  భూగోళ శాస్త్రం, గణితంలోనూ ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. పదేళ్ల వయస్సు నుంచే గణితంలో ప్రజ్ఞను ప్రదర్శించిన ఆయన.. గణితంలో కష్టసాధ్యమైన 'త్రికోణమితి' విభాగంపై పన్నెండేళ్ల వయస్సులోనే పూర్తిగా పట్టు సాధించారు. 17 ఏళ్ల వయస్సులోనే 'బెర్నౌలీసంఖ్యలు, యూలర్ అనంత సంఖ్యల సిద్ధాంతా'లపై పరిశోధనలు చేశారు. ఆయన ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం కుంభకోణంలోని కళాశాలలోచదువుకోవడానికిస్కాలర్‌షిప్ ఇచ్చింది.కానీకేవలం గణితంతప్ప మిగతాగణితేతర సబ్జెక్టుల్లో ప్రతిభచూపకపోవడంతో ఆతరువాత స్కాలర్‌షిప్‌ను నిలిపివేశారు.
1909, జులై 14వ తేదీన అంటే ఆయన 22వయేట రామానుజన్ కు జానకీ అమ్మాళ్ అనే తొమ్మిదేళ్ళ బాలికతో వివాహ మైంది.. తరువాత ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాడు.మద్రాస్ పోర్టుట్రస్టు కార్యాల యం లో గుమాస్తా గా చేరి, ఆ డబ్బుతో మరో కాలేజీలో చదువుతూ.. గణిత పరిశోధనలు చేశారు.
అప్పట్లో కొత్తగా ఒక గణిత శాస్త్ర సమాజాన్ని ఏర్పరిచిన డిప్యూటీ కలెక్టర్ రామస్వామిని రామానుజన్ కలుసుకున్నాడు. ఆయన పని చేసే ఆఫీసులో ఒక చిన్న ఉద్యోగంకోరి ఆయనకు తాను గణితం మీద రాసుకున్న నోటు పుస్తకాలను చూపించాడు. వాటిని చూసిన అయ్యర్  ఆనోటుపుస్తకాలలోని అపార మైన గణిత విజ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయాడు.అంతటి గొప్ప విజ్ఞానికి ఈచిన్న రెవెన్యూ విభాగంలో ఉద్యోగం ఇవ్వలేక,రామస్వామి రామానుజన్ ను కొన్నిపరిచయలేఖలురాసిమద్రాసులోతనకుతెలిసిన గణిత శాస్త్రవేత్తల దగ్గరకు పంపించాడు. అతనిపుస్తకాలను చూసిన కొద్దిమంది అప్పట్లో నెల్లూరు జిల్లా కలెక్టరుగా పనిచేస్తున్న రామచంద్రరావుదగ్గరకు పంపించారు.ఈయనభారతీయగణితశాస్త్రసమాజానికి కార్యదర్శి కూడా. రామచంద్రరావు కూడారామానుజన్ పనితనం చూసిఅబ్బురపడి, అవిఅతని రచన లేనా అని సందేహం కూడావచ్చింది. అప్పుడు రామానుజన్ తాను కలిసిన ఒక బొంబాయి ప్రొఫెసర్
సల్ధానా  గురించి, అతనిరచనలు ఆ ప్రొఫెసర్ కు కూడా అర్థం కాలేదని చెప్పాడు.
        నారాయణఅయ్యర్, రామచంద్రరావు, E.W.మిడిల్‌మాస్ట్ మొదలైనవారురామానుజన్ పరిశోధన లనుఆంగ్ల గణితశాస్త్రవేత్తలకు చూపించడానికి ప్రయత్నించారు.లండన్ యూనివర్సిటీకాలేజీకి చెందిన ఎం.జే.ఎం. హిల్ అనే గణితజ్ఞుడు రామానుజన్ పరిశోధనల్లో కొన్నిలోపాలున్నాయని వ్యాఖ్యానించాడు.  హిల్ ,రామానుజన్ ను విద్యార్థిగా స్వీకరించేందుకు అంగీకరించలేదుగానీ, రామానుజన్ పరిశోధనలపై మంచి సలహాలు మాత్రం ఇచ్చారు. ఆయన ఆవిష్కరించిన 120 గణిత సిద్ధాంతాలను కేంబ్రిడ్జ్‌ ప్రొఫెసర్‌ జి.హెచ్‌. హార్డీకి పంపారు.రామానుజన్‌మేధస్సుకుఆశ్చర్యపడినహార్డీఆయననుబ్రిటన్‌కుఆహ్వానించారు.  అంతేకాక, 28-12-1918 న రామానుజన్‌ను 'ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటీ'మెంబర్ గా ఎన్నుకున్నారు. దీంతో రాయల్‌ సొసైటీలో ఫెలోషిప్‌ పొందిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందారు. కేవలం 30 ఏళ్ళ వయస్సులోనే గణితంలో అనేకచిక్కుసమస్యలనుపరిష్కరించి,ఎన్నోకొత్తసిద్ధాంతాలనుఆవిష్కరించారు.
రామానుజన్ ఆ కాలంలో సుప్రసిద్దులైన ఆయిలర్, గాస్, జాకోబి మొదలైన సహజసిద్ధమైన గణిత మేధావులతో పోల్చదగిన వాడు. రామానుజన్ లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన హార్డీ అసలు తను గణిత శాస్త్రానికి చేసిన అత్యుత్తమ సేవ రామానుజాన్ని కనుగొనడమే !’అని వ్యాఖ్యానించడం విశేషం.1914లో రామానుజన్ ఇంగ్లండుకుప్రయాణమయ్యాడు.శాఖాహారపుఅలవాట్లుగలరామానుజన్ ఇంగ్లండులో స్వయంపాకం చేసుకునేవాడు. సరిగ్గా తినకపోవడం మూలాన, నిరంతర పరిశోధనల వల్ల కలిగిన శ్రమ వలన, ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల చాలా తీవ్రమైన పరిశ్రమ చేసి 32 పరిశోధనా పత్రాలు సమర్పించాడు. శరీరం క్రమంగా వ్యాధిగ్రస్థమైంది.తీవ్రమైనఅనారోగ్యంతోఉన్నపుడు  కూడా హార్డీతో 1729 సంఖ్య యొక్క ప్రత్యేకతను తెలియజెప్పి ఆయన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేశాడు. ఈ సంఘటన గణితంపై ఆయనుకున్న అవ్యాజమైన అనురాగాన్ని, అంకిత భావానికి నిదర్శనం. ఆకొద్ది కాలంలోనే రామానుజన్ దాదాపు 3200 ఈక్వేషన్స్‌ను, ఐడెంటీటీస్‌నుసాధించారు. 'రామానుజం ప్రైమ్, రామానుజంటీటా ఫంక్షన్'లను రూపొందించారు.. కొద్దిరోజులకే రాయల్ సొసైటీ, ట్రి నిటీ కళాశాల ఫెలోషిప్‌లను పొందారు

       క్షయవ్యాధికి గురై ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 1919 మార్చిలో భారతదేశానికి తిరిగి వచ్చాడు.బొద్దుగా,కొంచెంనల్లగా కనిపించే ఆయన ఇంగ్లండు నుంచి పాలిపోయిన అస్థిపంజరం వలే తిరిగి వచ్చిన రామానుజన్ నుచూసిఆయనఅభిమానులుచలించిపోయారు.అనేకరకాలవైద్యవసతులు కల్పించినాఆయనకోలుకోలేక పోయారు.దాంతోఆయన పిన్నవయస్సులోనే 1920,ఏప్రిల్26నపరమప దించారు. శుద్ధగణితంలో నంబర్ థియరీలోని ఇతనిపరిశోధనలు, స్ట్రింగ్ థియరీ, క్యాన్సర్ పరిశోధ నల వంటి ఆధునికవిషయాలలోఉపయోగ పడుతూ ఉన్నాయి. రామానుజన్ చివరిదశలో మ్యాక్-తీటా ఫంక్షన్స్ పైచేసినపరొశోధనలు  చాలా ప్రసిద్ధమైనవి. ఆయన ప్రతిపాదించిన కొన్ని అంశాలు కొన్నిఇప్పటికీఅపరిష్కృతంగానేఉండటంవిశేషం.
..
  రామానుజన్ చాలా సున్నితమైన భావాలు, మంచి పద్దతులు కలిగిన వాడు కాస్త బిడియస్తుడు. ఆయన కేంబ్రిడ్జిలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని గడిపాడు. ఆయన జీవిత చరిత్రను రాసిన మొట్టమొదటి రచయితఆయన్నుశుద్ధసాంప్రదాయవాదిగాపేర్కొనడంజరిగింది. తనకు సంక్రమించిన సామర్థ్యం అంతా తమ ఇలవేల్పు దేవత అయిన నామగిరి ప్రసాదించినదేనని రామానుజన్ బలంగా విశ్వసించేవాడు. తనకు ఏ కష్టంకలిగినాఆమెసహాయంకోసంఎదురుచూసేవాడు.  ఆమె కలలో కన్పించి ఎటువంటి సమస్యకైనా పరిష్కారంచూపించగలదనిభావించేవాడు.
భగవంతునిచే  ప్రాతినిథ్యం వహించబడని ఏ ఆలోచనా సూత్రం కానేరదు అని అప్పుడప్పుడూ అంటేవాడు. రామానుజన్ అన్ని మతాలు ఒకటిగా నమ్మేవాడని హార్డీ ఒకసారి పేర్కొన్నాడు.
రామానుజన్ స్వరాష్ట్రమైన తమిళనాడుప్రభుత్వం , ఆయన సాధించిన విజయాలకు గుర్తుగా ఆయన జన్మదినమైన డిసెంబరు 22 ను రాష్ట్ర సాంకేతిక దినోత్సవంగా ప్రకటించింది. భారత ప్రభుత్వం 1962 వ సంవత్సరంలో ఆయన 75వ జన్మదినం నాడు, సంఖ్యా శాస్త్రంలో ఆయన చేసిన విశేష కృషిని కొని యాడుతూ స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది.
      అంతమేధావి మరికొంతకాలం జీవించి ఉంటే గణితశాస్త్రంలో  భారతదేశప్రతిభను ఇంకా దశదిశలా వ్యాపింపజేసేవాడే!ఈరోజున భారతీయులమంతాఆయనకునివాళులర్పించడంమనధర్మగా భావించాలి. దేశవ్యాప్తంగా ఉన్నఅన్నిపాఠశాలల్లో గణితపోటీలునిర్వహించి,రామానుజన్ పేర బహుమతులు ఇచ్చి బాలలకంతా గణిత ప్రఙ్ఞాశాలి ఐన ఆయన గురించీ తెలియజెప్పడమూ మన బాధ్యతగా  భావించాలి.      

Tuesday 11 December 2012

ప్రపంచ జంతువుల ,మానవ --హక్కుల దినం - డిసెంబర్‌10.


 ప్రపంచ జంతువుల హక్కుల దినం - డిసెంబర్‌10.

          డిసెంబర్ 10.అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవమేకాక నోరులేని ప్రాణులైన జంతువుల హక్కులదినోత్సవంకూడా. ఈరోజును  ప్రపంచ జంతువుల హక్కుల దినంగా జరుపుకుంటున్నాం...
                         తనూజ తెల్లవారుఘామునే లేచి వాకిలి ముందు చిమ్మి చక్కని రంగవల్లులు తీర్చి దిద్దుతుంటుంది.దానికోసంఆమెప్రతినెలాఐదుకేజీలబియ్యంమరపట్టించుకునిఆపిండిదాచుకుంటుంది.పట్టణంనుండీ
దీపావళికిపుట్టింటికివచ్చినఆమెఆడపడుచుఆనంది"మీపల్లెవాసులకింకాఈపిచ్చివదల్లే
దన్నమాట! "   అంది  వేళాకోళంగా.
" వదినా!నీవు పుట్టిపెరిగింది ఈపల్లేలోనే అని మరువకు.ఈరంగవల్లులుఎందుకేస్తున్నామోమరచావా! వాకిలి ముందున్నపిండితినను ఎఱ్ఱచీమలు వరుసల్లోవచ్చి వాటి ఆహారం అవి తీసుకు పోతుంటాయి .ఉదయాన్నే  ఇదేమనం చేసేమొదటి మంచిపని " అని చక్కాలోపలి కెళ్ళి పోయింది తనూజ.
  ఆనంది ఆలోచనలోపడింది. 'ఔను కదా! తానుపుట్టిపెరిగిన వాతావరణాన్నే మరచేంత పట్నవాసపు వాతావరణంలో పడిపోయిన తనపట్ల తనకే అసహ్యం వేయటం లేదూ !? ' అని ప్రశ్నించుకుంది ఆమె.

   భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అఖండమైనవి. ఉదయం లేచి చేసే ప్రతి పనీ తమచుట్టూ ఉన్న సూక్ష్మ ప్రాణులకు సైతం జీవితాన్నిచ్చేవిగాఉంటాయి. మొదటిముద్ద అన్నం గోడమీద కాకుల కోసం పెట్టడం, అన్నం తిన్నాక  ఓముద్ద ఇంటిముందుండే కుక్కకు వేయడం,నూకలుచెట్లక్రిందచల్లడం ,గుళ్ళ వద్ద పండ్లు,అక్కడి కోతులకు పెట్టడం, ఇవన్నీ మన చుట్టూ జీవించే జంతు జాలాలకోసం మానవులు చేసేసహాయం.భారతదేశంలో ' పశువుల పండుగ'జరుపుతాం,ఆరోజునగోవులకూ,గేదెలకూకొమ్ములకు పసుపు కుంకుమలు పూసి , పూలమాలలు వేసి పూజిస్తాం .  వాటివలన మనంపొందే సేవలకు కృతఙ్ఞతచూపేవిధానమది.      

     రానురానూ మనిషి తనస్వార్థం కోసం ప్రకృతిని, పరిసరాలను కబళించి కలుషితం చేస్తూ జీవితం సాగిస్తున్నాం .  జంతువులు, పక్షులుతమకోసంకాక,ప్రకృతిలోభాగంగాజీవిస్తూ,మనుషులదుర్మార్గానికి బలైపోతూ మనుగడ అతికష్టం మీద సాగిస్తున్నాయి.కొన్ని పక్షులు ,జంతువులూ కనుమరుగై పోతు న్నాయి, సెల్లు సొల్లు  కబుర్లకు మనిషికిరెండేసి కొనిపెట్టుకుని తినే తిండినుండీ తాగే సిగరెట్టువరకూ, చూసే పనికిమాలిన టి.వీ. సీరియల్ నుండీ పాకశాలలో వండుకుతినే వంటకాలవరకూ చెప్పుకోను సాగించే కబుర్లతో పిచ్చుకల ప్రాణాలు పోతున్నాయి. నగరాల్లో చెట్లునరికేసి అపార్టుమెంట్లుకడుతూ అనేకరకాలపక్షులకు,  కోతులకు జీవించను చోటు లేకుండా చేస్తున్నాం. 
 మనిషి తన ఉనికి కోసం, ఆహారం, వినోదం కోసం వెంపర్లాడుతూ జంతుజాలాన్ని జీవించే అవకాశం పోగొడు తున్నాడు. జంతువులను,పక్షులనూ పంజరాల్లో బంధించి, బానిసలుగా మార్చి వాటి స్వేచ్ఛను, ప్రాణాలను హరించి తన స్వార్థానికి వాడుకుంటున్నాడు. జంతువులు, పక్షుల నుంచి మనిషి పొందుతున్న ప్రతిఫలానికి కనీస కృతజ్ఞత కూడా లేకుండా వాటి పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యం, హద్దులు మీరిన హింస క్షమించరాని నేరంగానే మిగిలిపోతోంది.
                  మానవులు తమకు ఏ చిన్న కష్టం వచ్చినా , ఇబ్బంది జరిగినా ,అనేక సంఘాలు తమ ఉనికిని కాపాడుకునేందుకూ, రాజకీయనాయకులు తమస్వార్ధంకోసం అనేకపనికిమాలినకారణాలకుధర్నాలు,ఆందోళనలు, బందులు,న్యాయ పోరాటాలు అంటూఅనేకం చేస్తుంటారు.హక్కులుహరించుకు పోతున్నాయంటూ వార్తా పత్రికలు పతాక శీర్షికలువేసి సొమ్ము చేసుకుంటుoటాయి. ఐతేనోరూవాయీ లేని పక్షులూ, పశువులూ, జంతువులూ  ఎవ్వరికీ చెప్పుకోలేవు, మానవుల్లా బందులూ, హర్తాళ్ళూ చేయలేని అమాయక ప్రాణులు.అందుకే మానవులం వాటిప్రాణాలను సులువుగా హరించి వేస్తున్నాం. జంతువులకు, పక్షులకు ఏమి అన్యాయం జరిగినా ఎంత కష్టం కలిగినా కూడా అవి ఏమీచేయలేవు పాపం  వాటికీనీ కొన్ని హక్కులుంటాయని మనుషులు ఎందుకు గుర్తించ రన్నది అందరూ ఆలోచిం చాల్సినవిషయం.సృష్టిలోని ప్రతిప్రాణీ జీవించడానికి సమాన హక్కులు ఉండాలి. ఒక జీవి ప్రాణాలను హరించే హక్కు మరో జీవికి లేదు, ఉండకూడదు.

                       మనిషికి రక్షణ, ఆహారం, ఆరోగ్యాలను ప్రసాదిస్తున్న జంతుజాలంపై కృతజ్ఞతాభావంతో మెలగా ల్సిందిపోయి, క్రూరంగా హింసించడం అమానుషం. దాన్ని గుర్తించి జంతువులు, పక్షుల సంక్షే మం కోసం ఎంతో కృషి సాగించిన సాధు టీఎల్ వాస్వాని పుట్టిన రోజైన నవంబర్ 25ను ప్రతి సంవ త్సరం జంతు ప్రేమికులు, జంతు సంరక్షణా సంస్థలు ఇండియాలోజంతువుల హక్కుల దినంగా పాటిస్తున్నాయి. ఆ రోజును నో మీట్ డేగా పాటించాలని ఆ సంస్థలు కోరడం అందరూ ఆహ్వానించ దగ్గ అంశం. అలాగే, జంతువులు, పక్షులకు కూడా కొన్ని హక్కులు ఉంటాయన్నది బాధ్యత గల ప్రతి ఒక్కరూ గుర్తించి వాటి రక్షణకు కృషి చేయాలి. పురాణాల కాలం నుంచీ మనుషులకు జంతువులకు అవినాభావ సంబంధం ఉంది. నేటికీ వాటి ద్వారానే మనుషులు ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని పొందుతు న్నారు. బిడ్డకు తల్లిపాలు చాలకపోతే ఆవు పాలు పడతాం. మనిషి ఆహారంలో సగభాగం కోసంవాటిని చంపి  మాంసాన్ని వాడటం బాధాకరం.
     ఇంటి కాపలాకేకాక ఇంటిముందుకుక్క ఉండటం ఒక హోదాగామనం భావిస్తాం, , నేర పరిశోధనకూ కుక్కలను గణనీయంగా వినియోగిస్తాం.వ్యవసాయానికిఎద్దులనూ,దున్నపోతులనూ,కొండప్రాంతాల్లో ,  మంచు కొండల్లో, ఎడారుల్లో మనుషులను గమ్యానికి చేరవేయడానికి ఆప్రాంతాల్లో జీవించే జంతువు లను ఉపయోగిస్తాం. సర్కస్ వంటి ప్రదర్శనల్లో ఎన్నో జంతువులు, పక్షులతో పాటుగా క్రూరమృగా నూ ఆడిస్తూ అనేక విన్యాసాలు చేయిస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే, మనమంతా  జంతువులపై ఆధారపడి జీవిస్తున్నాం . జంతువులు కేవలం ప్రకృతిపై ఆధారపడి జీవిస్తున్నాయి.వాటిఆహారం అవి సంపాదించుకుని బతుకుతున్నామనమ్మాత్రం వాటినిబ్రతుకనీయక ,వాటిని వెంటాడి, వేటాడి హరించ డం క్షంతవ్యం కాదు. మనుషుల నుంచి తప్పించుకోవడానికి జంతువులకు ఉన్నఆవాసమైనఅడవు ల్లో తలదాచు కుంటుంటాయి. దాన్ని కూడా వదల కుండా నేడు మనంవాటిప్రాణాలు  హరిస్తున్నాం. మాంసం కోసం, చర్మాల కోసం జంతువులను వేటాడే వాళ్లు కొందరైతే, కేవలం వినోదక్రీడగా కాలక్షేపానికి క్రూరంగా వేటాడిచంపేవారు మరికొందరు.. దీని ప్రభావంతోనే, 1972లో వన్యప్రాణులసంరక్షణాచట్టం రూపొందింది. దీని ప్రకారం వన్యప్రాణులను వేటాడటమే కాదు, పట్టుకుని బంధించడం కూడా నేరమే. ఇక పెంపుడు జంతువుల పేరుతో కూడా అవి అనేక హింసలకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్టు, నోరు లేని మూగ జీవాలకు స్వేచ్ఛ, సంరక్షణ కల్పించడానికి అనేక సంస్థలు నడుం బిగించడం గర్వించదగిన మంచి పరిణామం.   పీపుల్స్ ఫర్ ఏనిమల్స్, ‘జీవ రక్షా సమితి, జీవ బంధు, బ్లూ క్రాస్ వంటి సంస్థలు జంతువుల రక్షణకు ఎన్నో కార్యక్రమాలు, ఉద్య మాలు నిర్వహించడం మూలంగా కొంతైనా ఉపశమనం లభిస్తోందన్నది వాస్తవ విషయం. దీనికి వీలున్నంతగా మనమంతాసహకరించడం మనకనీస కర్తవ్యం.  
    హక్కులు కేవలం మనిషికే కాదు జంతువులకూ ఉండాలన్న ఉద్దేశ్యంతో యూనివర్సల్ డిక్లరేషన్ యానిమల్ రైట్స్‌నిప్రకటించారు.ఈడిక్లరేషన్‌ని1998లోప్రపంచదేశాలుఆమోదించాయి.మానవహక్కుల దినమైన డిసెంబర్10న జంతువులహక్కులదినంగాచేయడంద్వారాజంతువులనుమానవులు తమ హక్కైన ప్రాణ రక్షణ నుపొందేహక్కూ వాటికీ ఉందనే  సందేశం అందరికీ అందిం చడమే ప్రధాన లక్ష్యం.
డిసెంబర్ 10.అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం.
           
ఇహ నోరుండి తమహక్కులకోసం పోరాటాలుజరిపే మానవుల హక్కులదినోత్సవాన్ని గురించీ కాస్తంత చెప్పు కుందాం.   భూమిపై పుట్టిన ప్రతిమానవునికీ జీవించడానికి కొన్ని హక్కులుంటాయి.    ఇందులో జాతి,మత,కుల భాష,లకుసంబంధంలేదు.మనిషిగా జీవించే హక్కు కలిగి ఉండడమే ప్రధాన ఉద్దేశ్యం.అలాంటి మానవ హక్కుల దినాన్ని 10.12.1948న ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అప్పటి నుండి ప్రతిసంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా డిసెంబరు 10వ తేదీ ని అంతర్జాతీయ మానవహక్కుల దినోత్స వంగా జరుపుకుంటున్నాం. వివక్షత లేనటువంటి మానవ సమాజ నిర్మాణమేఈఅంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవ లక్ష్యం.అసలు ఈ ఉత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నామో ,ఎందుకోసం  జరుపుకోవాలో ముందుమమనంఆలోచించాలి.

                  మానవ హక్కులను రక్షించేందుకు, మరిన్ని సౌకర్యాలు కలిగించేందుకు అమెరికా 1945 నుండి ప్రయత్నిస్తోంది. ఆ దేశ జనరల్‌ అసెంబ్లీ  అధికార ప్రకటనలను గౌరవించే ఉద్దేశంతో 1948వ సంవత్స రంలో డిసెంబర్‌ 10వ తేదీని డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌గా (యు.డి.హెచ్‌.ఆర్‌) నిర్ణయించారు. మరి రెండేళ్ళ తర్వాత 1950 డిసెంబర్‌ 4వ తేదీన జరిగిన 317వ జనరల్‌ అసెంబ్లీ ప్రత్యేకసమావేశంలో మానవ హక్కుల దినోత్సవానికి సాధారణ ప్రణాళిక రచించి అమలు జరిపారు. ఆరోజున అన్ని రాష్ట్రాల అధికార ప్రతినిధులనూ ఆహ్వానించడమే కాకుండా ఆసక్తి ఉన్న సంస్థలు ఈరోజున మానవ హక్కుల దినోత్సవం జరిపినట్లయితే ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందని జనరల్‌ అసెంబ్లీ సూచించింది.

        ప్రతీ మనిషికి దక్కవలసిన హక్కులు దక్కుతున్నాయా? హక్కులు పరిరక్షించేందుకు మనమంతా మన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నామా?మనహక్కులనుకాపాడుకోగల్గుతున్నామా?కోట్లాదిమంది అశాంతితోఅభద్రతాభావంతో తల్లడిల్లిపోతున్నారుకనుకనేమానవ హక్కులదినోత్సవం అనేది పుట్టుకొచ్చింది.ఇతరదేశాలతో  పోల్చినప్పుడు అమెరికాలో ఈరోజుకు చాలా ప్రాధాన్యత వుంది.   న్యూయార్క్ సిటీ హెడ్‌ క్వార్టర్స్‌ క్యాలండర్‌లో డిసెంబర్‌ 10వ తేదీ హైలైట్‌ చేసిచూపుతుంది.పైస్థాయి రాజకీయ సభలు, సమావేశాలు అలాగే సాంస్కృతిక సంస్థలకు సంబంధించినప్రదర్శనలు,సాంప్రదాయ నృత్యాలు మొదలైనవన్నీ ఈ ప్రత్యేకదినాన ఏర్పాటు చేస్తారు.

       ఐదేళ్ళకోసారి అమెరికా సంయుక్త రాష్ట్రాలు 'మానవహక్కులకోసంపోరాడినవారికిఇచ్చేపురస్కారం, ఇంకా అత్యున్నత నోబెల్‌ బహుమతి అందుకున్నవారిని ఈరోజున సత్కరిస్తారు.అనేకప్రభుత్వ,ప్రైవేటు సంస్థలు మానవ హక్కుల రంగంలో చురుగ్గా పాల్గొంటారు. ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తారు. సాధారణ, సాంఘిక సమస్యలను చర్చి చేస్తారు.వాటిని పరిస్కరించేప్రయతనం చేస్తారు.

        2006వ సంవత్సరంలో మానవ హక్కుల దినాన్ని పురస్కరించుకుని పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం సలిపారు. నిజంగా తిండి, బట్ట, గూడు లాంటి కనీస అవసరాలు తీరకపోవడం ఎంత విషాదం?! ఈ సందర్భంగా ఎందరో వాటి పరిష్కారానికి సంబంధించిన ప్రకటనలు విడుదల చేశారు. పేదరికాన్ని రూపుమాపాలని, అందుకు మనమంతా కృషిచేయాలని మేధావులెందరో అభిప్రాయపడ్డారు. 2008 డిసెంబర్‌ 10న యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ 60వ వార్షికోత్సవం జరిగింది. యునైటెడ్‌ నేషన్స్  సెక్రటరీ జనరల్‌ 'ఆ ఏడాది అంతా మానవ  హక్కుల పరిరక్షణకు సంబంధించిన ప్రణాళికలు, ఉపన్యాసాలతో సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు. యు.డి.హెచ్‌.ఆర్‌ రూపొందించిన డాక్యుమెంట్‌ 360 భాషల్లోకి అనువాదమై ప్రపంచ రికార్డు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకుతమ హక్కులేంటో తెలియజేయడం,అవసరమైన సహకారం అందించడం ధ్యేయంగా పెట్టుకుని అనేకసంస్థలు పనిచేస్తున్నాయి. 1998లో మాల్దావా ''ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్‌ ది యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్' అంటూ ఒక పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. తైవాన్‌లో షియామింగ్‌టెహ్‌1979లోహ్యూమన్‌ రైట్స్ ప్రదర్శనలు నిర్వహించింది. 2004లో చైనా, మాల్దీవులు, వియత్నాం దేశాల్లో ఖైదీలుగా ఉన్న సైబర్‌ డిసిడెంట్స్'  ను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇంటర్నేషనల్‌ పెన్‌ ప్రదర్శనలు నిర్వహిం చింది. అమెరికా, ఆఫ్రికా, యూరప్‌ దేశాలు మానవ హక్కుల సంరక్షణకోసం యథాశక్తి ప్రయత్నిస్తు న్నా యి. మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మనమంతామనబాధ్యతలనుసక్రమంగా, నిజాయితీగా నిర్వహించాలనే అంకిత భావానికికట్టుబడిఉంటామనిప్రమాణంచేద్దాం.మనకనీసహక్కుల కోసం నిస్సంశయంగా పోరాడుదాం. ''బ్రతుకు, బ్రతకనివ్వు'' అనే సిద్ధాంతాన్ని నమ్ముదాం, ఆచరిద్దాం.