Monday 30 July 2012

దాసోహం కోసలేంద్రస్య.

                                       దాసోహం కోసలేంద్రస్య.
రామాయణాంలో హనుమంతుని స్వామిభక్తి వినయ విధేయతలు అమోఘమైనవి.జన్మరీత్యా జాతిరీత్యా  హనుమంతుడుకోతిజాతికి చెందినవాడు.ఆయన శక్తిసామర్ధ్యాలు చాలాగొప్పవి.ఆయన శాంతమూర్తి, గుణవంతుడు, బలవంతుడు, పరమభక్తుడు.రామకార్యానికి కంకణం కట్టుకున్నాడు. రామానుగ్రహానికి పాత్రుడయ్యాడు.యుధ్ధంలో లక్ష్మణుడు మూర్చిల్లినపుడు సంజీవనీ పర్వతాన్ని ఒక్కచేత్తో ఎత్తుకువచ్చినవాడు,అశోకవనంలో సీతమ్మను వెతుకుతూ ఉన్నసమయంలో అనేక కొంటెచేష్టలు చేస్తున్నపుడు రావణూనిసైనికులు " వింతరూపంలోఉన్న నీవెవరు ?" అని అడిగినపుడు ఆయన "దాసోహం కోసలేంద్రస్య " అని చెప్పాడు.నేను ఫలానావారి బిడ్డనుఫలానావారి మంత్రిని అనో ఇంతబలవంతుడిని సముద్రం దాటినవాడిని అనో విద్యావంతుడిననోచెప్పలేదు.  నేను శ్రీరామచంద్రునిదాసుడిని" అనిమాత్రమేచెప్పాడు. ఆయన సముద్రం దాటనుగానీ, సీతమ్మజాడతెల్సుకోడంలోగానీ, ఇంకాగొప్ప కార్యాలు సాధించనుగానీ తనశక్తిసామర్ధ్యాలు కారణంకాదని ఆయనతెల్సుకుని రాముని ఆశీర్వాదం, ఆయన నామ మహిమే కారణమని నమ్మినవాడు.  అన్నింటికీ ఆయన రామభక్తే ఆధారం.   . 
బలవంతు లైన కపివీరులెంతోమాంది ఉన్నా తనకు సీతజాడవెతికేపని ఇచ్చినందుకు ఆయనెంతో సంతోషించాడేకానీ " నేను కోతిని ఇంతపెద్ద స్దముద్రాన్ని దాటాగలనా1సీతను వెతక గలనా! అంతటిశక్తినాకుందా?"అని ఆలోచించలేదు.ఆపనికి తననుఎన్నుకున్నందుకు అహంకరించలేదు.రామాఙ్ఞను శిరసావహించాడు. ఈకార్యసాధనచేయగలశక్తి రాముడే నాకు ప్రసాదించి ఈకార్యానికి ఎన్నుకున్నాడని విశ్వసించి ,ధృఢ విశ్వాసంతో సాధించగలిగాడు.వానరులంతా కల్సికొండలెత్తిసేతువునిర్మించారు రామనామమహిమతో.వానరులు కొండలుమోస్తే  ,నరులమైన మనం నేడు కుండలుమోయలేని స్థితిలో ఉన్నాం.ఎన్నివిద్యలుపదవులూ ఉన్నా భగవద్విశ్వాసం, భగవన్నామంపైనమ్మకం మాత్రం లేకపోడంచేత కార్యసాధనల్లో వెనుకబడిపోతున్నాం.భగవంతునికి దాసులమై కార్యాలు సాధిద్దాం.  

వార్త -చెలి- ఆధ్యాత్మికంలో - సోమవారం 30జులై ప్రచురితం

Friday 27 July 2012

సమయం*** సందర్భం.


                       సమయం*** సందర్భం.
"
ఓహ్! నీచీర ఎంతబావుందో!ఎక్కడకొన్నావో య్!" ఆశ్చర్యంగా అడిగింది అర్చన .
"
ఏం నీవూ కొoదామనే!"మరీ ఆశ్చర్యం ఒలకపోస్తూ అంది సుందరి. సుందరి చాలా బావుంటుంది గులాబీ పూవువంటి శరీరఛాయ,తీర్చి దిద్దిన ముఖ కవళీకలు, దానికితగ్గట్లు మంచిమంచి ఖరీదైన డ్రెస్లు వేసు కుంటుంది. తనజీతమంతా తన ఖర్చులకేతప్ప ఇంటికి వాడవలసిన అవసరం లేదు.  అర్చన అలాకాదు, ఆమెకుటుంబమంతా ఆమెజీతంపైనే ఆధారపడి ఉంది. అందుకే ఖరీదైన బట్టలు కట్టలేదు కానీ ఎవరైనామంచిబట్టలు ధరించిబడికి వస్తే  మనస్పూర్తిగా మెచ్చుకుంటుంది, కల్లా కపటంలేని స్వఛ్ఛమైనమనస్సు.అందుకే  సుందరి అలా అనేసరికి మనస్సు చిన్న బుచ్చుకుందిఅర్చన . మన శారీరకఅందమే కాక మన మనస్సులూ అందంగా ఉంచుకోడం ఎంతో అవసరం కదా! పక్క వారినిబాధపెట్టే అందం ఎందుకూ కొరగాదు.
 
      గులాబీరంగు చుడీధర్ ధరించి ఆఫీస్ కు వచ్చిన మృధులను అంతా తలలు పైకెత్తిమరీ చూశారు. మృధులా అందంగా ఉంటుంది. ఆమె శరీరఛ్ఛాయకు గులాబీ రంగు ఎంతోనప్పింది. అంతా తననుఅలాతలలుపైకెత్తిచూస్తుంటే గర్వంగా ఉంది మృధులకు.మృధుల పక్క సీటు ,  బిందు  " ఏమోయ్! ఈరోజు నీ బర్త్ డేనా ఏం? అంతా తలలు
తిప్పకుండ చూసేలా వచ్చావ్? " అంది.
"
అదేంకాదు. కామాక్షితో పందేం కాశాను, అంతా నన్ను తలతిప్పకుండాచూసేలావస్తానని."అందిమరింత గర్వంగా.
"
తల్లీ ! ఇది ఆఫీసు, మీ పందేలు పనిలో చూపండి.ఎంతో వర్క్ పెండింగ్ ఉందనిబాస్ కోపగించారుకదా!ఇక్కడ మనం పనిచేయను వచ్చాం, దానికి తగిన జీతంతీసుకుంటున్నాం. కానీ మన డ్రెస్ లూ, పందాలూ బయటే!" అంది ఏమాత్రం మొఖమాటంలేకుండా బిందు .
        
బిందు చెప్పింది నిజం. మన వస్త్ర ధారణ సమయాన్నీ సందర్భాన్నీ బట్టిఉండాలి.ఆఫీసులకూ , స్కూళ్ళకూ అందమైన వస్త్రాలతో వెళితే ఏపేరంటానికోవెళుతున్నట్లు ఉంటుంది , కానీ పని చేయను వెళ్ళినట్లుండదు.పైగా  తోటి
ఉద్యోగస్తులంతా మనలా అందమైన , ఖరీదైన దుస్తులు ధరించే సదుపాయంఉండకపోవచ్చు, వారిపరిస్థితి మనవల్ల ఇంకా తక్కువైపోకుండా , అలాంటివారుబాధపడకుండా ఉండేoదుకూ మనం సమయాన్ని బట్టి దుస్తులు ధరిస్తే బావుంటుంది.ఇదేమనం మనపిల్లలకూ నేర్పాలి. అందుకే స్కూళ్ళన్నిట్లో సమవస్త్రా లు!,అదేయూనిఫాం కంపల్సరీ చేయటం, అలాగే కొన్ని ఆఫీసుల్లో ఉద్యోగస్తులకూ యూనిఫాంఉంటున్నది , నిజానికి పిల్లలకేకాకఉద్యోగస్తులందరికీ అన్నికార్యాలయాల్లోనూ కంపల్సరీ  యూనిఫాంఅమలుపరిస్తేఅర్చనలాంటివారెంతోమందితమస్థితికిబాధపడకపోగా  చూపరులకు సైతం ఎవ్వరి స్థితిగతులూ బయల్పడకపనిపై శ్రధ్ధ చూపగల్గుతారు. పెద్దలు ఆచరిస్తూ పిల్లలకు ఇలాంటివినేర్పితేఅoదం చందమూనూ. పెళ్ళిళ్ళకూ పేరంటాలకూ , ప్రత్యేకమైన పార్టీలకుఖరీదైన వస్త్రాలుధరించడం రివాజే! గుళ్ళకూగోపురాలకూ ఒకరకమైన వస్త్రాలూ,బంధువుల ఇళ్ళకు  విజిట్ చేసేప్పుడు వారి స్థాయికి తగిన వస్త్రాలు,ఆఫీసులకు సమవస్త్రాలు, లేదా  సాధరణ వస్త్రాలు,  ధరిస్తే ఆతీరేవేరుమరి!చాలా కొన్ని కంపెనీలు తమ సిబ్బందికి ' సమవస్త్రాలు ' నిర్ణ యిచి అమలుపరచడం  ముదావహం.
ఆదూరి.హైమవతి.
*అందరి అలోచనలూ ఒకేలాఉండవు అనేటైటిల్ తో చెలి--వార్త దినపత్రికలో 28-702012 న ప్రచురితము.
 

Sunday 22 July 2012

జులై 11 ప్రపంచ జనాభాదినోత్సవం.

                                 జులై  11 ప్రపంచ జనాభాదినోత్సవం.

 పెరుగుతున్న జనాభా అదుపుకు స్ర్తీలే ప్రధమపాత్రపోషించవలసి ఉంది.ఇటుమురికివాడల్లోనూ, అటుగ్రామీణ ప్రాంతాల్లోనూ   ప్రచారం అవసరం.గ్రామీణప్రాంతాల్లో జనాభానియంత్రణ  చేసుకుంటే పాపమనేమూఢనమ్మకాలతో తమసంతానాన్నిపెంచుకుంటూపోయి,విద్యవైద్యసదుపాయాలు,కనీసంచదువు,కూడూగుడ్డాకూడాసమకూర్చలేకపోతున్నారు.వారి మూడనమ్మకాల్నుపారదోలడంలో ముఖ్యంగా మహిళలుసహకరింకరించాల్సి ఉంది. మంచి జీవితంకావలంటే జనాభా నియంత్రణ ఉండాలి.
     మానవ వనరులు కాపాడుకుంటూ రాబోయే తరాలవారికి మన సంస్కృతితెలియజేయాల్సియవత జనాభా నియంత్రణ గురించి ప్రఛారం చేయాల్సి ఉంది. 2050నాటికి భారతజనాభా 1.54 బిలియన్స్‌ కి చేరుతుంది.. చైనాను మించిపోయేపరిస్దితిఏర్పడుతుంది.

 భూమిపై మానవుని భారం రోజు రోజుకు పెరుగుతుంది.పలు దేశాలుజనాభానియంత్రణకు చర్యలు చేపడతున్నా.. అవి పూర్తి స్థాయిలో ఫలించటం లేదు.ప్రతిసెకనుకు 5గురు బిడ్డలు లుపుడుతూనే ఉన్నారు.ప్రపంచ జనాభా2011
అక్టోబర్ చివరినాటికి 700 కోట్లకు చేరుకోనుందని నిపుణులు అంచనా వేరుశారు,అది ఇప్పటికి ఇంకా ఎంతో పెరిగీ ఉండవచ్చు.ఇలా సెకనుకు ఐదుగురు జన్మించటంవల్ల ఏటా ప్రపంచ జనాభాకు అదనంగా 7.8కోట్లు పెరుగుతుంది. పది సంవత్సరాలక్రితం ప్రపంచ జనాభా దాదాపు 600కోట్లు ఉండేది. గత 50 సంవత్సరాలప్రపంచజనభాగణాంకాలను పరిశీలిస్తే 1960లో ప్రపంచజనాభా 300 కోట్లు ఉండగా, 1999\నాటికి ఆ సంఖ్య 600 కోట్లకు చేరుకుంది.2025 నాటికి ప్రపంచజనాభా 800కోట్లకుచేరుకోవచ్చని ఐక్య రాజ్య సమతిలెక్కలు అంచనా వేస్తున్నాయి. ప్రతిఏటా 8 కోట్లచొప్పున జనాభాపెరుగుతుండటం వల్ల ఆందోళణ తప్పదని పలువురువిశ్లేషకులుహెచ్చరిస్తున్నారు.


         'నేషనల్ జియోగ్రాఫిక్" అనే  మ్యాగజైన్ లో ప్రచురితమైనఒకవ్యాసంలోరాబర్ట్ కుజింగ్ పలు కీలక అంశాలను వెల్లడించారు. ' ప్రస్తుతంభూగోళం పైనీటి మట్టాలు తగ్గిపోతున్నాయి.అలాగే మత్స్య సంపత కూడాకనుమరుగుయి
పోతుంది.. ప్రతి ఏటా దాదాపు 100 కోట్ల మంది కడుపునిండా తిండిలేకఆకలితోఅల్లాడుతున్నారని"హెచ్చరిoచారు. ఈ ప్రభావం కారణంగా ఆహారకొరతఏర్పడుతుందని ఆయన గుర్తు చేశారు.

      ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 10 నుంచి 20 సంవత్సరాల మధ్య యువకులు180కోట్ల మంది ఉన్నారు. జనాభా నిలకడగా ఉంచటానికి ప్రతి జంటకు సగటున 2.1మందిపిల్లలు మాత్రమే ఉండాలని నిపుణులు అంటున్నారు. కాగా ఐరోపా, తూర్పుఆసియాదేశాల్లో రోజు రోజుకు పెరిగిపోతున్న వృద్ధుల సంఖ్యకు తగినట్లుగాయువకులులేక పోవడం పై ఆందోళణ పెరుగుతోంది

        జనాభాను వర్ణించేందుకు అనేక ప్రమాణాలు వాడబడతాయి. జననాలు, మరణాలు,వలసలు,కుటుంబ జీవన విధానాలు, , సామాజిక వైద్య సదుపాయాలు,కుటుంబనియంత్రణ,యుద్ధాలు, ఉత్పాతాలు వంటి ఎన్నో అంశాలు జనాభాను ప్రభావితంచేస్తాయి.ఫిబ్రవరి 25 2006నాటికిప్రపంచ జనాభా 6.5 బిలియన్లకు(6,500,000,000 లేదా650 కోట్లు) చేరుకుంది. 2012నాటికి భూమిమీద 7 బిలియన్లజనాభాఉంటుందనిఅంచనా..గడచిన50సంవత్సరాలలోనూ, ముఖ్యంగా 1960 - 1995మధ్యకాలంలోమెరుగైన వైద్య సౌకర్యాలు లభించినందువలనా, ఆహారోత్పత్తిపెరిగినందు వలనాప్రపంచ జనాభా వేగంగా పెరిగింది. ప్రపంచ జనాభాలో ఒక్క ఆసియాఖండంలోనే 40శాతం ,ఆఫ్రికాలో 12 శాతం, యూరోప్‌ దేశాల్లో 11 శాతం, ఉత్తర అమెరికాలో8శాతం, దక్షిణమెరికా 5.3 శాతం, ఆస్ట్రేలియాలో 0.3 శాతం
ప్రజలుజీవిస్తున్నారు.
    

      ఒక ప్రాంతంలో సంతానోత్పత్తి రేటులో వచ్చే తేడాలు, పెద్దయెత్తునజరిగేవలసలు, రోగాలు, కరవు, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి అంశాలవలనజనాభాతరగవచ్చును. పాతకాలంలో -ప్లేగు, కలరా వంటి  వ్యాధులవలన ఒకోప్రాంతంలోజనాభా బాగా తగ్గడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతాలనుండిపట్టణాలకు వలసలవెళ్ళడం వలన గ్రామాల జనాభా తగ్గుతున్నది.జనాభా పెరుగుదలనునియంత్రించే విధానాన్ని జనాభా నియంత్రణ అంటాo. 


 పురాతన గ్రీస్ దేశంలో తమఅధిక జనాభా ఆవాసాలకోసం వారుసుదూరప్రాంతాలలోవలసకేంద్రాలనుస్థాపించారు.
ఆధునిక కాలంలో భారత దేశంలో కుటుంబ నియంత్రణవిధానాన్ని చాలా విధాలుగాప్రోత్సహిస్తున్నారు. చైనాలో ఒకే బిడ్డవిధానాన్ని అధికారికంగా అమలుచేశారు.
   

      జనాభా నియంత్రణకు లేటు వయసు పెళ్లిళ్లే సమర్థనీయం.
  3031ఏళ్లకువివాహాంచేసుకునేవారకేప్రోత్సాహకాలుఇవ్వాలి.అధికజనాభాతోవనరులునానాటికీతగ్గిపోతున్నాయి.అస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలే వారిప్రజల ఉద్యోగాలరక్షణకు భారతీయుల్ని తిప్పి పంపిస్తున్నాయి. దేశంలో జనాభాపెరుగుదల,వనరుల అభివృద్ధి మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది భవిష్యత్తులోయుద్ధాలుఉన్నవారికీలేనివారికీ మధ్యే జరుగుతాయి.

 ఈ భూమ్మీద వందకోట్ల మందికి ఆహారం దొరకడం లేదు.40 కోట్లమందికిపౌష్టికాహారం లేదు.ఏటా కోటి మందికి పైగా పిల్లలు ఆకలితోచనిపోతున్నారు.జనాభా పెరుగుతోంది కాని ఆహార ఉత్పత్తి పెరగడం లేదుముంబాయి,ఢిల్లీ,  కల్కత్తా, బెంగుళూరు, చెన్నై, హైదరాబాదు, అహమ్మదాబాదు,పూణే,కాన్పూర్, సూరత్ గత వందేళ్లలో దేశ జనాభా అయిదు రెట్లుపెరిగింది..13 నుంచి19 సంవత్సరాల మధ్య యువతులు ఎక్కువగా పిల్లల్ని కనడం,18 ఏళ్ల లోపే వివాహాలు చేసుకోవడం వంటి కారణాలు జనాభాపెరుగులకుకారణమవుతున్నాయి.ప్రతి ఒక్కరిలో, ఆరోగ్యం, సుఖ జీవనం ఆరోగ్య\జీవనం , వంటి అంశాలపీ అవగాహనపెరగాలి, తమ బిడ్డలకు 
మంచి విద్య ఆహారంకల్పించడంవంటివి బాగా ఆలోచించిగ్రామీణప్రజలకుఅవగాహనకలిపిస్తేజనాభానియంత్రణసులువవుతుంది.అప్పుడే జనాభానియంత్రణకు చేసేప్రయత్నాలుఫలిస్తాయి.





సాహసబాలిక.

                                      సాహసబాలిక.

     ఆరోజు గాంధిజీ   ఆపాఠశాల ఆవరణలో జరిగే సభలో మాట్లాడను వచ్చారు. మహాత్ముని ఉపన్యాసం విన్న వారంతా తన్మయులైపోయారు. ఒక పదేళ్ళ బాలిక ఒక సంచీ తీసుకుని అందరివద్దా ' గాంధీ  గారు చేసే స్వాతత్య్ర  ఉద్యమానికై మీకు తోచిన ది ఇవ్వండి " అంటూ ప్రేక్షకు లందరి వద్దకూ వెళ్ళి , వారు స్వఛ్ఛందంగా   ఇచ్చిన సొమ్మూ , నగలూ అన్నీ పోగుచేసి తెచ్చి , గాంధీ గారికి ఇచ్చింది, 
  అది చూసి ఆయన" అమ్మాయీ! మరి నీవేమి ఇచ్చావు? " అని అడగ్గానే తన చేతికున్న బంగారు గాజులు దూసి ఆసంచీలో వేసింది. ఎంత ధైర్యం! ఇంట్లో వారు గాంధీజీకి విరాళంగా ఇస్తే ఏమీ అనరనే నమకం.  అంత చిన్న వయస్సులో ఎంత దేశభక్తి!   
       

        ఆరోజు ఖాదీ ప్రదర్శన జరుగుతోంది కాకినాడలో, ఒక పన్నెండేళ్ళ అమ్మాయి మైన్ గేటు వద్ద నిల్చుని పాస్ లు ఉన్నవారినే లోనికి వదిలే సేవ చేస్తున్నది. అందరూ వరుసల్లో వచ్చి తమ ఎంట్రెన్స్ పాస్లు చూపి లోనికి వెళుతున్నారు.ఇంతలో నెహ్రూ వచ్చాడు, ఆయన్నూ ఆ అమ్మాయి పాస్ అడిగింది, ఆయన తనకు పాస్ లేదన్నారు. 
    పాస్ ఉంటే నే లోనికి పంపమని తననకు పెద్దలు ఆదేశించారనీ అందువల్ల పాస్ తెచ్చుకుంటే లోనికి వదులుతాననీ ఆమె చెప్పడంతో , నెహ్రూ వెంట ఉన్న వారు వెళ్ళి పాస్ తెచ్చాకే ఆమె  నెహ్రూను లోనికి అనుమతించింది. నెహ్రూ ఆమె క్రమశిక్షణకూ , నిబధ్ధతకూ ముచ్చటే సి అమె గురించీ తెల్సుకున్నారు, ఆమే దుర్గాబాయ్ , ఆమెపేరు దుర్గ ! దుర్గ వలె తాను చేపట్టిన, తనకు అప్పగించిన పనిని ఖచ్చితంగా చేసే   విజయం సాధించే స్వభావాన్ని అంత చిన్నతనం నుండీ తండ్రి పెంపకంలో , తల్లి సహవాసంలో నేర్చుకుని దేశానికే వన్నెతెచ్చే వీర నారీ మణీగా వెలుగొందింది.


                   జులై 15 దుర్గాబాయమ్మ జయంతి సందర్భంగా     

భారతజాతీయోద్యమ పిత -బాలగంగాధర తిలక్

                     భారతజాతీయోద్యమ పిత -బాలగంగాధర తిలక్

భారతజాతీయోద్యమ పిత గా.భారత అశాంతికి జనకుడు"స్వాతంత్ర్యం నాజనం హక్కని చాటిన మహా యోగి, స్వాతంత్ర్య సమరయోధుడు,బాలగంగాధర తిలక్ 1856 జూలై 23వ తేదీన మహారాష్ట్ర రాష్ట్రంలోని రత్నగిరిలో జన్మించాడు. ఆయన తండ్రి గంగాధర్ రామచంద్ర తిలక్ ఒక సంస్కృత పండితుడు,మంచి ఉపాధ్యాయుడు.తల్లి మహాభక్తురాలు . బాల్యంలో తిలక్ చాలా చురుకైన విద్యార్థి. ప్రత్యేకించి గణితశాస్త్రం లోనూ,సంస్కృతంలోనూ మంచి శిక్షణ ఇచ్చాడు తండ్రి.. తిలక్  విశేష ప్రతిభ కనబరచేవాడు.అతనికి  చిన్నప్పటి నుంచి అన్యాయం ఎక్కడ జరిగినా సహించని గుణమా తిలక్ ది.. నిజాయితీతో బాటు ముక్కుసూటితనం . కళాశాలకు వెళ్ళి ఆధునిక విద్యనభ్యసించిన తొలితరం భారతీయ యువకుల్లో ఆయనొకడు.
        తిలక్ కు పదేళ్ళ వయసున్నప్పుడు ఆయన తండ్రికి రత్నగిరి నుంచి పుణెకు బదిలీ అయింది. ఇది తిలక్ జీవితంలో చాలా మార్పు తెచ్చింది. ఆయన అక్కడ ఆంగ్లో-వెర్నాకులర్ పాఠశాలలో చేరి కొందరు ప్రసిద్ధి చెందిన ఉపాధ్యాయుల వద్ద విద్యనభ్యసించాడు. ఐతే పూణెకు వచ్చిన కొంతకాలానికే ఆయన తన తల్లిని, తన పదహారేళ్ళ వయసులో తండ్రిని కోల్పోయాడు.

     మెట్రిక్యులేషన్ చదువు తున్నప్పుడే ఆయనకు సత్యభామ అనే పదేళ్ళ అమ్మాయితో పెళ్ళయింది. మెట్రిక్ పాసయిన తరువాత, అతని పినతండ్రి ప్రభుత్వరంగంలో ఒక ఉద్యోగానికి సిఫారసు చేసి చేయించాడు. అయితే చిన్నప్పటినుంచి స్వతంత్ర భావాలున్న తిలక్, ఆ ఉద్యోగంలో చేరలేదు. భారతదేశ ప్రజలు అమాయకంగా ఉండి చదువు లేకపోవటంవల్లనే ఆంగ్లేయులు అధికారం చెలాయిస్తునారని, వారి అధికారం నుంచి భారతీయులు స్వేచ్చ పొందాలంటే చదువు ముఖ్యమని భావించి తిలక్ దక్కన్ కళాశాలలో చేరాడు. 1877లో ఆయన గణితశాస్త్రంలో ప్రథమశ్రేణిలో పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత ఆయన తనచదువును కొనసాగించి ఎల్ ఎల్ బి. పట్టా కూడా పొందాడు.


                1880లో తన మిత్రుడు అగర్మర్ తో కలిసి పూనాలో ఒక పాఠశాల స్థాపించాడు. ఆంగ్లేయులు భారతీయ సంస్కృతిని కాలరాస్తూ, వారి నాగరికతను మన మీద రుద్దుతూ, హిందువులను వారి మతం లోకి మార్చుతుంటే, తిలక్ భరించలేకపోయాడు. కేవలం వ్యాపారం చేయడానికిమనదేశాన్నిఆశ్రయించి, ఏకుమేకై కూర్చున్నట్లుగా వారు మనమీద పెత్తనం చెలాయించటం తిలక్ సహించలేకపోయాడు. తన పాఠశాలలో ప్రతి విద్యార్ధి దేశానికి నిజమైన సేవ చేయాలంటే బాగా చదువుకొని బ్రిటీషువారి పీడ వదిలించుకోవటానికి సిద్దపడాలనీ, అందుకు అవసరమైతే ప్రాణాలు అర్పించటానికైనా వెనుకంజ వేయరాదని నూరిపోశాడు.
         

     దేశసేవ నినాదంతో తన పాఠశాలను ఎంతో అభివృద్ది చేసుకుని అనేక దేశభక్తులను తయారు చేశాడు తిలక్. తోటి ఉపాధ్యాయులు కానీ, తను కానీ, ఎటువంటి జీతభత్యాలు తీసుకోకుండా పిల్లల బంగారు భవిష్యత్తుకై కృషి చేస్తూ, ఎప్పటికైనా భారతీయులు స్వేచ్ఛ పొందాలని కలలు కనేవారు. ఏ కోశానా స్వార్ధం లేని ఆ మేధావులు ఎందరో ఆణిముత్యాలను దేశానికి సమర్పించారు. తిలక్ పట్టుదల, కృషి, దీక్షవలన ఆ పాఠశాల ఉత్తమ పాఠశాలగా గుర్తింపు తెచ్చుకుని, భారతదేశంలోని యితర విద్యార్థులు కూడా అక్కడ చేరేలాగా ప్రాముఖ్యం పొందింది. 
          ఈ పాఠశాల విజయాలు గమనించిన బ్రిటీషు ప్రభుత్వం ఆ రోజుల్లో ఒకింత కలవరపడింది. కారణమేమంటే భారతదేశం నలుమూలల నుండి విధ్యార్ధులు వచ్చి చేరుతున్నారు. వీళ్ళు చదువుతో పాటు దేశసేవ, దేశభక్తి అంటూ నూరిపోస్తున్నారు. వీళ్ళు చదువు పూర్తిచేసుకొని వస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలుచేయవచ్చు, అందుకని ఈ పాఠశాలను మొగ్గగా ఉన్నప్పుడే తుంచివేయాలి, అనే దురుద్దేశంతో పాఠశాలలో రాజకీయాలు నేర్పుతున్నారనే మిషతో గుర్తింపును రద్దు చేస్తూ తాఖీదు పంపారు.
            తాఖీదు అందుకున్న తిలక్ ఉగ్రుడై బ్రిటీషు ప్రభుత్వంపై కోర్టులో దావా వేసి, తానే వాదించి తిరిగి గుర్తింపు పొందాడు. ఆ సంఘటన ప్రభుత్వ ప్రతిష్టను చాలా బలహీనపరచింది. ఆ సమయంలోనే తెల్లదొరల గర్వం అణగదొక్కడానికి భారతీయులను తెల్లవారి దొరతనం నుంచి విముక్తి కలిగించటానికి వార్తా పత్రిక ఎంతో అవసరమని భావించి, తన స్నేహితుడితో కలిసి 'మరాఠా', 'కేసరి' అనే పత్రికలు స్థాపించి ప్రభుత్వం చేసేఅవకతవకలు, వారిలోపాలు వరుసపెట్టి దుమ్మెత్తిపోయటం ప్రారంభించాడు. 



   అనతికాలంలోనే ఆ పత్రికలు పాఠకుల అభిమానాన్ని చూరగొన్నాయి. "కేసరి" పత్రికలను ఆ రోజుల్లో అందరికన్నా ముందుగా దొరలే కొనుక్కొని చదువుకొనేవారు. బ్రిటీషు ప్రభుత్వంచేత నాటి రాజద్రోహ నిరోధకచట్టం క్రింద విచారించబడి, శిక్షించబడిన మొదటి భారతీయుడు తిలక్. అతనిని అనేక పర్యాయాలు జైలుకు పంపారు. అతడు స్వాతంత్ర్య యోధుడేకాదు; గొప్పవిద్వాంసుడు కూడా. 'గీతారహస్యం', 'ఆర్కిటిక్ హొం ఆఫ్ వేదాస్' అనే గ్రంథాలను అతడు రచించెను. అతడు, బ్రిటీషు పరిపాలనపై ప్రజలలో చైతన్యాన్ని ను పెంపొందించాడు. ఇదే అతని నుండి జాతీయోద్యమానికి వచ్చిన కానుక. తిలక్ 'లాఠీక్లబ్' 'అఖ్ఖారస్' అనే వ్యాయామశాలనూ, 'గోహత్యా నిషేధ సంఘాల'నూ స్థాపించాడు.. అతని తీవ్రవాద విధానాల వల్ల, అతనిని "భారత అశాంతికి జనకుడు" అన్నారు. "స్వరాజ్యం నా జన్మ హక్కు"అని చాటింది ఇతడే. బాల్యవివాహాలను నిరసించి వితంతు వివాహాలను స్వాగతించాడు.
          తిలక్ 1890లో కాంగ్రెస్ లో సభ్యుడుగా చేరాడు. కానీ త్వరలోనే ఆయనకు కాంగ్రెస్ మితవాద రాజకీయాలపై నమ్మకం పోయింది. స్వరాజ్యం కోసం పోరాటమే సరైన మార్గమని ఆయన నమ్మాడు. ."స్వరాజ్యం నా జన్మహక్కు. దాన్ని నేను పొంది తీరుతాను." అని గర్జించాడు. 1907లో మహారాష్ట్రలోని సూరత్‌లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ చీలిపోయింది. మితవాదులు కాంగ్రెస్ పై తమ పట్టును నిలబెట్టుకున్నారు. అతివాదులుగా పిలవబడే తిలక్, ఆయన మద్దతుదారులు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు. తిరిగి 1916లో లక్నోలో జరిగిన సమావేశంలో అంతా ఒకటయారు. అదే సమావేశంలో కాంగ్రెస్ కు, ముస్లిం లీగుకు మధ్య లక్నో ఒప్పందం కుదిరింది.
           

                           జాతీయస్ఫూర్తిని రగల్చడానికి వీలున్న ఏ అవకాశాన్నీ ఆయన వదిలిపెట్టలేదు. మొట్టమొదటిసారిగా శివాజీ ఉత్సవాలను, గణపతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా ప్రజలను సమీకరించడం, వారిని జాతీయోద్యమం వైపు నడిపించడం ఆయనే మొదలుపెట్టాడు. తన పత్రికల్లో ప్రజలను రెచ్చగొట్టే రాతలు రాసినందుకు 1897లో ఆయనకు ఒకటిన్నరేళ్ళు కారాగారశిక్ష పడింది. విడుదలయ్యాక ఆయన స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాడు. 1906లో దేశద్రోహం నేరం క్రింద ఆయనకు ఆరేళ్ళు ప్రవాసశిక్ష విధించారు. కారాగారంలో ఉన్నప్పుడే ఆయన "గీతారహస్యం" అనే పుస్తకం రాశాడు. ఆయన చరిత్రకారుడు కూడా. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని ఆయన అభిప్రాయం.
       1916 ఏప్రిల్ లో హోంరూల్ లీగ్ ను స్థాపించి దాని లక్ష్యాలను వివరిస్తూ మధ్యభారతదేశంలో గ్రామయాత్రలు చేశాడు.. కానీ ప్రజల్లో తిలక్ రగిలించిన స్ఫూర్తి మాత్రం కొనసాగింది. అనేక ఉద్యమాలు నడిపి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి తన జీవితమంతా దేశ స్వాతంత్ర్య సాధనకొరకు అర్పించి మహాత్మాగాంధీలాంటి మహానాయకులకు, ఆదర్శమూర్తిగా నిలిచి ప్రజలచే లోకమాన్యుడనిపించుకున్న మహావ్యక్తి బాలగంగాదర్ తిలక్. ఆయన 1920 ఆగష్టు 1 న స్వర్గస్థులయినారు. 



జులై 23 లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా వార్త దినపత్రికలో ప్రచురితం        






                     బొజ్జగణపా! నీకు పొర్లుదండాలు.
                              ———————
    బొజ్జగణపా! నీకు పొర్లుదండాలు…
    బుజ్జిగణపా! నీకు కోటిదండాలు.


            1. సాక్షి గణపా !నీకు సాష్టాంగ దండాలు
                విద్య గణపా! నీకు వేయిదండాలు
                వీర గణపా !నీకు వేవేల దండాలు
                సుగుణ గణపా ! నీకు చాలదండాలు .
                                       2.పార్వతీ బిడ్డడా! పాదదండాలు
                                         శివునితనయా !నీకుశిరసు దండాలు
                                         శ్రవణసోదర !నీకు సహస్రదండాలు
                                         దేవపూజ్యుడ ! నీకు దొడ్డ దండాలు .

      3. విఘ్న వినాశక! నీకు వీరదండాలు
         శతృ విజేయా ! శతకోటిదండాలు
         ఏకదంతుడ !నీకు ఏకాగ్రదండాలు
        అగ్రపూజ్యుడ !నీకు అరకోటిదండాలు .

                                 4. సిధ్ధిగణపా ! నీకు సర్వదా దండాలు
                                     బుధ్ధిగణపా! నీకు బోలెడు దండాలు
                                     గంగపుతృడ !నీకు గంపెడు దండాలు
                                     గణనాధుడా! నీకు నీ గుడి చుట్టు దండాలు .
                                      దండాలు! దండాలు !దండాలు !దండాలు!. 


దురాశా పిశాచం
జగన్నాధపురం జమీ ధనవర్మ ఏలు బడి లోకిరాగానే ,ఆయన అనేకమార్పులు చేసాడు.దానికికారణం తాను అందరికంటే గొప్ప ధనవం తుడు కావాలని ఆశ. ‘ తన ఏకాం తమందిరం నిండా ధనరాసులు నిండిపోయి ఉన్నట్లూ ,ఆధనరాసులకాంతులమధ్య తాను ఉన్నట్లూ ‘ ప్రతిరోజూ కలలు కనేవాడు.ఆకలలు నిజంచేసుకోను ధనవర్మ పరిపాలనలో కొన్నిమర్పులుచేశాడు. తరతరాలుగా తన జమీలో జరుగుతున్న నిత్య అన్నదానపధకాలు, దేవాలయాలలోని ప్రత్యేకపూజలూ , తిరినాళ్ళూ , ఉత్సవాలూ రద్దుచేశాడు. దాంతో కొంతఖర్చు తగ్గినట్లు భావించాడు.ప్రజలపై పన్నులు రెట్టింపు చేశాడు. తండ్రి , దివాను , పెద్దలూ ఎంతచెప్పినా వినలేదు. పోగైన ఆధనం రాసులుగాపోసు కున్నాడు.ప్రజలు పెం చినపన్నులు కట్టలేక నా నా బాధలూ ప డసాగారు.రాత్రి పూటపురవీధుల్లో పది గంటలతర్వాత వీధి దీఅపాలన్నీ ఆర్పేయమని ఆఙ్ఞ్ వేశాడు.తన జమీ లోని ముసలిపని వారినంతా తీసేసి సగం మందినే యువకుల్ని నియమించి రెట్టింపుపనిచే యించసా గా డు. మందిరంలో హుందాగా అందంగా వెలిగే దీపాలు దుబారాగా భావించి తగ్గించేశాడు.వంటలూ పూలఖర్చుల్లోను కోతవిధించాడు.
ఈవిధంగాపొదుపు చేసినధనాన్ని కూడారాసులు పొసుకున్నా ఇంకా ఆ రాసుల్ని ఎలా పెంచుకోవాలా అనేతపనతో అశాంతి , అసహనం, కోపం ,నిద్రలేమి పెరిగిపోయాయి.తల్లి తండ్రులతో, భర్యా బిడ్డలతో మాట్లాడ టమే మానేశాడు. ప్రజలందరూ ముసలిజమీం దారైన జగన్నాధవర్మ కు తమ కష్టా లు మొరపెట్టు కున్నారు . జగన్నాధవర్మ ప్రజల బాధలు విని భరించలేక , భార్యతోకల్సి కొంతకాలం పుణ్య తీర్ధాలు సేవించను బయల్దేరివెళ్లాడు. పుణ్య క్షేత్ర దర్శ నాలు చేస్తూ జగన్నాధ వర్మ దంపతులు , దేవతలందర్నీ తమకుమరునికి పట్టిన ‘ దురాశాపిశాచాన్ని ‘ వదిలించి , అతనిలోమంచిమార్పు తెమ్మని ప్రార్ధించ సాగారు. ఒక అటవీప్రాంతంలోని పురాతనదేవాలయ మంటపంలో విశ్రాంతి తీసుకుం టున్న వారిని ఓ సాధువు పలుకరించాడు.వారుభక్తి తో ఆ యనకు నమస్క రించారు. వారి విచార ము ఖ కవళికలు గమనించిన ఆ సాధువు , వారి ద్వారా విషయం అంతా తెల్సుకుని , వారికి ఓ వుపాయం చెప్పాడు.జగన్నాధ వర్మ సం తోషం తో , భార్య తో కల్సి నగరానికి తిరిగి వచ్చాడు. తర్వాత మూడు రోజులకు ఒక సాధువు నగరానికి వచ్చాడు.ఆ యన అడిగిన వారి కోరికలన్నీ తీర్చుతున్నా డనే ప్రచారం సాగింది.నగర ప్రజలంతా ఆ యనను దర్సిం చను గుంపులుగా రాసాగారు.

దురాశా పరుడైన ధనవర్మ ఆ సాధువును దర్సించి , తన చిరకాలపు కలలు నిజంచేయమని ప్రార్ధించాడు. తన ఏ కాంత మందిరానికి ఆ యన్ను ఆ హ్వా నించాడు.సాధువు ధనవర్మ మందిరం ప్రవేసించి ,కళ్ళుమూసుకుని ఒక మంత్రం పఠించాడు.ఏ డు పెద్ద బానలు సృ ష్టించాడు. ఆ ఏ డు బానల్లోసగానికి వజ్రాలూ, ముత్యాలూ, బంగారు ఆ భరణాలూ,కాసులూ ఉ న్నాయి.” ధనవర్మా ! నీవద్ద వున్నధనాన్ని ఈ బానల్లో నింపు .నీస్వంత ధనంతో వీటిని నింపితే నీకలలు ఫలిస్తాయి.” అని చెప్పి ఆ సాధువు వెళ్ళి పోయాడు. ధనవర్మ తన ఏ కాంతమం దిరంలో తాను రాసులుపోసుకున్న ధనాన్ని ఆ బానలనిండా నింపసాగాడు.సగంవరకూ నిండివున్న ఆ ఏ డు బానల్లో ఆ రుమాత్రం పుర్తిగా నిండాయి.ఏ డవ బాన మాత్రం నిండలేదు.ఆ రోజు నుండీ ధనవర్మ ,ఇంకా పొదుపు పా టించి ,ఇంకా పన్నులు పెంచి ధనం కూ డబెట్టి, ఆ ఏడ వబాన నింపే ప్రయత్నం ముమ్మరం చేశాడు.
ఎం త పొసినా అదినిం డటంలేదు.రాజబాటల్లో హుండీలు పెట్టి ఆ దారినపోయే వారిపై ‘ దారిసుంకం ” కుడా విధించాడు.తల్లి తండ్రులు భార్య అతని దురాశను ఆ పను ఎం త ప్రయత్నించినా , వారిమాటలు పెడ చెవిని పెట్టాడు.రాత్రి పూట మారు వేషంలో ,జోలెపట్టిధనం సేకరించసాగాడు.
.ప్రజలు అతన్ని గుర్తించినా, అసహ్యంతో , నవ్వుకుంటూను, గుర్తించనట్లే ఎం తో కొంత డబ్బు వేయసాగారు.ఎం తధనం పోసినా ఆ ఏ డవ బాన నిండటంలేదు.అ న్నపానాదులుమాని ధనసేకరణలో పడి చిక్కి పోసాగాడు ధనవర్మ.దురాశా పిశాచం పట్టి పీడించేవాడు అల్లాగే అవుతాడు మరి

ఎ లాగైనా ఆ ఏ డవ బానను నింపాలనే పట్టుదలపెరగ సాగింది. పక్క నగరాలకు రాత్రిపూట మారు వేషం లో వెళ్ళి జోలెపట్టిధనంపోగుచేయసాగాడు నగరవాసులు అతన్ని ‘ ఇం తబలంగా వున్నా వే అ డుక్కొకపోతే ఏ దైనా కా య కష్టం చేసి నాల్గు డబ్బులు సం పాదించుకోరాదా? అడుక్కోను నీకు సిగ్గుగాలేదా?” , అని ఛీ కొట్టసాగారు. ఆ మాటలతో ధనవర్మ పంతం పెరిగింది.మారువేషంలోనే పక్కగ్రామాలకు వెళ్ళి కొలిమివద్ద కమ్మరిపని, కట్టెలు కొట్టేపని, రాళ్ళుమొసేపనీ, సేస్తూ కొంత ధనం పొగుచేశాడు.అ లాసంపాదించినధనాన్ని తెచ్చి, ఆ ఏ డవబానలో పొయగానే అ దినిం డిపొర్లింది.
ధనవర్మ ఆ శ్చర్యంతో ఇం తకాలం ఎంతపోసినా నిండని బాన ,తానుకూలిచేసి పోగుచేసిన కొద్దిపాటిధనంతోఎ లానిండిందాని అనుకుని ,ఆ సాధువు కనిపిస్తేఅడగాలని తలంచిన వెంటనే, ఆ సాధువు ధనవర్మ ఎ దుట ప్రత్యక్షమయ్యాడు.

“ధనవర్మా! నీ స్వంత ధనంతో ఆ ఏడు బానలూ నింపమన్నాను,నీవు నీ తాతలనాటి ధనాన్నీ ప్రజలపై అ న్యాయంగా పన్నులువేసి వసూలు చేసిన ధనాన్నీ ,సిగ్గు విడచి జోలెపట్టి సంపాదించిన ధనాన్నీ ఆ బానల్లో పోశావు. ఎం తకష్ట పడితే ధనం సంపాదించగలమో తెల్సు కోలేక పో యావు. ధనంకూడబెడితే అది పిశాచంలా పీడిస్తుంది. శాంతిలేకుండాచేస్తుంది.ఊ రకేవున్నధనం ఎవ్వరికీ వుపయోగపడని ధనంచూసుకుని సంతోషించే బదులు ఇసుక, రాళ్ళు ,మట్టీ ,ధనంగానే భావించి చూసుకుని సంతోషించవచ్చు.దానికోసం ప్రజలనూ కన్న తల్లి తండ్రులను భార్యాబిడ్దలనూ ఇన్ని కష్టా ల పాలు చేయవలసిన పనిలేదు.తాతముత్తా తలు ప్రజా సంక్షేమం కోసం ,దేవాలయాల్లో పూజలకోసం, అన్న దానాలకోసం ప్రత్యేకించి న ధనాన్ని ,వాటినంతా ఆ పి ఆ బానల్లో నింపావు.ప్రజలనుపీ డించి ధనం వసూలుచేశావు.కన్న బిడ్డలవలె చూసుకోవలసిన ప్రజలను ,ఎ న్నో కష్టాల పాలుచేశావు.ఆ నందం ధనం లో లేదు. అందరికీ ఆ నందం కలిగే పనులుచేస్తే ఆ ధనం వుపయోగం లోకివస్తే ఆ నందం లభిస్తుంది.ఆ ఏ డవబాన యే అత్యాశ !.మిగిలిన ఆ ఆ రూ అరిషడ్వర్గాలు. ఆ ఏడవదాన్ని నింపను ఎ వ్వరివల్లాకాదు. ఇప్పటికైనా తెలివొంది ప్రజా సంక్షేమం కోసం పాటుపడి తాతతండ్రులపేర్లు నిలుపు.ప్రజలనుసుఖపెట్టు.ఆ శాపాశం నాశనానికి దారితీస్తూదని తెల్సుకో….” ‘ అనిమాయమయ్యాడు సాధువు.
ఆ ఏడు బానలూ మాయమయ్యాయి.ప్రజాధనం అలాగేవుంది.తనతప్పు తెల్సుకున్న ధనవర్మ ఆ ధనాన్నంతా ప్రజాసంక్షేమం కోసం ఖర్చు చేసి ,ప్రజాహితకార్య క్రమాలన్నీ యధప్రకారం కొనసాగించి ,తనతప్పులన్నీ సరిదిద్దుకుని ,దురాశాపిశాచాని తరిమేసి,తల్లి తండ్రులనూ ప్రజలనూ
ఆ దరంతోచూసుకుంటూ, జనరంజకంగాపరిపాలించి,మంచిపలకుడిగాపేరుతెచ్చుకున్నాడు.ధనవర్మ గా కాక ధర్మ వర్మ గా పేరుపొందాడు.
నీతి:_ అత్యాశహానికరం.




Friday 20 July 2012

లక్ష[ యక్ష ] ప్రశ్నలు.


                                       లక్ష[ యక్ష ] ప్రశ్నలు.

నీటికై వెళ్ళిన సోదరులునలుగురూయక్షుడుఅడిగినప్రశ్నలకుసరైనసమాధాన మివ్వలేకమూర్ఛిల్లగా ,       మహాభారతంలోధర్మరాజుఆయక్షునికిదీటైనజవాబులిచ్చి,తనతమ్ములనుబ్రతికించుకున్నాడు.ఆయన ధర్మమూర్తీ, విద్యావేత్త ,పైపెచ్చు కృష్ణ భక్తుడూగనుకగండంగట్టెక్కగలిగాడు.నేడుమనంరెండుమూడేళ్ళ పిల్లలడిగే లక్ష[యక్ష] ప్రశ్నలకు ఒక్కదానికీ సరైన సమాధానo ఇవ్వలేక పోతున్నాం.వారి పసి బుఱ్ఱ ల్లో వేవేల సందేహాలు,లక్షల ప్రశ్నలు. అసలు విఙ్ఞానం  why, What, Who,where ,Whoseఎందుకు , ఏమి, ఎవరు,ఎక్కడ .. ఇలాంటి [W] తోనే మొదలవు తుందేమో!.ఇంటికి ఎవరైనా వస్తే పిల్లలుమనల్ని
 " ఎవరు ?" అని అడుగుతారు, 'ఈపని  చెయ్యి "అనిచెప్తే ,"వైఅంటారు .వారికితగినసమాధానాలు  . చెప్పడంలోనే  పెద్దలమనుకుంటున్న మన తెలివితేటలు,విఙ్ఞతబయల్పడుతుంటుంది.

         గతనెలలో మా కొడుకు, కోడలు, పిల్లలు  అమెరికానుండీ వచ్చారు ,కోడలు తమ్ముడి పెళ్ళికి. పెళ్ళంటే తెలీని 4,2 ఏళ్ళ పసి పిల్లలుగనుక వాళ్ళమ్మ ' మామ  కొత్త అత్తను తెచ్చుకుంటున్నాడు.  అందుకని మనం ఇండియా వెళుతున్నాం ' అనిచెప్పిందిట. ,నేను మా అల్లుడితో వెళ్ళాను [ఎయిర్ పోర్ట్ ఊరికి గంటన్నర దూరంలో ఉండటాన, మావారు చలికి రాలేనన్నారు.] వాళ్ళను రిసీవ్చేసుకోను. మాకోడలు " మామ ,హాయ్ చెప్పు " అనిచెప్పగానే పెద్దపిల్ల , లాస్య " ఈ మామేనా కొత్త అత్తను తెచ్చుకునేది ?" అని మొదటి ప్రశ్నాస్త్రం సంధించింది .మాకోడలు కొంత ఇబ్బంది ఫీలై ' కాదు కాదు, రాజా మామ , ఈ మామ సోమి అక్కా వాళ్ళానాన్న " అని సర్దిచెప్పింది.
  " నాకెప్పుడు ఫైవ్ వస్తాయి ? " అని అమెరికాలో అడిగిందిట లాస్య ," ఇండియా వెళ్ళినప్పుడు  " అని వాళ్ళమ్మ చెప్పిన జవాబు గుర్తుంచుకుని , విమానందిగగానే " నాకిప్పుడు ఫీవ్ వచ్చిందా?" అని అడిగిందిట ! ఎవరోకవి అన్నట్లు ' పెరగటానికెందుకురా తొందర ? . ఎదర ఉందంతా చిందర వందరా?  . అనేపాట గుర్తువచ్చింది .

      ఇల్లు చేరగానే , నాకూతుర్ని చూపించి మాకోడలు " అత్త కు హాయ్ చెప్పు అనగానే "" ఈ అత్తేనా కొత్తత్త ?" అనే రెండో అస్త్రం ప్రయోగించింది." కాదు ఈ అత్త సోమీ అక్క, శ్రీయా అక్క వాళ్ళమ్మ. ఈ మామ వాళ్ళ డాడీ , ఈ అత్త డాడీవాళ్ళ అక్క.. " అని చెప్పింది.
నేను పిల్లలి నీ తీసుకుని కూరలకై కార్లో వెళ్ళేప్పుడు నామీద పెద్ద అస్త్రమే ప్రయోగించిమది. " why baammaa! you are not having big ones like others " అంటూ ఛాతీ చూపింది.అమెరికాలో [ నేడు  ఇండియాలోనూ] ఎవ్వరూ ఛాతీ మీద కవర్ చేసుకోరు ,ఎద అంతా [బ్రస్ట్]  బయటికి కన్పిస్తుం టుంది. స్కూల్ లో మాంస్ , మాల్స్ లోనూ, బయటా ఎక్కడికెళ్ళినా అక్కడ [ నేడు సిటీలేకాక బస్తీల్లోను, పల్లె ల్లోనూ సైతం ఇక్కడానూ] ఛాతీ బయటే కదా! అందువల్ల పమిటభుజంచుట్టూతిప్పికప్పుకున్ననన్ను చూసి ఆచిన్న బ్రైన్ కు పెద్దసందేహం వచ్చింది. ఇంకా ఏమి అడుగుతుందోని నేను టాపిక్మార్చి " సిద ట్రీస్  ,కలర్ ఫుల్ ఫ్లవర్స్ " అంటూ ఏదేదో చెప్తూ ఇల్లు చేరాను.
   మాకోడలు చెప్పింది 'ఇండియాలో వాళ్ళకు ఇంగ్లీష్ వచ్చా!నాకు తెలుగురాదుకదా! అక్కడ సోమి, శ్రీయ అక్క, తో నేనెలా ఆడుకోను? అనిఅడిగిందిట నాల్గేళ్ళలాస్య. ' బెంగుళూర్ ఈజ్ సో నైస్ క్లయ్మేట్  షికాగో ఈజ్ సో కోల్డ్ వై కాంట్ఉయ్ స్టే ఇన్ఇండియా ?' అని ఆడుగుతున్నదివాళ్ళ పేరెంట్స్ ను.

            అన్నంతినిపిస్తున్న నాతో " వై కాంట్ ఉయ్ ఈట్  మీట్ " అని అడిగింది . " ఉయ్ ఆర్ వెజిటేరియన్స్ , ఇఫ్ ఎనీవన్ వాంట్స్  టు ఈట్ మీట్ దెహ్యావ్ టు కిల్ ద ఎనిమల్స్ ఆర్ బర్డ్స్ దెన్ కుక్ దెం  అండ్ ఈట్  " చూడు ఈ బర్డ్స్ ఎంత అందంగా ఎగురుతున్నాయో! వాటిని చంపితే పాపం అవి బాధపడవూ! "   అనిఏదో చెప్పానే కానీ ఆచిన్న మనస్సుకు ఏం అర్ధ మైందో నాకు తెలీలేదు.. తను ప్రీస్కూల్ కెళుతుంటే  అక్కడ అంతా తినేదిమీట్ మనం తినకూడదు. ఈ బాక్స్ లో దితిను ' అనివాళ్ళమ్మ చెప్పినందునఆచిన్న మనస్సులో ఆసందేహం దూరి ఉంటుంది..
   వై డోంట్ యు వేర్ నైటీస్ లైక్ మమ్మీ ?" అంది .
" నాజుట్టు నీలా గా ఎందుకు పెద్ద గా,పొడుగ్గా పెరగలేదు [ ఆంగ్లంలోనే ]  అని అడిగింది." నీవుబాగా అన్నీ తింటే పెరుగుతుంది." అనిచెప్పాక ఆరోజు నేను పెట్టినవన్నీ తింది .వెంటనే జుత్తుకేసి చూపి " నీవు పెట్టినవన్నీ తిన్నా ఇంకా పెరగలేదేం? భుజాల క్రిందకు రాలేదేం? " అని అడిగింది.
" నే నెప్పుడు నీ అంత పెరుగుతాను? "అంది
" ఇంక 60 ఏళ్లతర్వాత నా అంత ఉంటావు." అనిచెప్తే వెంటనే ," అప్పుడు నీవు నాకంటే చిన్నగా ఉంటావు కదా ?"  అని అడిగింది.
" ఎందుకు పక్షులు పైన ఎగురుతాయి? , వాటిలా మనమెందుకు ఎగరలేం?, చీమలు లైన్గా  పోతాయికదా ? ఎవరు నేర్పారు ? చేపలు నీళ్లలో ఈదుతాయ్ కదా?ఈత ఎవరు నేర్పారు ? నాకు ఈత నేర్ప మంటే  మాడాడీ ' ఇంకా పెద్దవ్వాలంటారు,ఈ చిన్న చేపలకు వాళ్ళడాడీ నేర్పారుకదా?  చెట్లకు ఈ పూలు ఎలావస్తున్నాయ్ ? చెట్లూ గ్రీన్ కదా రంగుల పూలు ఎలా వస్తున్నాయ్?ఈపెద్ద మఱ్ఱి చెట్టుకు ఇంత చిన్నకాయలేంటి? ఈచిన్నతీగకు ఇంత పెద్ద గుమ్మడికాయలేంటి?నేను కారు ఎందుకు డ్రైవ్ చేయ కూడదు? డాడీ చెప్తే నేను ఈ చక్రంతిప్పుతానుకదా? నాన్నకు గడ్డమ్మీద మూతి మీద వెట్రుకలు ఎందుకూన్నాయ్?మమ్మీకీ నీకు ఎందుకులేవు ?తాత జుట్టు ఎందుకు తెల్లగా ఉంది? నీజుట్టు నల్లగానే ఉందే? నాజుట్టు తెల్లగా ఎప్పుడువస్తుంది? నేనెప్పుడు పొడుగ్గా సోమీఅక్కలావస్తాను?  నేనెందుకు నీలాగా చీరలు కట్టుకో రాదు? " ఇలాంటిప్రశ్నలతోనాబుఱ్ఱ తిరిగిపోయింది యక్షప్రశ్నలకు జవాబులివ్వను భారత భాగవతాలు భక్తితో పఠించాలా ? చతుర్వేదాలు పారాయణ చేయాలా? భగవద్గీత కంఠోపాఠం చేయాలా? శంకభాష్యం చక్కగా చదవాలా ?! నాకైతే ఏమీ అర్ధంకాక ఏంచెప్పాలో ఆనాలుగేళ్ళ పిల్లకుతెలీక , భగవంతుని ప్రార్ధించాను.   

                                        published in vaartha daily 

గురుపూర్ణిమ


                                         గురుపూర్ణిమ
            గురుర్ బ్రహ్మ  గురుర్విష్ణుః  - గురుర్దేవో మహేశ్వరః 
            గురుస్సాక్షాత్ పరబ్రహ్మః    -  తస్మైశ్రీ గురవేన్నమః .
    గురువు త్రిమూర్తి  స్వరూపుడు. బ్రహ్మ వలె ఙ్ఞానాన్నిమనలో పుట్టించి , విష్ణువువలె  ఙ్ఞానాన్ని రక్షించి  పెంచి  , శివునివలె అఙ్ఞానాన్నితుంచిమనకులోకంలోఎలాజీవించాలో ,ఏదిమంచిమార్గమో , ఏవి మానవతావిలువలో , సద్గుణ సంపన్నత ఎలాపొందాలో నేర్పుతాడు. మనస్సునుండీ ఆలోచనలు ఆవిర్భవిస్తాయి ,సర్వవ్యాపకమైనమనస్సేవిష్ణుస్వరూపం.విష్ణుమూర్తినాభినుండీఉద్భవించినబ్రహ్మ
వలె,వాఃక్కు[తలంపు]మనస్సునుండీఆవిర్భవిస్తున్నది.బ్రహ్మయేవాఃక్కు.ఈశ్వరుడేహృదయము.ఇలా మన వాఃక్కు, మనస్సు, హృదయము త్రిమూర్తాత్మకమై ఉన్నది. త్రిమూర్తులుమనలోని త్రిగుణాలకూ ప్రతీకలు. గురువుమనలోమంచిని సృష్టింపజేసి,లోకంలోజీవింపగలవిధానాన్నినేర్పి,అమాయకత్వాన్నీ, మాయామోహాన్నీ తెంచివేసే శక్తిసంపన్నుడు.గుకారో అంధకారస్య ,’రుకారోతన్నిరోధకః. గురువు అఙ్ఞానాంధకారాన్ని రూపుమాపే వాడు. గుకారో గుణవర్జితః., రు కారో రూపవర్జితః. గుణాతీతుడు, రూపరహితుడు గురువు ,అట్టిగురువు భగవత్సమానుడు.          
          
ఆషాఢ శుధ్ధపూర్ణిమ ను ' గురుపూర్ణిమ లేక వ్యాసపూర్ణిమ అంటాం.ఈరోజున ఆధ్యాత్మిక ఙ్ఞానాన్ని కోరేవారంతా తమ ఆధ్యాత్మిక  గురువులను దర్శించి, లేదా స్మరించి ,ఆరాధించి తమకృతఙ్ఞతను తెలుపుకుంటారు. భుక్తి విద్యలుకాక ముక్తి విద్యలను బోధించే గురువుదర్శనానికి , స్మరణానికీ  ఈ రోజు విశిష్ట ప్రాముఖ్యతను గాంచినది.
' చంద్రమా మనసోజాతః సూర్య చక్షో అజాయతః -అనేది వేదవాఃక్కు.చంద్రుడు మనస్సునూ,సూర్యుడు బుధ్ధినీప్రకాసింపజేస్తారు.మానవులమైనమనమనస్సుల్లోఅష్టమదాలూ,అరిషడ్వర్గాలూ,అహంకారమూ  చిత్తమూ అనేపదహారుమలినాలనూ పూర్ణిమనాడు గురుస్మరణతో ,గురువు ఆశీర్వాదంతో , గురువు అనుగ్రహంతో తొలగించుకోడం కోసం ప్రయత్నించడమే గురుపూర్ణిమ ప్రత్యేకత.
           గురువు నెందుకు స్మరించాలి ? లేదా దర్శించాలి? మన కృతఙ్ఞతలు ఎందుకు తెలపాలీ? అనే సందేహాలు సహజoగా మన మనస్సులో ఏర్పడవచ్చు. గురువు ఒక శిల్పి వంటి వాడు.బండరాళ్లతో అందమైన శిల్పాలు చెక్కి వాటికి ప్రాముఖ్యతను కలిగించగల ప్రఙ్ఞాశాలి గురువు. మంచి గురువు చేతిలోమలచబడేవారుఉత్తమమానవులై  ,సంస్కారవంతులై ,సమాజానికిఉపయోగపడతారు.అలా
గురువు సమాజ సేవచేస్తున్నాడు.కంసాలి బంగారుముద్దను కాల్చి సాగదీసి , సుత్తితోకొట్టి మంచి నగగా తయారుచేసి ధరించేరూపాన్నీఅందాన్నిఇచ్చినట్లు గురువు శిష్యులనుసానబట్టిసద్గుణాలునేర్పి పరిపూర్ణమానవునిగా మార్చి సమాజానికి అలంకారంగా అందిస్తున్నాడు.తోటమాలి చక్కగా నేలను పదునుచేసిఎరువువేసిమొక్కలునాటిపెంచిచక్కగాపోషించిఫలించేలాచేసిఅందరికీఉపయుక్తకరమైన
ఫలాలనూపుష్పాలనూ అందించినట్లు గురువుశిష్యులనుసమాజానికిఅలంకారాలుగా అందిస్తాడు. గురువుమార్గదర్శకుడు ,తనశిష్యులుఏదిఎలాచేయాలో,ఎప్పుడుఎంతవరకుచేయాలో, ఏదిమంచో ఏది చెడో ,ఏదిఆచరించాలో, ఏదికూడదో చూసిస్తుంటాడు. గురుపూర్ణిమ హిందువులకు పరమ పవిత్రమైన రోజు.తమతమ గురువులను అత్యంత భక్తి భావంతో పూజించేరోజు, ఉపవాసంచేసి, గురుపూజ గావించే రోజు. విద్యబోధించే గురువులను గౌరవించేరోజు.
          గురువులుఎనిమిదిరకాలు.బోధగురువులు,వేదగురువులు,నిషిధ్ధగురువులు,కామ్యగురువులు,
వాచిక గురువులు, సూచిక గురువులు, కారణ గురువులు,విహితగురువులు.వీరందరిలోకీ జీవాత్మ పరమాత్మలో లీనమయ్యే విధానాన్ని , దానికి అవసరమైన మార్గాన్నీ బోధించే' కారణ గురువు ' ను ఆశ్రయించడం ఉత్తమం.
ప్రాచీన ఋషులు భగవానుని గురువుగా విశ్వసించి ఇలా స్మరించేవారు.
                 బ్రహ్మానందం పరమశుఖదం కేవలం ఙ్ఞానమూర్తిం
                 ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది  లక్ష్యం
                 ఏకం నిత్యం విమలం అచలం సర్వధీసాక్షి భూతం
                 భావతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి.
ఇహఈరోజునువ్యాసపూర్ణిమఅనికూడాఅంటాం .వ్యాసమహర్షిమానవజాతికిఅఙ్ఞానాంధకారాన్నిపార
ద్రోలి దివ్యమైన దైవతత్వాన్ని రుచిచూసి అనుభవించేందుకై  శ్రుతి, స్మృతి పురాణాలను శాస్ర్త్రాలను అందించిన గురువు.వ్యాసమహర్షి వశిష్టుని మనుమడు, పరాశరమహర్షి కుమారుడు ,శుకమహర్షి తండ్రి. భగవత్తత్వాన్ని మానవజాతికి అందించిన దైవాంశ సంభూతుడు, వేద విభజనకావించి నందున  వేదవ్యాసుడని ప్రసిధ్ధిగాంచినవాడు.అందుకే ఈమహర్షిని ఇలాకీర్తిస్తారు.  
                  వ్యాసం వసిష్టం నప్తారం శక్తేః  పౌత్ర మకల్మషం
                   పరాశరాత్మజంవందే శుకతాతం తపోనిధిం .
         అంటూ వ్యాస భగవానునికి ఈ రోజున ప్రణామాలు అర్పిద్దాం
           [ వార్తలో గురుపూర్ణిమ సందర్భంగా ప్రచురితం ]

Wednesday 18 July 2012




 
                 తొలుత నవిఘ్నమనుచుధూర్జటినందన ! నీకు మ్రొక్కెదన్
                               
                 ఫలితము సేయుమయ్య నిను
రార్ధన చేసెదనేకదంత! నా
                               
                  వలపల చేతిఘంటమున
వాఃక్కున నెప్పుడు బాయకుమీ
                             
                  తలపున నిన్ను వేడెదను
దైవ వినాయక ! లోకనాయకా !!