Friday 27 July 2012

సమయం*** సందర్భం.


                       సమయం*** సందర్భం.
"
ఓహ్! నీచీర ఎంతబావుందో!ఎక్కడకొన్నావో య్!" ఆశ్చర్యంగా అడిగింది అర్చన .
"
ఏం నీవూ కొoదామనే!"మరీ ఆశ్చర్యం ఒలకపోస్తూ అంది సుందరి. సుందరి చాలా బావుంటుంది గులాబీ పూవువంటి శరీరఛాయ,తీర్చి దిద్దిన ముఖ కవళీకలు, దానికితగ్గట్లు మంచిమంచి ఖరీదైన డ్రెస్లు వేసు కుంటుంది. తనజీతమంతా తన ఖర్చులకేతప్ప ఇంటికి వాడవలసిన అవసరం లేదు.  అర్చన అలాకాదు, ఆమెకుటుంబమంతా ఆమెజీతంపైనే ఆధారపడి ఉంది. అందుకే ఖరీదైన బట్టలు కట్టలేదు కానీ ఎవరైనామంచిబట్టలు ధరించిబడికి వస్తే  మనస్పూర్తిగా మెచ్చుకుంటుంది, కల్లా కపటంలేని స్వఛ్ఛమైనమనస్సు.అందుకే  సుందరి అలా అనేసరికి మనస్సు చిన్న బుచ్చుకుందిఅర్చన . మన శారీరకఅందమే కాక మన మనస్సులూ అందంగా ఉంచుకోడం ఎంతో అవసరం కదా! పక్క వారినిబాధపెట్టే అందం ఎందుకూ కొరగాదు.
 
      గులాబీరంగు చుడీధర్ ధరించి ఆఫీస్ కు వచ్చిన మృధులను అంతా తలలు పైకెత్తిమరీ చూశారు. మృధులా అందంగా ఉంటుంది. ఆమె శరీరఛ్ఛాయకు గులాబీ రంగు ఎంతోనప్పింది. అంతా తననుఅలాతలలుపైకెత్తిచూస్తుంటే గర్వంగా ఉంది మృధులకు.మృధుల పక్క సీటు ,  బిందు  " ఏమోయ్! ఈరోజు నీ బర్త్ డేనా ఏం? అంతా తలలు
తిప్పకుండ చూసేలా వచ్చావ్? " అంది.
"
అదేంకాదు. కామాక్షితో పందేం కాశాను, అంతా నన్ను తలతిప్పకుండాచూసేలావస్తానని."అందిమరింత గర్వంగా.
"
తల్లీ ! ఇది ఆఫీసు, మీ పందేలు పనిలో చూపండి.ఎంతో వర్క్ పెండింగ్ ఉందనిబాస్ కోపగించారుకదా!ఇక్కడ మనం పనిచేయను వచ్చాం, దానికి తగిన జీతంతీసుకుంటున్నాం. కానీ మన డ్రెస్ లూ, పందాలూ బయటే!" అంది ఏమాత్రం మొఖమాటంలేకుండా బిందు .
        
బిందు చెప్పింది నిజం. మన వస్త్ర ధారణ సమయాన్నీ సందర్భాన్నీ బట్టిఉండాలి.ఆఫీసులకూ , స్కూళ్ళకూ అందమైన వస్త్రాలతో వెళితే ఏపేరంటానికోవెళుతున్నట్లు ఉంటుంది , కానీ పని చేయను వెళ్ళినట్లుండదు.పైగా  తోటి
ఉద్యోగస్తులంతా మనలా అందమైన , ఖరీదైన దుస్తులు ధరించే సదుపాయంఉండకపోవచ్చు, వారిపరిస్థితి మనవల్ల ఇంకా తక్కువైపోకుండా , అలాంటివారుబాధపడకుండా ఉండేoదుకూ మనం సమయాన్ని బట్టి దుస్తులు ధరిస్తే బావుంటుంది.ఇదేమనం మనపిల్లలకూ నేర్పాలి. అందుకే స్కూళ్ళన్నిట్లో సమవస్త్రా లు!,అదేయూనిఫాం కంపల్సరీ చేయటం, అలాగే కొన్ని ఆఫీసుల్లో ఉద్యోగస్తులకూ యూనిఫాంఉంటున్నది , నిజానికి పిల్లలకేకాకఉద్యోగస్తులందరికీ అన్నికార్యాలయాల్లోనూ కంపల్సరీ  యూనిఫాంఅమలుపరిస్తేఅర్చనలాంటివారెంతోమందితమస్థితికిబాధపడకపోగా  చూపరులకు సైతం ఎవ్వరి స్థితిగతులూ బయల్పడకపనిపై శ్రధ్ధ చూపగల్గుతారు. పెద్దలు ఆచరిస్తూ పిల్లలకు ఇలాంటివినేర్పితేఅoదం చందమూనూ. పెళ్ళిళ్ళకూ పేరంటాలకూ , ప్రత్యేకమైన పార్టీలకుఖరీదైన వస్త్రాలుధరించడం రివాజే! గుళ్ళకూగోపురాలకూ ఒకరకమైన వస్త్రాలూ,బంధువుల ఇళ్ళకు  విజిట్ చేసేప్పుడు వారి స్థాయికి తగిన వస్త్రాలు,ఆఫీసులకు సమవస్త్రాలు, లేదా  సాధరణ వస్త్రాలు,  ధరిస్తే ఆతీరేవేరుమరి!చాలా కొన్ని కంపెనీలు తమ సిబ్బందికి ' సమవస్త్రాలు ' నిర్ణ యిచి అమలుపరచడం  ముదావహం.
ఆదూరి.హైమవతి.
*అందరి అలోచనలూ ఒకేలాఉండవు అనేటైటిల్ తో చెలి--వార్త దినపత్రికలో 28-702012 న ప్రచురితము.
 

No comments:

Post a Comment