లక్ష[ యక్ష ] ప్రశ్నలు.
నీటికై వెళ్ళిన సోదరులునలుగురూయక్షుడుఅడిగినప్రశ్నలకుసరైనసమాధాన
మివ్వలేకమూర్ఛిల్లగా , మహాభారతంలోధర్మరాజుఆయక్షునికిదీటైనజవాబులిచ్చి,తనతమ్ములనుబ్రతికించుకున్నాడు.ఆయన ధర్మమూర్తీ, విద్యావేత్త ,పైపెచ్చు కృష్ణ
భక్తుడూగనుకగండంగట్టెక్కగలిగాడు.నేడుమనంరెండుమూడేళ్ళ పిల్లలడిగే లక్ష[యక్ష] ప్రశ్నలకు
ఒక్కదానికీ సరైన సమాధానo ఇవ్వలేక పోతున్నాం.వారి
పసి బుఱ్ఱ ల్లో వేవేల సందేహాలు,లక్షల ప్రశ్నలు. అసలు విఙ్ఞానం why, What, Who,where ,Whoseఎందుకు ,
ఏమి, ఎవరు,ఎక్కడ .. ఇలాంటి [W] తోనే మొదలవు తుందేమో!.ఇంటికి ఎవరైనా వస్తే పిల్లలుమనల్ని
" ఎవరు ?" అని అడుగుతారు, 'ఈపని
చెయ్యి "అనిచెప్తే ,"వై“అంటారు .వారికితగినసమాధానాలు
. చెప్పడంలోనే పెద్దలమనుకుంటున్న మన తెలివితేటలు,విఙ్ఞతబయల్పడుతుంటుంది.
గతనెలలో మా కొడుకు, కోడలు, పిల్లలు అమెరికానుండీ
వచ్చారు ,కోడలు తమ్ముడి పెళ్ళికి. పెళ్ళంటే తెలీని 4,2 ఏళ్ళ పసి
పిల్లలుగనుక వాళ్ళమ్మ ' మామ కొత్త అత్తను తెచ్చుకుంటున్నాడు. అందుకని మనం ఇండియా వెళుతున్నాం ' అనిచెప్పిందిట. ,నేను మా అల్లుడితో
వెళ్ళాను [ఎయిర్ పోర్ట్ ఊరికి గంటన్నర దూరంలో ఉండటాన, మావారు చలికి రాలేనన్నారు.] వాళ్ళను రిసీవ్చేసుకోను. మాకోడలు " మామ ,హాయ్ చెప్పు " అనిచెప్పగానే పెద్దపిల్ల , లాస్య " ఈ మామేనా కొత్త అత్తను తెచ్చుకునేది ?" అని మొదటి ప్రశ్నాస్త్రం సంధించింది .మాకోడలు కొంత ఇబ్బంది ఫీలై
' కాదు కాదు, రాజా మామ ,
ఈ మామ సోమి అక్కా వాళ్ళానాన్న
" అని సర్దిచెప్పింది.
" నాకెప్పుడు ఫైవ్ వస్తాయి ? " అని అమెరికాలో అడిగిందిట లాస్య ," ఇండియా వెళ్ళినప్పుడు " అని వాళ్ళమ్మ
చెప్పిన జవాబు గుర్తుంచుకుని , విమానందిగగానే
" నాకిప్పుడు ఫీవ్ వచ్చిందా?" అని అడిగిందిట
! ఎవరోకవి అన్నట్లు ' పెరగటానికెందుకురా
తొందర ? . ఎదర ఉందంతా చిందర వందరా? . అనేపాట గుర్తువచ్చింది .
ఇల్లు చేరగానే , నాకూతుర్ని చూపించి మాకోడలు " అత్త కు హాయ్ చెప్పు అనగానే
"" ఈ అత్తేనా కొత్తత్త ?" అనే రెండో
అస్త్రం ప్రయోగించింది." కాదు ఈ అత్త
సోమీ అక్క, శ్రీయా అక్క వాళ్ళమ్మ. ఈ మామ వాళ్ళ డాడీ , ఈ అత్త డాడీవాళ్ళ అక్క.. " అని చెప్పింది.
నేను పిల్లలి నీ తీసుకుని కూరలకై కార్లో వెళ్ళేప్పుడు
నామీద పెద్ద అస్త్రమే ప్రయోగించిమది. " why baammaa! you are not
having big ones like others " అంటూ ఛాతీ చూపింది.అమెరికాలో
[ నేడు ఇండియాలోనూ]
ఎవ్వరూ ఛాతీ మీద కవర్ చేసుకోరు ,ఎద అంతా [బ్రస్ట్] బయటికి కన్పిస్తుం టుంది. స్కూల్ లో మాంస్ ,
మాల్స్ లోనూ, బయటా ఎక్కడికెళ్ళినా అక్కడ [ నేడు సిటీలేకాక బస్తీల్లోను,
పల్లె ల్లోనూ సైతం
ఇక్కడానూ] ఛాతీ బయటే కదా! అందువల్ల పమిటభుజంచుట్టూతిప్పికప్పుకున్ననన్ను చూసి ఆచిన్న
బ్రైన్ కు పెద్దసందేహం వచ్చింది. ఇంకా ఏమి అడుగుతుందోని నేను టాపిక్మార్చి " సిద
ట్రీస్ ,కలర్ ఫుల్ ఫ్లవర్స్ " అంటూ ఏదేదో చెప్తూ ఇల్లు చేరాను.
మాకోడలు చెప్పింది 'ఇండియాలో వాళ్ళకు ఇంగ్లీష్
వచ్చా!నాకు తెలుగురాదుకదా! అక్కడ సోమి, శ్రీయ అక్క, తో నేనెలా ఆడుకోను? అనిఅడిగిందిట నాల్గేళ్ళలాస్య. ' బెంగుళూర్ ఈజ్ సో నైస్ క్లయ్మేట్ షికాగో ఈజ్ సో కోల్డ్ వై కాంట్ఉయ్ స్టే ఇన్ఇండియా
?' అని ఆడుగుతున్నదివాళ్ళ పేరెంట్స్ ను.
అన్నంతినిపిస్తున్న నాతో " వై కాంట్
ఉయ్ ఈట్ మీట్ " అని అడిగింది .
" ఉయ్ ఆర్ వెజిటేరియన్స్ , ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు ఈట్ మీట్ దెహ్యావ్ టు కిల్ ద ఎనిమల్స్ ఆర్ బర్డ్స్
దెన్ కుక్ దెం అండ్ ఈట్ " చూడు ఈ బర్డ్స్ ఎంత అందంగా ఎగురుతున్నాయో!
వాటిని చంపితే పాపం అవి బాధపడవూ! " అనిఏదో
చెప్పానే కానీ ఆచిన్న మనస్సుకు ఏం అర్ధ మైందో నాకు తెలీలేదు.. తను ప్రీస్కూల్ కెళుతుంటే అక్కడ అంతా తినేదిమీట్ మనం తినకూడదు. ఈ బాక్స్ లో
దితిను ' అనివాళ్ళమ్మ చెప్పినందునఆచిన్న మనస్సులో ఆసందేహం
దూరి ఉంటుంది..
“వై డోంట్ యు
వేర్ నైటీస్ లైక్ మమ్మీ ?" అంది .
" నాజుట్టు నీలా గా ఎందుకు పెద్ద గా,పొడుగ్గా పెరగలేదు
[ ఆంగ్లంలోనే ] అని అడిగింది." నీవుబాగా
అన్నీ తింటే పెరుగుతుంది." అనిచెప్పాక ఆరోజు నేను పెట్టినవన్నీ తింది .వెంటనే
జుత్తుకేసి చూపి " నీవు పెట్టినవన్నీ తిన్నా ఇంకా పెరగలేదేం? భుజాల క్రిందకు రాలేదేం? " అని అడిగింది.
" నే నెప్పుడు నీ అంత పెరుగుతాను? "అంది
" ఇంక 60 ఏళ్లతర్వాత నా అంత ఉంటావు." అనిచెప్తే వెంటనే ," అప్పుడు నీవు
నాకంటే చిన్నగా ఉంటావు కదా ?" అని అడిగింది.
" ఎందుకు పక్షులు పైన ఎగురుతాయి? , వాటిలా మనమెందుకు ఎగరలేం?, చీమలు లైన్గా పోతాయికదా ? ఎవరు నేర్పారు ? చేపలు నీళ్లలో ఈదుతాయ్
కదా?ఈత ఎవరు నేర్పారు ? నాకు ఈత నేర్ప మంటే
మాడాడీ ' ఇంకా పెద్దవ్వాలంటారు,ఈ చిన్న చేపలకు వాళ్ళడాడీ నేర్పారుకదా? చెట్లకు ఈ పూలు ఎలావస్తున్నాయ్ ? చెట్లూ గ్రీన్ కదా
రంగుల పూలు ఎలా వస్తున్నాయ్?ఈపెద్ద మఱ్ఱి చెట్టుకు ఇంత చిన్నకాయలేంటి? ఈచిన్నతీగకు ఇంత పెద్ద
గుమ్మడికాయలేంటి?నేను కారు ఎందుకు డ్రైవ్ చేయ కూడదు? డాడీ చెప్తే నేను ఈ చక్రంతిప్పుతానుకదా? నాన్నకు గడ్డమ్మీద
మూతి మీద వెట్రుకలు ఎందుకూన్నాయ్?మమ్మీకీ నీకు ఎందుకులేవు ?తాత జుట్టు ఎందుకు తెల్లగా ఉంది? నీజుట్టు నల్లగానే
ఉందే? నాజుట్టు తెల్లగా ఎప్పుడువస్తుంది?
నేనెప్పుడు పొడుగ్గా సోమీఅక్కలావస్తాను? నేనెందుకు నీలాగా చీరలు కట్టుకో రాదు? " ఇలాంటిప్రశ్నలతోనాబుఱ్ఱ
తిరిగిపోయింది యక్షప్రశ్నలకు జవాబులివ్వను భారత భాగవతాలు భక్తితో పఠించాలా ? చతుర్వేదాలు పారాయణ
చేయాలా? భగవద్గీత కంఠోపాఠం చేయాలా? శంకభాష్యం చక్కగా చదవాలా ?! నాకైతే ఏమీ అర్ధంకాక ఏంచెప్పాలో ఆనాలుగేళ్ళ
పిల్లకుతెలీక , భగవంతుని ప్రార్ధించాను.
published in vaartha daily
No comments:
Post a Comment