Wednesday, 1 January 2014

అమ్మ మనస్సు


అమ్మ మనస్సు

నిర్మల ఇంటినంతా అందంగా ఒక ఎగ్జిబిషన్ హాల్ లాగా అలంకరించింది.పూలమాలలూ , బెలూన్స్ ,రంగు రంగుల లైట్స్ వెలుగుతూ ఆరుతూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. టైం ఆరైంది.ఇంతలో ఇంటిముందు వరుసగా కార్లు ఆగటం అతిధులంతా పూలబొకేలతో లోనికి రావటం మొదలైంది.

                  అంతా వచ్చి తాముతెచ్చిన బొకేలను అక్కడ అలంకరించి ఉంచిన ఫోటోముందు ఉంచసాగారు.కొత్తగా ఫంక్షన్ కి వచ్చిన విజయకు అంతా అయో మయంగాఉంది.ఆమె తన కజిన్ తో

- See more at: http://vihanga.com/?p=10752#sthash.jAsTxdtH.dpuf

ఆటవిడుపు.


ఆటవిడుపు.

"రండర్రా రండి! గత నెల నుండీ మనం అనుకుంటున్న కార్తీక వన భోజనం వచ్చే శనివారమే! మనం తలో ఐటం చేసుకెళితే బావుంటుందే మోగా! ఆలోచించండిఅన్నారు అన్నపూర్ణ గారు.
"
పోనీ ఆంటీ అందరం తలో ఐటం హోటల్స్ నుండీ ప్యాక్ చేయించుకుపోతేనో !" అని నిర్మల అంది
.
హోటళ్ళలో ఎన్ని రోజులవి ఇస్తారో నమ్మలేం కదా! " సంశయం వెలిబిచ్చింది దినమణి, ఇటీవలే బయట తిని ఇంటిల్లిపాదికీ సుస్తీ చేసి డాక్టర్ బిల్ దండిగా వదిలించుకున్న అనుభవంతో
..
"
నిజమే సుమండీ! మా పిల్లలు ఫైవ్ స్టార్ హోటల్ కెళదామంటే మావారంటుంటారు, ఫైవ్ స్టార్ హోటలంటే -ఫైవ్ డేస్క్రితంవి దాచి వేడి చేసి పెట్టేదిట! త్రీస్టార్ హోటలంటే త్రీడేస్ క్రితంవి దాచి వేడి చేసి పెట్టేదిట, ఇహ ఏసీ హోటలంటే ఎంగిలివి వేడి చేసి పెట్టేదిట !" అని లావణ్య బదులివ్వగానే అంతా ఫక్కుమన్నారు
.
"
బావుందర్రా! అందుకె అన్నానర్రా! మనమే తలోటీ చేసేసుకెళదా దామని. ఇంతకూ ఎవరెవరు ఏమేం చేసుకొస్తారో చెప్పండి రాసేస్తాను పన్లో పనిగా, ఐటంస్ రిపీటవ కూడదు కదా!" అంది అన్నపూర్ణ

తలోవంటకం చెప్పారు, ఆమె రాసుకుంటుండగా . "మనం వెళ్ళేది పల్లెప్రాంతం! కాస్తంత తెలుగు మాట్లాడితే మెరుగని గత నెల్లాళ్ళుగా అనుకుంటూనే------

శిలికానాంధ్ర సుజనరంజని జనవరి2014 లో పూర్తికధ చదివి మీ అమూల్య అభిప్రాయాలను తెలుపగలరు.

“గాయంతాం త్రాయతే ఇతి గాయత్రీ!”


గాయంతాం త్రాయతే ఇతి గాయత్రీ!”

‘  ఓమ్ భూర్భువస్సువః -తత్సవితు ర్వరేణ్యం

భర్గో దేవస్య థీమహిథియో యోనః ప్రచోదయాత్-

 
అని తాతగారి గదిలోంచి వినిపిస్తున్న గాయత్రీ మంత్రా న్ని విని వినోద్, వనజా  నవ్వుకున్నారు.

తాతగారికి ! చాదస్తం ఎక్కువలా ఉంది..ఇలా రోజూ మూడు వేళలా మూడు  గంటల సమయం వృధా చేసుకుంటున్నారు.  దీని బదులు వాకింగ్ కానీ, మరేదైనా ఎక్సర్ సైజ్ చేస్తే మేలు కదా!” అన్నాడు వినోద్. వంటగదిలోంచి  వీరి మాటలు వింటున్న బామ్మ భవాని ఏరా! తాతగారిని విమర్శించేంత  గొప్పవారా మీరు!  మీకేం తెల్సురా గాయత్రీ మాత  ప్రభావం ? అంది కోపంగా.

 
మాలిక పత్రికలో  జనవరి2014 లో పూర్తికధ చదివి మీ అమూల్య అభిప్రాయాలను తెలుపగలరు.