Tuesday 31 December 2013

ధర్మ మూర్తి

ఈలింక్ లో  http://pushkarinee.com/?q=comment/reply/184.
జనవరి2014 - పుష్కరిణి  వెబ్ పత్రికలో ' ధర్మ మూర్తి ' అనే కధను పూర్తిగా  చదివి తమ అమూల్య అభిప్రాయాలను తెలుపగలరు.


"ఆహా! వాతావరణం  ఎంత బావుందండీ! అలా ఎక్కడికైనా వెళ్ళి కాస్త తిరిగి వద్దామా?" బయటి చల్లని గాలి పలుకరించగా పులకరించిన మనస్సుతో మా శ్రీవారిని అడిగాను. ఆయన వెంటనే లేచి, " చెప్పు ఎటు వెళదామో" అన్నారు కారుతాళాలు తీసుకుంటూ.

"ముందు బయల్దేఱండి, ఆలోచిద్దాం" అంటూ బయటికొచ్చి కారెక్కాం. ఇంతలో మా స్నేహితురాలు లావణ్య ఫోన్. "హలో హిరణ్మయీ ! ఇక్కడ బెమ్మెల్ లే-ఔట్లోని బాలాజీ టెంపుల్లో తెలుగు పురాణశ్రవణం, రామాయణం మీదట! , త్వరగా రా! నేనక్కడే ఉంటాను.మీ ఇంటికి పదో, పదహైదో నిముషాలంతే! " అని ఫోన్ పెట్టేసింది. లావణ్య మాట్లాడుతుండగా భజన వినిపించింది. 'రఘుపతి రాఘవ రాజారాం- పతీత పావన సీతారాం' అని.

"పదండి బెమ్మెల్ బాలాజీ గుడికి, రామాయణం మీద తెలుగులో పురాణశ్రవణంట! తెలుగు ఉపన్యాసం మిస్సవ్వకూడదు" అన్నాను.----

Wednesday 18 December 2013

మరువంపుమొక్క

http://jabilli.in/

జాబిలి వెబ్ మ్యాగజైన్ లో --మరువంపుమొక్క అకేకధ పూర్తిగా చదవి మీ అమూల్య అభిప్రాయాలు తెలుపగలరు.
        
పూర్వం ఒక అరణ్యంలో ని ఒక పెద్ద మఱ్ఱిచెట్టు మీద  ఒక కాకి గూడుకట్టుకుని ఒంటరిగా జీవించసాగింది.కొంతకాలానికి దాని కి ఒంటరిబాధ ఎక్కువై , తన గూటినుండి బయటికి వచ్చి మాను పక్కనేప్రవహిస్తున్నమందాకినీ నదిలోకి చూసుకుంది , దానినీడ తప్పచుట్టూఏప్రాణీకనిపించలేదు .విచారంగా ఆలోచిస్తున్న కాకికి తన చిన్నతనంలో అవ్వచెప్పిన మాటలు గుర్తువచ్చాయి.-----