Saturday 9 May 2015

మాలిక మే 2015 పత్రికలో నా స్వదస్తూరితో ' ఆవకాయ గురించీ ' ఆవకాయా - అనసూయమ్మా! - చదవగలరు

http://magazine.maalika.org/wp-content/uploads/2015/05/aduri-hymavathi1.jpg
మాలిక మే 2015 పత్రికలో నా స్వదస్తూరితో ' ఆవకాయ గురించీ ' ఆవకాయా - అనసూయమ్మా! - చదవగలరు

మాలిక మే 2015 పత్రికలో నాకధ ' మాంగల్యం తంతునానేనా '

http://magazine.maalika.org/2015/05/04/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82-%E0%B0%A4%E0%B0%82%E0%B0%A4%E0%B1%81%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%A8%E0%B1%87%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%BF/


మాంగల్యం తంతునా నేనా …(వివాహబంధం తరాలు- అంతరాలు)

రచన: ఆదూరి హైమవతి
విశ్లేషణ: జ్యోతి వలబోజు
వివాహబంధం
“ ముహూర్తం దగ్గర పడుతున్నది, పెళ్ళికూతుర్నితీసుకురండి “ పెళ్ళి చేయిస్తున్న పురోహితుడు మంత్రాలు చదవడం ఆపి, పెద్దగా పెళ్ళిపెద్దల్ని ఆదేశించాడు.
పెళ్ళికూతురు తరఫు ముత్తైదువులు పట్టుచీరల పరపరలతో గబగబా పెళ్లికూతురి గదిలోకి వెళ్ళి, గోడక్కొట్టిన బంతిలా అదే వేగంతో తిరిగొచ్చి ” పెళ్ళి కూతురు కనపడ్డం లేదు.” అని గట్టిగా అరిచారు.
అది వినగానే పెళ్ళికొడుకు ముఖం పాలిపోయింది. చేతిలోని అక్షింతలు క్రింద వదిలి, అవమానంతో తలవంచుకున్నాడు. పెళ్లికొడుడు తండ్రి “ఏమండీ ! బావగారూ! మ అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్ళి ఎలా నిర్ణయించారండీ!‘ అష్ట వర్షాత్ భవేత్ కన్యా ‘ అని ఎనిమిదేళ్ళ పిల్లల ఇష్టాయిష్టాలతో పని లేకుండా మన అమ్మల కాలంనాడు పెళ్ళిళ్ళు చేశారు , మీ కూతురు 28 ఏళ్ళ పిల్ల. తనకు ఇష్టం లేకుండా ఎలా చేస్తున్నారండీ పెళ్ళి? మమ్మల్ని అవమానంపాలు చేయడానికా?” అంటూ కోపంతో అరిచాడు.
పెళ్ళి కూతురు తండ్రి ఆయన చేతులు పుచ్చుకుని బ్రతిమాలుతూ “ఇవి చేతులు కావు, కాళ్ళనుకోండి. ఒక్క పది నిముషాలు టైమివ్వండి, ఏం జరిగిందో నేను కనుక్కుంటాను. మా అమ్మాయి సంపూర్ణంగా ఇష్ట పడ్డాకే ఈ పెళ్ళి నిర్ణయించామని మీకూ, మీ కుమారునికీ అందరికీ తెలుసు కదండీ! నాక్కొంచెం ఊపిరి తీసుకునే సమయమివ్వండి! ప్లీజ్” అంటూ లోపలికెళ్లాడు.
పెళ్ళి బాజాలతో, అమ్మలక్కల మాటలతో, బంధువుల పరస్పర పరాచికాలతో, మంత్రోఛ్ఛారణతో , పిల్లల పరుగులు అరుపులతో కళకళ లాడుతున్న పెళ్ళిహాలు ఒక్కసారిగా చిన్నబోయి, మూగపోయింది.
పెళ్ళికూతురు తండ్రి లోపలికి పోయినవాడు అలాగే బయటికి వచ్చి తలపట్టుకుని పెళ్ళిమంటపం మీద కూలబడ్డాడు. “తండ్రిని బుకాయించి ఎవరితోనో లేచిపోయుంటుంది. ఈ కాలం ఆడపిల్లల్ని ఎవ్వరూ నమ్మలేరు. ఏక్షణానికి ఏం చేస్తారో?” బుగ్గలునొక్కుకుంటూ పెద్ద ఓముత్తైదువ తన అభిప్రాయం వెలిబుచ్చింది.
“అంత ఇష్టం లేకపోతే ఈ పెళ్ళి వద్దని చెప్పచ్చుగా. తీరా పీటలమీదికి వచ్చేముందు ఇలా అందర్నీ ముంచేసి వెళ్ళక పోతే?” మరోఆవిడ. “అసలు ఈ వంశమే అంత , వీళ్ళమ్మేం తక్కువ తిన్నదా? ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా? ఊరికే వచ్చిందా సామెత?”
 
మిగిలినకధ      మాలికలో

' బడాయి భూరుహం ' కధ

http://www.gotelugu.com/issue109/2860/telugu-stories/badaayi-bhooruham/
గోతెలుగు దస్తూరీ తిలకం లో ' మోహన్ కుమార్ గారి దస్తూరీ తో ' బడాయి భూరుహం ' కధ