Sunday 19 April 2015

మనసు .

మనసు .
 మనసు ,మాట, నడత ఈమూడింటిని ఒకటిగా చేసి ప్రవర్తించడమే త్రికరణ శుధ్ధిగాజీవించడమంటే. ఇలా జీవించేవాడే పరిపూర్ణ మానవుడని పించుకోదగిఉంటాడు.మొదట మనస్సునుగురించీకాస్తంత చెప్పు కుందాం. ' సంకల్పవికల్పాత్మకం మనః ' అన్నారు.సంకల్ప వికల్పాల సంచీయే మనస్సు.                'మననాత్ ఇతిమనః ' -అంటే నీరంతరం మననం చేసేది మనస్సు.ఈమనస్సుయొక్క తత్వాన్ని గుర్తించడమే బహుకష్టం. మనస్సు నిరంతరం సంభాషణ లతో,ఆలోచనలతో నిండిఉంటుంది.మనిషి నిరంతరం  మనస్సులో సంభాషిస్తూఉంటాడు.ఆలోచనకూ, సంభాషణకూ భేదముంది. మనసమస్యల గురించి  తర్కించితర్కించి వాటిని పరిహారం చేసే వైపు పయనించేవే ఆలోచనలు.మన సమస్యనుభూతద్దంలో చూసి మనస్సును అల్లకల్లోలం చేసేవి సంభాషణలు. మొదగామానసిక సంభాషణలను  అదుపుచేసేందుకై మనం ప్రయత్నించాలి.మనస్సుకుకొంత విశ్రాంతిచేకూర్చాలి ,దానికై వేరే ఇష్టాంశాలపైకి మనస్సునుమళ్ళించేప్రయత్నం చేయాలి మనం చింతించే విషయాలన్నీ ఒక తెల్లకాగితం మీదనల్ల సిరాతో వ్రాసినట్లుగా మనహృదయంలో ముద్రితమవుతాయి. మనస్సు నుఅదుపుచేసుకునేనిమిత్తం మానసిక సంభాషణలను క్రమేపీతగ్గించుకుంటూరావాలి.ఈమానసిక సంభాషణాక్రమం మితిమీరితే 'మతిభ్రమణం 'కలిగే ప్రమాదముంది.                                                                            దీనిని అరికట్టను మూడు మార్గాలున్నాయి. 1.ప్రాణాయామము.--మనంఒకప్రదేశంలో మనకు సుఖమైన రీతిగాకూర్చుని, ప్రశాంతంగా మనఉఛ్వాస,నిశ్వాసలపై మనసుంచి సక్రమ మార్గంలో వాటిపైకి దృష్టినిల్పి నిదానంగాశ్వాస పీల్చుకుని ,కొంతసమయం అలాగే ఉంచి,ఆతర్వాత శ్వాసవిడవాలి.అలాకొంతసమయాన్ని గడుపుతూ ఉంటే మానసిక సంభాషణతగ్గుతుంటుంది,క్రమేపీ వీటిని అరికట్టవచ్చు.                                                         2. రెండవది -సమాజసేవ-- నిరంతరం ఒక పత్యేకమైనపనిలో నిమగ్నమైఉంటే మనస్సుయొక్క సంభాషణలు క్రమేపీ తగ్గుకుఖంపడతాయి. వైద్యశాలలోఉండే రోగులకు ఏదైనా సాధ్యమైన సేవచేయటంగానీ,వృధ్ధాశ్రమాల్లో సేవలుకానీ,  పాఠశాలల్లో ఉచితంగా  విద్య బోధించడంకానీ, మనకు వచ్చినఏదైనా అంశాన్నిఇతరులకు ఉచి తంగా నేర్పడంలో గానీ లేదా సత్సంగం లో గ్రంధపఠనమో,శ్రవణమోచేయటంవల్లగానీ ఇలాంటిపవిత్ర మైన పనులలో  మనస్సును లగ్నం చేస్తేమానసిక సంభాషణ ఆగిపోతుంది.                                                                                                            
 3.సాధనాసంపత్తి- అంటే భజన,కీర్తనలను,పాడటం, జపము, ధ్యానము, నియమిత సమయానికి ప్రతిరోజూసద్గ్రంధపఠనం చేయడం , మొదలైన వాటివలనకూడా మనస్సును అణచిఉంచవచ్చు రెండవది, శారీరకంగా ఇతే ఇది కేవలం మానసిక శిక్షణఅన్నమాట.గాయత్రీమంత్రపఠనం నిరంతరం చేయటం అలవాటుచేసుకుంటేమనస్సు ఆవైప ఆలోచిస్తుంది.మానసిక సంభాషణలు అణగిపోయివత్తిడితగ్గుతుంది.
నేటిమానవులం నిరంతరం ఇతరులను గూర్చిన చింతనతో పక్కవారి ఉన్నతి,పదవి, జీతభత్యాలు, వారి సౌకర్యాలు ఇల్లు, బ్యాక్ బ్యాలెన్స్ గురించి చింతిస్తూమనస్సును అలికిడికి గురిచేస్తుంటాం.పక్కవారి మంచి చెడులు  మాత్రమేకాకవారి దుర్మార్గ తత్వాన్ని స్మరించడాంవల్లనూ మనస్సు మురికి తుడిచినగుడ్డవలెమాలిన్య మవుతుంటుంది.మనం మనమనస్సును ఒక దినపత్రికగామార్చుకుంటున్నామేకానీ హృదయా న్నిపవిత్రంగా ఉంచుకోలేక పోతున్నాం.దినపత్రికలో దొంగతనాలు, చెడువిషయాలు, సినిమా లు, ఇంకా రాజకీయవిషయాలు అన్నీ మనకు పనికిరానివే కదా! మనమానసిక శక్తిని పనులలోనూ,ఆలోచనల్లోనూ సక్రమంగా వినియోగిస్తే మనాంతర్గతశక్తి విలువం,అనకుఅవగతమవుతుంది.మన్లో ఉన్న శక్తిమగా గొప్పది.
మనయేవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః ' అన్నట్లుగా బంధములకుమోక్షమునకు మనమనస్సే ముఖ్య కారణం మనస్సేమానవత్వాన్ని అభివృధ్ధిచేసిమానవుని మహోన్నతునిగా నిలుపగలదు. సంకల్ప వికల్పాలసంచీయేమనస్సుకనుక మన సంకల్పాలను నియంత్రించేప్రయత్నంచేయాలి.మానసిక విశ్రాతికై ' ధ్యనాన్ని ' ఒక సాధనగా భావించి ఆచరించాలి.పూర్వంనుండీ మనవారు ధ్యానానికి సముచిత స్థానం ఇచ్చారు. మనం మన నిత్యకృత్యల్లోనిరంతరం పరధ్యానంలోనే ఉంటున్నాం.ధ్యానాన్ని మరచిపోతున్నాం. మానసిక విశ్రేతి కోసం మనం శ్రవణ, మనన, నిధి, ధ్యాసలను అనుసరించడం శ్రేయస్కరం.
మనస్సును అరికట్టడం దుస్సాధ్యం ఎలాగంటే --చేపలుపట్టే వ్యక్తి గాలానికి ఒకఎఱను కట్టి ఉంచి, గాలాన్ని నీటిలో వేయటంవలన ఆచేప ఆగాలానికున్న ఎఱనుపట్టుకుని వేటగానికి అందుతుంది. సర్కస్సులో క్రూర మృగాలను ఆడించేవారు చేతఒక అంకుశాన్నిపట్టుకుని దాన్ని వశం చేసుకుని ఆడిస్తారు. విషసర్పాలనువాటికున్న దవడలలోని విషకోరలనుతొలగించి  వాటిని ఆడించేవారువశపరచుకుంటారు.మనస్సును స్వాధీనం  చేసుకోను మనస్సులోని మాలిన్యాలనుకొంతవాకైనా తొలగించుకుని స్వాధినపరచుకోవాల్సి ఉంటుంది.కోపము,ద్వేషము,అసూయ అహంకారము,అత్యాశ వంటిమాలిన్యాలకు మనస్సులో చోటివ్వడం చేతఅవిమనస్సును అనేకరీతుల ఆడిస్తాయి మానసిక సంభాషణలను కొంతైనాఅదుపుచేసుకుంటే  మనశ్శుధ్ధి ఏర్పడుతుంది.---రెండవ దైన ' మాట ' గురించీమళ్ళాచెప్పుకుందాం.