2. తొలగినతెర.
కనకయ్య శెట్టి కలియుగ కుబేరుడు.అతని ఇల్లు ఇంద్రభవనాన్నిమించి ఉంటుందని ఆ కనకపురివాసులంతా భావిస్తారు. ఆయన ఇంటి దర్వాజా, గవాక్షపుతెరలే ఎంతోఖరిదైనవనీ, ఇంట్లోని దీపా లన్నీ వెన్నెలనువెదజల్లే చంద్రునికాంతిని మించి ఉంటాయనీ కధలుగాచెప్పుకుంటారు జనం. కనకయ్య శెట్టి ఇంటికి తూర్పుదిక్కున'
వేదవేద్యు 'డనే ఒక పేద వైదిక భ్రాహ్మణుని ‘ పాక ‘ఉంది.అది కనకయ్య శెట్టి ఇంట్లోని ఒక గదికంటే చాలా చిన్నది. ఆపాకలో ‘ వేదవేద్యుడు ‘ ,అతని భార్య ‘ వేదవతి ‘ , కుమారుడు' విద్యాధరుడు
‘ నివశిస్తుంటారు.
ప్రతినిత్యం, కనకయ్య శెట్టి కుంచెడు ధాన్యాన్ని ఉదయాన్నే ఇంటిముందుంచి , వచ్చే భిక్షువులకు గుప్పెడు చొప్పున బిక్ష వేయమని ఒక పని వాడిని నియమించాడు.ఆవిధంగాచేయడంతనగొప్పదాతృత్వానికిని దర్శనమని ఆయన భావన. తాను దానకర్ణుడంతటివాడినని గర్వంగా అందరికీ చెప్పుకుంటుంటాడు.
ఆయన తన పుట్టుపండుగను ఘనంగా చేసుకుని , గొప్పవారినంతా విందుకు ఆహ్వానించేవాడు,ఆయన ఇంటిసంపదను వీక్షిం చను పిలిచిన వారంతా తప్పక వచ్చేవారు. వారంతా ఆయన ఏర్పాటుచేసిన విందులోని వంటకాలు భోంచేస్తూ , ఆయన ఇంటిపక్క న ఉన్న వేదవేద్యుని గుణగణాలను ధార్మికతను పొగిడేవారు. అదికనకయ్యకు కంటకంగా ఉండేది.

ఆఏడాది పుట్టుపండుగ పూర్తైన మరురోజున అందరూ అంతగా పొగుడుతున్న ఆవేదవేద్యుని గొప్పతన మేంటో తెల్సుకోవాలనిపించి , కనకయ్య శెట్టి ఉదయం నుండీ దీక్షగా వేదవేద్యుని కుటీరాన్ని పరిశీలించసాగాడు.వేకువకు ముందే ఇంటి వారు ముగ్గురూలేచి స్నానపానాదులు పూర్తిచేసుకుని
, దైవకార్యం చేసుకునే వారు. పాక ముందు, చుట్టూతా వేదవతి చిత్రించే రంగులముగ్గులు ఎంతో హృద్యంగా చూపరులను ఆకట్టుకునేవి.ఆముగ్గులు ఏదోసందేశాన్నిస్తున్నట్లు , అంతరార్ధాన్ని చెప్తున్నట్లు ఉండటాన దారిన పోయేవారంతా ఆగి వీక్షించి వెళ్ళేవారు..తన పూరిపాక చుట్టూ పెంచుకున్న పూలు కోసి , మాలలుకట్టి దేవాల యంలో ఇచ్చివచ్చేది వేదవతి.కుమారుడు విద్యాధరుడు ఐదు ఇళ్ళలో భిక్షకు వెళ్ళి వచ్చిన పదార్ధాలు తల్లికి అందించగా ఆమె వాటిని వండాక , అగ్నికార్యంచేశాక వారు ముగ్గురూ అతిధికోసం ఎదురుచూసి , వచ్చిన అతిధి ఎవరైనాసరే , అతడికులమతా లతో
,చదువు సంధ్యలతో పనిలేక ఆయన పాదాలు కడిగి , తమ నట్టింట ,భోజనం వడ్డించి, సేవించి పంపేవారు .ఆతర్వాతే ఆ మిగిలిన పదార్ధాలను వారు భుజించేవారు.రోజంతా వారింట వేద పఠనం జరుగు తుండేది.మధ్యాహ్నం నుండి వేదవతి జనావా సాలకు వెళ్ళి వైద్య సేవలు అందించేది, ఆమె వైద్యంలో దిట్ట. విద్యాధరుడుపేద ధనిక అనే బేధంలేక విద్యకోసం తనవద్దకువచ్చే పిల్లలకు అందరికీ విద్యాబోధన చేసేవాడు. సాయంకాలానికి వారి ఇంటిముందుకు వచ్చిన వారికంతా వేదవేద్యడు అనేక శాస్ర్తా ల
లనుండీ కధలు మానవతావిలువలు వివరిస్తూ , వారి ధర్మసందేహాలు తీర్చేవాడు. తమ వద్దకు వచ్చిన వారు అందించే ఫలాలను భగవన్నివేదన చేసి అందరికీ పంచి వార ఒక్క ఫలాన్ని మాత్రమే ప్రసాదంగా భుజించే వారు.ఎల్లప్పుడూ చిద్విలాసంగా ఉండే వారిని చూసి కనకయ్య శెట్టికి ఈర్ష్య పెరిగిపోయింది.తుంగచాపలమీద పుడుకుంటూ ఊరివారిచ్చిన భిక్ష తింటూ పూరిపాకలో కావి బట్టలతో నివసించేవారికంత ఆనందం ఎలా కలుగుతున్నదో అతగాడికి అంతుపట్టలేదు.
ఎలాగైనా వారి ఆనందానికి ఆటంకమ కలిగిస్తే తప్ప నిద్రపట్టనిస్థికివచ్చాడు కనకయ్య.
కనకయ్య ఒక సాయంకాలం బాగా గమనించి , తన ఇంటి గవాక్షాల గుండా తనఇంటి దీపాలకాంతి వేదవేద్యుని ఇంటి ముందు, ఇంట్లోకి ప్రసరించడం సహించలేక ,ఆగవాక్షాలకు నల్లని తెరలు కట్టించాడు. అది ఆయన భవనానికి ఉన్న అందాన్ని తగ్గించగా , తన ఇంటిదీపాలకాంతి వేదవేద్యుని ఇంట పడనందుకు కనకయ్య సంత సించాడు. ఐతే వేదవేద్యుడి ఇంట దేవుని ముందున్న చిన్న దీపం ఆయన పూరిపాక నంతా వెలుగుతో నింపడం కనకయ్య గమనించి ఆశ్చర్యపోయాడు.
వేద వేద్యుడు అంత పేదరికంలోనూఎలా అoత ఆనందంగా ఉంటున్నాడో, అందరూ అతన్ని ఎందుకు పొగుడుతున్నరో తెల్సుకోవాలని , ఓమారు కనకయ్య సాయంకాలo అతడు చేసే సత్సంగానికి వెళ్ళాడు, తనను వేదవేద్యుడు ప్రత్యేకంగా ఆహ్వానిం చనందుకు ఉడుక్కున్నా , తమాయించుకుని కూర్చున్నాడు.
వేద వేద్యుడు చెప్పేమాటలు వింటూ , చివరగా ఒక్కోరూ తమ సందేహాలు అడగ సాగారు.
ఒకవ్యక్తి ” మహాత్మా !తమరు మరోలా అనుకోకండి, తమరు ఇంత పేదరికంలోను ఇంత ఆనందంగా ఉండటానికి కారణం తెల్సుకోవాలని చాలాకాలంగా నామనస్సు వేధిస్తోంది ” అని అడిగాడు.దానికి వేదవేద్యుడు చిరునవ్వుతో ,
” మాకు పేదరిక మేముంది! ప్రతిరోజూ అతిధికి భోజనం పెట్టి తింటున్నాం. ఆకలికి ఏనాడూ బాధపడలేదు. ధనం లేకపోడంపేదరికంకానేకాదు. భావదారిర్ద్యమే నిజమైన దారిర్ద్యం.” అన్నాడు వేదవేద్యుడు.
” మరి మహాత్మా! తమ శ్రీమతి వేదవతీదేవి ఎంతోమంది కి వైద్య సేవలు అందిస్తున్నారుకదా! పేదలను వదిలేసినా, ధనవంతులవద్ద కొంత ధనం స్వీకరిస్తే తప్పులేదేమో!తమరు ఆధనాన్ని ఎటూ ఎవరికో ఇచ్చేస్తారు “
” అనారోగ్యానికి ధనం , పేదరికమనే తేడాలు లేవుగదా! అది ఆమె ఎన్నుకున్న , ఆమెకు చేతనైన మాన వ సేవ, సేవకు వెలకట్టడం అధర్మం కదా! “
” తమ కుమారులు ఎందరికో విద్యాదానంచేస్తున్నారు, వారివద్దనైనా కొంతధనం ….”
” తమరే విద్యాదానం అంటున్నారు! దానాన్ని ధనంతో కొలవడం అధర్మమే!’ అని పూరించాడు వేదవేద్యుడు.

” మహాత్ములారా! అవసరాన్ని మించినధనం గర్వాన్నికల్గిస్తుoది, భయం కౌగిట్లోకి చేర్చుతుంది.
ఈర్ష్యకు దారి చేస్తుంది, పొగ డ్తలనే విషగుళికలను
స్వీకరింపజేసి అధోగతికి చేరవేస్తుంది. మనజన్మ సార్ధకం చేసు కోను జీవం ఉన్నంతవరకూ సేవా ధనాన్ని పోగుచేసుకోను కృషి చేయాల్సి ఉంది. అందుకు భగవం తుడు అవసరమైన అవకాశం మాకు కలుగజేసినందుకు ఆయనకు సదా కృతఙ్ఞులం. ” అని అందరికీ నమస్క రిం చా డు వేదవేద్యుడు . ఆయన్నంతగా అందరూ ఎందుకు పొగుడు తున్నారో అర్ధమైన కనకయ్యశెట్టి తన తప్పు తెల్సుకుని తన ఈర్ష్య తననే వెక్కిరించగా
'అహంకారపు తెర 'తొలగి సిగ్గుతో తల వంచు కున్నాడు.
*******************************************************************************
*******************************************************************************