Friday, 29 January 2016

‘ ఏ ఆవ్ రా బా వా? ! ‘ --కొత్తపల్లి పిల్లలపత్రికలో ప్రచురితం


                             ఏ ఆవ్ రా బా వా? !      

 

           సోంపేటలో ఉండే నాగయ్య కొడుకు  సోంబాబు మహా సోంబేరి. ఆటలంటే మహా ఇష్టం,చదువంటే మాత్రం గిట్టదు, భయం! , బడంటే బందిఖానా లా భావిస్తాడు. తాను తెలివి తక్కువవాడిననీ తనకు చదువు అబ్బదనీ వాడి భావన.అందుకే వాడు బళ్ళో పెద్ద పంతులు కంట పడకుండా తప్పించుకు తిరుగు తుంటాడు. అమ్మ పెట్టిన పెరుగన్నం కడుపునిండా తినిసంచీభుజానికితగిలించుకునిచెట్లమ్మట పుట్ట లెమ్మ టా తిరిగి బడి వదిలేవేళకుఇల్లుచేరేవాడు.అందుకేఅమ్మఅంజమ్మకూ,నాయననాగయ్యకూ వాడిమోసం తెలీనేలేదు. ఐతే రాంబాబుకు వంటరిగా తిరగటం, ఆడుకోడం కష్టంగా ఉంది.తోచటంలేదు , తోడు కోసం వాడు వెతుక్కుంటుండగా , ఒక సోమవారం నాడు చెఱువుగట్టున కూర్చుని  నీళ్ళలోకి రాళ్ళు విసురు తున్న రాంబాబు ను చూసి ఎగిరి గంతేశాడు.

      " ఒరే రాంబాబూ బావా ! ఈడున్నవేరా ! బళ్ళోకెళ్ళలే!? " అని అడిగాడు.

" ఓరి! సోంబాబు బావా!  రారోయ్! బళ్ళోచదువు కట్టం గుందిరా ! రాయాల, సదవాల , లెక్కలెయ్యాల.. నావల్లకా దోరే ! సదూకునేంత తెలివినాకు లేదురా! అందుకే ఈ చెఱువు గట్టు కొచ్చినా ! ఇద్దరం కల్సి ఆడుకుందాం రారోరే ! " అంటూ లేచి దగ్గరి కొచ్చాడు. ఇద్దరూ కల్సి ఆడిపాడి, పళ్ళతోట వద్ద కెళ్ళి కంచ లోంచీదూరి లోని కెళ్ళారు .జామపళ్ళు దొంగ తనంగా కోసుకు తిన్నారు,ఇంతలోకాపలాకుక్కఅరవటం తో కాపలా కామయ్య ," ఎవడొరే చెట్లకాడా ! " అంటూ  కర్రతీసుకుని వస్తుండటంచూసిపరుగులంకించు కున్నారు ఇద్దరూనూ.

ఎదురుగా బడి నుండీ ఇంటి కెళుతున్న పిల్లలు కనిపించారు .

   " ఒరే రాంబాబూ! సోంబాబూ ! మీరిద్దరూ బళ్ళోకిరాలేదని పెద్ద పంతులు అడుగుతున్నార్రా ! ఈడేం

చేస్తున్నార్రా ! "  అంటూ అటకాయించగానే , " ఓ అదా! మా నల్లావు తప్పిపోయిందిరా ! మా యమ్మ ఎతుక్కురమ్మంటే రాంబాబును తోడుతీసుకెళ్ళానురా ! " అంటూ తటక్కినఅబధ్ధంచెప్పేశాడుసోంబాబు.

" ఓరినీ ! మీయమ్మ నల్లావును తోలు కెళుతుంటే చూసినంరా ! ఇప్పుడే ! " అని సావాసగాళ్ళు చెప్ప గానే , " ఓరి రాంబాబూ ఇన్నావు రొరే ! కర్రావు కనిపించిందిట్రా ! ఇహ రాపోదారి " అంటూ వారిని తప్పించుకుని పరుగెత్తా రిద్దరూనూ.

 ఆమరునాటినుంచీ రాం బాబు సోంబాబుకు తోడవగా ఇద్దరూ వాగులూ వంకలూ తిరగసాగారు. ఓరోజున నాగయ్యకు పెద్దపంతులు కనిపించి " ఏం నాగయ్యా! నీ కొడుకు బళ్ళోకొచ్చి ఎన్నాళ్ళైందో కనీసం నీకైనా తెల్సా! నీలాగే నీకొడుకునూకుఎన్నివంకర్లో తెలీకుండా చేస్తావా! " అని అడగ్గానే కొడుకు గుట్టు రట్టవ్వగా  , మరునాటి నుంచీ" ఓరొరే! సోముగా ! నీవెటూ బడికి ఎగనామం పెడుతు న్నావ్ ! ఈ పశూ లనైనా  మేపుకురా  రేపటాల్నుంచీ ! " అని తన నాలుగావులనీ, రెండు గేదెలనీ  ,

అడవిలో మేపే పని అప్పగించాడు. రాంబాబు అయ్యకూడా " ఓరి! రాంబాబూ ! నీవూ మన గేదెలనీ ఆవు లనీ మేపుకురా పో ! ఇయ్యాల్నుంచీ పశుల్నిమేపుకొస్తేనే బువ్వ ! " అని గద్దించాడు. సోంబాబుకూ, రాంబాబుకూ ' రొట్టెవిరిగినేతిలోపడినట్లయింది.ఇద్దరూహాయిగాపశువుల్నితోలుకుంటూ గాలికి తిరగ సాగారు. ఒకరోజున ఉదయాన్నే రాంబాబు చేలగట్లంట పరుగెడుతూ ఎదురుగా వస్తున్న సోంబాబుతో" ఒరే సోంబాబూ! మీ ఆవీనిందిరా  !" అని ఉరుకులూ పరుగులూ పెడుతూ వచ్చిచెప్పాడు.  సోంబాబు అమితా నందంగాతల్లి జున్నుపాలతో కమ్మటిజున్నుకాస్తూందనే సంతోషంతో " ఏ ఆవ్ రా బా వా! అని కేకేశాడు . అప్పుడే అటునుండీ బళ్ళోకెళుతున్న పెద్ద పంతులు " ఓరి భడవల్లారా! మీ కెక్కడిదిరా ఇంత ఙ్ఞానం ! చదువేరాని మీరు ఐదు భాషలు మాట్లాడార్రా ! " అన్నారు .

             సోంబాబూ , రాంబాబు ముఖముఖాలు  చూసుకుంటూ " మేం ఐదు బాసలు మాట్టాడ్డవేంటి  పెద్ద సారూ ! "  అన్నారు . " ఒరే పిల్లలూ ! మీకు తెలుగు భాష అంటేనే తెలీదు కదా ! ఐనా మీరుఐదు భాష లు మాట్లాడారు, మీరుబళ్ళోకొచ్చి చదువుకుంటే ఇంకా ఎన్ని భాషలు మాట్లాడి పెద్ద పండితు లై పోతారో గదా1 ఇలా పశువులనుకాస్తూ ఎండావానలకు బతుకుతార్రా ఎప్పటికీనీ ! ఏ- అంటే బెంగాలి, ఆవ్-హింది, రా - తెలుగు ,బా- కన్నడ ,వా -తమిళ్ ;ఈ ఐదు భాషల్లోనూ 'ఏ ఆవ్ రా బా వా  ' అంటే 'రమ్మని ' అర్ధం ! చూశారా మీకు తెలీకుండానే ఇన్నిభాషలు మాట్లాడితే బళ్ళో చదువు కుంటే మీకు ఇంకా తెలివి పెరగదూ ! మీరింత తెలివిగల వారని మీకే తెలీదు ! బళ్ళోకి రండిరా ! " అనగానే తమ తెలివిపై తమకే నమ్మకం కుదిరి మరునాటి నుండీ బడికెళ్ళి బాగాచదువుకునిమంచిపండితులైనారు ! చూశారా !  పిల్లలనే కాదుఎవరినైనా ప్రోత్సహిస్తేఎంతటిపనులనైనాసులువుగాచేయించవచ్చు,భయపెట్టి, బలవంతంగా ఏమీ  చేయించలేము !   .

[చదువంటే భయం వల్లా,  తమకు చదువురాదనీ తాము తెలివితక్కువ వారమనే తక్కువ భావనతో చాలా మంది విద్యాగంధం లేకుండా ఉండిపోతున్నారు. అలాంటి వారిని ప్రోత్సహించి విద్యావంతులను చేయడం మనందరిబాధ్యత,ముఖ్యంగాఉపాధ్యాయులుఅలాంటిపిల్లలనుఎలాగోలాబడిబాటపట్టించాలి.  అలాంటి ఒక పెద్ద పంతులు గురించిన కధే ఇది.  ]

&&&&&&&&&&&&&&&&&&

No comments:

Post a Comment