Thursday, 23 July 2015

దృష్టి -సృష్టి



దృష్టి -సృష్టి

దృష్టి -సృష్టి  రచనఆదూరి.హైమవతి.

 

ఒక రోజున సాయం సమయంలో తులసీదాసు తాను వ్రాసిన ‘ తులసీ రామాయణం’ చదివి అర్ధం చెప్తుండగా , ఆయన చుట్టూ జనం కూర్చుని ఆరామాయణగాధను ఆలకిస్తున్నారు. ఆసమయంలో తులసీదాసులంకా పట్టణం లోని అశోక వనంలో సీతమ్మ తల్లి విచారంగా అశోకవృక్షం క్రింద కూర్చుని దూరంగాఉన్నతటాకంలోని తెల్ల కలువలను చూస్తూ ., శ్రీరాముని స్మరించుకుంటూ , తన అవస్తకు చింతిస్తూ ఉందిఅని పరవశంతో చెప్తుండగా పెద్దగాలి రివ్వున వీయసాగిందిఅక్కడకూర్చున్న జనమంతా అది  ఏదో భీకర గాలీ వానా వచ్చేసూచనేమో అని భయపడసాగారు. ఇంతలో వాయుపుత్ర హనుమంతుడు అక్కడ దిగాడు.

అయ్యా! తులసీదాసు గారూ!వందనం !మీ రామాయణ ప్రవచనం మధురంగాఉంది,నేను ఆకాశ మార్గాన వెళ్తూ వింటున్నాను,ఐతే తమరు ఒక్క చిన్న పొరపాటు చెప్తున్నారు,అందుకే నేను దిగివచ్చానుఆనాడు లంకా నగరంలోని అశోకవనంలో ఉన్నవి తెల్ల కలువలు కావుఎఱ్ఱ కలువలు ! తమరు అది సవరించి ప్రవచించండి ! తమ గ్రంధంలోనూ సవరించండి !” అని వినయంగా కోరాడు.

అక్కడి శ్రోతలంతా హనుమంతుని దర్శన భాగ్యం కలిగినందుకు మహదానంద పడసాగారు. తులసీదాసురామ భక్త హనుమాన్  కు జయమగుగాక! హనుమత్ ప్రభూనేను నిరంతరం రామ నామం జపిస్తూ నాదైవం నా మనస్సులో స్పురింపజేసే ఆలోచనలనే రామాయణకావ్యంలో రచించాను. నాదేవుడు నాచే ఏతప్పూరాయించడు !” అని స్థిర చిత్తంతో , చిరునవ్వుతో చెప్పాడు .

దానికి హనుమఅయ్యా! తూలసీదాసుగారూ ! తమరు ఊహించి వ్రాస్తున్నారు,నేను స్వయంగా లంకా నగరాన్నీఅశోక వనాన్నీ , తటాకంలోని  కలువలను దర్శించినవాడనునేను ప్రత్యక్ష సాక్షిని . కనుక మీరు మరోలా భావించక మీ గ్రంధాన్ని సవరించాల్సిఉందిఅని చెప్పాడు గంభీరకంఠంతో.

తులసీదాసు చిరునవ్వుతోహనుమా న్ జీ! స్వామీ ! నా ప్రభువు నాచే ఎన్నడూఒక్కతప్పైనా వ్రాయించడుఆనమ్మకం నాకుంది,అందువల్ల ఆచెఱువులోవి తెల్లకలువలేకానీఎఱ్ఱకలువలు కానేకావు“  అని స్థిరంగా అన్నాడు .

ఇద్దరిమధ్యా వాగ్వివాదం పెరగసాగింది. అప్పుడు హనుమ వాదన మనకెందుకు ? మనం వెళ్ళి సీతారాములను దర్శించి ,  సమయంలో  కలువలను చూసిన  తల్లినీ , అన్నివిషయాలూ ఆమె ద్వారా అలకించిన ప్రభువునూ అడిగి వాస్తవం తేల్చు కుందాం రండిఅని కోరగా తులసీదాసు అంగీకరించాడు.ఇద్దరూబయల్దేరి వెళ్ళిశ్రీరాముని,సీతమ్మ తల్లిని కల్సి నమస్కరించి నిలిచారు.

వారు ఏమీచెప్పకుండానే శ్రీరాములవారుహనుమా! తులసీదాసు వ్రాసినది సత్యం !లంకానగరం లోని అశోకవనంలోని సరస్సులో ఉన్నవి తెల్లకలువలే! ” అన్నారు చిరునవ్వుతో.

ప్రభూ ! నేను స్వయంగా చూశానుకదా! నాకళ్ళే నన్ను మోసంచేస్తాయా! అమ్మా!సీతమ్మతల్లీతమరు చెప్పండి కలువల రంగు ఎరుపా! తెలుపా!” అన్నాడు హనుమ చేతులు జోడించి.సీతమ్మవారు చిరునవ్వుతో శ్రీరాముని వంక చూసింది.’తమరేచెప్పమన్నట్లుగా .

శ్రీరాములవారుహనుమా! నీవు రావణుని పట్ల క్రోధంతో ఉండటాన , నీకళ్ళు సైతం ఎఱ్ఱబారి చూసినవన్నీ నీకు ఎఱ్ఱగానే కనిపించాయినిజానికి అవన్నీ తెల్లనివే! మన దృష్టి ఎట్టిదో సృష్టీ అట్టిదిగా ఉంటున్నదిఅని చెప్పారు.హనుమ తన సందేహం తీరటంతో  , తులసీదాసుతో కలసితిరుగు ప్రయాణ మయ్యాడు.

చూశారామన దృష్టిని బట్టే మన కళ్ళు లోకాన్నిచూస్తాయి కనుక మనం నిరంతరం మన మనస్సునూ మంచిగా ఉంచుకుని చూస్తే లోకమంతా మంచిగానే కనిపిస్తుంటుంది.అలా చేయను ప్రయత్నిద్దామా!

2 comments:

  1. more updates please click the link below http://spiceandhra.com

    ReplyDelete
  2. Submit Your Blog
    http://blogvedika.blogspot.in/

    ReplyDelete