Thursday 23 July 2015

ఒక్కడేగా !?-


ఒక్కడేగా !?-ఆదూరి.హైమవతి.[కథ

ఒక్కడేగా !?
ఒక్కడేగా !?
కిట్టిగాడు నిద్ర లేచేసరికి వాడిబామ్మతాత కనిపించక పోయే సరికి వాడికి తిక్కరేగింది. “ తాతా ! బామ్మా ! “అని పెద్దగా అరుస్తూ ఇల్లంతా తిరిగాడు. వంటగదిలో హడావిడిగా ఉన్నతల్లి వద్దకెళ్ళిఅమ్మా! బామ్మా,తాతా ఏరే?” అని అడిగాడు
బయట తోటలో ఉన్నారేమో చూడుఅందివాడి అమ్మ .వాడుగబగబా తోటలో కెళ్ళి చూశాడు,అక్కడి సిమెంట్ బెంచి ఖాళీగా ఉంది. తిరిగి ఇంట్లోకి వచ్చి ఈమారునాన్నా! బామ్మా తాతా ఏరీ?” అని అడిగాడుగడ్డం గీక్కుంటున్న వాళ్ళనాన్న తలతిప్పకుండానేపెరట్లో పూలుకోస్తున్నారేమో చూడరాదూ !” అన్నాడు. కిట్టిగాడు పెరట్లోకెళ్ళి అక్కడ గిన్నెలుతోముతున్న గంగమ్మను ,
మాబామ్మా తాతా ఇక్కడగాని ఉన్నారా?” అని అడిగాడు .” లేరుబాబూ ! బయటికి గానీ వెళ్ళారేమో! ” అంది గంగమ్మ .
వాడితిక్క ఎక్కువై వీధిగుమ్మముందు అరచేతుల్లోముఖం పెట్టుకుని కూర్చున్నాడు, బామ్మతాతలకోసం ఎదురుచూస్తూ. కాస్త సేపటికి చేతులో పూజబుట్టతో వచ్చారు ఇద్దరూ.
వారు కినిపించగానే ఛెంగున గెంతి దగ్గరకెళ్ళిఎక్కడకెళ్ళారు పొద్దుటే ?” ఆశ్చర్యంగా అడిగాడుకిట్టి.
ఈరోజుగురుపూర్ణమికదరా ! అందుకని ఆలయానికి వెళ్ళివస్తున్నాంఅందిబామ్మ
అలాగేంఅంటూ తాతచెయ్యిపట్టుకుని లోపలికి నడిచాడు కిట్టు
ఇంకో మారు మళ్ళీ బామ్మతాత లేవగామే కనిపించకపోడంతో ,’ఈరోజూ గుడికే వెళ్ళి ఉంటారనిగుమ్మంలోనే కాపేశాడుకిట్టు. ” ఈరోజు ఏగుడికెళ్ళారు బామ్మా!” అని అడిగాడు వారురాగానే
ఈరోజు వరలక్ష్మీ వ్రతంకదా ! అందుకని లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళాంఅందిబామ్మ .
మరో మారు బయటికెళ్ళివస్తున్న బామ్మతాతలతో రోజు ఆలయానికీ?” అన్నాడు.
రోజున వినాయచవితిరా కిట్టూ ! అందుకని వినాయకుని గుడికిఅందిబామ్మ.
మళ్ళీ ఇంకో మారు ఆలయం నుండీవస్తున్న వారిని కిట్టిగాడుఈరోజే ఆలయానికీ?” అన్నాడు , బామ్మ నవ్వుతూదేవీనవరాత్రులురా కిట్టూ! అందుకే దుర్గాదేవి కోవెలకుఅంది కుంకుమ వాడినుదుటపెడుతూ .
బామ్మా! నాకో అనుమానం . మన దేవునిగదిలోనే దేవుడున్నడని నీవు పూజ చేస్తూ రోజుకోగుడి కి ఎందుకెళుతున్నావు? నీవునాకు రాత్రిపూట నిద్రపోయేప్పుడు రోజూకధలుచెప్తున్నావుగదా! ఓరోజునీవుచెప్పినకధ ……
ఒక ఊర్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. అతడిని ఆఫీస్ లోక్రిందివారుసార్ సార్అనిపిలుస్తారు,అతడిపై అధికారులుమిస్టర్ ఎస్ పీ! ” అంటారు. ప్రజలుఎస్ పీ సార్అని, స్నేహితులుఏమోయ్ ! రావ్అనీ , వాళ్ళ అమ్మనాన్నఏరా!బాబూఅనీ , భార్య 
ఏమండీ! ” అనీ , అన్నతమ్ములు , అక్కచెల్లెళ్ళూఅన్నా!” లేకఒరే తమ్ముడూఅనీ , పిల్లలునాన్నగారూఅనీ పిలుస్తారు.ఆఫీస్ కు యూనిఫాం వేసుకుంటాడు, ఇంట్లో పంచెకట్టుకుంటాడు, షికారుకు వేరేడ్రెస్ , నిద్రపోయేప్పుడు నైట్ డ్రెస్ , ప్రయాణాలకు వేరేడ్రెస్ ,కానీ ఏడ్రెస్ వేసుకున్నా , ఎవరెలా పిలిచినా అతడు ఒకే మనిషి. డ్రేస్ లూ , పిలిచే పధ్ధతులూ మారుతున్నాయికానీ మనిషి మారడంలేదు. భగవంతుడు ఒక్కడే రూపనామాలు మాత్రం వేరు , అందుకనే మనం దేవుని ఒకే రూపాన్ని ,ఒకే పేరున పూజిస్తే చాలు —‘ అనిచెప్పావుగదా ! మరి రోజుకోగుడికివెళుతున్నా రెందుకూ?” అని ఐదేళ్ళ కిట్టూగాడు అడిగినప్రశ్నకు బామ్మ తాత విస్తుపోయారు

No comments:

Post a Comment