గురుపూర్ణిమ
గురుర్ బ్రహ్మ గురుర్విష్ణుః - గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మః - తస్మైశ్రీ గురవేన్నమః .
గురువు త్రిమూర్తి స్వరూపుడు. బ్రహ్మ వలె ఙ్ఞానాన్నిమనలో పుట్టించి , విష్ణువువలె ఙ్ఞానాన్ని రక్షించి పెంచి ,
శివునివలె అఙ్ఞానాన్నితుంచిమనకులోకంలోఎలాజీవించాలో ,ఏదిమంచిమార్గమో , ఏవి మానవతావిలువలో , సద్గుణ సంపన్నత
ఎలాపొందాలో నేర్పుతాడు. మనస్సునుండీ ఆలోచనలు
ఆవిర్భవిస్తాయి ,సర్వవ్యాపకమైనమనస్సేవిష్ణుస్వరూపం.విష్ణుమూర్తినాభినుండీఉద్భవించినబ్రహ్మ
వలె,వాఃక్కు[తలంపు]మనస్సునుండీఆవిర్భవిస్తున్నది.బ్రహ్మయేవాఃక్కు.ఈశ్వరుడేహృదయము.ఇలా
మన వాఃక్కు, మనస్సు, హృదయము త్రిమూర్తాత్మకమై ఉన్నది. త్రిమూర్తులుమనలోని త్రిగుణాలకూ ప్రతీకలు. గురువుమనలోమంచిని
సృష్టింపజేసి,లోకంలోజీవింపగలవిధానాన్నినేర్పి,అమాయకత్వాన్నీ, మాయామోహాన్నీ
తెంచివేసే శక్తిసంపన్నుడు’.గు ‘కారో అంధకారస్య ,’రు ‘కారోతన్నిరోధకః. గురువు అఙ్ఞానాంధకారాన్ని రూపుమాపే వాడు. గుకారో గుణవర్జితః., రు కారో రూపవర్జితః.
గుణాతీతుడు, రూపరహితుడు గురువు ,అట్టిగురువు భగవత్సమానుడు.
ఆషాఢ శుధ్ధపూర్ణిమ ను ' గురుపూర్ణిమ లేక వ్యాసపూర్ణిమ అంటాం.ఈరోజున ఆధ్యాత్మిక ఙ్ఞానాన్ని కోరేవారంతా తమ ఆధ్యాత్మిక గురువులను దర్శించి, లేదా స్మరించి ,ఆరాధించి తమకృతఙ్ఞతను తెలుపుకుంటారు. భుక్తి
విద్యలుకాక ముక్తి విద్యలను బోధించే గురువుదర్శనానికి , స్మరణానికీ ఈ రోజు విశిష్ట ప్రాముఖ్యతను
గాంచినది.
' చంద్రమా మనసోజాతః సూర్య చక్షో అజాయతః -అనేది
వేదవాఃక్కు.చంద్రుడు మనస్సునూ,సూర్యుడు బుధ్ధినీప్రకాసింపజేస్తారు.మానవులమైనమనమనస్సుల్లోఅష్టమదాలూ,అరిషడ్వర్గాలూ,అహంకారమూ చిత్తమూ అనేపదహారుమలినాలనూ
పూర్ణిమనాడు గురుస్మరణతో ,గురువు ఆశీర్వాదంతో
, గురువు అనుగ్రహంతో తొలగించుకోడం కోసం
ప్రయత్నించడమే గురుపూర్ణిమ ప్రత్యేకత.
గురువు నెందుకు స్మరించాలి ? లేదా దర్శించాలి?
మన కృతఙ్ఞతలు ఎందుకు తెలపాలీ? అనే సందేహాలు సహజoగా మన మనస్సులో ఏర్పడవచ్చు.
గురువు ఒక శిల్పి వంటి వాడు.బండరాళ్లతో అందమైన శిల్పాలు చెక్కి వాటికి ప్రాముఖ్యతను
కలిగించగల ప్రఙ్ఞాశాలి గురువు. మంచి గురువు చేతిలోమలచబడేవారుఉత్తమమానవులై ,సంస్కారవంతులై ,సమాజానికిఉపయోగపడతారు.అలా
గురువు సమాజ సేవచేస్తున్నాడు.కంసాలి బంగారుముద్దను
కాల్చి సాగదీసి , సుత్తితోకొట్టి మంచి నగగా తయారుచేసి ధరించేరూపాన్నీఅందాన్నిఇచ్చినట్లు
గురువు శిష్యులనుసానబట్టిసద్గుణాలునేర్పి పరిపూర్ణమానవునిగా మార్చి సమాజానికి అలంకారంగా
అందిస్తున్నాడు.తోటమాలి చక్కగా నేలను పదునుచేసిఎరువువేసిమొక్కలునాటిపెంచిచక్కగాపోషించిఫలించేలాచేసిఅందరికీఉపయుక్తకరమైన
ఫలాలనూపుష్పాలనూ అందించినట్లు గురువుశిష్యులనుసమాజానికిఅలంకారాలుగా
అందిస్తాడు. గురువుమార్గదర్శకుడు ,తనశిష్యులుఏదిఎలాచేయాలో,ఎప్పుడుఎంతవరకుచేయాలో, ఏదిమంచో ఏది చెడో ,ఏదిఆచరించాలో, ఏదికూడదో చూసిస్తుంటాడు. గురుపూర్ణిమ హిందువులకు పరమ పవిత్రమైన రోజు.తమతమ గురువులను
అత్యంత భక్తి భావంతో పూజించేరోజు,
ఉపవాసంచేసి,
గురుపూజ గావించే రోజు. విద్యబోధించే గురువులను గౌరవించేరోజు.
గురువులుఎనిమిదిరకాలు.బోధగురువులు,వేదగురువులు,నిషిధ్ధగురువులు,కామ్యగురువులు,
వాచిక గురువులు, సూచిక గురువులు, కారణ గురువులు,విహితగురువులు.వీరందరిలోకీ
జీవాత్మ పరమాత్మలో లీనమయ్యే విధానాన్ని , దానికి అవసరమైన మార్గాన్నీ బోధించే' కారణ గురువు
' ను ఆశ్రయించడం ఉత్తమం.
ప్రాచీన ఋషులు భగవానుని గురువుగా విశ్వసించి
ఇలా స్మరించేవారు.
బ్రహ్మానందం పరమశుఖదం కేవలం ఙ్ఞానమూర్తిం
ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం
ఏకం నిత్యం విమలం అచలం సర్వధీసాక్షి భూతం
భావతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి.
ఇహఈరోజునువ్యాసపూర్ణిమఅనికూడాఅంటాం .వ్యాసమహర్షిమానవజాతికిఅఙ్ఞానాంధకారాన్నిపార
ద్రోలి దివ్యమైన దైవతత్వాన్ని రుచిచూసి అనుభవించేందుకై శ్రుతి, స్మృతి పురాణాలను శాస్ర్త్రాలను అందించిన గురువు.వ్యాసమహర్షి వశిష్టుని మనుమడు,
పరాశరమహర్షి కుమారుడు ,శుకమహర్షి తండ్రి. భగవత్తత్వాన్ని మానవజాతికి అందించిన దైవాంశ సంభూతుడు,
వేద విభజనకావించి నందున
వేదవ్యాసుడని ప్రసిధ్ధిగాంచినవాడు.అందుకే ఈమహర్షిని ఇలాకీర్తిస్తారు.
వ్యాసం వసిష్టం నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం
పరాశరాత్మజంవందే శుకతాతం తపోనిధిం .
అంటూ వ్యాస భగవానునికి ఈ రోజున ప్రణామాలు అర్పిద్దాం .
[ వార్తలో గురుపూర్ణిమ సందర్భంగా ప్రచురితం ]
వార్తలో ప్రచురించబడ్డ మీ వ్యాసం శిరోధార్యం.మనిషి ఎదుగుదలలో గురువుది అత్యంత ప్రతిభావంతమైన పాత్ర.గురువులందించిన అక్షరబిక్ష మనిషి మనుగడకు కరదీపిక!
ReplyDeleteఉమగారూ! మీకు కృతఙ్ఞతలు.ఓపిగ్గా బ్లాగ్లో ప్రవేశించి ప్రోత్సహకర వ్యాఖ్యలు అందించడం ముదావహం.
ReplyDeleteఆదూరి.హైమవతి.