Monday, 30 July 2012

దాసోహం కోసలేంద్రస్య.

                                       దాసోహం కోసలేంద్రస్య.
రామాయణాంలో హనుమంతుని స్వామిభక్తి వినయ విధేయతలు అమోఘమైనవి.జన్మరీత్యా జాతిరీత్యా  హనుమంతుడుకోతిజాతికి చెందినవాడు.ఆయన శక్తిసామర్ధ్యాలు చాలాగొప్పవి.ఆయన శాంతమూర్తి, గుణవంతుడు, బలవంతుడు, పరమభక్తుడు.రామకార్యానికి కంకణం కట్టుకున్నాడు. రామానుగ్రహానికి పాత్రుడయ్యాడు.యుధ్ధంలో లక్ష్మణుడు మూర్చిల్లినపుడు సంజీవనీ పర్వతాన్ని ఒక్కచేత్తో ఎత్తుకువచ్చినవాడు,అశోకవనంలో సీతమ్మను వెతుకుతూ ఉన్నసమయంలో అనేక కొంటెచేష్టలు చేస్తున్నపుడు రావణూనిసైనికులు " వింతరూపంలోఉన్న నీవెవరు ?" అని అడిగినపుడు ఆయన "దాసోహం కోసలేంద్రస్య " అని చెప్పాడు.నేను ఫలానావారి బిడ్డనుఫలానావారి మంత్రిని అనో ఇంతబలవంతుడిని సముద్రం దాటినవాడిని అనో విద్యావంతుడిననోచెప్పలేదు.  నేను శ్రీరామచంద్రునిదాసుడిని" అనిమాత్రమేచెప్పాడు. ఆయన సముద్రం దాటనుగానీ, సీతమ్మజాడతెల్సుకోడంలోగానీ, ఇంకాగొప్ప కార్యాలు సాధించనుగానీ తనశక్తిసామర్ధ్యాలు కారణంకాదని ఆయనతెల్సుకుని రాముని ఆశీర్వాదం, ఆయన నామ మహిమే కారణమని నమ్మినవాడు.  అన్నింటికీ ఆయన రామభక్తే ఆధారం.   . 
బలవంతు లైన కపివీరులెంతోమాంది ఉన్నా తనకు సీతజాడవెతికేపని ఇచ్చినందుకు ఆయనెంతో సంతోషించాడేకానీ " నేను కోతిని ఇంతపెద్ద స్దముద్రాన్ని దాటాగలనా1సీతను వెతక గలనా! అంతటిశక్తినాకుందా?"అని ఆలోచించలేదు.ఆపనికి తననుఎన్నుకున్నందుకు అహంకరించలేదు.రామాఙ్ఞను శిరసావహించాడు. ఈకార్యసాధనచేయగలశక్తి రాముడే నాకు ప్రసాదించి ఈకార్యానికి ఎన్నుకున్నాడని విశ్వసించి ,ధృఢ విశ్వాసంతో సాధించగలిగాడు.వానరులంతా కల్సికొండలెత్తిసేతువునిర్మించారు రామనామమహిమతో.వానరులు కొండలుమోస్తే  ,నరులమైన మనం నేడు కుండలుమోయలేని స్థితిలో ఉన్నాం.ఎన్నివిద్యలుపదవులూ ఉన్నా భగవద్విశ్వాసం, భగవన్నామంపైనమ్మకం మాత్రం లేకపోడంచేత కార్యసాధనల్లో వెనుకబడిపోతున్నాం.భగవంతునికి దాసులమై కార్యాలు సాధిద్దాం.  

వార్త -చెలి- ఆధ్యాత్మికంలో - సోమవారం 30జులై ప్రచురితం

No comments:

Post a Comment