Sunday, 22 July 2012

సాహసబాలిక.

                                      సాహసబాలిక.

     ఆరోజు గాంధిజీ   ఆపాఠశాల ఆవరణలో జరిగే సభలో మాట్లాడను వచ్చారు. మహాత్ముని ఉపన్యాసం విన్న వారంతా తన్మయులైపోయారు. ఒక పదేళ్ళ బాలిక ఒక సంచీ తీసుకుని అందరివద్దా ' గాంధీ  గారు చేసే స్వాతత్య్ర  ఉద్యమానికై మీకు తోచిన ది ఇవ్వండి " అంటూ ప్రేక్షకు లందరి వద్దకూ వెళ్ళి , వారు స్వఛ్ఛందంగా   ఇచ్చిన సొమ్మూ , నగలూ అన్నీ పోగుచేసి తెచ్చి , గాంధీ గారికి ఇచ్చింది, 
  అది చూసి ఆయన" అమ్మాయీ! మరి నీవేమి ఇచ్చావు? " అని అడగ్గానే తన చేతికున్న బంగారు గాజులు దూసి ఆసంచీలో వేసింది. ఎంత ధైర్యం! ఇంట్లో వారు గాంధీజీకి విరాళంగా ఇస్తే ఏమీ అనరనే నమకం.  అంత చిన్న వయస్సులో ఎంత దేశభక్తి!   
       

        ఆరోజు ఖాదీ ప్రదర్శన జరుగుతోంది కాకినాడలో, ఒక పన్నెండేళ్ళ అమ్మాయి మైన్ గేటు వద్ద నిల్చుని పాస్ లు ఉన్నవారినే లోనికి వదిలే సేవ చేస్తున్నది. అందరూ వరుసల్లో వచ్చి తమ ఎంట్రెన్స్ పాస్లు చూపి లోనికి వెళుతున్నారు.ఇంతలో నెహ్రూ వచ్చాడు, ఆయన్నూ ఆ అమ్మాయి పాస్ అడిగింది, ఆయన తనకు పాస్ లేదన్నారు. 
    పాస్ ఉంటే నే లోనికి పంపమని తననకు పెద్దలు ఆదేశించారనీ అందువల్ల పాస్ తెచ్చుకుంటే లోనికి వదులుతాననీ ఆమె చెప్పడంతో , నెహ్రూ వెంట ఉన్న వారు వెళ్ళి పాస్ తెచ్చాకే ఆమె  నెహ్రూను లోనికి అనుమతించింది. నెహ్రూ ఆమె క్రమశిక్షణకూ , నిబధ్ధతకూ ముచ్చటే సి అమె గురించీ తెల్సుకున్నారు, ఆమే దుర్గాబాయ్ , ఆమెపేరు దుర్గ ! దుర్గ వలె తాను చేపట్టిన, తనకు అప్పగించిన పనిని ఖచ్చితంగా చేసే   విజయం సాధించే స్వభావాన్ని అంత చిన్నతనం నుండీ తండ్రి పెంపకంలో , తల్లి సహవాసంలో నేర్చుకుని దేశానికే వన్నెతెచ్చే వీర నారీ మణీగా వెలుగొందింది.


                   జులై 15 దుర్గాబాయమ్మ జయంతి సందర్భంగా     

No comments:

Post a Comment