ప్రపంచ వికలాంగుల దినోత్సవం -డిసెంబర్ 03
ప్రతి సంవత్సరము డిసెంబర్ 03 న ప్రపంచ వికలాంగుల దినోత్సవము జరుపుకుంటున్నాం .ఈరోజు వికలాంగుల గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాం.అసలు ‘వికలాంగులంటే ఎవరు?!’ అన్నీఉండీ ఇతరులకోసం ఏమీ చేయను ఇష్టపడనివారు మానశిక వికలాంగులు [మెంటల్లీ డిసేబుల్డ్], కాళ్ళూ చేతులూ ఉండీ ఇతరులకోసం ఏసేవాచేయనివారు ఫిజికల్లీ హేండీకాప్డ్ , కళ్ళుండీ ఇతరుల మాంచిచూడలేనివారూ,మనతోటివారికి అవసరమైన సహాయమేంటో చూసలేనివారు నిజమైన బ్లైండ్ పీపుల్.ఇతరుల ఉన్నతస్థితికి బాధపడిఏడ్చేవారు, మెంటల్లీ రిటార్డెడ్ , అంతే గానీ తల్లి గర్భంలోఉండగా ఏవోకారణాలరీత్యా పుట్టుకతోనే అంగవికలురైనవారు ,పుట్టినతర్వాత ఏప్రమా దానికో, దురదృష్టవశాత్తూ ఏఅనారోగ్యాంబారినోపడిఅవయవాలుకోల్పోయినవారునూ,నిజానికి వికలాంగులు .అందుకని ముందుఇలాంటి అంగవైకల్యాన్ని మనంతటమనం చక్కబరచుకుని, మన అంగవైకల్యానికి ముందు వైద్యం చేయించుకుని ఆతర్వాత ,ఆ అంగవికలురకు చేయవలసున సేవ, సహాయం వారిపట్ల మన బాధ్యతగురించీఆలోచిద్దాం.
మనం 'వికలాంగులు 'అనే పదం వాడడం లేదు. ఆంగ్లంలో హేండీ క్యాప్డ్ లేదా డిజేబుల్ద్, అంటుంటాం.
వ్యాధులలోకొన్ని మానసికంగాఏర్పడతాయి,శారీరక అనారోగ్యం నుండీకూడా మానసికవ్యాధులు ఏర్పడ తాయి. మానవులకు నిత్యం సాంఘీకజీవితంలో కలిగే సంఘర్షణలవలన ,ప్రకృతి వైపరీత్యాలైన యుధ్ధము, క్షామము ,భూకమోము, సునామీ , రోడ్డుప్రమాదాలవంటి విపత్కర పరిస్థితులవల్ల నాడీ సంబంధ వ్యాధులు మనోవైకల్యం ఎర్పడి మనోరుగ్మతలూ, శారీరక వైకల్యం సైతం కలుగవచ్చు. దీనికి మానవతప్పిదాలు ఒక్కోమారు కారణంకావచ్చు, విధివైపరీత్యాలూ కావచ్చు, వాతావరణ పరిస్థితులూ కావచ్చు, ఏదిఏమైనా ఫలితం కొందరు మానవులు వికలాంగులవడం సంభవిస్తుంటుంది. వీటిలో కొన్నింటి ని పూర్తిగా సరిచేయవచ్చు, కొన్నింటిని పాక్షికంగా సరిచేయవచ్చు, మరికొన్నింటిని సరి చేయటం ఏవిధమైన వైద్య సహాయం వల్లా సరిచేయలేకపోవచ్చు, ఫలితం వాటికి బలైన మానవులు జీవితాంతం వికలాంగులుగానే జీవించవలసి రావడం దురదృష్టం.
వికలాంగులైనంతమాత్రాన పనికిరాని వామని కలత చెందరాదు. వికలాంగులప్రతిభను అటు కుటుంబసభ్యులు ఇటుసమాజంకూడా గుర్తించి ప్రోత్సహిస్తే వారు చేయలేని పనంటూ ఉండదు. ప్రభుత్వం సైతం అన్ని వ్ర్త్తి విద్యల్లోనూ, కళాశాలల్లోను, ఉద్యోగాల్లోనూ కోటాఏర్పరచి అవకాసాలను అందిస్తూనే ఉంది.
ప్రపంచం లో పనికి రాని వాడంటూ ఎవరూ ఉండరు. అలాగని అందరూ తెలివైనవాళ్ళే ఉండరు . అంగవికలురూ ఇతరులవలెనే అనెక పనులు సక్రమంగా చేయగలరని నిరూపణ చేస్తూనే ఉన్నారు. తెలివికి,తెలివిలేని తనానికి అంగవైకల్యానికీ సంబంధంలేదు.ఒకపని చేయగలగడం ,చేయలేకపోవడం అనేవి వ్యక్తు;అ సామ్ర్ధ్యం మీద, ఆధారపడి ఉంటాయితప్ప మరోటికాదు.నికి మధ్యలోనే మనం. మనం చేయగలిగినది ఎవరైనా చేయలేక పొతే మనం వాళ్ల కన్నా గొప్ప వాళ్ళంఅనుకోవడంసర్వసాధారణమై పోయింది.అయితే వికలాంగులను అర్ధం చేసుకోడానికి ఐరిస్ అనే ఆవిడ ఏమంటారంటే "కూర్చున్న చోటినుండి లేవలేక పోవడం శారీరక సమస్య ఐతే, అలా లేవలేక పోవడానికి సరైన సహకారాన్ని అందించక పోవడమే అసలైన వైకల్యం అంటారు". అందుకే సమాజం లో ఎవరు ఎ పని చేసినా, చేయ లేక పోయినా దాని వెనుక సమాజం పాత్ర ఎంతైనా వుంటుంది. ఆ సహకారం, ప్రోత్సాహం తో ఎవరైనా ఎంత ముందుకైన వెళ్ళగలం అనే సత్యాన్ని తోటి వారు అవగాహన చేసుకోవాలి. నిజమైన సామర్ధ్యం గురుంచి చర్చించు కుంటే ఎవరు ఎవరినీ తక్కువగా చూడలేము. అలాఅర్ధంచేసుకోలేకకొన్నితరాలుగా కొంత మంది పై నిర్లక్ష్య గా సామర్ధ్యం అని చెప్పి, చేయగలిగినవాళ్ళను కూడా అసమర్ధులుగామార్చిన సమాజం నుండి బయటికి వచ్చి అందరినీ అర్ధం చేసుకొనే సమాజం వైపు మన పెద్దవాళ్లుప్రారభించిన అడుగులు ముందుకు తీసుకు వెల్లడానికి ఈరోజే నిర్ణయం తీసుకుందాం.
వికలాంగులు దేంట్లోనూ తీసుపోరు. వారి ప్రతిభ అనూహ్యమైనది. ఫ్రఖ్యాత బ్రిటీస్ కవి ‘ జాన్
మిల్టన్’1652లో తన 44వఏట కంటిచూపుకోల్పోయాక ‘పారడైజ్ లాస్ట్ ‘ అనే
అత్యద్భుత కావ్యం రాశాడు.
జర్మనీకి చెందిన ప్రపంచప్రసిధ్ధ
సంగీతకారుడు ‘భీదోవెన్ ‘ కు బ్రహ్మచెముడు ! ఆయన మధురాతి మధురమైన సంగీతాన్ని లోకానికి అందించాడు.గొప్పసంగీతకర్తగా
చరిత్రలో చెరగని స్థానంపొందాడు.
ప్రాచీన గ్రీకు మహాకవి ‘హోమర్
‘ అంధుడు!
ఆమెరికాకు చెందిన ‘ హెలెన్
కెల్లర్ ‘ 1880 జూల్ 17న జన్మించింది. పుట్టినపుడు మామూలుగానె ఔన్నా
19నెలల వయస్సులో ఆమెకు జబ్బుచేయడంతో చెముడు,మూగతనం, గ్రుడ్డితనంవచ్చాయి . గ్రుడ్డి , చెముడు
వల్ల ఆమెకు స్నేహితులు లేకపోడంతో ఏకాకిగా ఐపోయింది.కాని మానశిక శక్తివల్ల ఆమె ఏకాకితనాన్ని
లెక్కచేయలేదు.,అమోఘ మేధతో ఆమె ' బ్రెయిలీ ‘
లిపినినేర్చుకుని,పాండిత్యం
సంపాదించింది.ఎన్నో అద్భుత గ్రంధాలు రచించింది.ప్రపంచమంతా పర్యటించి వికలాంగులకు ఎన్నో
పాఠశాలలు ఏర్పాటుచేసింది.ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటుచేసింది.ఆమెతనవంటి వారికి ఉపయోగపడేలా
ఎన్నో ఏర్పాట్లు చేసింది. ఆమె తనడైరీలో " నాఏకాకితనంలో చదవనూ, ఆలోచించనూ
నేర్చుకోనూ ఎంతో అవకాశం, సమయం లభించాయి " అనివ్రాసుకునందిట! చూశారా
వంటరితనాన్ని ఎలా ఉపయోగించుకుని మనందరికీ మార్గదర్శకురాలైందో!ఆమెను వికలాగురాలని ఎవరంటారు?
అమెరికాలోని మరో అద్భుత వ్యక్తినిచూస్తే ఆశ్చర్యంకలుగుతుంది
ఎవరికైనా, 'జేంస్ తర్జర్ ' కు పసితనంలోనే ఒక కన్ను ప్రమాదవశాత్తూ పోయింది,పెద్దయ్యాక
రెండోకంటికీ చూపు పోయింది.ఐనా ఆయన న్యూయార్క్ పత్రికకు వ్యాసాలు వ్రాసేవాడు.అనేక పుస్తకాలూ, నాటాకాలూ
కూడావ్రాశాడు. అంతేకాక ఆయన పెద్దపేరుపొందిన పెద్ద కార్టూనిస్టు.
ఇహ మనదేశానికి చెందిన కొలహాపూర్
లోని ' గిల్ బిలే ' అనే వ్యక్తి చేతులు లేకుడానే పుట్టాడు. ఐనా అతడు
సైకిలెక్కి తనంతట తానే తొక్కగలడు!నీటిలో ఈదగలడు! ఆత్మవిశ్వాసం ఉంటే చేయలేనిదే లేదని నిరూపించాడు! మనదేసానికి
చెందిన మరో వ్యక్తి 'భరత్ రాజ్ ' రెండుచేతులూలేక్పోయినా కాళ్ళతోనే అన్నిపనులూ చేసేస్తాడు!ప్రింటింగ్
ప్రెస్ లో ఉద్యోగంచేస్తూ తనను తానే పోషించు కుంటు న్నాడు! తనస్నేహితులకు ఉత్తరాలు వ్రాస్తుంటాడుట! పొయ్యి వెలిగించి
వంటచేస్తూ తనకే కాకతన తల్లికీ ఇంతవండిపెడ్తూ తల్లి ఋణంతీర్చుకుంటున్నాడు!
లండకు చెందిన ' నార్మన్
' అనేవానికి ఏదో ప్రమాదంలో కాళ్ళుతెగిపోయాయిట! 1981లో అతడు చంకకఱ్ఱలసాయంతో అర్జంటీనాలోని 17వేల అడుగుల అత్తైన పర్వతాన్ని అధిరోహించి క్షేమంగా
దిగివచ్చాడుట కూడా!
“లక్ష్యాన్ని
మరువకపోడమే విజయానికి కీలకం ..”అంటాడు బెంజిమిన్ డిజ్రేలి.
మరి వీరంతా వికలాంగులంటే ఎవరునమ్ముతారు. అన్నీవయవాలూ సరిగా ఉండీ
శ్రమచేయగల శక్తి సామర్ధ్యాలుండీ సోమ్రితనంతో ఉండే వారే అసలైన వికలాంగులనవచ్చేమో!
పుట్టుకతో వికలాంగులైనవారికి
ప్రత్యేకమైన శక్తులుంటాయనే విషయమూ సత్యదూరంకాదు. చూపులేనివారు ఒక మారు విన్న స్వరాన్ని
మరోమారువినగానే ఆవ్యక్తిని గుర్తిస్తారు.ఒక మారు స్పర్శతగిలినవారినీ రెండోమారు గుర్తించగలుగుతారు.వారికి
గ్రహణ శక్తీ అధికంగానే ఉంటుంది!
వికలాంగులు మానసికంగా ఆధైర్య
పడకుండా ఆత్మస్థైర్యంతో అన్ని రంగాల్లో ముందుకు దూసు కెళుతున్నారు. వికలాంగులు ఈ రోజు క్రీడలను నిర్వహిస్తారు . వికలాంగ
క్రీడాకారులు సాధారణ క్రీడాకారులకు ఏమాత్రం తీసిపోకుండా ఆత్మస్థైర్యంతో కొన్ని క్రీడలలో
పాల్గొంటూనె ఔన్నారు. ఇంకా వారిని అటుసమాజమూ, ఇటు ప్రభుతవ్మూ అన్నిరంగాల్లో రాణించను ప్రోత్సహించాలి, అవకాశాలు
కల్పించాలి..
వికలాంగులకు నేడు ప్రభుత్వం
అనేక సంక్షేమ పథకాలు రూపొందిస్తూనే ఉంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వికలాంగుల పునరావసం మరియు
వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. 1995వ సంవత్సరములో కేంద్ర ప్రభుత్వం
ద్వారా చట్టం చేయబడి 7-2-96వ తేదీన అమలులోకి తేబడిన వికలాంగుల సమాన అవకాశాలు, హక్కుల
పరిరక్షణ, సంపూర్ణ భాగస్వామ్యం చట్టం,
1995 ఒకటవ చాప్టరులో వికలాంగుల నిర్వచనం ఈ విధంగా
యివ్వబడి అమలులో ఉంది.
అంధత్వం,వినికిడి లోపం ,బుద్ధి మాంద్యం ,అంగవైకల్యం [ చేతులుకానీకాళ్ళు కానీ కదిలికలేకపోడం ]
మెడికల్ బోర్డు ప్రతినెల నిర్ణీత సమయాల్లో జిల్లా వైద్యశాల యందు సమావేశమైవికలాంగత గల వ్యక్తిని పరీక్షించి సర్టిఫికెట్లు ఉచితంగా అందజేస్తుంది.వారికి ప్రభుత్వ ఏర్పాటూచేసిన రాయితీలు వర్తియ్తాయి. విద్యావకాశాలకు,ప్రయాణాలకూ, ఉద్యోగాలకూ ఈసర్టిఫికేట్లు ఉపకరిస్తాయి.
వికలాంగుల పునరావస నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే 1981 సం.ఆంధ్రప్రదేశ్ వికలాంగుల సహకార సంస్థ. 1983 సంవత్సరం వికలాంగుల సంక్షేమ శాఖ స్థాపించడం జరిగింది. ప్రతి జిల్లాలో ప్రభుత్వ పథకాలు అమలు పర్చే నిమిత్తం సహాయ సంచాలకుల కార్యాలయాలు పనిచేస్తున్నవి. ఆంధ్రప్రదేశ్‌లో వికలాంగులు పునరావాసం మరియు అభివృద్ధి కొరకు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి.అంధ , బధిర, మూగ బాలబాలికలకు ప్రత్యేక పాఠశాలలు పరభుత్వమ్నిత్వహిస్తున్నది. వికలాంగుల సంక్షేమ శాఖ ,ప్రాథమిక విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ పాఠశాలలు నడుస్తున్నాయి.భారత ప్రభుత్వం ద్వారా సహాయం పొందుతో కొన్ని , పొందకుండానే కోన్ని ఉన్న ప్రభుత్వే తర సంస్థలు విద్యారంగంలో తమ వంతు సహాయం అందిస్తున్నాయి. విద్యాశాఖ అధ్వర్యంలో ప్రతి జిల్లాలో బధిరులకు, అంధవిద్యార్థుల కొరకు ఒక్కొక్క తరగతి గుర్తించిన పాఠశాలలో ప్రారంభించబడింది. 'అందరికీ విద్య 'లక్ష్యంతో అవసరమైనప్రతిచోటఇటువంటివిద్యావిధానం అమలుకు విద్యాశాఖ దశలవారీగా చర్యలు తీసుకుంటూనే ఉంది.1992 లో యునైటెడ్ నేషన్స్ వికలాంగుల సహాయార్దము దీనిని ప్రారంభించినది . అప్పటి నుండి ప్రపంచవ్యాప్తము గా జరుపుకొంటున్నారు .
.
No comments:
Post a Comment