Monday, 29 October 2012

అక్టోబర్ 28 [ ఈ ఏడాది ] అత్తగార్ల పండుగ!


                      అక్టోబర్ 28 [ ఈ ఏడాది ] అత్తగార్ల పండుగ!     
ప్రతిసంవత్సరమూఅక్టోబర్నెలనాలుగోఆదివారముMother.inLaw’s.Day[మదరిల్లాస్డే. ]జరుపుకుంటారు .ఈ పండుగ జరుపుకోనుఖచ్చితమైన కారణంప్రత్యేకంగాతెలీదు,ఐతే అత్తగారికి కృతఙ్ఞత తెలుపు తూ కోడళ్ళు , బహుశా మంచి భర్తను కనిచ్చినందుకు కావచ్చు,తమనుకోడంట్రికంపెట్టకుండాసజావు గాకాపురంచేసుకొనిస్తున్నందుకుకావచ్చు,లేదాఇంటిపనుల్లో,వంటపనుల్లోచేదోడువాదోడుగాఉంటూ ,తమబిడ్డల్నితాముఉద్యోగాలకైవెళ్ళినపుడునానీలాచూస్తున్నందుకుకావచ్చు,పెద్దదిక్కుగాఇంటిపట్టున ఉంటూ ,అనారోగ్యాలు వస్తే గృహవైద్యంచేసేఇంటిడాక్టరైనందుకుకావచ్చు,కారణంఏదైతేనేంకోడళ్ళుతమ అత్తగారిసాయానికి కృతజ్ఞతలు చెప్తూ ఆమెకుబహుమతులుఅందజేస్తూప్రేమ,ఆప్యాయతల్నిపంచేరోజు ఇది.ఈరోజునగ్రీటింగ్ కార్డ్స్ కంపెనీలుమంచివ్యాపారజోరుతోపండుగచేసుకుంటాయి,బహుశాఈతయారీ కంపెనీలేఈపండుగనుప్రారంభించిఉండవచ్చనేఊహాగానాలుకూడాలేకపోలేదనుకోండి,అదివేరేవిషయం.         చిన్నతనంలో వివాహమైఅత్తింటకాపురానికివచ్చేవరకూకమ్మనిప్రేమనందించినఅమ్మనుతిరిగిసంపుర్ణ హృదయంతోఅత్తలోచూసుకోడంకోడళ్ళుప్రారంభించాలి, తమకూతుళ్ళలాఅత్తలుకోడళ్ళను ఆదరించాలి, అప్పుడేఈపండుగఅర్ధంపరమార్ధంనెరవేరినట్లు.’అత్తకోడల్నికూతుర్లాచూస్తే,కోడలుఅత్త నుఅమ్మలా చూస్తుందనిపెద్దలమాట,ఇంటశుఖసంతోషాలువిరాజిల్లాలంటేఅత్తా కోడళ్ళమధ్యప్రేమాభిమానాలు, నమ్మకం,అవగాహనా,పరస్పరఅనురాగమూముఖ్యం.లేదంటేకొంపకొల్లేరైమగవారుఇడుములపాలై , నరకానికి మరోస్థాన మవుతుంది ఇల్లు.
అత్తాకోడళ్ళైన లక్ష్మీ సరస్వతులకే పడదనీ , అందుకే లక్ష్మి ఉన్నచోట సరస్వతి ఉండదనీ అంటారు.
 జీవితమంతా తోడూ-నీడగా కలసి మేలసి ఉంటామని కష్ట సుఖాల్లో అండదండగా ఉంటామని వివాహ సమయంలో [-- 'ధర్మేచ ..అర్ధేచ ..కామేచ ..నా అతిచరామి .' అని  --] చేసుకున్నబాసలు భార్యాభర్తలకు జీవితంలో నిజమవాలంటే ,అత్తకోడళ్ళ మధ్య సహాయ సహకారాలు సరిగా ఉండాలి. అత్తా  కోడళ్ళ గురించిన ' అత్త ఆర్భాటం..కోడలి ఆరాటం , అత్తను దిద్దినకోడలు, కోడల్ని దిద్దిన అత్త, అనే అనేక సినిమాలూ, నేడు తెలుగు టి.వి. లనిండా అత్తాకోడళ్ళపై అనేక సీరియల్స్ రోజంతా , అత్తను ఎలా బాధించాలనేకోడలు, కోడల్నెలా మట్టుపెట్టలనే అత్త, దుష్ట చింతనలు మనస్సుల్లోనిండివికృతరూపుదాల్చేఈసీరియల్సుచూడటం జరిగితే ఇక ఇల్లు యమపురే ! మరేకథలూదొరక్క పాపంతెలుగు సీరియల్సన్నీబుల్లితెరను, బుల్లి హింసాలయంగామార్చుతున్నై.  దాదాపుఅన్నికథల్లోనూ అత్తాకోడళ్ళనడుమ స్పర్ధలు ,వాటిని ఎక్కువచేయనునెగట్లోమంటఎగదోసేస్నేహితురాళ్ళూ,ఆడపడుచులూ,ఇరుగుపొరుగూనూ.మనకు సాధారణంగా కనిపించే బుల్లితెరభాగోతంఇదేగా!. కొత్తగాపెళ్ళైన కోడళ్ళంతా అవిచూసి " అమ్మో అత్తగారా!" అనుకుని భయపడ్డం, అత్తలు  " అమ్మో కోడలుపిల్లా!" అనుకుని ముందుగానే తామెలాఉండాలోజాగ్రత్తపడటంచేస్తుంటారు.వీటన్నింటికీకారణముసరైనఅవగాహనాలోపమే!సంపూర్ణహృదయంతో,వచ్చినకోడలు నచ్చిందని సంతోషంగా ఆఅమ్మాయిని మనకుంటుంబంలో కలిపేసుకుని,కోడల్నిఇంటికిఆహ్వానించిమమేకంకావాలి.,అలాగేకోడలూఅత్తగార్నితల్లిలా ఆదరించ గలగాలి.పరస్పరప్రేమేవారిద్దరిఅనుబంధాన్నినాగర్జునా సిమెంట్లా [నిజం నాగార్జునా సిమెంట్కూలు స్తుందోనిలబెడుతుందోతెలీదుగానీ]కలుపుతుంది.తనకుమంచిసంస్కారంగలభర్తనుఅందించినఅత్తపట్లకోడలూ,తన్నుకూతుర్లాచూసుకుంటూతనకొడుక్కుఒకమంచితోడుదొరికినందుకుఅత్త,తమబాధ్యతలుగుర్తుంచుకుంటూ,పరస్పరంకృతఙ్ఞతగామెలగాలనిగుర్తుచేయనేమోఈపండుగజరుపుకోడం
కొడుక్కి పెళ్ళిచేసేంతవరకుఆరాటపడినఅమ్మఅత్తగారిహోదారాగానే అనవసరపు రుసరుసలు! ఎక్కడ తనస్థానం తగ్గిపోతోందోనే భయం!తమపెత్తనానికి పతనమ్మొదలవుతుందనే అనుమానం! .పుట్టింట ఎలాంటి అరమరిలకూలేనిఅమ్మాయిమెట్టినింటఅడుగిడగానే కోడలు పోర్షన్ కొచ్చేసరికి ఏదో తెలియని అసంతృప్తితో ఆరాటపడటమ్మొదలవుతుంది.!అందుకుకారణము'ప్రేమ'మార్పిడీజరగటమే!.పెళ్ళైందాకా  ప్రతి చిన్నపనికీఅమ్మనుపిలుస్తూతనపైఅనుక్షణంఆధారపడే కొడుకుపెళ్ళయ్యాకఅన్నింటికీ 'హాయ్ స్వీటీ!' అనో మరో ముద్దుపేరుతోనో ,భార్యను పిలుస్తూ ,కోడలినిఅనుక్షణంతనఅవసరాలకు పిలుస్తుం డటం బహుశాఆత్తకు మానశిక అసంతృప్తి కలిగించడం ప్రారంభమవుతుంది....కొడుక్కు తనపై ప్రేమ దూరమవుతుందేమో!నే అనుమానం, తన పాధాన్యత క్రమేపీ తరిగి పోతుందేమోనే  భయంతోకూడిన ప్రేమేదీనికికారణం.. ఫలితం కొత్తగావచ్చినకోడలిపనుల్లో పొరపాట్లు చూడటం ,చీటికీమాటికి తప్పులు ఎంచుతూ తగవులు ప్రారంభం అవుతాయి .
చాలా ఇళ్ళలో భార్యాభర్తల మధ్య వచ్చే మనస్పర్ధలకు అత్తగారినే బాధ్యురాల్ని చేస్తుంటారు .చివరకు కథల్లో కార్టూన్లలో అత్తాకోడళ్ళనడుమ వైరాలే కధావస్తువులు! ఇటువంటిస్పర్ధలుప్రారంభమై కుటుంబ సభ్యుల మధ్య  కోపతాపాలు,అకారణవైరాల,ఫలితంగా ఒత్తిడికి లోనవడం ! చాలామందికొత్తకోడళ్ళు  అత్తగారితోకలిసివుండేందుకుసైతంమొగ్గుచూపడంలేదు.భార్యాభర్తలమధ్య ఈవివాదం విడాకులవరకు దారితీస్తూంది.చిన్నచిన్నవిషయాలనుఅత్తాకోడళ్ళుభూతద్దంలోచూడక,కుటుంబవ్యవస్థచిన్నాభిన్నం కానివ్వకుండా చూసుకోవాలి. ఒకవేళ ఏవైనావిభేదాలుతలలెత్తితేవీలయినంతవరకు సంయమనాన్ని పాటించాలి.చిన్నచిన్నవిషయాల్నిపెద్దవి చేసుకుని, విచ్చిన్నధోరణిలోపడకపోడం మంచిది . 
కొన్నిమార్లు భరించలేనంత సాధింపులను ఇళ్ళలో ఎదురైనపుడు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని వెతకాలి . ఒకే ఇంట్లో ఒకరి నొకరు ప్రతిక్షణము శత్రువుల్లా చూసుకుంటూ బ్రతికే బదులు , విడివిడిగాఉంటూ అప్పుడప్పుడూ పండుగ పబ్బాల్లోకలిసి సంతోషంగా నవ్వుకుంటూ గడపడమ్మేలు. పంతాలుపట్టింపులూ వదలిసర్దుకుపోవడంరెండోమార్గం.పెళ్ళయ్యాక అప్పటిదాకా తన కొంగుపట్టుకుని తిరిగినకొడుక్కి తనపై ఆధారపడాల్సినపనిలేదని ..జీవితాంతముతోడుకోసం పెళ్ళాడిన జీవిత భాగస్వామితో అతనుకలసి ఉం డాలనీ ఆ కన్నతల్లి గుర్తించాలి .తానూఒకరోజునఅలానే ఆఇంట కోడలిగా అడుగుపెట్టినవిషయం గుర్తుకుతెచ్చుకోవాలి.'అత్తాఒకింటికోడలే !' కోడలూ మరోనాటికి అత్తే!   ఇంటికికోడలుగా వచ్చినంతమాత్రాన అంతవరకూ తల్లిని అన్నీ అడుగుతూ ఇంతకాలం పెరిగి పెద్దైన తనభర్త, తల్లినివదిలేసిపూర్తిగాతనకే ప్రాధాన్యమివ్వాలని,అక్కాచెల్లెళ్ళనూ అన్నదమ్ములనూ వదిలేసి తనకే స్వంతంకావాలనీదేనికోసమూఅత్తగారిపై అస్సలుఆధారపడకూడదనీఆఇంటికోడలు ఆలోచించ కూడదు .తామంతాఒక్కటేఅన్నభావనమనస్సులోఏర్పర్చుకోవాలి.అప్పుడుఏసమస్యాఉత్పన్నంకాదు. .వీటినన్నింటినీ మననం చేసుకుంటు అత్తగారిలోని అమ్మతనాన్ని గౌరవిస్తూ అమ్మకోసం ఓ పండుగ జరుపుకున్నట్లే అత్తగారి కోసమూ ఓ పండుగ జరుపుకోవాలనే ఉద్దేశమే ... ఈ మదర్-ఇన్‌-లా డే. .
ఈ పండుగలన్ని అమెరికా వంటి దేశాల్లో సంవత్సరంపొడవునా దూర దూరంగా ఉంటూ ఇలాంటి సందర్భాలలో ఒకచోట కలసి తమ ప్రేమను అత్తగారికి చూపి పూల బొకేలు ఇచ్చి, ఆదరించి , కేకులు కట్చేసుకుతింటూ, ఒకరోజుకలసిమెలసిఉండేందుకే!ఎల్లప్పుడూఇళ్ళలోనేఉండేభారతీయకుటుంబాల్లో సైతం ఈ పండుగ జరుపుకుంటే తప్పేం లేదు , ప్రత్యేక గుర్తింపు కోరుకోడం మాననైజంకదామరి!
జై అత్తలకూ జైజైకోడళ్ళాకూ! 

No comments:

Post a Comment