Saturday, 20 October 2012

సరదాల దసరా ‘బొమ్మల కొలువు’ ప్రాముఖ్యం


 సరదాల దసరాబొమ్మల కొలువుప్రాముఖ్యం

                         నమస్తే సిద్ద సేవ్యానీ ఆర్యే మందార వాసినీ
                        
కుమారీ కాళీ కపాలీ కపిలే కృష్ణపింగళే
                        
భద్రకాళీ నమస్తుభ్యం కోటదుర్గా నమోస్తుతే
                        
దండీ చండీ నమస్తుభ్యం తారణీ వరవర్ణినీ…. అంటూ భక్తిశ్రధ్ధలతో దుర్గాదేవిని స్తుతిస్తూ,పూజిస్తూనవరాత్రిఉత్సవాలుమొదలవుతాయి.ఈపండుగకుమరోపేరుదసర.ఇదిఒకప్రధానమైన హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులుదేవీనవరాత్రులు,పదవరోజువిజయదశమికలసిదసపది,అంటేరాత్రులుఅనిఅర్ధం.,శరదృతువు ఆరంభంలోవచ్చేపండుగ కనుకశరన్నవరాత్రులనీఅంటారు.ఈ పండుగ మొదటి మూడు రోజులు పార్వతిదేవిని తరవాతిమూడురోజులలక్ష్మీదేవినిచివరిమూడురోజులుసరస్వతిదేవినిపూజిస్తారు. దశరా అనగానే పిల్లలకూ పెద్దలకూ అమిత సరదా! ఇదిసరదాలదశరా !కొత్తఅల్లుళ్ళుకూతుళ్ళూవారిపిల్లలతో వారిపిల్లలతోఈపండుగహడావిడిఇంతాఅంతాకాదు.ఇదిపెద్దపండుగ!అంటేఎక్కువ రోజులు జరుపుకునే పండుగ . ……అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె
                      ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడిపుచ్చిన యమ్మ దన్నులో
                      నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మా
                     యమ్మ,కృపాబ్దియిచ్చుతమహత్వకవిత్వపటుత్వసంపదల్----- అంటూ.. కవిపుంగవులుయోగులుసైతంనవరాత్రులలోఅమ్మవారినిపూజిస్తారు..శక్తినిపూజించేశాక్తేయులకుఇదిముఖ్యమైనపండుగ.దేవీఆలయాలలోఅమ్మవారికిఒక్కోరోజుఒక్కోఅలంకారంచేస్తారు.పదవరోజుపార్వేటఉంటుంది.,పూర్వంపాండవులుతమఆయుధాలనుజమ్మిచెట్టుపైఉంచిఅఙ్ఞాతవాసంగడిపి,విజయదశమిన వాటినితిరిగితీసుకున్నారు,అందుచే జమ్మిచెట్టువద్ద పార్వేట చేయడం ఆనవాయితీగావచ్చింది.
పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు లోకాలన్నీ జయించి తానే గొప్పవాడుకావాలనీ అంతాతనకు లొంగిఉండాలనేకోరికతోబ్రహ్మగురించీకఠినతపంచేసివరాలుపొంది,ఆవరగర్వంతోరెచ్చిపోయిఅందరినీ బాధించసాగాడు.ఎవ్వరూఏఆయుధంవల్లవాడినిసమ్హరించలేకపోతారు.అప్పుడుత్రిమూర్తులు,దేవతలంతాతమతమశక్తులనుదేవికిఇచ్చి,మహిషునిసమ్హరించమనివేడుకుంటారు. శివుని తేజం ముఖంగా, విష్ణుతేజంబాహువులుగా,బ్రహ్మతేజంపాదములుగాకలిగినస్త్రీమూర్తిగాత్రిమూర్తులశక్తులుఉద్భవించి ,18 బాహువులతో శివుని శూలము,విష్ణుమూర్తిసుదర్శనచక్రము,ఇంద్రునివజ్రాయుధము, వరుణ దేవునిపాశము,బ్రహ్మదేవునిఅక్షమాల,కమండలము ఆయుధాలుగా ధరించి,హిమవంతుని సింహ  వాహనాన్నీఅధిరోహించి,సర్వదేవతల ఆయుధములతోమహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పిందిదేవి. మహిషాసురునివైపుపోరు సల్పుతున్నఉదద్రుడు, మహాహనుడు, అసి లోముడు, బాష్కలుడు,బిడాలుడుమొదలైనవారినిసంహరించినతరువాతమహిషాసురునిఎదుర్కొంది.ఈయుద్దము లో ఆదేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవరూపముతో భీకరముగాపోరిచివరకుతిరిగిమహిషిరూపము లో దేవిచేతిలో హతుడైనాడు.ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా , విజయదశమి ,పర్వదినంగా ప్రజలచే కొనియాడబడింది.
బొమ్మల కొలువుపిల్లలుఆనందంగా,ఉత్సాహంగాదశరా బొమ్మలకొలువుపెడతారు, పెద్దలుసహకరించి కావల్సినఏర్పాట్లూసలహాలూఇస్తుంటారు.నవరాత్రులలో9రాత్రులుఈబొమ్మలకొలువుజరుపుకుంటారు.ముత్తైదువులను ,పిల్చిపసుపుకుంకుమలుతాంబూలాలూపండ్లుపూలువాయినాలుఇస్తారు..మహిషాసురుణ్ణిచంపేందుకు దేవికొంతకాలముసూదిమొనమీదతపస్సుచేసిందంటారు.అందుకని బొమ్మల కొలువున్నన్నిరోజులుసూదిలోదారముపెట్టిఏపనిచెయ్యరు.ఈబొమ్మలకొలువుసాధారణంగాతొమ్మిదిమెట్లతోఅలంకరిస్తారు.. వారి కళాదృష్టి, ఆర్ధిక స్తోమత, సౌకర్యాలనుబట్టిఈమెట్లపై రకరకాలబొమ్మలను అమరుస్తారు.మెట్లపైతెల్లనిబట్టపరచిదానిపైబొమ్మలనుఅమర్చుతారు.పైమెట్లపైదేవుళ్ళబొమ్మలు,దేవతాఅమ్మవార్ల బొమ్మలు ఉంచి అలంకరిస్తారు.క్రిందమెట్లపైన కింది మెట్లు పైప్రాపంచికజీవితానికిసంబం దించిన బొమ్మలు ,మధ్యన క్షత్రియధర్మాన్ని తెలుపుతూ ఉండేరాజు,రాణి,యుద్ధవీరులవంటిబొమ్మల నుంచుతారు. పై మెట్టు మీదవుంచే దేవీ కలశంఉంచుతారు. క్రిందనుండీతామస,రాజస,సత్వగుణాలకు ప్రతీకగా ఈమెట్లపై బొమ్మలఆమరిక ఉంటుంది,ఈమూడుగుణాలనూఅధిగమిస్తేదేవికరుణఅందుకోగల మనిసంకేతం .భక్తిని,త్యాగాన్నీస్నేహభావాన్నీ ,సమానత్వాన్నీ ,సేవాభావాన్నీ ,శ్రధ్ధనూపెంచండమేఈపండుగఅంతరార్ధం,పేదధనికభేదంలేకఅందారినీపిల్చి,కలసిమెలసిఆటపాటలటో,పరస్పరం,ఉన్నంతలో నైవేద్యంపేర వాయినాలరూప్మలో అందరికీఇచ్చితమస్నేహాన్నిచాటుకుంటారు.  ధూపదీపనైవేద్యాలతో ప్రతిరోజూలలితాసహస్రనామాలు,లక్ష్మీఅష్టోత్తరాలూచదివిపూజలుచేస్తారు.రోజూఒకఅమ్మాయికిఒకసువాసినికిభోజనంపెట్టితాంబూలం,అలంకరణవస్తువులు,బట్టలుఇస్తారు.ఇలాదసరాతొమ్మిదిరోజులుదాన
ధర్మాలుచేస్తారు. ప్రతిరోజూసాయంత్రముపేరంటానికిముత్తైదువులను,పిలిచి, అందరికీపసుపుకుంకుమ, తాంబూలము,దక్షిణఇస్తేతమకుఅష్టైశ్వర్యాలుసిద్ధిస్తాయని,అమ్మవారిఅనుగ్రహంకలుగుతుందనినమ్మకం. గంధము,పసుపుధరించడంవల్లఆరోగ్యంబాగాఉంటుంది,చల్లదనం , ఏదైనా శారీరక చర్మసంబంధ వ్యాధులుంటే నయమైపోతాయి.ఒకసారిమొదలెట్టిన బొమ్మలకొలువు ప్రతిసంవత్సరము కొనసాగు తుంటుంది.కొన్నిప్రాంతాలలోసంక్రాంతికిబొమ్మలకొలువుపెట్టేఆనవాయితీ, అప్పుడు మూడురోజులే పెడతారు. బొమ్మల కొలువు పెట్టడం మొదలు పెట్టాక సంవత్సరానికో మెట్టు చొప్పున పెంచుకుంటూ తొమ్మిది మెట్ల వరకు పెంచుతారు. ప్రతీ సంవత్సరము తప్పనిసరిగాఓక్రొత్తబొమ్మకొనడంసంప్రదాయం. ప్రస్తుతం ప్లాస్టిక్బొమ్మలు,బార్బీలుచోటుచేసుకున్నాయికానీపూర్వంమట్టిబొమ్మలు,పింగాణీబొమ్మలు , కొయ్యబొమ్మలు,తాటాక్లుబొమ్మలూపెట్టేవారు.దేవునిప్రతిరూపాలైన  శివుడు, పార్వతి,వినాయకుడు , సుభ్రహ్మణ్యేశ్వరుడు,శ్రీరాముడు ,సీతమ్మ,శ్రీకృష్ణుడు,లక్ష్మి,సరస్వతి,ఇంకాఇతరదేవతలబొమ్మలూ,
తత్వబోధకులైనశంకారాచార్యాదులబొమ్మలు,వివేకానందుడు,రామకృష్ణపరమహంస,బుద్దుడు,లాంటిబోధకులబొమ్మలూ,స్వాతంత్ర్యసమరయోధులబొమ్మలు,పెళ్ళితంతుబొమ్మలు,హాస్యపుబొమ్మలు,
కౌరవపాండవులయుధ్ధసీన్లు,అంగడి,పార్కు,జ్యూవంటిసెట్టింగ్స్కూడాపెడతారు .నవరాత్రిబొమ్మలకొలువుపెట్టడంలోఒకప్రత్యేకతవుంది.మానవులుఎలాగైనామంచితనాన్నీపెంచుకుంటూ పరమాత్మ వైపు పయనించేలాఆత్మపరంగాతానుపైమెట్లవైపుఎదుగుతూజీవితంలోముందుకుసాగాలని.ఇలాతాముఉన్నతస్థాయికిచేరుతూచివరికిదేవునిలోఐక్యమైపోడం.కొలువుప్రదర్శనలో 9 మెట్లు అమర్చిఅందులో రకరకాలబొమ్మలు పెడుతున్నాం.తొమ్మిది మెట్లలోఒక్కొక్కమెట్టుపైనా క్రమపద్ధతిలోనే బొమ్మలను అమర్చాలి.బొమ్మలను అమర్చడంలోనూ ఒకపధ్ధతి పాటిస్తారు.మొదటి మెట్టుపైప్రాణముండీ కదల్లేని, గడ్డి,చెట్లవంటివి,రెండవమెట్టుపైనత్త,శంఖువంటిమెల్లనికదలికగలవాటిని,మూడవమెట్టుపైచీమలవంటిచిరుప్రాణులబొమ్మలునాలుగవమెట్టుపైఎండ్రకాయవంటిపాకుడుచలనమున్నబొమ్మలు ,ఐదవమెట్టుపైజంతువులు,పక్షులువంటివివాటిని,ఆరవమెట్టుపైఅంగడిసెట్టి,పోలీస్,వృత్తులుతెలిపేబొమ్మలు,కుటుంబం,పాఠశాలఇంకావివిధరకాలమానవులబొమ్మలు.ఏడవమెట్టుపైతస్సుచేసేఋషుల,పద్మవ్యూహం ,యఙ్ఞ వాటికవంటిబొమ్మలు,ఎనిమిదవమెట్టుపైదశావతారములు ,నవగ్రహాలు, పంచభూతముల రూపాలు అష్టదిక్పాలకులబొమ్మలు.పెడతాము.తొమ్మిదవ మెట్టుపై త్రిమూర్తులు,త్రిమాతలు దుర్గ వివిధరూపాలు, అష్ట లక్ష్ములబొమ్మలుపెడతాము..ఇంకాపార్కు, జ్యూ,వంటి సెట్టింగ్స్ ,అనేకరకాల పళ్ళు,కూరగాయలు, సైనికులు, పక్షులు, జంతువులపెడతారు. కొండపల్లి బొమ్మలు, ఏటి కొప్పాక, నిర్మల్, తంజావూర్బొమ్మలు సేకరించేవారు. ఈకొలువులుసాధారణంగాఆడపిల్లలుఉన్నఇళ్లలోఎక్కువఆర్భాటంగాజరపడంజరుగుతుంటుంది.ఈపండుగప్రత్యేకతేమంటేప్రతిఅంశంలోనూసామాజికస్పృహ,తెలివితేటలువ్యక్తమవుతాయి.పిల్లలుతమఆలోచనాశక్తికిపదునుపెట్టిబొమ్మలకొలువుపెడుతుంటారసరాపండుగల్లోప్రత్యేమైనవిబతుకమ్మలు,పులివేషాలు,బుట్టబొమ్మలు,బొమ్మలకొలువు,ప్రభలుమొ..ఈవిశేషాలుప్రాంతాలనుబట్టిమారుతుంటుంటాయి.తెలంగాణా లో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. విజయ దశమి రోజున రాముడు రావణుని సమ్హరించి విజయంసాధించినరోజనీ,పాండవులు  జమ్మి చెట్టు పైఉంచినతమ ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజనీ ,ఈ రోజునసందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటంజరుగు తుంటుంది, ఇదే పార్వేట అంటే! దసరా ఉత్సవాలను దేశమంతా వివిధ రూపాలలో జరపుకుంటారు. మైసూరు, కలకత్తా, ఒరిస్సా, తెలంగాణా, విజయవాడలలో ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపు కుంటారు. ఇవే కాక ఊరి ఊరికీ కొన్ని ప్రత్యేక ఉత్సవాలు జరుపుకుంటారు. ఒంగోలులో కళాకారులుఅమ్మవారినివివిధరూపాల్లో అలంకరించి ఆరాధించి చివరి రోజున ఉత్సవంగా అమ్మవారు వెళ్ళి రాక్షససంహారం చేసే ఘట్టాన్ని ప్రదర్శించేవారు.
                  వార్తపత్రికలో -అక్టోబర్ 21న ' సరదాల బొమ్మలకొలువు ' చెలి  సెక్షన్లో  ప్రకటితం.

2 comments:

  1. చక్కగా వివరించారు హైమగారు.

    ReplyDelete
  2. సంతోషం ఉమగారూ! అమెరికా నుండీ చదివి నందుకు,ఎప్పుడు ఇండియా ఆగమనం!

    ReplyDelete