అల్లంబెల్లం చట్నీ రెస్పీ:-
1అల్లం ఒక చిన్నకప్పు,
2. బెల్లం అంతే కప్పు.
3.మినప్పప్పు- 2స్పూన్స్
4,. ఆవాలు 1స్లూన్.
5. ధనియాలు-3స్పూన్స్.
6.మెంతులు 1స్పూన్ .
7. కొద్దిగా ఇంగువ.
8. ఎండుమిర్చి -4,5 [ కారాని బట్టి]
9. చింతపండు ఒక [ అదేకొలత] కప్పు.
10. ఉప్పు- తగినంత.
తయారుచేసేవిధానం - ముందుగా మూకుడు స్టౌ మీద ఉంచి వెలిగించి 4 స్లూన్స్ నూనె వేయాలి. నూనెకాగాక పోపుసామానంతా వేసి బాగా బంగారు రంగువచ్చేవరకూ వేయించి, పక్కన పెట్టుకోవాలి. ముందుగా చింతపండు నీళ్ళలో నానబెట్టి ఉంచుకుని నానాక గుజ్జుతీసి ఉంచుకోవాలి, పోపుసామాను
మిక్సీలోవేసి గ్రైండ్ చేసి , బాగామెదిగాక అల్లం వేసి అది మెదిగాక చింతపండు గుజ్జు, బెల్లం [తురిమినది] , ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి, తగినంత నీరు పోసి గరిట జారుగా చేసుకోవాలి. ఇది ఇడ్లీల్లోకి, వడల్లోకీ, దోసె, బజ్జీ , చపాతీ, పూరీల్లోకి కూడా చాలారుచిగా ఉంటుంది.
ఒకమారు తిన్నారంటే వదలరు. చేసి చూస్తారుగా!
No comments:
Post a Comment