ఆదిదేవ
నమస్తూభ్యం .
1 ఉదయే బ్రహ్మస్వరూపాయ మధ్యాహ్నేతు మహేశ్వరః
సాయంధ్యయే సదా విష్ణుః త్రిమూర్తించ దివాకరః
అని ఉదయన్నేసూర్యదేవుని పూజిస్తాం.
2. సూర్యుడు ఒకగ్రహం కదా!దేవుడేంటీ అనుకుంటున్నారా!
సాధారణంగా ఎవరైనా మనకు సాయం చేస్తే ’ దేవుడి’లా వచ్చిసాయం చేశా డండీ !’ అంటాం కదా!
మరి మనకు సూర్యుడెంత సాయంచేస్తున్నాడు!
సూర్యోదయంతోనే మననిత్యకృత్యాలు మొదలవుతాయి. సూర్యాస్తమయంతో పూర్తవు తాయి. మనం ఎక్కడి కన్నావెళితే రాత్రయ్యే సరికి ఇల్లుచేరాలి, అనుకుంటాంకదా! అంటే సూరుడుండగానే మన పనులుచేసుకుని ఇల్లు చేరుతాం.
దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోడం అన్నమాట. సూర్యుడు మనకు రక్షకుడు.
సూర్యుని వల్లేమనకు ఎండ వేడి,
కాంతి ,మనపంట పొలాలకు మొక్కలకూ చెట్లకూ ఆహారం తయారుచేసుకోను సూర్యకాంతి కావాలికదా!
మురికి పోవాలటే సూర్యుని ఎండ కావాలి.మన బట్టలు ఆరాలన్నా,సూర్యుని ఎండ కావాలి.
మన ఆరోగ్యానికి హాని కలిగించే సూక్ష్మజీవులు నశించాలంటే మనకు సూర్యుని ఎండ కావాలి.
మనకు వర్షం కురవాలంటే సూర్యుని ఎండకావాలి.
భూమి మీద ఉన్న నీరు మన వాడుక వల్ల నదుల్లో నీరూ
, బావుల్లో నీరు , చెరువుల్లో కూడా మురికిఅవుతాయి. అందువల్ల సూర్యుడు ఆనీటినంతా తన కిరణాల ద్వారా గ్రహించి తిరిగి మనకు శుభ్రమైన నీటిని వర్షం ద్వారా అందిస్తాడు.
పక్షుల్లో చకోరం అనేపక్షి కేవలం వాననీరే నేరుగా నోరు తెరిచి త్రాగుతుంది. ఎక్కడా నీరూ త్రాగదు.
వర్షం వ చ్చేప్పుడు ఆ నీటి కోసం కాచుక్కూర్చుంటుంది. అందుకే ఎవరికోసమైనా ఎదురు చూస్తుంటే చకోర పక్షిలా ఎదురు చూస్తున్నారు అనే మాట వచ్చింది.
ఇహ సూర్యుడు నవగ్రహాల్లో ఒకడు.
ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః -
అంటూ మనం నవగ్రహాలను స్తుతిస్తాం. నవగ్రహలంటే- సూర్యుడు ,చంద్రుడు , అంగారకుడు (మంగళగ్రహం) బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువు. ఆదిత్యుడు అంటే సూర్యుడు.
1. సప్తాశ్వ రథమారూఢం ప్రచండ కశ్యపాత్మజమ్
శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమా మ్యహం
2. జపాకుసు మసంకాశం,
కాశ్యపేయం మహా ద్యుతిమ్
తమోరిం సర్వ పాపఘ్నం,
ప్రణతోస్మి దివాకరం - అని సూర్యుని ప్రార్ధిస్తాం.
ఎఱ్ఱని మందార పువ్వు రంగు వంటి శరీర కాంతితో,
ప్రకాశించేవాడూ, కశ్యపుని కుమారుడు, మహాకాంతి వంతుడు, చీకటిని తొలగించేవాడు అయిన సూర్యునకు నమస్కారము అంటూ ప్రతి హిందువూ ఉదయాన్నే స్నానం చేశాక ఈ నవగ్రహ శ్లోకాన్ని సూర్యునికి ఎదురుగా నిల్చి పఠిస్తారు.
సూర్యుని --ఆంగ్లంలో- సన్ అంటాము.
ఇక్కడ మనం మూడు విషయాలు గుర్తుంచు కోవాలి.
1.ఒకటి సూర్యుడు భౌతికంగా అంటే మనకు కనిపించేవాడు.
2. రెండవది సూర్యుడు ఒకగ్రహం అని.
3. మూడవది ఖగోళశాస్త్రం ప్రకారం సూర్యుడు.
భౌతికంగా సూర్యుడు.
మనం సూర్యోదయమైంది, సూర్యాస్తమయమైంది ,సూర్యూడు నడినెత్తికొచ్చాడు అనుకుంటాం, ఐతే సూర్యుడు కదులుతున్నాడా! అని ఆలోచిస్తే సూర్యుడు కదలడం లేదు. భూమే కదులుతున్నది.
భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. దానివల్లే రాత్రింబవళ్ళు కలుగుతున్నాయి. భూమి తనచుట్టూ తాను తిరక్కుండా సూర్యుని చుట్టూ మాత్రమే తిరుగుతుంటే భూమి మీది సగం మందికి ఎప్పుడూ రాత్రి,
మరో సగం మందికి ఎప్పుడూ పగలే ఉంటాయి.
ఎంతకష్టం, మీరు ఒక పరిధి గీచుకుని దానిమీదే మీచుట్టూ మీరు తిరగను ప్రయ త్నించండి.ఎంతకష్టం!భూమాత మనకోసం ఎంత కష్ట పడుతున్నది! సూరోదయానికీ, సూర్యాస్తమయానికీ, భూమి సూర్యునిచుట్టూ తిరగడమే కారణం.
కదిలే భూమి మీద ఉన్నమనకు కదలని సూర్యుడు కదులు తున్నట్లుగా కనిపి స్తాడు. వేగంగా వెళ్ళే రైల్లో కూర్చుని బయటి చెట్లను గమనిస్తే అవి వేగంగా వెనక్కు వెళుతున్నట్లు అనిపిస్తుంది. అలాగే భూమీ,
సూర్యుడూనూ.
భౌతికంగా మనకు కనిపించే సూర్యుడు ఉదయాస్తమయాల్లో ఒక గుండ్రని పెద్ద యాపిల్ లాగానో ఒక ఆరంజ్ లాగానో ఉంటాడు.
2.రెండవది సూర్యుడు ఒకగ్రహం - నవగ్రహాల్లో సూర్యుడు ఒక గ్రహం.
సూర్యునిగుణము-సత్వము ,ఆత్మపై తన ప్రభావం చూపుతాడు.
సూర్యుడు ఎముకలకు బలం చేకూరుస్తాడు.
సూర్యుని దిక్కుతూర్పు - అందుకేతూర్పుకు తిరిగి మనం నమస్కరిస్తాం.
సూర్యుని అనుగ్రహంవల్ల కోరిన విద్యలు లభిస్తాయి...
ఈయన ఆంజనేయస్వామికి నవవ్యాకరణాలు బోధించాడు,
వేదశాస్త్రాలన్నీ చెప్పాడు.
సూర్యుని తల్లిదండ్రులు అతిది -కశ్యపులు. భార్యలు ఉష,- ఛాయ.
ఉష బిడ్డలు - మనువు,యముడు, యమున- అశ్వినీకుమారులు. దేవతలకు వైద్యం చేసేవారు.
ఛాయబిడ్డలు - సంవీర్ణ,
'శని, 'తపతి.
అన్నిప్రాణులకు సూర్యుడే ఆధారం కనుక సూర్యుని ప్రార్ధిస్తే ఋణ, రోగ, శతృబాధలు నశిస్తాయి. మన మంత్ర పుష్పాలలో ఒకటిగా పేర్కొనే "యోపాంపుష్పంవేద, పుష్పవాన్ప్రజావాన్, పశు మాన్భవతి''
అనేవాక్యాలున్న మంత్రం అరుణం లోనిది.
నవగ్రహాల్లో సూర్యుడు ఒకగ్రహం.జ్యోతిషశాస్త్రంలో సూర్యుడు మొదటి గ్రహం రవి అనేపేరుతో .మన పురాణాల ప్రకారం వాస్తుశాత్రంలోనూ, జ్యోతిషశాస్త్రంలో నూ సూర్యునికి ప్రాధాన్యత ఉంది.
మూడవది ఖగోళశాస్త్రం ప్రకారం సూర్యుడు.
ఖగోళశాస్త్రం ప్రకారం చూస్తే ఖగోళంలోని అనేక నక్షత్రాలలో సూర్యుడు ఒక నక్షత్రం .
సూర్యుడు హైడ్రోజన్ ,హీలియంలతో కూడిన ఒక పెద్ద వాయుగోళం. సూర్యుని గురుత్వాకర్షణ శక్తి వలననే సౌరకుటుంబంలోని భూమి,
అంగారకుడు మొదలైన గ్రహాలు సూర్యుని చుట్టూ నిర్ధిష్ట కక్ష్యలలో తిరుగుతున్నాయి.
భూమినుండిసూర్యుడిదూరం: 149.8 మిలియన్కిలోమీటర్లు.
1.కాంతిఆవరణఉష్ణోగ్రత: 6000 సెంటిగ్రేడ్ డిగ్రీలు.
2.సూర్యునివ్యాసం:13,91,980 కిలోమీటర్లు.
3.సూర్యునివయస్సు: సుమారు 5 బిలియన్ల సంవత్సరాలు.
4.సూర్యకిరణాల ప్రయాణ వేగం: ఒక సెకనుకు 3 లక్షల కిలో మీటర్లు .
5.సూర్యకిరణాలు భూమిని చేరడానికి సుమారుగా 8 నిముషాల కాలం పడుతుంది.
6.సూర్యుడి ఉపరితలం నుండి వచ్చే ఉధృతమైన అయస్కాంత తరంగాల మేఘానికి శాస్త్రవేత్తలు పెట్టిన పేరు సౌరతుఫాను .
సూర్యనమస్కారాలు.
సూర్యనమస్కారాల వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, నాడీమండలం, గుండె మొదలైన అవయవాలకు బలం కలిగి రక్తప్రసరణ సక్రమంగా జరిగి ఆరోగ్యం కలుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పన్నెండు భంగిమలతో కూడిన సూర్య నమస్కారాలలో ప్రాణాయామం, ధ్యానం వ్యాయామం ఇమిడి ఉన్నాయి. శ్వాసపై ధ్యాస నిలిపి సూర్య నమస్కారాలు చేయాలి. శరీరంలో ఉండే ప్రతి అవయవంలోని విషపదార్థాలను ఈ నమస్కార భంగిమలు తొలగిస్తాయి.
సూర్యోదయంవేళలో సూర్యునికి అభిముఖంగా నిలబడి సూర్యనమస్కారాలు చెయ్యాలి.
ఆదిత్యహృదయం
ఆదిత్యహృదయం అనే స్తోత్రం సూర్యభగవానుడిని ఉద్దేశించినది.
తతో యుద్ద పరిశ్రాంతం సమరే చింతయా స్థితం
రావణంచాగ్రతో దృష్ట్వా యుద్దాయ సముప స్థితం-
రామాయణంయుద్ధకాండలో శ్రీరాముడు అలసటపొంది నప్పుడు,
అగస్త్యమహర్షి యుద్ధ స్థలానికి వచ్చి ఆదిత్యహృదయం అనే ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఈ మంత్రోపదేశము ఐన తర్వాత శ్రీరాముడు రావణాసురుడిని హతమరుస్తాడు.
అందువలన ఆదిత్య హృదయం ప్రతి ఒక్కరూ పఠిస్తే ధైర్యం , ఆరోగ్యం కలుగుతాయి. లోకోపకారం కోసం ఆకాశంలో సంచరిస్తూ వర్షాల ద్వారా జగత్తును పోషించి తన కిరణాలను ప్రకాశింప జేస్తున్నాడుబంగారువన్నెతో అద్భుతముగా ప్రకాశిస్తూ. బ్రహ్మాండములు ఉత్పత్తికి బీజమైనవాడు. చీకట్లను తొలగించుచు. సూర్యుని ప్రభావం ఉన్నవారు ఆత్మాభిమానం, చురుకుతనం ,సమయస్ఫూర్తి కలిగిఉంటారు.
‘ బిగ్బ్యాంగ్ ‘ థియరీ.
ఎన్నోకొన్నిలక్షల సంవత్సరాల క్రితం జరిగిన పెద్ద విస్ఫోటనం కారణంగా ఈ ఖగోళాలన్నీఏర్పడ్డాయని "బిగ్బ్యాంగ్'' థియరీ చెప్తుంది.
కానీ ఆ విస్ఫోటనానికి కారణం ఏమిటన్నది ఏ సైన్సు యింత వరకు వివరించలేదు.
‘ ఓంకార ‘ విస్ఫోటనంతో మొదట కాంతి ఏర్పడిందని, ఆ కాంతియే సూర్యుడని పురాణాలు చెప్తున్నాయి. నిజానికి సూర్యుడు భగభగ మండే అగ్నిగోళం మాత్రమే.
సూర్య రథాన్నిఆధారం చేసుకుని తక్కిన గ్రహాలన్నీ సంచరిస్తాయి.
ప్రతి రోజూ మనకు కనిపించే సూర్యుడి వయసు 460 కోట్లసంవత్సరాలు. మరో 460 కోట్ల సంవత్సరాల వరకూ సూర్యుడు వెలుగుతూనే ఉంటాడు. సూర్యుడి పై ఉన్న మండేందుకు తోడ్పడుతున్న హైడ్రోజన్ మరో 460 కోట్ల సంవత్సరాల వరకు మండు తూనే ఉంటుంది. అంటే ఇప్పుడు సూర్యుడు మధ్యవయసులో ఉన్నాడు.
సూర్యమండలం వ్యాసం 1,392,684 కిలోమీటర్లు. సూర్యునిపై సుమారు 10 లక్షల భూములు పట్టేంత స్థలం ఉంది.
సూర్యుని వెలుగు భూమిని చేరడానికి పట్టే సమయం ఎనిమిది నిమిషాలు. సూర్యుని ఉపరితల వాతావరణం లో 5,500 సెంటీ గ్రేడ్స్ఉష్ణోగ్రత ఉంటుంది. మనం వేసవికాలం లో 40సెంటీ గ్రేడ్ఉష్ణోగ్రత దాటితే అల్లాడిపోతాం. అదే 5,500 సెంటీగ్రేడ్ఉష్ణోగ్రత అంటే ఎలా ఉంటుందో మనం ఊహించుకోవడం కూడా కష్టమే.
సూర్యుడివేగంఎంతోతెలుసా? ఒకసెకన్కు 220 కిలోమీటర్లు. సూర్యునికి భూమికి మధ్య దూరంసుమారు 15 కోట్ల కిలోమీటర్లు ఉంటుంది. అందుకే సూర్యకాంతి భూమిని చేరడానికి ఎనిమిది నిమిషాల సమయం పడుతుంది. భూమికి,
సూర్యుడికి మధ్య దూరం సంవత్సరంలో 14 కోట్లకిలోమీటర్ల నుండి 15 కోట్లకిలోమీటర్ల మధ్యకు మారుతూ ఉంటుంది.
దానికి కారణం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడమే.
ఈ విశ్వం ఒక వృత్తం అనుకుంటే ,సంఖ్యా శాస్త్రం ప్రకారం దానికి 360 డిగ్రీలు వుంటాయి. సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున చరిస్తూ 360 రోజులలో ఈ వృత్తాన్ని పూర్తిచేస్తాడు. అదే మనకొక సంవత్సరం. అందుకే జోతిషశాస్త్ర వేత్తలు ఈ సృష్టి చక్రాన్ని 12 రాసులుగా విభజించి, ఒక్కొక్కరాశికి 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు.
సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్కరాశిలో సంచరిస్తాడు.
సూర్యభగవానుడు ప్రత్యక్షదైవం. సూర్యుని వల్లనే రాత్రి, పగలూ ఏర్పడు తున్నాయి. సూర్యుని వల్లే రాత్రింబవళ్లూ, గంటలూ, నిముషాలూ,రోజులూ, వారాలూ, మాసాలూ, పక్షాలూ, ఆయనాలూ, సంవత్సరాలూ మొదలైనవి జరుగుతున్నాయి. సూర్యుడు లేని ప్రపంచాన్నిమనం ఊహించలేము.
జగత్తంతా ఏర్పడటం ,అంతం కావడం అంతా సూర్యుని వల్లే. సూర్యుని లోక బాంధవుడు అంటారు.అంటే లోకానికంతా బంధువు,
మిత్రుడు అని అర్ధం.
సూర్యుని వల్లే లోకంలో సర్వకార్యాలూ జరుగుతున్నాయి. వైకుంఠం లో విష్ణుమూర్తి, కైలాసంలో శివశంకరుడూ, బ్రహ్మలోకంలో దీన్నే సత్యలోకం అనికూడా అంటారు, చతుర్ముఖుడూ ఉన్నట్లుగానే ఈసూర్యభగవానుడు ఉండే లోకం ఆదిత్యలోకం. అదే సూర్యమండలం.
తెల్లని సూర్య కిరణంలో ఏడు రంగులుంటాయి .ఇవే సూర్యుని సప్తాశ్వాలు . మనకు ప్రత్యామ్నాయ ఇంధన ప్రదాత సూరుడు .సోలార్ఎ నర్జీకి మూలం.
సూర్యుడు ఆరోగ్యప్రదాత .ఆయుర్దాత .సకల జీవరాశులకు శక్తి నిచ్చే మిత్రుడు. .సూక్ష్మజీవులను తన కిరణజాలంతో నశింపజేసే శక్తి కలవాడు .అన్నిటికీ ప్రత్యక్ష సాక్షి .కర్మసాక్షి .ఆ రధానికి ఏడు గుర్రాలు పూన్చబడి ఉన్నాయంటారు. ఈ ఏడు గుఱ్ఱాలు వారంలోని ఏడురోజులకు సంకేతంగా చెబుతారు.
సప్తాశ్వరధమారూఢమ్
ప్రచండంకాశ్యపాత్మజమ్
శ్వేతపద్మధరందేవమ్
తంసూర్యంప్రణమామ్యహమ్
సప్తాశ్వాలపేర్లు: గాయత్రి ,బృహతి ,ఉష్ణిక్ ,జగతి ,త్రిష్టుప్ ,అనుష్టుప్, పంక్తి . శ్రీసూర్యనారాయణ స్వామి దేవాలయాలు అరసవల్లి- ఆధ్రా ,కోణార్క్ -ఒడిషా లో ఉన్నాయి.
రథసప్తమి-
హిందువులు మాఘశుద్ధసప్తమిరోజున రథసప్తమి పండుగజరుపుకుంటారు
రధసప్తమి రోజు సూర్యుని పుట్టినరోజు. అందుకే ఆరోజున సూర్యదయానికి ముందే ఏడు జిల్లేడు ఆకులను తలపై ఉంచుకుని స్నానంచేస్తాం. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నంమాత్రమేగాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను,
ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈజన్మలోను,
గత జన్మ లోను (రెండు), మానసిక, వాచిక, శారీరకములు (మూడు), తెలిసిచేసేవి, తెలియకచేసేవి (రెండు) కలిసిమొత్తం ఏడుపాపాలు ,ఏడురోగాలకు కారణాలు.ఇవన్నీపోతాయని నమ్మకం . సూర్యుడు తన రధాన్ని మొదటి సారిగా ఎక్కిన రోజు కూడా ఈరోజే.
ఇంతేకాక సూర్యకిరణాలలోని ప్రాణశక్తిని అత్యధికంగా నిల్వచేసుకునేవృక్షం జిల్లేడు. ఏడాదికి ఒక్కసారైనా ఈ ఔషధాలను కలిగిన ఈ ఆకులను తాకినా, వాటి స్పర్శా ప్రభావం ఆ సంవత్సరమంతా శరీరంపై ఉంటుందనీ, ఈ పండుగ నాడు వీటిని తప్పక తలపై ఉంచుకుని స్నానం చేయాలని పెద్దలు నిర్ణయించారు.
భారతీయసంస్కృతిలోని ఆచారాలన్నీ ఆరోగ్యం కోసమే.
సూర్యునినుండే మనకు ‘డి’విటమిన్ లభ్యమవుతున్నది.
సూర్యకాంతిలోని నీలి కిరణాల ప్రభావం వల్లనే మన శరీరం సహజ సిద్ధంగా విటమిన్ 'డి'ని ఉత్పత్తి చేసుకొంటుంది. 'డి' విటమిన్లోపిస్తే ఎముకల పెరుగుదల తగ్గిపోతుంది. సూర్యకిరణజన్య సంయోగ క్రీయ వల్లనే సృష్టి,
ఆహారం, పోషణ మున్నగునవి ఏర్పడుతున్నాయి. సూర్య కిరణాలు మానవ శరీరంపై తప్పక ప్రసరించాలి. అందుకే భారతీయ సంస్కృతిలో సూర్యనమస్కారాలు ఉన్నాయి.
సూర్యోపాసనవల్ల, సూర్యగ్రహ ప్రభావం వల్ల ఆత్మశక్తి పెరుగుతుంది. నేత్ర శక్తి పెరుగుదలకూ, హృద్యోగ నివారణకూ సూర్యుడే ఆరాధ్యుడు. గాయత్రీమంత్రంసూర్యపరమైనదే .సూర్యానుగ్రహంతోనే పాండవులు "అక్షయపాత్ర'' పొంది అరణ్యవాస కాలంలో ఆహార సమస్య లేకుండా అతిథి సత్కారాలుచేస్తూ, ధన్యులయ్యారు.
No comments:
Post a Comment