చిట్టెలుకల సహకారం.
ప్రశాంతి పురంలో పరమేశం అనే ఒక మోతుబరి రైతు ఉండేవాడు. ఆయనకు ఉన్నపొలంలో వడ్లేకాక ,కందులు ,మినుములు, పెసలతో పాటుగా మెట్టపంటలైన రాగి, సజ్జ, జొన్న వంటి పంటలు కూడా పండే వి.
ఇల్లంతా ధాన్యపు బుట్టలతో, పాతర్లతో నిండి ఉందేది. ఆయన ఇంట ధాన్య లక్ష్మి కొలువై ఉండేది. అడిగినవారికి లేదనక సాయం చేసేవాడు.
ఒకమారు వరుసగా మూడేళ్ళు వానలులేక చెఱువుగట్టుపక్కనే ఉన్న పరమేశం పొలంలో కూడా ఒక్క గింజ పండలేదు. ఇహ ఊరిలో రైతు లంతా తిండి గింజలకు కటకటలాడి పోసాగారు.అంతా కరువు వ్యాపిం చింది. బీదా బిక్కీ తినను తిండిలేక చేయను కూలిపనులు దొరక్క ఆకలి కడుపులతో అలమటించి పోసాగారు.
అదంతా చూస్తున్న పరమేశం తనొక్కడే కడుపునిండా తినడం సరి కాదని పించింది. వెంటనే కొందరు పనివాళ్ళను పిలిచి ఆకలికి ఉండ లేక వచ్చే వారందరికీ అన్నం ,పప్పుపులుసు వండించి పెట్టసాగాడు. కొద్ది రోజులకు ఆకలికి ఆగలేక వచ్చేవారి సంఖ్య పెరిగిపోయింది.
బియ్యం గాదె నిండుకుంది. అప్పుడు రాగన్నం వండించి పెట్టసా గాడు. ఊర్లో కొందరు స్నేహితులు పరమేశం చేసే అన్నదానం చూసి,
" ఓ పరమేశం ! నీకేమన్న పిచ్చా! ఇలా ఊరూరు మందికీ అన్న దానం చేస్తే నీకేం మిగులుతుంది? ఒక రోజుకు నీవూ అన్నంకోసం అలమటిం చల్సి ఉం టుంది. చాలు ఇహ ఆపు." అన్నారు .
" మిత్రులారా! మీరు నా బాగుకోసం చెప్తున్నారు.సంతోషం. ఐతే ఊరు ఆకలి చావులతో పీనుగుల పెంటగా మారిపోతే నేను మాత్రం ఎలా బ్రతక గలను . అందరితోపాటే నేనూనూ. దేవుడిచ్చిన దాన్ని దాచుకుని ఏం చేసుకుంటా ను. మన్నించండి." అనిచెప్పి తన అన్నదాన వ్రతం కొనసాగించాడు.
గాదె ల్లో దాచిన రా గి, సజ్జ కూడా నిండుకుని ,చివరకు జొన్న గాదె నుంచీ ధాన్యం తీసి వండసాగారు.ఇహ ఎన్నోరోజులు ఇలా అన్న దానం సాగించ లేనని పరమేశానికి అర్ధమైంది.
'భగవాన్ ! నాకోసం కాకపోయినా ఊరి వారికోసం వాన కురిపించి పంటలు పండనీ . నీవు పుట్టించిన ఈ జనమంతా ఆకలి చావుల బారిన పడకుం డా కాపాడు ' అని ప్రార్ధించసాగాడు.
ఆరాత్రి ఆయన ధాన్యపు గాదెల మాటున ఎంతోకాలంగా ఆధాన్యం రాత్రులు తింటూ ఉన్న మూషిక మూక సమావేశమయ్యింది.' మిత్రు లారా! ఇంత కాలంగా మనమీ మహనీయుని ధాన్యం తింటున్నా మనలను చంపను మందుపెట్టక , పోనీలెమ్మని వదిలేసి,మనల్ని బతకనిచ్చాడు. ఇప్పుడు ఆకలితో ఉన్నవారి కడుపులు నింపుతూ ,తన ధాన్యాగారాలు వట్టిపోయినా అన్నదానం మానని ఈ మహనీయు నికి ఏదైనా సాయం చేద్దాం. ' అని నిర్ణయం తీసుకుని బయల్దేరాయి.
చెఱువు సమీపాన ఉన్న కొండల్లో ఉన్న జల మార్గాన్ని కనిపెట్టి ఆ వృష లోచనాలన్నీ[ఎలుకలు] తమ పదునైన నోళ్లతో నేలను తొలిచి చెఱువుకు నీరు పారేలా చేశాయి. తెల్లవారగానే ఊరిబయటకు బహిర్భుమూల కెళ్ళిన పల్లె జనం చెఱువు లో నీరు నిండుతుండటం గమనించి ఆనందంతో వెర్రి కేక లేశారు.
ఊరు ఊరంతా చెఱువు గట్టుకు చేరింది. ఉత్సాహంగానూ ,ఉబ లాటంగా నూ నీరు వస్తున్న తావును వెతుక్కుం టూ కొండ మీదకెళ్ళారు అంతా. అక్కడ ఇంకా నేల తవ్వుతున్న విఘ్నేశ్వర వాహన మూకను చూసి అంతా అచ్చెరువందారు. అవన్నీ జనాలను చూసి తలలు ఎత్తి చేతులు ఊపాయి తప్పభయంతో పారిపోలేదు.
ఆరోజుతో నీటి బాధ తీరి జనం పొలాలు పండించుకుని తమ ఊరికి పట్టిన కరువు రాకాశిని తరిమి కొట్టారు. మూషికాలు చేసిన సాయానికి ప్రతిగా తమ ఊరికి’ ప్రశాంత మూషికాపురం ‘ అని పేరు పెట్టుకున్నారు.
నీతి-
మనసుంటే మార్గ
ముంటుంది. ఎవరైనా సాయం చేయాలనే తలంపు కలి గితే భగవంతుడు శక్తి సామర్ధ్యాల నిస్తాడు.
చిన్న జీవులకైనా అపకారం తల పెట్టకపోతే అవి విశ్వాసంతో అవస రానికి సాయం చేస్తాయి. భగవంతుడు పుట్టించిన ప్రతి ప్రాణీ తిరిగి సాయం చేయను తప్పక ప్రయత్నిస్తుంది. ప్రతి ప్రాణిలోనూ ఉండేది భగవంతుడేకదా!
వెనుకాడక తప్పక ఇతరులకుసాయం చేయాలి.
****
No comments:
Post a Comment