Thursday 18 April 2019

అన్నమయ్య .


                                                అన్నమయ్య .
                                 annamayya కోసం చిత్ర ఫలితం
                 అదివో అల్లదివో శ్రీ హరి వాసము-
               పదివేల శేషుల పడగల మయము
                   అదె వేంకటాచల మఖిలోన్నతము-
               అదివో బ్రహ్మాదుల కపురూపము
                 అదివో నిత్యనివాస మఖిల మునులకు-                     
                అదెచూడుడదెమ్రొక్కుడానందమయము
 అంటూ తన వాక్చిత్రంతో , కమ్మగా కీర్తించి తిరుపతి దేవుని సర్వుల కూ కళ్ళకుకట్టినట్లు దర్శింప జేసిన అఖండభక్తుడు.
       పదకవితా పితామహూడు, సంకీర్తనాచార్యుడు, పంచమాగమసార్వ భౌముడు, ద్రవిడాగమసార్వభౌముడు -అనే బిరుదులు గడించినా వినయంలో, భక్తిలో అగ్రగణ్యుడు అన్నమయ్య.  
  తిరుమల దేవుడు  శ్రీవేంకటేశ్వరస్వామినీ, ఆయన దేవేరి అల మేలు మంగతాయారునూ కీర్తించనే  తన  జీవితాన్ని అంకితం చేసిన పరమ భక్తుడు అన్నమయ్య. ఆమహామహుని రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మధురంగా , మనో హరంగా, వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటలలో ఆధ్యా త్మికతను,  భగవత్తత్వాన్నీ జీవాత్మపరమాత్మలతాదాత్మ్య రహస్యాల నూ, లోకరీతినీ- నీతిని,  ధర్మాన్నీతన కీర్తనల్లోచూపాడు,కీర్తించాడు. దక్షిణాపధంలో భజన సంప్రదాయానికి అన్నమయ్యే ఆద్యుడు.  

          వేంకటేశ్వర స్వామితోపాటుగా అహోబిల నరసింహ స్వామివా రినీ , వైష్ణవ  సాంప్రదాయ దేవతలనూ కీర్తిస్తూ తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ  పాటలు,  శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు - ఇలా మొత్త ము ముప్పై రెండు వేల పాటలు వ్రాసాడు.
అన్నమయ్య వరపుత్రుడు.
 ఆయన జన్మ అతడి  తాతకు ముందే గ్రామ దేవత చింతలమ్మ ద్వారా సూచింపబడింది. ఆయన తాత నారాయణయ్య. చదువు లో వెనక బడటంతో గురువులకు భయపడి చనిపోవాలని నిర్ణయించు కుని ఆఊరి గ్రామ దేవత చింతలమ్మ గుడివద్ద ఉండే విషసర్పపు పుట్టలో చేయి పెట్టాడట.
  అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై అతని వంశంలో మూడవ తరంలో హరి అంశతో ఒక బాలుడు జన్మిస్తాడని చెప్పిందట.
ఆయన కుమారుడు నారాయణ సూరి. గొప్పవిద్వాంసుడు,అతని భార్య లక్కమాంబ. ఆమెది తాళ్ళపాక సమీప గ్రామం మాడు పూరు. అక్కడ ఉండే  విష్ణుమూర్తి ఆలయంలో ఆమె శ్రద్ధగా డేవుని పూజిం చేది!  వారికి చాలా కాలం బిడ్డలులేనందున తిరుమల వేంకటేశ్వరుని దర్శించి వారి కోరిక విన్నవించుకోను వెళ్ళారుట!
          వారు దైవ దర్శనం తర్వాత,ధ్వజస్తంభం ఎదురుట  సాష్టాంగ నమస్కారం చేసే ప్పుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందనీ అలా ప్రవేశగర్భం ద్వారా మహామహుని పుట్టుక జరిగిందనీ తెలుస్తున్నది.
సర్వధారి సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు (మే 9, 1408) కడప జిల్లా లోని రాజంపేట మండలం తాళ్ళపాక  గ్రామములో అన్నమయ్య జన్మించాడు.  8 యేట అన్నమయ్యకు ఆయన గురువు వైష్ణవ దీక్ష నొసగినపుడు అన్నమాచార్యుడని పేరు మారింది..
ఎనిమిదేళ్ళ  వయస్సులో ఒకనాడు భగవంతుని దర్శించాలనే కోరిక ఆపుకొనలేక , ఇంట్లో వారు అంగీకరించరనే భయంతో ఎవరికీ చెప్ప కుండా అన్నమయ్య కాలి నడకన తిరుపతి బయలుదేరాడు.     
      పసివాడైనందున సంప్రదాయం తెలియక తిరుమల కొండను చెప్పులతో కొండ నెక్కుచుండగా అలసిపోయి ఒక వెదురు పొదలో నిద్రపోయాడుట!. అప్పుడు ఆయనకు అమ్మలకు అమ్మ ఐన  అలి వేలు మంగమ్మ కలలో దర్శనమిచ్చి పరమాన్న ప్రసాదాన్ని అందిం చగా, ఆపసిబాలుడు " అమ్మా! అంతా స్వామి దర్శనార్ధమై వెళు తుండగా నేనెందుకు కొండ ఎక్కలేక ఆగిపోయాను ? నాకు ఆస్వామి దర్శనభాగ్యం కలుగదా?" అని అడగ్గా  ఆతల్లి " నాయనా! నీవు స్వామి నడయాడే పవిత్రమైనపర్వతాలను పాదరక్షలతో ఎక్కడంవలన పైకి చేరుకో లేకున్నావు ,వాటిని వదలిఎక్కు ,స్వామి దర్శనం పొందగలవు "  అని చెప్పిందట.
     అప్పుడు ఆమె కరుణకు ఆనందించిన అన్నమయ్య ఆ తల్లిని కీర్తి స్తూ శ్రీవేంకటేశ్వర శతకము రచించాడు. తిరుమల శిఖరాలు చేరు కొన్న అన్నమయ్య, స్వామి పుష్కరిణిలో  స్నానం చేసి, వరాహ స్వామి దేవాలయంలో ఆదివ రాహ స్వామిని దర్శించుకొన్నాడు. పిదప వేంక టేశ్వరుని కోవెల పెద్దగోపురము ప్రవేశించి "నీడ తిరుగని చింతచెట్టు" కు ప్రదక్షిణ నమస్కారాలు చేసి, గరుడ స్తంభానికి సాగిలపడి మొక్కు లు చెల్లించాడుట!.
 సంపెంగ మ్రాకులతో తీర్చిన ప్రాకారము చుట్టి "విరజానది"కి నమ స్కరించాడట!. యోగనరసింహుని , వరద రాజస్వామిని, వకుళా దేవినీ దర్శించుకుని  ,యాగశాలను చూచి , ఆనంద నిలయం విమాన మును ఆశ్చర్యంతో గమనించి మ్రొక్కాడు.
    కళ్యాణ మంటపమునకు ప్రణతులిడి,  బంగారు గరుడ శేష వాహన ములను దర్శించి ,బంగారు వాకిలి చెంతకుచేరి, దివ్యపాదాలతో, కటి వరద హస్తాలతో సకలా భరణ భూషితుడైన దివ్యమంగళ శ్రీమూర్తిని దర్శించుకొన్నాడు. తీర్ధ ప్రసాదాలను స్వీకరించి, శఠకోపముతో ఆశీర్వ చనము పొంది,  హుండీని దర్శించి తన పంచె కొంగున ముడి వేసుకొన్న కాసును కానుకగా సమర్పించాడట!
   రాత్రి ఒక మండపములో విశ్రమించాడు. తరువాత అన్నమయ్య కొండపై  కుమార ధార, ఆకాశ గంగ, పాప వినాశం వంటి తీర్ధాలను దర్శిం చి, ఒడలెరుగక  కొండపైనే స్వామిని కీర్తిస్తూ ఉండిపోయాడు ట!.  అతని కీర్తనలు విని ఆశ్చర్యంతో అర్చకులు అతనిపాటలు పరవ శంతో వింటూ ఆహారాదులు అందించ సాగారుట!.
 తిరుమలలో ఘనవిష్ణువు అనే ముని స్వామి అన్నమయ్యను చేరదీసి అతనికి భగవ దాజ్ఞను తెలిపి శంఖ చక్రాది కములతో  శ్రీవైష్ణవ సంప్ర దాయానుసారముగా పంచ సంస్కారములను నిర్వహించాడు.          
    గురువుల వద్ద వైష్ణవ తత్వాలను తెలుసుకొంటూ, ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ, వేంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమల లో నే అన్నమయ్య జీవించసాగాడు.
         అన్నమయ్య తిరుమలలోఉన్నాడనివిని అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళి అతనిని ఇంటికి  తిరిగి  రమ్మని బ్రతి మాలారు. మెదట తిరిగి ఇంటికి వెళ్ళను అంగీకరించని అన్నమయ్య గురువు ఆఙ్ఞపై తాళ్ళపాకకు తిరిగి చేరాశు. కాని నిరంతరం భగవ ధ్యానంలో ఉంటూ స్వామిని కీర్తిస్తూ రోజులు గడప సాగాడు.
          అతనికి యుక్త వయస్సు రాగానే తిమ్మక్క, అక్కమ్మ అనే కన్యారత్నాలతో వివాహం జరిపించాడు తండ్రి. వైవాహిక జీవితంలో పడిన అన్నమయ్య ఒకమారు తన ఇద్దరు భార్యలతో కూడి తిరుమల ను దర్శించాడు.
          సమయంలోనే  శ్రీవేంకటేశ్వరుని స్తుతిస్తూ రోజు కొక  కీర్తన విని పించాలని సంకల్పించాడట!.
అప్పటినుండి అన్నమయ్య పుంఖాను పుంఖాలుగా కీర్తనలు చెప్పా డు. అప్పటికే అతడి అండ జేరిన అతని శిష్యులు వాటిని గానం చేస్తూ తాళపత్రాలపై వ్రాయ సాగారు.  ఆతర్వాత అన్నమయ్య తన భార్యల తో కలసి తీర్ధయాత్రలకు బయలుదేరాడు. వారు ముందుగా తమ వూరి లో చెన్నకేశవుని అర్చించారు.
     దారిలో నెందలూరు సౌమ్యనాధుని, ఒంటి మిట్ట రఘురాముని, కడప వేంకటరమణుని, చాగలమర్రి చెన్నకేశవుని దర్శించుకొన్నారు. తరువాత నవ నారసింహ క్షేత్రం అయిన  అహోబిలం చేరుకొని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని , క్షేత్రాన్ని, తీర్ధాన్ని, దైవా న్ని అన్నమయ్య తన కీర్తనలతో స్తుతించాడు. అహోబిలంలో మఠం స్థాపించిన ఆచార్యుడైన  ఆదివణ్ శఠకోప యతుల వద్ద అన్నమయ్య సకల వైష్ణవాగమాలను అధ్యయనం చేశాడు. అతని బోధనల ద్వారా పరబ్రహ్మ స్వరూపమును అర్చించే దివ్య యోగంలో కుల విచక్షణ వంటి అడ్డుగోడలను కూల గొట్టాలని నిర్ణయించు కున్నాడు, దక్షిణా దిన ఎన్నో వైష్ణవ క్షేత్రాలను దర్శించుకొన్నాడు. అతని కీర్తనలు ప్రాచుర్యం పొందసాగాయి.

    శ్రీకృష్ణదేవరాయలుకు తాత ఐన సాళ్వ నరసింగరాయలు ,అపుడూ విజయగర రాజ ప్రతినిధి, దండనాధుడు కూడా. ఆయన టంగుటూరు కేంద్రంగా ఆ సీమపాలనా వ్యవహారాలు చూస్తుండేవాడు. అతనికి "మూరురాయరగండ" అనే బిరుదుండేది. అన్నమయ్యకీర్తనలు, అతని ఆశీర్వచన మహాత్మ్యం గురించి విన్న దండనాధుడు తాళ్ళ పాకకు వెళ్ళి అన్నమయ్యను దర్శించి , సాన్నిహిత్యాన్ని పెంచుకొ న్నాడు.
  తరువాత అతను పెనుగొండకు పాలకుడైనాడు.అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు.  తరువాతి కాలంలో రాజు అన్నమయ్య ను తనపై కూడా ఒక్కపదాన్ని రచించి వినిపించమని కోరగా , హరిని కీర్తించే నోట నరుని కీర్తించనని అన్నమయ్య అతడి కోరికను నిరాక రించగా ఆగ్రహించిన  రాజు పాత పరిచయాన్ని సైతం మరచి అతనిని చెరసాలలో సంకెళ్ళలో ఉంచాడట.
  తదుపరి తన తప్పు తెల్సుకున్న ఆ రాజు మన్నించమని వేడి చెరసాల నుండీ విడుదలచేసి, పూర్వంలా తన ఆస్థానంలోఉండ మని ప్రార్థించినా నిరాకరించి రాజాస్థానం తనకు తగినది కాదని తెలుసుకొని ,అన్నమయ్య తిరుమల చేరాడు.   
          తన శేషజీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలో, సంకీర్తన లతోగడిపాడు. కాలంలోనే అన్నమాచార్యులు బహుశా ఆధ్యాత్మిక సంకీర్తనలు అధికంగా రచించి ఉండవచ్చు.చివరి రోజుల్లో ఆయన వేంకటాచలానికి సమీపంలో ఉన్న "మరులుంకు" అనే అగ్రహారంలో నివసించేవాడు.  
అన్నమయ్య జీవితంపట్ల విరక్తుడై  నిత్యసంకీర్తనలతో రోజులు గడప సాగాడు. అతని కీర్తనలలోని ఆశీర్వచన మహాత్మ్యం, గానమాధుర్యం  కధలు కధలుగా వినిన ప్రజలు అతని సంకీర్తనా సేవకు తండోప తండాలు గా రాసాగారు.
95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య, దుందుభి నామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశి నాడు (ఫిబ్రవరి 23, 1503) స్వర్గ్స్తుడైనాడు. రాగిరేకుల మీద వ్రాసిన తిధుల కారణంగా అతని జన్మ, మరణ దినాలు తెలుస్తున్నాయి.  
 క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
 నీరజాలయమునకు నీరాజనం-- ఇలా హారతి పాటలు,
.జోఅచ్యుతానంద జోజో ముకుంద -రార పరమానంద రామ గోవింద-- అంటూ లాలిపాటలు
   నందు నింటను జేరి నయము మీఱంగ-
చంద్రవదనలు నీకు సేవ చేయంగ
   నందముగ వారిండ్ల నాడుచుండంగ-
మందలకు దొంగ మా ముద్దురంగ--  అంటూ గోపగోపికా కాంత లతో యశోదతో రేపల్లెలో  బాలకృష్ణుని క్రీడలను వర్ణించాడు.
  ఈ విధంగా ఆయన ఎన్నో కీర్తనలు కన్నడ, సంస్కృత , తెలుగు , తమిళ భాషల మేళవింపుతో అలాడు, భాషా భేదాలకు అడ్డుకట్ట వేయ టమే గాక ఆనాటి  సాంఘీక పరిస్థితులపై జనావళికి ఙ్ఞానోదయం కలిగేలా  తనకీర్తనల్లో పరిస్థితులను వివరించాడు
          బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మమొక్కటే అంటూ 600 సంవత్సరా లు క్రితమే మనషులంతా సమానమేనంటూ అన్నమయ్య కీర్తనలు రచించి సమాజానికి ఙ్ఞానబోధ చేశాడు.
అన్నమయ్య వంశం తెలుగు సాహిత్యానికి ఆభరణం.
    అన్నమయ్య తండ్రి మహాపండితుడు. తల్లి సంగీతకళానిధి. అన్నమయ్య  భార్య తిమ్మక్క తెలుగులో  తొలి కవయిత్రి.
 "సుభద్రా కళ్యాణం" మంజరి ద్విపద కావ్యం రచించింది.   పండిత వంశంలో పుట్టి , దైవ భక్తినిపానంచేసి ,సంగీతాన్నే ఆహారంగా తీసుకు ని పెరిగి, దైవ సంకీర్తనే జీవనపరమావధిగా జీవించి , సమాజంలోని దురాచారాలను కీర్తనల ద్వారా ప్రజలకు తెలియపరచి సమ సమాజ స్థాపనకు పునాది వేసిన మహామహుడు , సంగీత విద్వాంసుడు , శాశ్వ త కీర్తినార్జించిన అన్నమయ్య దేహంచాలించినా అందరి హృదయా ల్లో జీవించే ఉన్నాడు .                                                                                    
                                               *********





No comments:

Post a Comment