Tuesday, 9 April 2019

అవగాహన . - కధ .


అవగాహన .  
                    పూర్వం  పరిపూర్ణ దేశాన్ని '  పూజిత వర్మ ' అనే రాజు పరిపలిస్తూ ఉండేవాడు.ఆయన తన  ప్రజల ను కన్న బిడ్డల్లాగా చూసుకునే వాడు. ఎవ్వరికి అవసరమైనా స్వయంగా వెళ్ళి , ఏర్పాట్లు గావించే వాడు.  రాజ్యంలోని ప్రజ లంతా త్రాగునీరు ,సాగునీరు కోసం ఏనాడూ ఇబ్బందులు పడలేదు. ప్రజలంతా మహారాజును తండ్రిలా , దేవునిలా చూసు కునేవారు. ఆయన మాటే ప్రజలకు వేదవాక్కు.  
తమదేశంలో కష్టపడి పంటలు పండించే అన్నదాతలకు సరైన రీతిలో  మేలు చేయా లని  సంకల్పించాడు.  దీనికోసం ముందు ఎంత సంకటపరిస్థితి ఎదురైనా తన ఆలో చన కు రూపకల్పన చేయాలని నిర్ణయించుకున్నాడు. 
  మహారాజు ఆదేశంలో వ్యాపారరులంతా రైతులు పండించే పంట లను రాజు నిర్ణ యించినధరకు కొనాలనీ, వాటిని విదే శాల్లో అమ్ము కోవచ్చనీ ప్రకటించాడు.దీనివల్ల పేదరైతులంతా లాభపడగా, వ్యాపారులు తమకు నష్టం కలిగిందని బాధపడ్దారు. వ్యాపారులు తమ లాభాల్లో పదో వతు పన్నుగా చెల్లించాలనే నిబంధన పెట్టా డు. అదీ వారికి కష్టంగా తోచింది.కాని రాజాఙ్ఞ  ధిక్కరించే ధైర్యం లేనందున పన్నుచెల్లిస్తూ ఉండే వారు.  
   ఇలాఉండగా మహారాజుగారి ఏకైక కుమారుని విధ్యాభ్యాసం పూర్తై  ,గురుదేవులు అతడ్ని మహా రాజు కు అప్పగించను వచ్చా రు. మహారాజుగారు గురుదేవులను సాదరంగా ఆహ్వానించి , అర్ఘ్య పాద్యాదు లు సమర్పించుకుని, తమ పుత్రు ని సకల విద్యా వంతుని చేసి నందుకు,కృతఙ్ఞతలు తెలుపు కున్నారు రాజదం పతులు.
   గురుదేవులు సంతృప్తితో ,   " మహారాజా! తమ బిడ్డడే కాదు, 'పరిపూర్ణ'దేశానికి కాబోయే మహారాజు.రాజు విద్యా వంతుడు, గుణ వంతుడు ఐతేనే కదా, రాజ్యంలోని ప్రజలంతా సుఖ శాంతులతో  వర్ధి ల్లేది! అందువల్ల మేం చేసిన పనేం గొప్పది కాదు, పైగా అది మా కర్తవ్యంకూడా  . మహారాజా !అన్నట్లు  మేమొక మాట చూచా యగా విన్నాం , వేగులవలన...."
   "గురుదేవా ! మీరు ఏం విన్నారో , మీకు అభ్యంతరం లేకుంటే మేం తెలుసుకోవచ్చా!" అని మహారాజు అడుగగా ,
"తప్పక మహారాజా! మీకు తెలుపాలనే నేను వచ్చాను.మన రాజ్యం లోని వ్యాపారులు కొంత అసంతృప్తిగా ఉన్నట్లు విన్నాం. వారు తమ లాభాల్లో  ఎక్కువభాగం పన్నుగా చెల్లించను ఇష్ట పడటం లేదనీ, వారంతా ఒక సంఘంగా ఏర్పడి తమతో ఏదో విన్న వించుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు తెలియ వచ్చింది.  ..."
 " అవును గురుదేవా! మేమూ చారులవలన ఆవిషయం విన్నాం. కానీ వారు అధిక లాభాలు గడించి,ఒక రోజుకు మహా రాజుల మైన మమ్ములనే మించిన ధనవంతులు కావచ్చు, అంతేకాక వ్యాపా రు లంతా అధిక ధనవంతు లైనపుడు, రాజో ద్యోగులు కూడా తమ పనులు మానేసి, లాభాపేక్షతో వారూ వ్యాపారానికి దిగ వచ్చు.ఇపుడు మనం ప్రజ లందరిపైనా పన్నులు వేయడం లేదు. వ్యాపారులు చెల్లించే  పన్నులతోనే ప్రజా సౌక ర్యాలు  చేస్తున్నాం.అందుకే ప్రజలంతా రాజ విధే యులై సుఖంగా ఉంటున్నారు. పేదవారు సైతం తిండికి, బట్టకూ ఇబ్బంది పడటంలేదు. నేను అది ఆలోచి స్తున్నాను గురుదేవా!" అన్నాడు మహారాజు.
"మాహారాజా! నాకో ఉపాయం . మనదేశంలోని వ్యాపారులను వారి కి ఇష్టమైతే ఇతర దేశాలకు వ్యాపారాలు చేసుకు వెళ్ళి వ్యాపారా లు చేసుకోవచ్చనీ ఆలాభాల్లో ఏమాత్రం పన్ను చెల్లించక్కర్లేదనీ ప్రక టించండి.వారికి అప్పుడు ఇతరదేశాల్లో వ్యాపారం, చెల్లిం చేపన్ను గురించీ అవగాహన కలుగు తుంది.పైగా మన దేశీయ వస్తువులకు ఇతర దేశాల్లో గిరాకీ కలుగు తుంది. మీరూ బాగా యోచించి నిర్ణయిం చండి "అనిసలహా ఇచ్చారు  గురుదేవులు  . 
 "తప్పక గురుదేవా!మీ సూచన పాటిస్తాను." అని సగౌరవంగా గురు దేవుని సాగనంపారు మహారాజు.
   ఇతరమంత్రులందరితో యోచించి గురువుగారిచ్చిన సూచన బావుందని అంతా నిర్ణయించాక , మహారాజు ఆవిషయాన్ని ప్రక టించారు .
   ఈప్రకటన విని వ్యాపారులంతా ఒక కూటమిగా తయారై ,చాలా సంతోషంగా మహా రాజు కు ధన్యవాదాలు చెప్పుకుని, తాము ఇతర దేశాలకు  వ్యాపారార్ధం వెళ్ళను అను మతిపత్రాలు పొందారు.
   అలా చాలామంది వ్యాపారులు ఇతరదేశాల బాటపట్టారు. ఎక్క డాలభించని ఎన్నో వస్తువులు పరిపూర్ణ దేశంలో విరివిగా లభిం చ టాన వాటికి బాగా గిరాకీ పెరిగి రైతులంతా ఆయా పంటలు బాగా పండించి అమ్ముకుని సొమ్ము చేసుకోసాగారు.
   ఇతరదేశాలకు వెళ్ళిన వ్యాపారుల కు , కొంతకాలానికి   యా దే శాల రాజులు విధించే పన్నులు చెల్లిం చడం చాలా కష్టంగా ఉండ టాన , తాము చేస్తున్న వ్యాపారా నికీ తమ రాజుకు చెల్లించే పన్నూ పోల్చుకుని వారంతా తమ వ్యాపారాలు కట్టేసుకుని స్వ దేశాని కి తిరిగి వచ్చారు.   
   ఇతర దేశాల్లో పరిపూర్ణ దేశంలో పండే వస్తువులకు అలవాటైన  ఆయాదేశాల ప్రజలు పరిపూర్ణ దేశానికి వచ్చి వస్తుకొనుగోలు నేరు గా పండించిన వారినుంచే చేయడంతో రైతులకులాభం చేకూరింది.  వ్యాపారులు తాముకట్టేపన్ను  , తాము అక్కడ చేసి న వ్యాపారానికి ఇతర దేశాల కు కట్టే దానికంటే తక్కువగా  ఉన్నందున మౌనంగా ఉండి పోయారు.
      మహారాజు ఇతర దేశా లనుండీ వస్తువులు కొనే వారిపైనే పన్ను స్వీకరిస్తూ , తన దేశంలోని వ్యాపారు లవద్ద తగ్గించారు. ఇలా వ్యాపా రులకు పైదేశాల్లో వ్యాపారం గురించీ  అర్ధమై మహా రాజుకు ధన్య వాదాలు చెప్పుకున్నారు.   
           తమదేశంలో కష్టపడి పంటలు పండించే అన్నదాతలకు సరై నరీతిలో  మేలు చేయాలని  సంకల్పించాడు. దీనికోసం ముందు ఎంత సంకటపరిస్థితి ఎదురైనా తన ఆలోచనకు రూప కల్పన చేయాలని నిర్ణయించుకున్నాడు. 
            ఇలా మహారాజు యోచన కార్యరూపం దాల్చి రైతులంతా సంతోషించగా, వ్యాపారులు తమలాభాలు తమకు మిగులు తున్నందుకు ,ఇతరదేశాల్లో వ్యాపారం పట్ల అవగాహన కలిగి సంతోషించారు. మహారాజు యుక్తి  ఫలించింది.
                                                   ***


No comments:

Post a Comment