అహింసా ప్రధమం పుష్పం .
చాతుర్మాస దీక్షంటే నే పూజలూ ..ఉపవాసాలూ, పుణ్య సంపాదనే అంతానూ. ఈపూజకై పూల కోసం పూర్వం గ్రామాల్లో ఉదయాన్నే పూల సంచీ పట్టుకుని తోటలవైపు వెళ్ళేవారు , సంచీ నిండా పూలుతెచ్చి మాలలుకట్టి, మధ్యాహ్నం, వంటై , మహా నివేదన ముందు పూజ వేళకు దైవ మందిరం లో ని పటాలన్నింటికీ,
పూజా విగ్రహాలకూ, అలంకరించి, హారతి, నివేదన అయ్యాక భోజన కార్యక్రమం మొదలయ్యేది.
ఈ ఆధునిక నవనాగరిక యుగంలో , బెంగుళూరు , హైదరాబారు , ముంబై వంటి మహా నగరాల్లో , పేరుకు అందరి ఇళ్ళలోనూ పూల కుంపట్లు [ అదే తొట్లు] ఉంటాయికానీ ఆపూలు కోసి దేవునికి అలంక రించనూ కాదు, తలలో తురుము కోనూ కాదు, అలంకారానికే!
కోయ కుండా మొక్కలకే ఉంచి ఇంటికి వచ్చినవారు ,
" ఆహా! మీ పూల మొక్కలెంత అందగా ఉన్నాయ్! ఎన్నిపూలూ పూస్తున్నా య్!
ఏ ఎరువేస్తారు?
ఎన్ని నీళ్ళుపోస్తారు
? " అంటూ అడుగుతుంటే ఎంత గర్వంగా ఉంటుందో! అలా మురిసిపోనే
ఇంటి పూలకుండీలు!మరి పూజకు పూలెలా ! అంటారా !అక్కడికే వస్తున్నా..[అసలు పూజచేసే తీరి కెవరికి ? విశ్రాంత ఉద్యోగులూ, అరవై పదుల తర్వాత వారూ తప్ప , పరుగుల ఉరుకు ల జీవితాలాయె ]
ప్రతిరోజూ ఉదయాన్నే నడక్కు నడకా పాలు లీటరుకు రెండురూపాయలు తక్కువకూ వస్తాయని పాలసంచీ తగిలించు కుని బయట నడుస్తూ వెళ్ళి రావటం అలవాటు. ఈ బెంగుళూర్లో వాతా వరణం ఎప్పుడెలా మారుతుందో చెప్పలేం, అందుకే మఫ్లర్ పెట్టుకునే బయల్దేరాను. మలుపు తిరగ్గానే ఒక పెద్దమేడ నాలుగంతస్తులు లిఫ్ట్ లేకుండా ! దానిముందు హైపవర్ కరెంట్ వైర్లు పోతుండటాన వదిలేసిన స్తలంలో ఆ ఇంటివారు ఫెన్సింగ్ వేసుకుని పూలమొక్కలు పెంచుతున్నారు
. చూడగానే కళ్ళు జిగేలు మనిపించే రం
గుల పూలు దారెంట పోతున్నవారినంతా
ఆకట్టు కుంటుంటాయి . ప్రతిరోజూ ఒక పోలితీన్ కవర్ పట్టుకుని దాన్లో ఇళ్ళ ముందు వేసుకున్న పూల మొక్క లనుండీ
ఒకావిడ పూలు తస్కరించి దేవుని సత్కరిస్తుంటుంది పాపం!
ఆరోజూ ఆ ఇంటి ముందు ఫెన్సింగ్లో
వేసుకున్న పూలమొక్కల నుండీ బయటి కొచ్చిన కొమ్మల కున్న మందారపూలు తుంచు తుండగా , పొగమం చులో ఆమె ఎవ్వరికీ కనిపించ ననుకుంది పాపం, ఆ ఇంటావిడ
" ఎవరక్కడ! పూలుకోస్తుంటిరి!
రోజూ కాపలా కాస్తుండాల, కొనుక్కుని పూజ చేసు కోరాదూ, మీకు కాపలా కాయేంకే నాకు సరిపోతున్నది..."
అంటూతిట్ల పురాణం విప్పిం ది.
[తప్పక ఆమె బంధువు లెవరో ఎం ఎల్ ఏ లో, ఎంపీలో కనీసం పంచాయితీ మెంబర్లో ఐఉంటారని పిస్తుంది, ఆతిట్ల పురాణం వింటుంటే, రాజకీయ గంధం లేని మరొకరికి అంత ఆతిట్ల పురాణం అంత శ్రావ్యంగా పాడటం రాదు గాక రాదు ] .
పాపం గబగబా పూల సంచీ పమిటకొంగులో దాచి పెట్టుకుని " ఇక్కడు న్న గరిక కొసుకుంటున్నా
వినా యకునికి
" అంటూ గరిక పట్టుకుని రోడ్డు మీదకు
వచ్చింది .
రోజూ చూసేదే ఐనా నాక్కాస్త బాధని పించింది. పూజకు పూలు కొనుక్కోవాలి,
లేదా ఇంటి కుండీ ల్లోపెంచుకుని
వాటిని అలంకారానికి
కాక కోసుకోవాలి, ఇలా దొంగతనంగా , తిట్టించు కుంటూ కోసి పూజచేస్తే దేవుడు సంతోషిస్తాడా!
పూజ అనేక విధాలు, తిట్ల పూజ, పూల పూజ, శాపనాద్థాల పూజ, భక్తిపూజ, మానసిక పూజ, బడాయి పూజ, అంతః కరణపూజ, [ బడిత పూజా ఉందికానీ అది మనుషులకే పరిమితం.!.]
ధార్మికపూజ , బంగారు పూలపూజ, వెండి పూల పూజ, అష్టపుష్ప పూజ, అహింసా ప్రధమంపుష్పం పుష్ప మింద్రియ నిగ్రహం…. అంటూ అష్ట పుష్పాలపూజ శ్లాఘనీయం, ఈ దొంగపూలపూజ ఎవరికోసం! నవ్వురాదూమరి!
**************…
No comments:
Post a Comment