Thursday 18 April 2019

నాన్నంటే ?


                     నాన్నంటే  ?                                                                        నాన్నంటే ఒక వట వృక్షం -
 చల్లని నీడనిచ్చేమహావృక్షం’,
కోరినవన్నీ తీర్చే కల్పవృక్షం
ఎల్లప్పుడూపిల్లల పక్షం
భగవంతునికి ప్రతి రూపం
జన్మ నిచ్చినదయారూపం,’
తన సంతానం కోసం శ్రమించేమానవ కర్మాగారం’,
పిల్లలపై మమకారం వర్షించే మహాకరుణా మేఘం
తన జీవన సాఫల్యాన్నంతా
తన సంతానంలో చూసుకునేదర్పణం’,
 సుఖాన్నంతా శ్రమగా మార్చి
బిడ్డల ఉన్నతికే కరిగించేకర్పూరం’, నాన్నంటే ఒకనడయాడే దైవం’,
సంతు కుశలంకోసం కృషిచేసేకువలయం
నాన్నంటే కాదు ఓమానవాకారం,
మనసంతా తనవారిపై ప్రేమ నింపుకున్నఅమృతాకారం’,
పోరగాళ్ళకై జీవిత మంతా 
పోరు సలిపేపోరాట  రత్నం’, జీవన సమరంలో
ఆటుపోట్ల  జాడలు చెప్పేజోదుముత్యం’, 
నాన్నంటే ఒకజీవన వేదం’ –
నాద రూపం’ 
నాన్నంటేత్రిమూర్తాత్మక దైవ స్వరూపం’.
-నాన్నంటే కాదు ఓమానవాకారం,
నీకు జన్మనిచ్చి, సామాజంలో ఒక మంచి
మానవునిగా మార్చేబ్రహ్మన్ ‘,
పెంచిపోషించి,
విద్యాబుధ్ధులు నేర్పేవిష్ణు భగవాన్’,
నీకో స్పృహ నిచ్చి, గుర్తింపు వచ్చేలా చేసే
పరమ శివన్ ‘,  
ఎన్నడూ మరువకు ఆదరించడం,
ఆశీర్వచనాలు పొందడం  .  
                                                               
                    *****   The End


No comments:

Post a Comment