Wednesday, 1 August 2012

విశ్వమానవప్రేమికుడు అరవిందుడు.


యోగి అరవిందఘోష్  మహర్షి    
     . స్వాతంత్య్ర సముపార్జనకు తమదైన శైలిలో శ్రమచేసినమహానుభావుడుఅరవిందమహర్షి .ఆయన  తన జన్మదినం నాడే భారతదేశ దాస్యశృంఖలాలుఖండింపబడతాయని  ముందేచెప్పినజాతీయోద్యమ  నాయకుడు, సత్య సంకల్పుడు, ఆయనవలెనే ఆయన పాజిటివ్ థింకింగ్ ఎంతో మహోన్నతమైనది!
 అరవిందఘోష్ సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు,ఒక మంచి కవి ,జాతీయవాది,యోగి,తత్త్వవేత్త.గురువు.
అరబింద్ ఆగస్టు 15, 1872 న కోల్‌కతా లో కె.డి.ఘోష్ ,స్వర్ణలతాదేవిలకుజన్మించాడు.తండ్రికె.డి.ఘోష్  వైద్యుడు.తల్లి స్వర్ణ లతా దేవి గొప్ప భక్తురాలు.ఈయన పూర్తి పేరు అరబిందో ఘోష్. అరవింద అనగా బెంగాలీలోపద్మముఅనిఅర్థం.అరవిందఘో ఘోష్ కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయంలో  అసాధారణతిభావంతు   డైన విద్యార్థిగా గుర్తింపు పొంది, సివిల్ సర్వీస్(ఐసిఎస్) పరీక్షలోఉన్నతశ్రేణిలోఉత్తీర్ణుడయ్యారు..ఐసిఎస్ పదవిని నిరాకరించి 1892లో భారతదేశానికి తిరిగి వచ్చాడు.
         సాహిత్య వ్యాసంగంలో కృషిచేస్తూనే , స్వాతంత్య్రోద్యమపొరాటంలోపాల్గొన్నాడు.ఈ పొరాటములో ఈయన  అతివాదులుగా విప్లవమార్గాన్నిఎంచుకొన్నారు."బరోడా"కుట్ర కేసులోఈయనకలకత్తా కేంద్ర కారాగారములో వున్నప్పుడుకలిగినఅనుభూతులతో పూర్తిగా ఆధ్యాత్మిక మార్గములో పయనించారు. వడొదరాలోనిమహారాష్ట్రయోగి ఐన’ విష్ణుభాస్కర్ లెలె ‘ఉపదేశముతోఅధ్యాత్మికమార్గంపట్ల ఆకర్షితుడై అరబిందో రాజకీయం నుంచి ఆధ్యాత్మికత వైపుకు క్రమక్రమంగా ప్రవేశించడం జరిగింది.. రెండవసారి కోల్‌కతాలోని ఆలీపూర్ కేంద్రకారాగారంలోశిక్షఅనుభవిస్తున్నపుడుఆధ్యాత్మికత పట్ల గాఢమైన ఆసక్తి కలిగింది.ఇక్కడఆయనచేసినభగవద్గీతపారాయణం,అనుసరణఆయనకుఅనేకఆధ్యాత్మికఅనుభూతుల్ని కలిగించాయి.
ఆతరువాత పాండిచ్చేరిలో ఆశ్రమస్థాపనచేయటం జరిగింది. అరవిందునిబోధల వలన ఎంతోమంది ఆయనకుశిష్యులుగామారారు.అరవింద్‌.‘ Thelifedevine,‘సావిత్రి’లాంటిఅద్భుతమైనకావ్యాలను  అందించిన ఋషి అరవిందమహాశయుడు. పరిపూర్ణమానవుని అవతరణ జరుగుతుందని, దానికోసం తన తపశ్శక్తిని వెచ్చించి అత్యున్నతమైన ఆధ్యాత్మికప్రవాహాన్ని భూమి వైపు మళ్ళించిన గొప్ప యోగ సాధకుడు అరవిందయోగీంద్రులు.  
‘న్యూ ల్యాంప్ ఫర్ ఓల్డ్’అనేశీర్షికనముంబాయికి చెందిన ‘ఇందు ప్రకాశ్ పత్రికలో 1893 ఆగష్టు నుంచి 1894 మార్చివరకూఅనేకవ్యాసాలనుచాలాఘాటుగారాశాడు. జాతీయతఅనేది మతం. దాన్ని దైవం ఇచ్చింది. ఈ భావం హృదయానికి, ఆత్మకు సంబంధించినదని అరవింద ఘోష్ జాతీయతను నిర్వచిస్తూ వ్యాసాలనురాశారు.1906లో అరవిందఘోష్ కళాశాల అధ్యక్షుడయ్యాడు. బెంగాల్ జాతీయ కళాశాలను స్థాపించి, బిపిన్‌ చంద్రపాల్, తిలక్‌లతో కలిసి రాజ్యాంగ పద్ధతుల ద్వారా ఆందోళన కొనసాగించాడు. విదేశీ వస్తు బహిష్కరణ అమలు జరిపాడు. వీటన్నిటి ద్వారా దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించవచ్చని సూచించాడు. 1905లో బెంగాల్ విభజనానంతరంరాజకీయాల్లోచురుకుగాపాల్గొన్నారు. ‘వందేమాతరమ్ పత్రిక నిర్వహణలో బిపిన్ చంద్రపాల్‌తోసహకరించారు. ‘బెంగాల్ యుగంధర్ పత్రికను ప్రారంభించారు.పుదుచ్చేరిలో నాలుగుసంవత్సరాలు ఏకాగ్రతతోయోగాభ్యాసం చేసినతదనంతరం 1914 వ సంవత్సరంలో' ఆర్య 'అనే అరవై నాలుగు పేజీల సమీక్షను మాసపత్రిక రూపంలో వెలువరించాడు. తర్వాతఆరున్నరసంవత్సరాలపాటుఆయనఈపత్రికద్వారానేతనముఖ్యమైనరచనలనుధారావాహికంగా ప్రజలకు చేరవేశాడు.
తీవ్రవాద జాతీయవాదాన్ని సమర్థించిన తత్వవేత్తలు, భారతదేశపు సర్వజ్ఞతను విశ్వసించారు. విదేశీ ప్రభుత్వసంస్థలప్రాబల్యం, సంస్కృతీ ప్రభావంనుంచి స్వాతంత్య్రం సాధించిన తర్వాతే హిందూ సంస్కృతి శిఖరాగ్రాలను అందుకుందని వారు నమ్మారు. జాతీయతను మత పరిభాషలో ప్రకటించారు. 
అరవిందఘోష్ అకుంఠిత దీక్షతో భారతమాత దాస్యశృఖంలాలను పగులగొట్టడానికి సాయుధసమరం జరిపినస్వాతంత్య్ర యోధుడు. అనేక ఏళ్ళపాటుపుదుచ్చేరిలో ఆయనకార్యకలాపాలుసాగించారు.బ్రిటిష్ దురాక్రమణకు ప్రతినిధి ఐనఆనాటి వైస్రాయ్ లార్డ్ మింటో చేత ‘మోస్ట్ డేంజరస్మాన్అనివర్ణించబడిన, నాటివిప్లవవీరుడు అరవిందుడు1910ఏప్రిల్ 4న బ్రిటిష్ పాలనలోఉన్నభారతదేశాన్నివదిలి, ఫ్రెంచి వారి ఆక్రమిత ప్రాంతమైన భారతదేశంలోని పాండిచేరిచేరాడు.
       1902 ప్రాంతాలలో, కింగ్స్‌ఫర్డ్ అనేఆంగ్లేయుడు,నాలుగుసంవత్సరాలు కలకత్తాలో మేజిస్ట్రేట్‌గా పనిచేసాడు. అతడుచాలా కఠినుడు, రాజకీయ నేరాలకు ఆయన శిక్షలు చాలా దారుణంగా వుండేవి. ‘వందేమాతరం’అని నినాదమిచ్చిన నేరానికి, బహిరంగంగా కొరడాదెబ్బల శిక్షవిధించాడు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ లార్డ్‌మోరే కూడా ఈ దారుణ శిక్షలకు చలించిపోయి, వైస్రాయ్ లార్డ్‌మింటోకు అంత తీవ్రమైన శిక్షలనుతగ్గించమనిఉత్తరంరాసాడు. తరువాత కింగ్స్‌ఫర్డ్, బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు జిల్లా జడ్జిగా వెళ్లాడు.బెంగాల్విప్లవకారులసంఘంఅతనినివధించాలనినిర్ణయించింది.ఈబాధ్యతఖుదీరాంబోస్,ప్రఫుల్ల రాకీలకుఅప్పగించబడింది.1908 ఏప్రిల్ 30 తేదీనవీరిరువురూ,కింగ్స్ ఫర్డ్ అనుకునివేరే బండి మీద బాంబులు విసిరారు. దానిలోని, కెన్నడీఅనే కుటుంబానికి చెందిన, ఇద్దరు స్త్రీ లు మరణించారు.దానితో దేశమంతా గగ్గోలెత్తింది మే 1నఖుదీరాంబోస్ అరెస్టయితే అరెస్టయిన ప్రఫుల్లరాకీ తాను రహస్యాలు ఎక్కడ బయటపెడతానో అన్న భయంతో ఏప్రిల్ 5న తానే కాల్చుకుని ఆత్మహత్యచేసుకున్నాడు. దీని వెనక గల కుట్రను ఛేదించదలుచుకున్న ప్రభుత్వం, అరవిందుల పేరుతోగల 'మురారి పుకార్ 'తోటను సోదాచేసి అరవిందుల సోదరుడు హరీంద్రనాథ దత్‌ను, ఇంకా కొంతమందిని అరెస్టు చేసారు.
అదే ప్రసిద్ధి చెందిన ఆలీపూర్ బాంబు కేసు. దానిని కలకత్తా సెషన్స్ కోర్టులో విచారించింది బీచ్ క్రాఫ్ట్ అనే ఆంగ్లేయుడు . విచిత్రమేమిటంటే ఈయన అరవిందులు, కేంబ్రిడ్జ్‌లో సహోధ్యాయులు. గ్రీకుభాషలో అరవిందులు ప్రథముడైతే, బీచ్‌క్రాఫ్టు ద్వితీయుడయ్యాడు. ఈ కేసు విచారణకు ప్రభుత్వం పట్టుదలతో మద్రాసులోని ప్రముఖ క్రిమినల్ న్యాయవాది నార్టన్‌ను ప్రత్యేక ప్రాసిక్యూటర్‌గా నియమించింది. మరి వారికి దీటైన న్యాయవాది, ముద్దాయిల తరఫున ఎవరు వాదించగలరు? అపుడే చిత్తరంజన్‌దాస్ ఈ భారాన్ని వహించారు. పూర్తి కాలాన్ని ఈ కేసుకేవెచ్చించడంతో,ఆకర్మయోగికిచివరికిమిగిలిందిఏభైవేల అప్పు.... బండిని గుర్రాలను అమ్మేసుకున్నారు! 9 రోజులపాటు సాగిన ఆయనవాదన ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది.తనవాదననుముగిస్తూఅరవిందులవాణివారిమరణానంతరంకూడఒక్కభారతదేశంలోనేకాకుండా ప్రపంచమంతావినిపిస్తుందన్నారు! సరిగ్గాఅదేజరిగింది.దేశభక్తి వైతాళికుడుగా, జాతీయవాదప్రవక్తగా వున్న శ్రీ అరవిందులు ఆతరువాత విశ్వమానవ ప్రేమికునిగా అవతరించారు. 1909లో మే 6న బీచ్ క్రాఫ్ట్, అరవిందుడునిర్దోషిఅనితీర్పుచెప్పారు! కానిసోదరులు హరీంద్రునికి, ఉలాస్కరదత్ కు మరణశిక్ష విధించబడింది. దేశబంధు చిత్తరంజన్‌దాస్, కలకత్తా హైకోర్టుకి అప్పీలు చేసి, వారిమరణశిక్షను ద్వీపాంతరవాస శిక్షగా మార్పించగలుగుతాడు.
వారి 40 సంవత్సరాల పాండిచేరి జీవితంలో వారు విశ్వమానవ ప్రేమికునిగానే శ్రమించారు. ఐనా భారతదేశాన్నిగిరించిన ఆలోచన మరువలేదు. అరవిందుల అనేక గ్రంథాలుపాండిచేరి లోజీవించిన కాలంలోనే రచింపబడ్డాయి, అందులో ఒకటి ‘ది ఫౌండేషన్ ఆఫ్ ఇండియన్ కల్చర్’, ఆ ఉద్గ్రంధం, వారి‘ఆర్య’ మాసపత్రికలో 1918 డిసెంబర్‌నుంచి 1921 జనవరి దాకా వెలువడింది. సుమారు 400 పుటలు.అందులోముఖ్యంగాభారతరాజనీతినిగురించి,4 ప్రకరణాలు, సుమారు 60 పుటలు వున్నాయి.  ‘ఐనా తిరిగి ఈ తికమకల మధ్య, ఇంకాఒక నూతన వెలుగుకు,సాయంకాలపువెలుగుకాదు,ఉదయ కాలపుయుగసంధ్యకుఅవకాశముంది.యుగాలతరబడిఉండినభారతదేశంచనిపోలేదు.తనచిరసృజనాత్మకభావాలను ఇంకా పూర్తిగా వెదజల్లలేదుఈదేశం జీవిస్తుంది. ఇంకాతన కొరకుమరియు విశ్వమాన వాళికి ఎంతో సేవ చేయవలసింది వుంది...' అనేది ఆగ్రంధంలోని చివరివాక్యం. అరవిందుల నిర్యాణం 1950 డిసెంబర్ 5న జరిగింది.ఐనా ఆయన భారత ప్రజలేకాక ఎంతోమంది ప్రపంచ ప్రజలహృదయాల్లో చిరంజీవియే! అట్టి మహామహునిభారతస్వాతంత్య్రదినోత్సవాన ,అరవిందులజన్మదినోత్సవానఆయన్ని
 స్మరించడం ఉచితం. –
-విశ్వమానవప్రేమికుడు అరవిందుడు.అనే టైటిల్తో ఆగష్టు 15న ప్రచురితం.






                                






విశ్వమానవప్రేమికుడు అరవిందుడు.అనే టైటిల్తో ఆగష్టు 15న ప్రచురితం.
                             బాబోయ్ మళ్ళా బళ్ళు తీస్తున్నారు!
" అమ్మా! ఈ ఏడాదన్నా కొత్త స్కూల్ బ్యాగ్  కొంటావా, లేదా? "అని అనంత కొడుకు  సమంత్ ,
"ఆపాతదాంతోనే గడిపేయమనవుకదా? అందరూ కొత్త బాగ్స్ తో వస్తే మేం ఈ పాత బ్యాగ్స్ తో వెళిత అంతా మమ్మల్నే  చూస్తారు " అని కూతురు మధురిమతల్లి భుజాలుపట్టి ఊపసాగారు.
           అనంత తల తిరిగిపోసాగింది.అటు రెట్టింపుగా పెరుగుతున్న మరిది ఇంజనీరింగ్ ఫీజ్ , ఇటు ఆడపడుచుపెళ్ళి , ఎదుట పిల్లల కోరికలో అవసరాలో  , వీటికితోడు , పెరుగుతున్న అవసరాల తో పోటీగా పెరుగుతున్నధరలు,..మెప్పేట ఉచ్చులో మధ్యతరగతి బాధ్యతలుమోసే మహిళలకు  ప్రతినిధిగా అనంత . ఎటుచూస్తున్నా పెరగటం పెరగటం.పెరగటం... తమ ఒరుంబడి మాత్రం ఖర్చులకు తగ్గట్లు పెరగటం లేదు.

       మండే ఎండలు, అంతకన్నా మండే పెట్రోల్ ధరలు, దాంతో మరీ మండిపోతున్న , నోట్సులు , తెల్లకాగితాలపుస్తకాలు ,ఒకటేంటిఅన్నీఎండలతోపోటీపడిమండిపోతుండగాబళ్ళుతెరుస్తున్నారు .
ఏవెంత ఖరీదైనా కార్పొరేట్ స్కూళ్ళలో చదివించేస్థోమతున్నవారికి ఫరవాలేదుకానీ మధ్యతరగతి, క్రిందిమధ్యతరగతి వారి కుటుంబయజమానుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తేరోజులివి.[ అదీనీ ఆరైళ్ళకు మధ్య మధ్యలో ప్రమాదాలు సంభవిస్తుండగా  భయాలు ఇంకా ఇంకా పెరుగుతున్నాయ్ వారికి]
 తెల్లకార్డులున్నవారికి ప్రభుత్వం ఎటూ అన్నీ చవగ్గానో, ఉచితంగానో ఇస్తుంది అన్నింటికీ బలయ్యేది మధ్యతరగతి వారే!
     మధ్యతరగతిలో ని అప్పర్ మిడిల్ క్లస్ వారు కాస్త బయటపడనూ మొహమాటపడతారు,కవర్ చేసుకోను ప్రయత్నిస్తుంటారు.మధ్యమధ్య తరగతివారు సర్ధుబాటుచేసుకోను, పొదుపుచేయనూ , మరో మార్గం వెతుక్కోనూ చూస్తుండగా క్రింది మధ్యతరగతి వారు నీళ్ళబయటపడ్డ చేపలా, కుడితి లోపడ్డ ఎలకలా [మన్నించాలి ఈ ఉదాహరణకు కానీ నిజంసుమండీ!] ఏమీ చేయలేక , పరిస్థితులను ఎదిరించలేకఊగిసలాడుతుంటారు,ఆప్రయత్నంలోనేతమపిల్లలకుసరైనచదువులుఅందించడంలో
కూడా వెనుకపడిపోతుంటారు. ఫైలైపోతుంటారు,అప్పుడే కుటుంబాల్లో ఘర్షణలు ,వ్యధలూ మొదలౌ తుంటాయి.అవసరానికి ఒక్క శాతం సొమ్ము ఎప్పుడూ వారికి తక్కు వౌతుంటుంది..
 మధ్య మధ్య తరగతివారికి అవసరానికి సరిపడామాత్రమే ఉంటుండగా, హయ్యర్ మిడిల్ క్లాస్ వారి అవసరానికి ఒక్క శాతం సొమ్ము ఎక్కువగాఉంటుంటుంది.ఈ తేడాలునిరంతరంఉంటూనేఉంటుండటం వల్లవారిజీవితాలుకొతవరకూ అదోలా నడుస్తుండగామరికొందరివిఅస్తవ్యస్తమవుతున్నయి
                    
 ఆధారం అందితే పైకెగబాక గల తెలివితేటలున్న వారైనా అవకాశాల్లేక మొగ్గల్లోనే ముకుళించి పోతున్నారు.
    స్కూల్ యూనిఫాంస్ కొనాలన్నా , తెల్లకాయితాల పుస్తకాలు, నోట్సులూ, పెన్స్, పెన్సిల్స్ , స్కూల్ బ్యాగ్స్ అన్నీ భారమే వారికి.ప్రభుత్వ విధానాల వల్ల నష్టపడేది ఈ మధ్యతరగతి వర్గమే!  ఇంట్లో ఈగలమోత బయట పల్లకీలమోత లా బ్రతుకు తుంటారు , గృహిణుల విషయం ఆలోచిస్తే పాపం అన్నివిధాలా  బాధలూ, ఇబ్బందులూ పడేది వీరే. సమాజంలో ఇతరతరగతి వారిని చూసి అలా ఉండాలని అటుపిల్లలూ ఇటు పెద్దలూ అనుకుంటున్నా అందుకోలేని స్థితి వారిది. ఉట్టికీ స్వర్గానికీ కానిబ్రతుకులు. 
 స్కూళ్ళు తెరిచేపర్వo వారి పాలిట అరణ్యపర్వమే అవుతుంటుంది.ప్రతి క్వార్టర్కూ కట్టవలసిన ఫీజులూ, కొన వలసిన వస్తువులూ వారికి సవాల్ అవుతుంటాయి. పిల్లలు  సహజంగా పాతవాటితో  సర్దుకోనూ లేరు,పెద్దలు కొత్తవి   కొననూలేరు. దీంతో గృహిణికీ ,గృహస్తుకూ మధ్య పెద్ద రణ రంగం ! ఇది ఈనాటిమనమధ్యతరగతి వారి స్థితి. ఈ బళ్ళు తీసే రోజులు నిజానికివారికి పరీక్షాసమయాలేమరి!
                       కొత్త తరగతుల్లోకి కొత్తకొత్త బూట్లు, సంచులు,నోటు,అచ్చుపుస్తకాలతో వెళ్ళాలని పిలల్లికోరుకోడం సహజమే! అది మధ్యతరగతి గృహిణులపాలిట ఎంసెట్ పరీక్షలాంటిది.ప్రతి తరగతీ పిల్లలుదాటుతుంటే సంతోషంతోపాటుగా  , ఖర్చులుభరించే దైర్యం లేక గుండె బలం తగ్గిపోతుంటుంది.అయ్యో మళ్ళా బళ్ళు తెరిచేరోజులొచ్చాయే! అని భయపడటంలో వింతేముందీ! 

    [ బ్యాగ్స్ -బ్యాగ్స్ పేరుతో ఆదివారం 27th వార్తలో ప్రచురితమైంది.]

Monday, 30 July 2012

దాసోహం కోసలేంద్రస్య.

                                       దాసోహం కోసలేంద్రస్య.
రామాయణాంలో హనుమంతుని స్వామిభక్తి వినయ విధేయతలు అమోఘమైనవి.జన్మరీత్యా జాతిరీత్యా  హనుమంతుడుకోతిజాతికి చెందినవాడు.ఆయన శక్తిసామర్ధ్యాలు చాలాగొప్పవి.ఆయన శాంతమూర్తి, గుణవంతుడు, బలవంతుడు, పరమభక్తుడు.రామకార్యానికి కంకణం కట్టుకున్నాడు. రామానుగ్రహానికి పాత్రుడయ్యాడు.యుధ్ధంలో లక్ష్మణుడు మూర్చిల్లినపుడు సంజీవనీ పర్వతాన్ని ఒక్కచేత్తో ఎత్తుకువచ్చినవాడు,అశోకవనంలో సీతమ్మను వెతుకుతూ ఉన్నసమయంలో అనేక కొంటెచేష్టలు చేస్తున్నపుడు రావణూనిసైనికులు " వింతరూపంలోఉన్న నీవెవరు ?" అని అడిగినపుడు ఆయన "దాసోహం కోసలేంద్రస్య " అని చెప్పాడు.నేను ఫలానావారి బిడ్డనుఫలానావారి మంత్రిని అనో ఇంతబలవంతుడిని సముద్రం దాటినవాడిని అనో విద్యావంతుడిననోచెప్పలేదు.  నేను శ్రీరామచంద్రునిదాసుడిని" అనిమాత్రమేచెప్పాడు. ఆయన సముద్రం దాటనుగానీ, సీతమ్మజాడతెల్సుకోడంలోగానీ, ఇంకాగొప్ప కార్యాలు సాధించనుగానీ తనశక్తిసామర్ధ్యాలు కారణంకాదని ఆయనతెల్సుకుని రాముని ఆశీర్వాదం, ఆయన నామ మహిమే కారణమని నమ్మినవాడు.  అన్నింటికీ ఆయన రామభక్తే ఆధారం.   . 
బలవంతు లైన కపివీరులెంతోమాంది ఉన్నా తనకు సీతజాడవెతికేపని ఇచ్చినందుకు ఆయనెంతో సంతోషించాడేకానీ " నేను కోతిని ఇంతపెద్ద స్దముద్రాన్ని దాటాగలనా1సీతను వెతక గలనా! అంతటిశక్తినాకుందా?"అని ఆలోచించలేదు.ఆపనికి తననుఎన్నుకున్నందుకు అహంకరించలేదు.రామాఙ్ఞను శిరసావహించాడు. ఈకార్యసాధనచేయగలశక్తి రాముడే నాకు ప్రసాదించి ఈకార్యానికి ఎన్నుకున్నాడని విశ్వసించి ,ధృఢ విశ్వాసంతో సాధించగలిగాడు.వానరులంతా కల్సికొండలెత్తిసేతువునిర్మించారు రామనామమహిమతో.వానరులు కొండలుమోస్తే  ,నరులమైన మనం నేడు కుండలుమోయలేని స్థితిలో ఉన్నాం.ఎన్నివిద్యలుపదవులూ ఉన్నా భగవద్విశ్వాసం, భగవన్నామంపైనమ్మకం మాత్రం లేకపోడంచేత కార్యసాధనల్లో వెనుకబడిపోతున్నాం.భగవంతునికి దాసులమై కార్యాలు సాధిద్దాం.  

వార్త -చెలి- ఆధ్యాత్మికంలో - సోమవారం 30జులై ప్రచురితం

Friday, 27 July 2012

సమయం*** సందర్భం.


                       సమయం*** సందర్భం.
"
ఓహ్! నీచీర ఎంతబావుందో!ఎక్కడకొన్నావో య్!" ఆశ్చర్యంగా అడిగింది అర్చన .
"
ఏం నీవూ కొoదామనే!"మరీ ఆశ్చర్యం ఒలకపోస్తూ అంది సుందరి. సుందరి చాలా బావుంటుంది గులాబీ పూవువంటి శరీరఛాయ,తీర్చి దిద్దిన ముఖ కవళీకలు, దానికితగ్గట్లు మంచిమంచి ఖరీదైన డ్రెస్లు వేసు కుంటుంది. తనజీతమంతా తన ఖర్చులకేతప్ప ఇంటికి వాడవలసిన అవసరం లేదు.  అర్చన అలాకాదు, ఆమెకుటుంబమంతా ఆమెజీతంపైనే ఆధారపడి ఉంది. అందుకే ఖరీదైన బట్టలు కట్టలేదు కానీ ఎవరైనామంచిబట్టలు ధరించిబడికి వస్తే  మనస్పూర్తిగా మెచ్చుకుంటుంది, కల్లా కపటంలేని స్వఛ్ఛమైనమనస్సు.అందుకే  సుందరి అలా అనేసరికి మనస్సు చిన్న బుచ్చుకుందిఅర్చన . మన శారీరకఅందమే కాక మన మనస్సులూ అందంగా ఉంచుకోడం ఎంతో అవసరం కదా! పక్క వారినిబాధపెట్టే అందం ఎందుకూ కొరగాదు.
 
      గులాబీరంగు చుడీధర్ ధరించి ఆఫీస్ కు వచ్చిన మృధులను అంతా తలలు పైకెత్తిమరీ చూశారు. మృధులా అందంగా ఉంటుంది. ఆమె శరీరఛ్ఛాయకు గులాబీ రంగు ఎంతోనప్పింది. అంతా తననుఅలాతలలుపైకెత్తిచూస్తుంటే గర్వంగా ఉంది మృధులకు.మృధుల పక్క సీటు ,  బిందు  " ఏమోయ్! ఈరోజు నీ బర్త్ డేనా ఏం? అంతా తలలు
తిప్పకుండ చూసేలా వచ్చావ్? " అంది.
"
అదేంకాదు. కామాక్షితో పందేం కాశాను, అంతా నన్ను తలతిప్పకుండాచూసేలావస్తానని."అందిమరింత గర్వంగా.
"
తల్లీ ! ఇది ఆఫీసు, మీ పందేలు పనిలో చూపండి.ఎంతో వర్క్ పెండింగ్ ఉందనిబాస్ కోపగించారుకదా!ఇక్కడ మనం పనిచేయను వచ్చాం, దానికి తగిన జీతంతీసుకుంటున్నాం. కానీ మన డ్రెస్ లూ, పందాలూ బయటే!" అంది ఏమాత్రం మొఖమాటంలేకుండా బిందు .
        
బిందు చెప్పింది నిజం. మన వస్త్ర ధారణ సమయాన్నీ సందర్భాన్నీ బట్టిఉండాలి.ఆఫీసులకూ , స్కూళ్ళకూ అందమైన వస్త్రాలతో వెళితే ఏపేరంటానికోవెళుతున్నట్లు ఉంటుంది , కానీ పని చేయను వెళ్ళినట్లుండదు.పైగా  తోటి
ఉద్యోగస్తులంతా మనలా అందమైన , ఖరీదైన దుస్తులు ధరించే సదుపాయంఉండకపోవచ్చు, వారిపరిస్థితి మనవల్ల ఇంకా తక్కువైపోకుండా , అలాంటివారుబాధపడకుండా ఉండేoదుకూ మనం సమయాన్ని బట్టి దుస్తులు ధరిస్తే బావుంటుంది.ఇదేమనం మనపిల్లలకూ నేర్పాలి. అందుకే స్కూళ్ళన్నిట్లో సమవస్త్రా లు!,అదేయూనిఫాం కంపల్సరీ చేయటం, అలాగే కొన్ని ఆఫీసుల్లో ఉద్యోగస్తులకూ యూనిఫాంఉంటున్నది , నిజానికి పిల్లలకేకాకఉద్యోగస్తులందరికీ అన్నికార్యాలయాల్లోనూ కంపల్సరీ  యూనిఫాంఅమలుపరిస్తేఅర్చనలాంటివారెంతోమందితమస్థితికిబాధపడకపోగా  చూపరులకు సైతం ఎవ్వరి స్థితిగతులూ బయల్పడకపనిపై శ్రధ్ధ చూపగల్గుతారు. పెద్దలు ఆచరిస్తూ పిల్లలకు ఇలాంటివినేర్పితేఅoదం చందమూనూ. పెళ్ళిళ్ళకూ పేరంటాలకూ , ప్రత్యేకమైన పార్టీలకుఖరీదైన వస్త్రాలుధరించడం రివాజే! గుళ్ళకూగోపురాలకూ ఒకరకమైన వస్త్రాలూ,బంధువుల ఇళ్ళకు  విజిట్ చేసేప్పుడు వారి స్థాయికి తగిన వస్త్రాలు,ఆఫీసులకు సమవస్త్రాలు, లేదా  సాధరణ వస్త్రాలు,  ధరిస్తే ఆతీరేవేరుమరి!చాలా కొన్ని కంపెనీలు తమ సిబ్బందికి ' సమవస్త్రాలు ' నిర్ణ యిచి అమలుపరచడం  ముదావహం.
ఆదూరి.హైమవతి.
*అందరి అలోచనలూ ఒకేలాఉండవు అనేటైటిల్ తో చెలి--వార్త దినపత్రికలో 28-702012 న ప్రచురితము.
 

Sunday, 22 July 2012

జులై 11 ప్రపంచ జనాభాదినోత్సవం.

                                 జులై  11 ప్రపంచ జనాభాదినోత్సవం.

 పెరుగుతున్న జనాభా అదుపుకు స్ర్తీలే ప్రధమపాత్రపోషించవలసి ఉంది.ఇటుమురికివాడల్లోనూ, అటుగ్రామీణ ప్రాంతాల్లోనూ   ప్రచారం అవసరం.గ్రామీణప్రాంతాల్లో జనాభానియంత్రణ  చేసుకుంటే పాపమనేమూఢనమ్మకాలతో తమసంతానాన్నిపెంచుకుంటూపోయి,విద్యవైద్యసదుపాయాలు,కనీసంచదువు,కూడూగుడ్డాకూడాసమకూర్చలేకపోతున్నారు.వారి మూడనమ్మకాల్నుపారదోలడంలో ముఖ్యంగా మహిళలుసహకరింకరించాల్సి ఉంది. మంచి జీవితంకావలంటే జనాభా నియంత్రణ ఉండాలి.
     మానవ వనరులు కాపాడుకుంటూ రాబోయే తరాలవారికి మన సంస్కృతితెలియజేయాల్సియవత జనాభా నియంత్రణ గురించి ప్రఛారం చేయాల్సి ఉంది. 2050నాటికి భారతజనాభా 1.54 బిలియన్స్‌ కి చేరుతుంది.. చైనాను మించిపోయేపరిస్దితిఏర్పడుతుంది.

 భూమిపై మానవుని భారం రోజు రోజుకు పెరుగుతుంది.పలు దేశాలుజనాభానియంత్రణకు చర్యలు చేపడతున్నా.. అవి పూర్తి స్థాయిలో ఫలించటం లేదు.ప్రతిసెకనుకు 5గురు బిడ్డలు లుపుడుతూనే ఉన్నారు.ప్రపంచ జనాభా2011
అక్టోబర్ చివరినాటికి 700 కోట్లకు చేరుకోనుందని నిపుణులు అంచనా వేరుశారు,అది ఇప్పటికి ఇంకా ఎంతో పెరిగీ ఉండవచ్చు.ఇలా సెకనుకు ఐదుగురు జన్మించటంవల్ల ఏటా ప్రపంచ జనాభాకు అదనంగా 7.8కోట్లు పెరుగుతుంది. పది సంవత్సరాలక్రితం ప్రపంచ జనాభా దాదాపు 600కోట్లు ఉండేది. గత 50 సంవత్సరాలప్రపంచజనభాగణాంకాలను పరిశీలిస్తే 1960లో ప్రపంచజనాభా 300 కోట్లు ఉండగా, 1999\నాటికి ఆ సంఖ్య 600 కోట్లకు చేరుకుంది.2025 నాటికి ప్రపంచజనాభా 800కోట్లకుచేరుకోవచ్చని ఐక్య రాజ్య సమతిలెక్కలు అంచనా వేస్తున్నాయి. ప్రతిఏటా 8 కోట్లచొప్పున జనాభాపెరుగుతుండటం వల్ల ఆందోళణ తప్పదని పలువురువిశ్లేషకులుహెచ్చరిస్తున్నారు.


         'నేషనల్ జియోగ్రాఫిక్" అనే  మ్యాగజైన్ లో ప్రచురితమైనఒకవ్యాసంలోరాబర్ట్ కుజింగ్ పలు కీలక అంశాలను వెల్లడించారు. ' ప్రస్తుతంభూగోళం పైనీటి మట్టాలు తగ్గిపోతున్నాయి.అలాగే మత్స్య సంపత కూడాకనుమరుగుయి
పోతుంది.. ప్రతి ఏటా దాదాపు 100 కోట్ల మంది కడుపునిండా తిండిలేకఆకలితోఅల్లాడుతున్నారని"హెచ్చరిoచారు. ఈ ప్రభావం కారణంగా ఆహారకొరతఏర్పడుతుందని ఆయన గుర్తు చేశారు.

      ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 10 నుంచి 20 సంవత్సరాల మధ్య యువకులు180కోట్ల మంది ఉన్నారు. జనాభా నిలకడగా ఉంచటానికి ప్రతి జంటకు సగటున 2.1మందిపిల్లలు మాత్రమే ఉండాలని నిపుణులు అంటున్నారు. కాగా ఐరోపా, తూర్పుఆసియాదేశాల్లో రోజు రోజుకు పెరిగిపోతున్న వృద్ధుల సంఖ్యకు తగినట్లుగాయువకులులేక పోవడం పై ఆందోళణ పెరుగుతోంది

        జనాభాను వర్ణించేందుకు అనేక ప్రమాణాలు వాడబడతాయి. జననాలు, మరణాలు,వలసలు,కుటుంబ జీవన విధానాలు, , సామాజిక వైద్య సదుపాయాలు,కుటుంబనియంత్రణ,యుద్ధాలు, ఉత్పాతాలు వంటి ఎన్నో అంశాలు జనాభాను ప్రభావితంచేస్తాయి.ఫిబ్రవరి 25 2006నాటికిప్రపంచ జనాభా 6.5 బిలియన్లకు(6,500,000,000 లేదా650 కోట్లు) చేరుకుంది. 2012నాటికి భూమిమీద 7 బిలియన్లజనాభాఉంటుందనిఅంచనా..గడచిన50సంవత్సరాలలోనూ, ముఖ్యంగా 1960 - 1995మధ్యకాలంలోమెరుగైన వైద్య సౌకర్యాలు లభించినందువలనా, ఆహారోత్పత్తిపెరిగినందు వలనాప్రపంచ జనాభా వేగంగా పెరిగింది. ప్రపంచ జనాభాలో ఒక్క ఆసియాఖండంలోనే 40శాతం ,ఆఫ్రికాలో 12 శాతం, యూరోప్‌ దేశాల్లో 11 శాతం, ఉత్తర అమెరికాలో8శాతం, దక్షిణమెరికా 5.3 శాతం, ఆస్ట్రేలియాలో 0.3 శాతం
ప్రజలుజీవిస్తున్నారు.
    

      ఒక ప్రాంతంలో సంతానోత్పత్తి రేటులో వచ్చే తేడాలు, పెద్దయెత్తునజరిగేవలసలు, రోగాలు, కరవు, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి అంశాలవలనజనాభాతరగవచ్చును. పాతకాలంలో -ప్లేగు, కలరా వంటి  వ్యాధులవలన ఒకోప్రాంతంలోజనాభా బాగా తగ్గడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతాలనుండిపట్టణాలకు వలసలవెళ్ళడం వలన గ్రామాల జనాభా తగ్గుతున్నది.జనాభా పెరుగుదలనునియంత్రించే విధానాన్ని జనాభా నియంత్రణ అంటాo. 


 పురాతన గ్రీస్ దేశంలో తమఅధిక జనాభా ఆవాసాలకోసం వారుసుదూరప్రాంతాలలోవలసకేంద్రాలనుస్థాపించారు.
ఆధునిక కాలంలో భారత దేశంలో కుటుంబ నియంత్రణవిధానాన్ని చాలా విధాలుగాప్రోత్సహిస్తున్నారు. చైనాలో ఒకే బిడ్డవిధానాన్ని అధికారికంగా అమలుచేశారు.
   

      జనాభా నియంత్రణకు లేటు వయసు పెళ్లిళ్లే సమర్థనీయం.
  3031ఏళ్లకువివాహాంచేసుకునేవారకేప్రోత్సాహకాలుఇవ్వాలి.అధికజనాభాతోవనరులునానాటికీతగ్గిపోతున్నాయి.అస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలే వారిప్రజల ఉద్యోగాలరక్షణకు భారతీయుల్ని తిప్పి పంపిస్తున్నాయి. దేశంలో జనాభాపెరుగుదల,వనరుల అభివృద్ధి మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది భవిష్యత్తులోయుద్ధాలుఉన్నవారికీలేనివారికీ మధ్యే జరుగుతాయి.

 ఈ భూమ్మీద వందకోట్ల మందికి ఆహారం దొరకడం లేదు.40 కోట్లమందికిపౌష్టికాహారం లేదు.ఏటా కోటి మందికి పైగా పిల్లలు ఆకలితోచనిపోతున్నారు.జనాభా పెరుగుతోంది కాని ఆహార ఉత్పత్తి పెరగడం లేదుముంబాయి,ఢిల్లీ,  కల్కత్తా, బెంగుళూరు, చెన్నై, హైదరాబాదు, అహమ్మదాబాదు,పూణే,కాన్పూర్, సూరత్ గత వందేళ్లలో దేశ జనాభా అయిదు రెట్లుపెరిగింది..13 నుంచి19 సంవత్సరాల మధ్య యువతులు ఎక్కువగా పిల్లల్ని కనడం,18 ఏళ్ల లోపే వివాహాలు చేసుకోవడం వంటి కారణాలు జనాభాపెరుగులకుకారణమవుతున్నాయి.ప్రతి ఒక్కరిలో, ఆరోగ్యం, సుఖ జీవనం ఆరోగ్య\జీవనం , వంటి అంశాలపీ అవగాహనపెరగాలి, తమ బిడ్డలకు 
మంచి విద్య ఆహారంకల్పించడంవంటివి బాగా ఆలోచించిగ్రామీణప్రజలకుఅవగాహనకలిపిస్తేజనాభానియంత్రణసులువవుతుంది.అప్పుడే జనాభానియంత్రణకు చేసేప్రయత్నాలుఫలిస్తాయి.





సాహసబాలిక.

                                      సాహసబాలిక.

     ఆరోజు గాంధిజీ   ఆపాఠశాల ఆవరణలో జరిగే సభలో మాట్లాడను వచ్చారు. మహాత్ముని ఉపన్యాసం విన్న వారంతా తన్మయులైపోయారు. ఒక పదేళ్ళ బాలిక ఒక సంచీ తీసుకుని అందరివద్దా ' గాంధీ  గారు చేసే స్వాతత్య్ర  ఉద్యమానికై మీకు తోచిన ది ఇవ్వండి " అంటూ ప్రేక్షకు లందరి వద్దకూ వెళ్ళి , వారు స్వఛ్ఛందంగా   ఇచ్చిన సొమ్మూ , నగలూ అన్నీ పోగుచేసి తెచ్చి , గాంధీ గారికి ఇచ్చింది, 
  అది చూసి ఆయన" అమ్మాయీ! మరి నీవేమి ఇచ్చావు? " అని అడగ్గానే తన చేతికున్న బంగారు గాజులు దూసి ఆసంచీలో వేసింది. ఎంత ధైర్యం! ఇంట్లో వారు గాంధీజీకి విరాళంగా ఇస్తే ఏమీ అనరనే నమకం.  అంత చిన్న వయస్సులో ఎంత దేశభక్తి!   
       

        ఆరోజు ఖాదీ ప్రదర్శన జరుగుతోంది కాకినాడలో, ఒక పన్నెండేళ్ళ అమ్మాయి మైన్ గేటు వద్ద నిల్చుని పాస్ లు ఉన్నవారినే లోనికి వదిలే సేవ చేస్తున్నది. అందరూ వరుసల్లో వచ్చి తమ ఎంట్రెన్స్ పాస్లు చూపి లోనికి వెళుతున్నారు.ఇంతలో నెహ్రూ వచ్చాడు, ఆయన్నూ ఆ అమ్మాయి పాస్ అడిగింది, ఆయన తనకు పాస్ లేదన్నారు. 
    పాస్ ఉంటే నే లోనికి పంపమని తననకు పెద్దలు ఆదేశించారనీ అందువల్ల పాస్ తెచ్చుకుంటే లోనికి వదులుతాననీ ఆమె చెప్పడంతో , నెహ్రూ వెంట ఉన్న వారు వెళ్ళి పాస్ తెచ్చాకే ఆమె  నెహ్రూను లోనికి అనుమతించింది. నెహ్రూ ఆమె క్రమశిక్షణకూ , నిబధ్ధతకూ ముచ్చటే సి అమె గురించీ తెల్సుకున్నారు, ఆమే దుర్గాబాయ్ , ఆమెపేరు దుర్గ ! దుర్గ వలె తాను చేపట్టిన, తనకు అప్పగించిన పనిని ఖచ్చితంగా చేసే   విజయం సాధించే స్వభావాన్ని అంత చిన్నతనం నుండీ తండ్రి పెంపకంలో , తల్లి సహవాసంలో నేర్చుకుని దేశానికే వన్నెతెచ్చే వీర నారీ మణీగా వెలుగొందింది.


                   జులై 15 దుర్గాబాయమ్మ జయంతి సందర్భంగా     

భారతజాతీయోద్యమ పిత -బాలగంగాధర తిలక్

                     భారతజాతీయోద్యమ పిత -బాలగంగాధర తిలక్

భారతజాతీయోద్యమ పిత గా.భారత అశాంతికి జనకుడు"స్వాతంత్ర్యం నాజనం హక్కని చాటిన మహా యోగి, స్వాతంత్ర్య సమరయోధుడు,బాలగంగాధర తిలక్ 1856 జూలై 23వ తేదీన మహారాష్ట్ర రాష్ట్రంలోని రత్నగిరిలో జన్మించాడు. ఆయన తండ్రి గంగాధర్ రామచంద్ర తిలక్ ఒక సంస్కృత పండితుడు,మంచి ఉపాధ్యాయుడు.తల్లి మహాభక్తురాలు . బాల్యంలో తిలక్ చాలా చురుకైన విద్యార్థి. ప్రత్యేకించి గణితశాస్త్రం లోనూ,సంస్కృతంలోనూ మంచి శిక్షణ ఇచ్చాడు తండ్రి.. తిలక్  విశేష ప్రతిభ కనబరచేవాడు.అతనికి  చిన్నప్పటి నుంచి అన్యాయం ఎక్కడ జరిగినా సహించని గుణమా తిలక్ ది.. నిజాయితీతో బాటు ముక్కుసూటితనం . కళాశాలకు వెళ్ళి ఆధునిక విద్యనభ్యసించిన తొలితరం భారతీయ యువకుల్లో ఆయనొకడు.
        తిలక్ కు పదేళ్ళ వయసున్నప్పుడు ఆయన తండ్రికి రత్నగిరి నుంచి పుణెకు బదిలీ అయింది. ఇది తిలక్ జీవితంలో చాలా మార్పు తెచ్చింది. ఆయన అక్కడ ఆంగ్లో-వెర్నాకులర్ పాఠశాలలో చేరి కొందరు ప్రసిద్ధి చెందిన ఉపాధ్యాయుల వద్ద విద్యనభ్యసించాడు. ఐతే పూణెకు వచ్చిన కొంతకాలానికే ఆయన తన తల్లిని, తన పదహారేళ్ళ వయసులో తండ్రిని కోల్పోయాడు.

     మెట్రిక్యులేషన్ చదువు తున్నప్పుడే ఆయనకు సత్యభామ అనే పదేళ్ళ అమ్మాయితో పెళ్ళయింది. మెట్రిక్ పాసయిన తరువాత, అతని పినతండ్రి ప్రభుత్వరంగంలో ఒక ఉద్యోగానికి సిఫారసు చేసి చేయించాడు. అయితే చిన్నప్పటినుంచి స్వతంత్ర భావాలున్న తిలక్, ఆ ఉద్యోగంలో చేరలేదు. భారతదేశ ప్రజలు అమాయకంగా ఉండి చదువు లేకపోవటంవల్లనే ఆంగ్లేయులు అధికారం చెలాయిస్తునారని, వారి అధికారం నుంచి భారతీయులు స్వేచ్చ పొందాలంటే చదువు ముఖ్యమని భావించి తిలక్ దక్కన్ కళాశాలలో చేరాడు. 1877లో ఆయన గణితశాస్త్రంలో ప్రథమశ్రేణిలో పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత ఆయన తనచదువును కొనసాగించి ఎల్ ఎల్ బి. పట్టా కూడా పొందాడు.


                1880లో తన మిత్రుడు అగర్మర్ తో కలిసి పూనాలో ఒక పాఠశాల స్థాపించాడు. ఆంగ్లేయులు భారతీయ సంస్కృతిని కాలరాస్తూ, వారి నాగరికతను మన మీద రుద్దుతూ, హిందువులను వారి మతం లోకి మార్చుతుంటే, తిలక్ భరించలేకపోయాడు. కేవలం వ్యాపారం చేయడానికిమనదేశాన్నిఆశ్రయించి, ఏకుమేకై కూర్చున్నట్లుగా వారు మనమీద పెత్తనం చెలాయించటం తిలక్ సహించలేకపోయాడు. తన పాఠశాలలో ప్రతి విద్యార్ధి దేశానికి నిజమైన సేవ చేయాలంటే బాగా చదువుకొని బ్రిటీషువారి పీడ వదిలించుకోవటానికి సిద్దపడాలనీ, అందుకు అవసరమైతే ప్రాణాలు అర్పించటానికైనా వెనుకంజ వేయరాదని నూరిపోశాడు.
         

     దేశసేవ నినాదంతో తన పాఠశాలను ఎంతో అభివృద్ది చేసుకుని అనేక దేశభక్తులను తయారు చేశాడు తిలక్. తోటి ఉపాధ్యాయులు కానీ, తను కానీ, ఎటువంటి జీతభత్యాలు తీసుకోకుండా పిల్లల బంగారు భవిష్యత్తుకై కృషి చేస్తూ, ఎప్పటికైనా భారతీయులు స్వేచ్ఛ పొందాలని కలలు కనేవారు. ఏ కోశానా స్వార్ధం లేని ఆ మేధావులు ఎందరో ఆణిముత్యాలను దేశానికి సమర్పించారు. తిలక్ పట్టుదల, కృషి, దీక్షవలన ఆ పాఠశాల ఉత్తమ పాఠశాలగా గుర్తింపు తెచ్చుకుని, భారతదేశంలోని యితర విద్యార్థులు కూడా అక్కడ చేరేలాగా ప్రాముఖ్యం పొందింది. 
          ఈ పాఠశాల విజయాలు గమనించిన బ్రిటీషు ప్రభుత్వం ఆ రోజుల్లో ఒకింత కలవరపడింది. కారణమేమంటే భారతదేశం నలుమూలల నుండి విధ్యార్ధులు వచ్చి చేరుతున్నారు. వీళ్ళు చదువుతో పాటు దేశసేవ, దేశభక్తి అంటూ నూరిపోస్తున్నారు. వీళ్ళు చదువు పూర్తిచేసుకొని వస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలుచేయవచ్చు, అందుకని ఈ పాఠశాలను మొగ్గగా ఉన్నప్పుడే తుంచివేయాలి, అనే దురుద్దేశంతో పాఠశాలలో రాజకీయాలు నేర్పుతున్నారనే మిషతో గుర్తింపును రద్దు చేస్తూ తాఖీదు పంపారు.
            తాఖీదు అందుకున్న తిలక్ ఉగ్రుడై బ్రిటీషు ప్రభుత్వంపై కోర్టులో దావా వేసి, తానే వాదించి తిరిగి గుర్తింపు పొందాడు. ఆ సంఘటన ప్రభుత్వ ప్రతిష్టను చాలా బలహీనపరచింది. ఆ సమయంలోనే తెల్లదొరల గర్వం అణగదొక్కడానికి భారతీయులను తెల్లవారి దొరతనం నుంచి విముక్తి కలిగించటానికి వార్తా పత్రిక ఎంతో అవసరమని భావించి, తన స్నేహితుడితో కలిసి 'మరాఠా', 'కేసరి' అనే పత్రికలు స్థాపించి ప్రభుత్వం చేసేఅవకతవకలు, వారిలోపాలు వరుసపెట్టి దుమ్మెత్తిపోయటం ప్రారంభించాడు. 



   అనతికాలంలోనే ఆ పత్రికలు పాఠకుల అభిమానాన్ని చూరగొన్నాయి. "కేసరి" పత్రికలను ఆ రోజుల్లో అందరికన్నా ముందుగా దొరలే కొనుక్కొని చదువుకొనేవారు. బ్రిటీషు ప్రభుత్వంచేత నాటి రాజద్రోహ నిరోధకచట్టం క్రింద విచారించబడి, శిక్షించబడిన మొదటి భారతీయుడు తిలక్. అతనిని అనేక పర్యాయాలు జైలుకు పంపారు. అతడు స్వాతంత్ర్య యోధుడేకాదు; గొప్పవిద్వాంసుడు కూడా. 'గీతారహస్యం', 'ఆర్కిటిక్ హొం ఆఫ్ వేదాస్' అనే గ్రంథాలను అతడు రచించెను. అతడు, బ్రిటీషు పరిపాలనపై ప్రజలలో చైతన్యాన్ని ను పెంపొందించాడు. ఇదే అతని నుండి జాతీయోద్యమానికి వచ్చిన కానుక. తిలక్ 'లాఠీక్లబ్' 'అఖ్ఖారస్' అనే వ్యాయామశాలనూ, 'గోహత్యా నిషేధ సంఘాల'నూ స్థాపించాడు.. అతని తీవ్రవాద విధానాల వల్ల, అతనిని "భారత అశాంతికి జనకుడు" అన్నారు. "స్వరాజ్యం నా జన్మ హక్కు"అని చాటింది ఇతడే. బాల్యవివాహాలను నిరసించి వితంతు వివాహాలను స్వాగతించాడు.
          తిలక్ 1890లో కాంగ్రెస్ లో సభ్యుడుగా చేరాడు. కానీ త్వరలోనే ఆయనకు కాంగ్రెస్ మితవాద రాజకీయాలపై నమ్మకం పోయింది. స్వరాజ్యం కోసం పోరాటమే సరైన మార్గమని ఆయన నమ్మాడు. ."స్వరాజ్యం నా జన్మహక్కు. దాన్ని నేను పొంది తీరుతాను." అని గర్జించాడు. 1907లో మహారాష్ట్రలోని సూరత్‌లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ చీలిపోయింది. మితవాదులు కాంగ్రెస్ పై తమ పట్టును నిలబెట్టుకున్నారు. అతివాదులుగా పిలవబడే తిలక్, ఆయన మద్దతుదారులు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు. తిరిగి 1916లో లక్నోలో జరిగిన సమావేశంలో అంతా ఒకటయారు. అదే సమావేశంలో కాంగ్రెస్ కు, ముస్లిం లీగుకు మధ్య లక్నో ఒప్పందం కుదిరింది.
           

                           జాతీయస్ఫూర్తిని రగల్చడానికి వీలున్న ఏ అవకాశాన్నీ ఆయన వదిలిపెట్టలేదు. మొట్టమొదటిసారిగా శివాజీ ఉత్సవాలను, గణపతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా ప్రజలను సమీకరించడం, వారిని జాతీయోద్యమం వైపు నడిపించడం ఆయనే మొదలుపెట్టాడు. తన పత్రికల్లో ప్రజలను రెచ్చగొట్టే రాతలు రాసినందుకు 1897లో ఆయనకు ఒకటిన్నరేళ్ళు కారాగారశిక్ష పడింది. విడుదలయ్యాక ఆయన స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాడు. 1906లో దేశద్రోహం నేరం క్రింద ఆయనకు ఆరేళ్ళు ప్రవాసశిక్ష విధించారు. కారాగారంలో ఉన్నప్పుడే ఆయన "గీతారహస్యం" అనే పుస్తకం రాశాడు. ఆయన చరిత్రకారుడు కూడా. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని ఆయన అభిప్రాయం.
       1916 ఏప్రిల్ లో హోంరూల్ లీగ్ ను స్థాపించి దాని లక్ష్యాలను వివరిస్తూ మధ్యభారతదేశంలో గ్రామయాత్రలు చేశాడు.. కానీ ప్రజల్లో తిలక్ రగిలించిన స్ఫూర్తి మాత్రం కొనసాగింది. అనేక ఉద్యమాలు నడిపి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి తన జీవితమంతా దేశ స్వాతంత్ర్య సాధనకొరకు అర్పించి మహాత్మాగాంధీలాంటి మహానాయకులకు, ఆదర్శమూర్తిగా నిలిచి ప్రజలచే లోకమాన్యుడనిపించుకున్న మహావ్యక్తి బాలగంగాదర్ తిలక్. ఆయన 1920 ఆగష్టు 1 న స్వర్గస్థులయినారు. 



జులై 23 లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా వార్త దినపత్రికలో ప్రచురితం        






                     బొజ్జగణపా! నీకు పొర్లుదండాలు.
                              ———————
    బొజ్జగణపా! నీకు పొర్లుదండాలు…
    బుజ్జిగణపా! నీకు కోటిదండాలు.


            1. సాక్షి గణపా !నీకు సాష్టాంగ దండాలు
                విద్య గణపా! నీకు వేయిదండాలు
                వీర గణపా !నీకు వేవేల దండాలు
                సుగుణ గణపా ! నీకు చాలదండాలు .
                                       2.పార్వతీ బిడ్డడా! పాదదండాలు
                                         శివునితనయా !నీకుశిరసు దండాలు
                                         శ్రవణసోదర !నీకు సహస్రదండాలు
                                         దేవపూజ్యుడ ! నీకు దొడ్డ దండాలు .

      3. విఘ్న వినాశక! నీకు వీరదండాలు
         శతృ విజేయా ! శతకోటిదండాలు
         ఏకదంతుడ !నీకు ఏకాగ్రదండాలు
        అగ్రపూజ్యుడ !నీకు అరకోటిదండాలు .

                                 4. సిధ్ధిగణపా ! నీకు సర్వదా దండాలు
                                     బుధ్ధిగణపా! నీకు బోలెడు దండాలు
                                     గంగపుతృడ !నీకు గంపెడు దండాలు
                                     గణనాధుడా! నీకు నీ గుడి చుట్టు దండాలు .
                                      దండాలు! దండాలు !దండాలు !దండాలు!.