చివరి మజిలీ .
" ఓరోరీ! రామారావ్ ! ఎన్నాళ్ళకెన్నాళ్ళకెణ్ణాళ్ళకు కనిపించావు రా! ఆరింగుల క్రాఫేదీ! కోరమీసమేదీ!చర్మపు నిగారింపేదీ!ఇలా అయ్యావే మోయ్ ? ఛ్చో ఛ్చో ఛ్చో ఛ్చో ఛ్చో . టీ.వీ చూడవా? యాడ్స్ తెలీదా? ఎన్ని రకాల లేపనాలూ, నూనెలూ,ఇంకా ఎన్నెన్నో చెప్తునారు చూడ ట్లేదా! పొడుగుపెరిగేందుకు మందూ , లావు వచ్చేందుకుమందూ..ఇంకా
"
" అంటూ రామారావును ఊపేస్తూ
వాక్ప్రవాహం
సాగిస్తున్నా వామనరావు ను ఆపి , "నీ ధోరణిమాత్రం
మారలేదోయ్! అదే ధోరణి. అదే వాగుడూ , అదే రూపూ. !నీరూపం మాత్రం మార లేదు టోయ్ ఆనల్లని జుట్టేదీ? ఆ గుబురు మీసమేదీ? ఆ మెరిసే కంటి చూపేదీ? ఈ సోడాబుడ్డి కళ్ళాద్దాలేం
టో? ఈ బాన పొట్టేంటో !వయస్సు ప్రభావమోయ్ వయస్సు ప్రభావం? నీకైనా నాకైనా ! "అన్నాడు రామారావు.
"అద్సరే ఇంతకీ ఎక్కడ ఉంటం? నీవెక్కడున్నాసరే
!ఇంద నా ఫోన్ నెంబర్ రాసుకో
“
" ఎక్కడ వ్రాసుకోను పెన్నూలేదు, పేపరూ లేదు. ఊరికే అలా నడుచు
కుంటూ మార్నింగ్ వాక్ కు వచ్చాను."
" నడుచుకుంటూ కాక మార్నింగ్ వాక్ కు ఎలావస్తారోయ్
! ఎగురుకుం టూ నా?ఐనా అలా ఎగిరేవయస్సా
ఏంట్రా మనదీ !?
మరేం కంగారు లేదు
గానీ నే చెప్పింది విను.
నవగ్రహాలను చుట్టి ,అరిషడ్ వర్గాలు వదలి, త్రిమూర్తులను
దర్శించి,ద్వివిధాత్మలను
గుర్తించి, పంచభూతా లను
స్మరిం చి, పూర్ణతత్వాన్ని
గ్రహించి,త్రిశాంతులు
వచించి ,చతుర్ వేదా ల పేర్లూ తలంచి ,అష్ట పుష్పా లతో పూజించి ,ముమ్మారు ప్రదక్షిణ గా విస్తే నా ఫోన్ కలుస్తుందిరా!" " ప్రదక్షణాలూ,
సుదక్షణలు నాకు పడవని నీకు తెల్సుకదా! ఒరే వామన రావ్! నీ చాదస్తం లేశమాత్రం కూడా తగ్గలేదురా !నీ ఫొన్ నెంబర్ గుర్తుం డదు
గానీ పోనీ మీ ఇంటికి దారిచెప్పు
"
"ఓ అదెంతో సులువురా! అదో ఆకనిపిస్తున్న చౌరస్తా బస్టాప్ నుండీ ఎడం వైపు వెళితే కల్యాణ మంటపం వస్తుంది.దానికి ఎదురుగా విడాకు లిప్పించడం లో సిధ్ధహస్తుడని పేరుగాంచిన వకీలు
వంకర మూతి వాటే శ్వర్రావు గారి ఇల్లు దాటితే ,ఒక పెద్ద మూడు గిలకల బావి వస్తుంది. దాని పక్కనుంచీ తిన్నగా వెళితే ఒక చిన్న పిల్లల హాస్పెటల్ వస్తుంది. దాని
పక్కనుంచీ వెళితే కోర్టు వస్తుంది.దానికుడివైపునుంచీ వెళితే ఒక వృధ్ధా
శ్రమం , దాని ముందునుంచీ తిన్నగా వెళితే
...." అని అంటున్నవామన
రావు ను ఆపి, రామారావు"
నీబొదా నీబోలా వస్తాయి. వెధవా! వయసైం ది కానీ
బుధ్ధిమాత్రం
మారలేదురా! ఇదిట్రా నీఇంటికి దారి చెప్పే వైనం?
" అంటూ ఉగ్రుడయ్యాడు
.
" నీ బీ.పీ . పెంచుకోకు నాయనా! మరో తేలికైన చిరునామా చెప్తాను సరా! తిన్నగా కళ్ళుమూసుకుని
ఇదే మైన్ రోడ్డు మీద మధ్యగా నడుచు కుంటూ రా! నిన్ను జనాలు తెచ్చి మా అల్లు డి కార్పొరేట్ హాస్పెటల్లో వేస్తారు , ఇక్కడికి దగ్గరగా ఉండే ది అదొక్కటేలే .అప్పుడు మా అల్లుడ్ని అడిగితే నాకు కబురు చేయగానే మేడ దిగి వస్తాను."
అని వామనరావు అనగా నే,
" తూ వెధవాయ్! పెళ్ళికి వచ్చి చావుమంత్రాలు
చదివినట్లు చిరకాల మిత్రుడినీ, వాడి కుటుంబాన్నీ
కలవాలనుకుంటే
ఇదిరా చిరునామా చెప్పే విధానం . చూస్తాన్న్రా
చూస్తా!"
అంటూ కోపంగా పక్కకు తిరిగాడు రామారావు.
కోపము నుబ్బును గర్వము – నా పోవక యునికియును దురభి మానము ని
- ర్వ్యాపారత్వము ననునివి-- అంటున్న వామన రావు ను ఆపి
" ఒరే ! వామనా! నీపద్యపఠనం మాత్రం మానలేద న్నమా!
ఇంకా ఎన్నిపద్యాలు
నేర్చావురా!"అంటూ మిత్రుని వైపు తిరిగాడు రామా రావు.
"ఇంతకూ నీకెంత మంది సంతానం ? ఎక్కడ ఉంటున్నారూ! చెప్పావు కాదురా!?
" అని అడిగాడు.
“ఈగల్ జాతీయ పక్షిగా ఉన్నదేశంలో
ఒకడూ, కంగారూ జాతీయ మృగం గా ఉన్నదేశంలో ఒకడూ ఉన్నారురా! నేను మాత్రం నా నెమలి దేశాన్ని వదలి రానని ఇక్కడే
స్వయం విష్ణువు వద్ద ఉంటున్నానురా!
" ఏదీ నేరుగా చెప్పి చావవుగా ! ఇంతకూ మాచెల్లాయ్ ఎలాఉందీ
"బాగానే ఉండే ఉంటుందిరా! నీచెల్లాయికేం రా
హాయిగా వాళ్ళ పుట్టింటి కెళ్ళీ
ఉంటున్నాది."
"ఏం ట్రా నీవు చెప్పేదీ! నిన్నువదిలేసి పుట్టింటికెళ్ళిందా? ఎవరున్నా
ర్రా ఇంకా ఆపల్లెటూర్లో? ఆమె తల్లి దండ్రులు కాలం చేసారని విన్నానే!"
" ఏంచేస్తాం! మీ చెల్లాయ్ హాయిగా వాళ్ళమ్మ ఒళ్ళో విశ్రాతి తీసు కోను వెళ్ళి
పోయింది, నామానానికి నన్నొదిలేసి.
" గద్గద స్వరం తో అంటున్న వామనరావు చూసి
, రామారావు " ఓరినీ! ఇదీనీ ఇలాగుట్రాచెప్పడం? సారీరా!ఐ యాం రియల్లీ సారీ!” అంటూ భుజం తట్టాడు.
“ఉత్తిత్తీ సారీలేనా? కాస్త కాఫీపోయించేదమన్నా ఉందా! పద నేనే
పోయి స్తా ఆకెఫే హౌస్ కెళదాం"
అంటూ దారితీశాడు వామ నరావ్.
" నీకిక్కడ కాలం ఎలాగడుస్తున్నదిరా!"నడుస్తూనే అడిగాడు రామారావు .
" ఏముందిరా! ప్రొద్దుటే నుదుట కన్నున్నవాడ్ని చూస్తాను. ఆ తర్వాత లంకాదహనం చేసిన వాడ్ని పదకొండు చుట్లు చుడ తాను.ఆతర్వాత క్రియాశక్తిని దర్శించి ,అన్నపూర్ణా తల్లి దయ కోసం ఇల్లు చేరతాను. ఆ తర్వాత ఏడుకట్ల వాహనం ఎక్కాల్సిన దాన్ని కాస్తసేపు పర్యంకం మీద పెట్టి, 32తెల్లమెట్ల గుహలో తేనీ రు పోసి , ఊరుపొమ్మంటున్న
వారి వద్ద కెళ్ళి యుధ్ధభూమి లో సద్భోధ పఠించి, ఇచ్ఛాప్రసంగం
గావించి, ఇదో ఇలా జామాత గృహం చేరుతాను."
" అబ్బా నీతో వచ్చిన తంటానే ఇది మొదటినుంచీ , ఏదీ సవ్యం గా చెప్పి...
'
"చావను. చస్తే మా ఆవిడదగ్గరకెళ్తే చక్కగా చక్రపొంగలీ , చక్కెర అరి సెలూ , హోళీగలూ , లడ్డూలూ చేసి పెట్టును. అదెప్పటికో గానీ నీ సంగతి చెప్పవేం? "
"నా సంగతేముందీ ! నీవు తెలుగు పంతులుగా రిటైరైతే నేను గణిత మాస్టారిగా రిటైరై రెండు రెండ్లు నాలుగుచేస్తే
, నాలుగు రెండ్లు
ఎనిమి దయ్యాయి, మొదటి రెండులోంచీ ఒకటి మైనె స్సైతే ఆప్రధానసంఖ్య
అప్రధానంగా మరిపోయి ఏ సంఖ్యల తో చెలిమి పెట్టుకోక ఏసరి సంఖ్య చెంతాచేరక ,
‘ ఏకోనారాయ ణో హరిః ‘ అని ఊర్లు పట్టుకు
ఉధ్ధరిస్తున్నది.
ఆప్రధాన సంఖ్య కు మరో ప్రధానసంఖ్య
లేనిదే ఈ ఎనిమిది సంఖ్య లేదు. ఐనా ఈ ప్రధానసంఖ్య కిప్పుడు గుర్తింపూ గౌరవ మూ ఏమీలేవు. ఏంచేస్తాం చెప్పూ , అందుకే ఇక్కడ కాడురమ్మం టున్నవాళ్ళాంతా చేరే చోట ఇంత చోటు కోసం వెతుక్కుంటూ వచాన్రా!, నీవేమన్నా అక్కడ కాస్తంత జాగా నా కోసం వెతికి పెడతావా?"అన్న రామారావు ను ఆశ్చర్యం గా
చూస్తూ
" ఓరినీ! నీవూ కోడ్ ల్యాం గ్వేజిలో మాట్లాడ్డాం
ఎప్పటి నుంచీ
మొదలెట్టావురా!
రామూ!"
" ఎన్నో అడుగులేస్తే
వారు వీరవుతారంటారుగా
, మరి నీతో ఈ
1800 సెకండ్లు గడిపానాయే అంతమాత్రం మారనా ఏంట్రా వామూ!"
" ఒరే ఎన్నాళ్ళాకెన్నాళ్ళాకు ఈ పిలుపు విన్నాన్నన్న్రా! పదరా ఇద్దరం అక్కడే మనచివరి మజిలీ
గడుపుదాం కలిసి మెలసీ "అంటూ రామా రావును
ఆలింగనం చేసుకున్నాడు
వామనరావు.
&&&&&&
No comments:
Post a Comment