సాధన
యోగరతోవా భోగరతోవా - సంగరతోవా సంగ విహీనః
యస్య బ్రహ్మణీ రమతేచిత్తం -నందతి నందతి నందత్యేవ. --
భజగోవిందం లో శంకరులవారిశిష్యులు నిత్యా నందుడు చెప్పిన శ్లోకం
ఇది . బంధ సహితు డైన వాడు యోగికానేరడు.చిత్తంలో భగవంతుని తలంచు కుంటూ కర్తవ్య కర్మలను నిర్వహించాలి.
పరమాత్మ అనే పురుషునికి ప్రవృత్తి, నివృత్తి అనే ఇరువురు భార్యలు.
ప్రవృత్తి నైజం త్యాగం, నివృత్తి లోక
కళ్యాణంకోసం
కర్తవ్య కర్మలను నిర్వర్తిస్తూ
ఉంటుం ది. సంఘంలో ఉండి కూడా త్యాగరాజు,
జయదేవు డు, పోతన, వేమన,రామకృష్ణ పరమహంస, కబీరు, రామదాసు,మున్నగు వారు నామ స్మరణతో ఆత్మ తత్వం
లో లీనమై ఉండేవారు. సంఘమునకు దూరంగా ఏహిమాల యా ల్లోనో ,అడవుల్లో నో
ఉంటూ తపస్సు చేసుకునే వారి వల్ల సంఘానికి ఏమీ ప్రయోజనం లేదు.మరి కొందరు భక్తుల వలె నటిస్తూ తమనే కాక సమాజంలోని వారినీ మోసం చేస్తుంటా రు.
జప ధ్యానాలు రత్నసమానాలు.
వాటిని కొనగల వారికే అమ్మే వారు చూపుతా రు. స్థిర చిత్తులగుటకు
మూడు సాధనలు ఉన్నాయి.
మొదటిది – మీనసాధన
- మీనము అనగా చేప ,తాను నీటిలోమాత్రమే జీవించ
గలదు.నేలపై బ్రతకలేదు. అలాగే ఏకాంతంలో మాత్రమే కొందరు సాధన చేయ గలరు.దీన్నే మీన సాధన అంటారు.
ఇహ రెండవది మృగ సాధన - మృగము అనగా పశువు, కేవలము భూమిపైన మాత్రమే జీవించ గలదు .నీటిలో జీవించ లేదు.
కొందరు అలాగే పదిమందిలో సాధన చేయగలరు, ఏకాంతంలో సంసార బాధ్యతలు సాధన చేయనివ్వవు.
ఇహ మూడవది కూర్మ సాధన - కూర్మము అంటే తాబేలు నీటిలోనూ బయట కూడా జీవించగలరు. దానివలె కొందరు ఏకాంతం లో నూ పదిమంది మధ్య గుంపులోనూ
సాధన చేయగల ఏకాగ్రత కలిగి ఉంటా రు.సమచిత్తం పవిత్రమైన ఏకాగ్రతకు దారితీస్తుంది.
అలాంటి ఏకాగ్ర చిత్తంతో పవిత్ర విశ్వాసంతో సాధన చేయాద్దాం. మనం సంఘం లో జీవిస్తున్నా
దైవ విశ్వాసాన్ని
వదలరాదు.
ఇంద్రియ నిగ్రహంతో సత్సంగంలో ఏకాగ్రతతో విన్న విషయా లను హృదయంలో భద్రపరచుకుని , వాటిని మననం చేసుకుం టూ చలించని చిత్తంతో భగవదను గ్రహానికి పాత్రులమయ్యేలా
ప్రవర్తిం చాలి.విన్నవాటిని
ఆచరించి నపుడే సార్ధకత. మన బుఱ్ఱ రజకుని గృహం వంటిది .పూర్వకాలం రజకులు ఊరి వారందరి బట్టలనూ తెచ్చి నది లేక చెఱువు వద్ద ఉతికి ఆరేసి మూటకట్టి తెచ్చి ఉంచి, జాగ్రత్తగా ఎవరివి వారికి గుర్తుంచుకుని అప్పగిస్తాడు. చివరకు మూటకట్టిన గుడ్డ ఒక్కటే తనది మిగులుతుంది. వంట చేసేప్పుడు పప్పు, కూర, చారు,
పాయసం లోనూ గరిటె పెట్టి త్రిప్పుతుంటాం ,కానీ ఆగరిటెకు రుచి ఏమాత్రం తెలియదు.
ఎడ్డెమనుష్యు డేమేరుగు ఎన్ని దినంబులు కూడి యుండినన్
దొడ్డ గుణాఢ్యునందుగల
తోరపు వర్తన లెల్ల ప్రఙ్ఞ బే
ర్పడ్ద వివేకి రీతి ,రుచిపాకము నాలుక గాకెఱుంగునే ?
తెడ్డది కూరలో గలయ ద్రిమ్మరు చుండిన నైన భాస్కరా! -
అన్నాడు
భాస్కరశాతక కారుడు . మనం అలాకాకూడదు. సత్సంగములో విన్న
విషయాల ను స్మరిస్తూ సాధనలో ఉంచాలి.కాలమునూ, జీవితమునూ పవిత్రం చేసుకోవాలి. .. -
No comments:
Post a Comment