Monday, 30 September 2013

వినయానికే విజయం

వినయానికే విజయం


a-pr -   Mon, 30 Sep 2013, IST


తెల్లవారితే శ్రీరామ పట్టాభిషేకం. శ్రీరాముడు పట్టాభిషేక సమయానికి ధరించ వలసిన ఆభరణాలన్నింటినీ ఒకగదిలో పెద్ద బల్లమీద విడివిడిగా పెట్టారు. అర్ధరాత్రి అయ్యింది ఆగదిలో మెల్లగా కలకలం మొదలైంది. ''ఏంటీ ఇంకా తెల్లవారదు? సూర్యదేవుడి రథాన్ని అనూరుడు ఈ వేళ నెమ్మదిగా తోలుతున్నాడేమిటి చిత్రంగా..! ఎప్పుడు తెల్లారేను ఎప్పుడెప్పుడు నేను శ్రీరాముడి తలపై జేరి ఆనందం పొందేను'' అంది కిరీటం దర్జా ఉట్టిపడే కంఠంతో.
''అదేమి అంత ఠీవి! శౌర్యం వుట్టిపడే ఆయన భుజాలను అలంకరించే మా మాటేంటి? ఆయన బాణం అందుకుని భుజం పైకెత్తితే మొదట కనిపించేది మేమే!'' మోహనంగా ముక్తకంఠంతో అన్నాయి భుజకీర్తులు.
''ఆహా!! ఆయన చేయి పైకెత్తితే ముందు కనిపించేవి మణికట్టును చేరే మా అందాలే'' అన్నాయి మణికంకణాలు.
''అసలు ఆయన కంఠసీమన అలరారే మా అందం మాటేమిటి? సీతమ్మతల్లి కంటే ముందుగా ఆ మహారాజు కంఠసీమను అలంకరించే నా గొప్పతనం ఎవ్వరికీరాదు'' మహా గర్వంగా అంది కంఠమాల.
''ఓహో అలాగా! ఆయన తల తిప్పినప్పుడల్లా మిలమిల మెరుస్తూ గిరగిరా తిరగే మా మాటేమిటి?'' అన్నాయి కర్ణాభరణాలు.
''పాపం అదేం! ఆయన వేళ్లను అలంకరించే మా మాటేంటి! మహారాజు చేయి పైకెత్తి ఆశీర్వాదాలు, ఆజ్ఞలు జారీచేస్తుంటే ముందుగా కనిపించేది మేమే. మీరు మాకంటే గొప్పా'' అని ప్రశ్నించాయి నవరత్నాలు, వజ్రాలు.
''ఆపండి కొంచెం. కర్ణరఠోరంగా ఉన్నాయి మీ మాటలు. రాజముద్రికనైన నాకంటే ఎవ్వరూ గొప్పకాదు. నేనులేంది ఆ రామచంద్రుడు రాజశాసనాలే చేయలేడు'' అంది దర్పాలు పోతూ రాజముద్రిక.
''అసలా మహానుభావుడు సింహాసనం మీద కూర్చుని పాదపీఠంమీద పాదాలుంచినపుడు అంతా చూసి నమస్కరించే ఆయన పాదాలపై అలరారే మాసంగతేంటి?'' అన్నాయి మంజీరాలు.
''మీ గొప్పల గురించి తప్ప పక్కవారి గొప్పదనాన్ని గూర్చి ఆలోచించలేని మీ తెలివి తక్కువకు ఆశ్చర్యంగా ఉంది. ఆయన శరీరంలో ఒక్కో భాగాన్ని అలంకరించే మీకే అంత అతిశయమైతే శ్రీరాముడి శరీరాన్నంతా ఆక్రమించే నా గొప్పదనం మీ కెవ్వరికీ రాదు'' అంటూ అహంకరించి చెప్పాయి పట్టుబట్టలు.
అన్నీ మౌనం వహించాయి. కాసేపయ్యాక ''ఏంటీ పాదుకలు మాట్లాడవు. పాపం కిందుండి ఎవ్వరికీ కనిపించని వీటినెవరు గుర్తిస్తార్లే! అందుకే ఈ మౌనం'' అంటూ పకపకా నవ్వాయి.
తక్కువ స్వరంతో ''మీరు చెప్పింది నిజం స్నేహితులారా.. తక్కువ స్వరంతో ఆయన పాదాలకింద ఉండే నాకు గుర్తింపు ఏముంటుంది. మీ అందరికంటే నేను తక్కువదాన్ని. కానీ ఆయన నాపై పాదాలు పెట్టి నడిస్తే చాలు నా జన్మ ధన్యమవుతుంది'' అంటూ అందరికీ నమస్కరించాయి పాదుకలు. అన్నీ పడీపడీ నవ్వాయి.
ఇంతలో తలుపులు తెరుచుకున్నాయి. ''మౌనం, మౌనం ప్రభువుల వారు వస్తున్నారు'' గుసగుసలాడింది రాజకిరీటం. రామచంద్రుడు లోపలకు వచ్చాడు. పాదుకలను మాత్రమే ధరించి వడివడిగా వెళ్లిపోయాడు. అన్నీ వెలవెలబోయాయి. అంతా నవ్వి హేళన చేసి ఆ పాదుకలే అందరి నమస్కారాలు అందుకుని, భరతుని శిరస్సుపైజేరి ఆపై 14 సంవత్సరాలు సింహాసనం మీద ఆసీనమై రామునికి మారుగా రాజ్యం చేశాయి.
.

- ఆదూరి హైమావతి.
************************************
ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం  

Sunday, 1 September 2013

అవసరాన్ని బట్టి...

అవసరాన్ని బట్టి...


apr -   Mon, 2 Sep 2013, IST


వరదాపురంలో వరదయ్య పెద్ద వడ్డీ వ్యాపారి. తన వద్దకు వచ్చే వారి అవసరాలను బట్టి వడ్డీరేట్లలో మార్పులు చేర్పులు చేస్తూ అధిక లాభాలను సంపాదించేవాడు. పొరుగూళ్లకు వసూళ్లకు వెళ్లడంలో దొంగల భయానికి భీముడు అనే వ్యక్తిని పనిలో పెట్టుకున్నాడు. ఒకరోజు సాయంకాలం తీరుబడిగా అరుగుమీద కూర్చున్న వరదయ్య దగ్గరకు ఆ ఊరి భూకామందు భూమయ్య అదరాబాదరా వచ్చాడు. ఆయన్ను చూసిన వరదయ్య ''ఊరకరారు మహాత్ములు.. ఏం పనిమాద వచ్చారో'' అన్నాడు.
''ఎంతటి వారైనా నీ దగ్గరకు రాక తప్పుతుందా వరదయ్యా! మా అవసరాలు అటువంటివి'' అన్నాడు భూమయ్య. ''ఇప్పటికిప్పుడు నీకంత అవసరం ఏమొచ్చిందయ్యా? అయనా ఊరి మొత్తానికి నీ అంత కామందు లేడే'' అని ప్రశ్నించాడు వరదయ్య.
''ఏముంది వరదయ్యా.. అమ్మాయి పెళ్లి కుదిరింది. వియ్యాలవారేమో ఈ శ్రావణ మాసంలోనే పెళ్లి చేయాలని పట్టుబట్టారు. ఉన్న సొమ్మంతా మామిడి తోటలమీద, పొలాలమీద పెట్టాను. మే నెల వరకూ సొమ్ము చేతికి రాదు. మంచి సంబంధం వదులు కోవడం ఇష్టం లేదు. నీవేమైనా ఆదుకుంటావని..'' అంటూ నాన్చాడు భూమయ్య.
''పెద్దచిక్కే తెచ్చిపెట్టావ్‌ భూమయ్యా! సాయం కోసం నిన్న సాయంత్రమే పొరుగూరి పుల్లయ్య, ఎల్లయ్యా ఇదే విషయంతో నన్ను కలిస్తే రేపు రమ్మని చెప్పా. ఏం చేయనబ్బా'' అని నసిగాడు వరదయ్య.
''బాబ్బాబు.. అలా అనకు. నీకు దండం పెడతా. వడ్డీ కావాలంటే కాసింత ఎక్కువే తీసుకో. నాకు ఎలాగైనా 20 వేల వరహాలు కావాలి. సొమ్ము చేతికి రాగానే పూవుల్లో పెట్టి ఇచ్చుకుంటాను'' అంటూ భూమయ్యా బతిమాలసాగేడు.
సరే ఏదో నా తంటాలు నేను పడతాను. అయితే ఈ విషయం మాత్రం బయట చెప్పకు. ఎందుకంటే ముందు అడిగిన వారికి కాదని నీకు ఇస్తే నా పరువు పోతుంది'' అని చెప్పి ఇంట్లోకి వెళ్లాడు వరదయ్య. వెళ్లే ముందు భీముడిని పిలిచి ''ఒరే ఇక్కడేవుండు. పుల్లయ్య, ఎల్లయ్య వస్తే నేను బయటకు వెళ్లానని చెప్పు'' అని ఆదేశించాడు. ఇంట్లోకి వెళ్లి 20 వేల వరహాలకు వడ్డీ లెక్కకట్టి 20 వరహాలను మొదటి నెల వడ్డీకింద మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని భూమయ్యకు అందించాడు.
భూమయ్య వెళ్లాక ''అయ్యా! మన వద్దకు నిన్నా, మొన్న కూడా ఎవరూ రాలేదు. మీరు భూమయ్యతో అలా అన్నారేంటి'' అని ప్రశ్నించాడు. ''అదంతా వ్యాపార రహస్యం రా'' నీకు అర్థం కాదని చెప్పాడు.వసూళ్లకు పొరుగూరికి వెళ్లిన ఇద్దరూ పని ముగించుకుని ఇంటిముఖం పట్టారు. తిరిగి వస్తుండగా వర్షం నెమ్మదిగా మొదలైంది. వాతావరణాన్ని గమనించిన భీముడు ''అయ్యా! బండి కట్టించుకుని వెళ్దాం'' అని చెప్పాడు.
ఇప్పుడు బండి కట్టమంటే 10 వరహాలు అడుగుతాడు. అయినా ఈ వర్షం చిన్నదే. నాలుగు చినుకులు పడి తగ్గిపోతుంది అనుకుని ''బండిఅవసరం లేదు లేరా'' అని చెప్పాడు.
కొద్ది దూరం వెళ్లాక వర్షం పెద్దగా పడటం మొదలైంది. అప్పుడు వారి వెంట ఒక బండి వస్తోంది. ''బండాపి మేమిద్దరం వరదాపురం వెళ్లాలి. మమ్మల్ని దించుతావా'' అని అడిగాడు వరదయ్య.
''అయ్యో! దానికేం భాగ్యం. తప్పకుండా అయితే మనిషికి 20 వరహాలు ఇవ్వాలి. అదికూడా బండి ఎక్కడడానికి ముందే'' అని షరతు పెట్టాడు బండివాడు.
''అదేంటి మాములూ 10 వరహాలేగా! ఆశ్చర్యంగా అడిగాడు'' వరదయ్య.
''అవునండి మీరు చెప్పింది నిజమే. అయితే అవసరాలను బట్టి రేటుంటుంది'' అయినా ఎక్కుతారా లేదా. తొందరగా చెప్పండి. అని గద్దించాడు బండివాడు. చేసిదిలేక మొత్తం 40 వరహాలు ఇచ్చి బండి ఎక్కాడు వరదయ్య. వారిద్దర్నీ ఇంటివద్ద దింపి వడ్డీపోనూ వచ్చిన లాభాన్ని చూసుకుంటూ ఇంటిముఖం పట్టాడు కామందు భూమయ్య.
ఆదూరి హైమావతి, చికాగో.
*************************
ఆంధ్రప్రభ ఆదివారం-చిన్నారిలో-ప్రచురితం.

Sunday, 18 August 2013

కదళీ ఫలం

చిన్నారి 




కదళీ ఫలం


ap -   Sun, 18 Aug 2013, IST


కదళీ ఫలం,andhra prabha,telugu, news paper,epaper,hyderabad,online games for girls, telugu news, hot,cinema,show,sunday book,breaking news,telangana,vidyaprabha, corparate accounting,student voice,kulasa,naika,balaprabha,chintana,business,sports

దుర్వాస మహర్షి తన భార్య అయిన 'కదళి'తో కలిసి ఒక పర్ణశాలలో నివస్తున్నాడు. అక్కడే భార్య సహకారంతో జపతపాదులు చేసు కుంటూ కాలం గడుపుతున్నాడు.
భర్త కోపం గురించి తెలిసిన కదళి ఎంతో జాగ్రత్తగా ఆయనకు సపర్యలు చేస్తుండేది.
ఒక రోజు సాయంత్రం అలసటగా ఉండడంతో మహర్షి ఆశ్రమం బయట నడుం వాల్చాడు. ఇంతలో సాయం సంధ్యా సమయం మించిపోతోంది. సంధ్యావందనం చేసుకునే సమయం దాటిపోతుండడంతో భర్తను లేపడం తన కర్తవ్యంగా భావించింది కదళి.
మంచి నిద్రలో ఉన్న దుర్వాసుడిని ఆమె తట్టి లేపింది. నిద్రాభంగం కావడంతో కోపం తెచ్చుకున్న ఆయన తీవ్రంగా కదళివైపు చూశాడు. అంతే ఆ తీక్షణతకు తట్టుకోలేక కదళి భస్మమయి పోయింది.
ముందు వెనుక ఆలోచించక తెచ్చుకున్న కోపంతో జరిగిన ఆనర్థానికి బాధపడ్డాడు దుర్వాసుడు.
కొన్నాళ్ల తరువాత కదళి తండ్రి తన కుమార్తెను చూసేందుకు ఆశ్రమానికి వచ్చాడు. అయితే జరిగిన విషయం చెప్పడానికి భయపడ్డాడు దుర్వాసుడు. చివరికి ఆయన పదేపదే అడగ్గా జరిగిన విషయం చెప్పి క్షమించమని వేడుకున్నాడు.
అంతేకాక తన తపో శక్తితో కదళి భస్మం నుండి ఒక చెట్టును సృష్టించాడు. అదే కదళృ వృక్షం. ఆ ఫలమే కదళీ ఫలం.
ఆ ఫలాన్ని మామగారికి ఇస్తూ నేటి నుంచి మీ కుమార్తె కదళీ అందరికీ ఇష్టురాలై దేవతా కార్యక్రమాల్లో, శుభకార్యాల్లో ముఖ్య భూమిక పోషిస్తుందని మాట ఇచ్చారు.
ఇప్పటికీ మనం అరటిపండును (కదళీ ఫలం)ను దేవుడిముందుంచి కదళీ ఫళం సమర్పయామి అని చెప్పి నైవేద్యం పెడుతున్నాం.
- ఆదూరి హైమావతి, చికాగో.
*****************************************
ఆదివారం 18-8-2013 ఆంధ్రప్రభ ' చిన్నారి 'లో ప్రచురితం.

Sunday, 11 August 2013

అసూయ అనర్థ హేతువు

చిన్నారి 




అసూయ అనర్థ హేతువు


apr -   Sun, 11 Aug 2013, IST


రాజుపాలెం అనే గ్రామంలో భూకామందు మాధవయ్య కొడుకు కుమార్‌, పేదవాడైన కొమరయ్య కొడుకు కిట్టయ్య ఒకే స్కూళ్లో చదువుకుంటున్నారు. కొమరయ్య అతడి భార్య కూలికి వెళ్లి వచ్చిన డబ్బులతో గంజి తాగి బతికేవాళ్లు. వాళ్లుండే గుడిసెలో ఏ లైట్లు లేవు. చమురు దీపపు వెలుగులో గడిపేవారు. చీకట్లో గంజి తాగుతూ
తమ బిడ్డకు ధనం కన్నా గుణం గొప్పదని, ధనం కోసం ఏ దుర్మార్గాలూ చేయరాదని, అంతా మన ప్రవర్తనను బట్టే జరుగుతుందని చెప్పేవారు.
తల్లిదండ్రులు చెప్పే మాటలతో కిట్టయ్య చిన్నప్పటినుంచి మంచి విద్యార్థిగా పేరుతెచ్చుకున్నాడు. తరగతిలో వాడే ఫస్ట్‌ మార్కులు తెచ్చుకునేవాడు. వాడి చేతిరాత ఎంతో బాగుంటుందని ఎన్నోసార్లు పంతులుగారు బోర్డుపై రాయించేవారు.
చిరిగిన పాతగుడ్డలతో వచ్చే కిష్టయ్యకు మంచిపేరు రావడం, పంతులుగారు ఎప్పుడూ వాడిని మెచ్చుకోవడాన్ని కుమార్‌ భరించలేకపోయేవాడు. ఆ ఏడాది ఆగస్టు 15 పండుగ నుద్దేశించి జరిపిన ఆటల పోటీలు, చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు ఇలా అన్నీ కలిపి ఓ పది బహుమతులు కిట్టయ్య సొంతం చేసుకున్నాడు. కిట్టయ్యకు అన్ని బహుమతులు రావడం చూసి అకారణంగా కోపం
పెంచుకున్నాడు కుమార్‌. ఎలాగైనా వాడిని బాధించి సంతోషించాలని ఆలోచించసాగేడు. ఒకరోజు చెరువు గట్టుమీద అమ్మ నేర్పిన

పద్యాలను వల్లె వేసుకుంటూ వస్తున్నాడు. కిట్టయ్యను చెరువులోకి తొయ్యాలని ఒక చెట్టుకింద కాపు కాస్తున్నాడు కుమార్‌. కిట్టయ్య తన దగ్గరకి రాగానే కుమార్‌ గభాలున నీళ్లలోకి తోసాడు. అయితే అదే ఊపుతో కుమార్‌ కూడా నీళ్లలో పడ్డాడు.
తండ్రివెంట చేపలవేటకు వెళ్లే అలవాటున్న కిట్టయ్య నీళ్లలోంచి ఈదుకుంటూ బయటకు వచ్చాడు. అయితే ఈత రాని కుమార్‌ రక్షించండి! రక్షించండి! అంటూ నీళ్లలో కేకలు వేయసాగాడు. మళ్లిd నీళ్లలోకి దూకి కుమార్‌ను ఒడ్డుకుతీసుకువచ్చాడు. అక్కడే కడుపులోంచి నీళ్లను బయటకు కక్కించి ఇంటికి తీసుకెళ్లాడు. తను చేసిన పనికి సిగ్గుతో తలదించుకున్న కుమార్‌ క్షమించమని కిట్టయ్యను వేడుకున్నాడు. కిట్టయ్య ఇద్దరం కలిసుందామని స్నేహహస్తాన్ని చాచాడు.
-- ఆదూరి హైమావతి, చికాగో
ఆదివారం ఆంధ్రప్రభ 11ఆగస్ట్ లో ప్రచురితం.

Thursday, 8 August 2013

మృకండుమహర్షిచరిత్ర .


మృకండుమహర్షిచరిత్ర  .        

  మృకండుమహర్షి మృగశృంగమహర్షి కుమారుడు.మృగశృంగమహర్షితపశ్శక్తిచేచనిపోయినసువృత్తను  తిరిగి బ్రతికించగా, సువృత్తతండ్రినుచథ్యుడుతనకుమార్తెనుఅతనికిచ్చివివాహంచేస్తాడు.సువృత్తకుమారుడే మృకండుడు. శాలగ్రామమనే మహాతీర్ధంలో సర్వప్రాణుల హితంకోరితపస్సుచేసి శ్రీమహావిష్ణువును మెప్పించిదర్శనంపొందుతాడు, విష్ణువుమృకండు భక్తికిమెచ్చిఅతనికి కుమారునిగాజన్మిస్తాననిఅతడు కోరకుండానే వరమిస్తాడు.మృకండు సార్థక నామధేయుడు.ఆయనతపస్సులో లీనమైనిశ్చలుడై ఉన్న సమయంలోఆయన శిలవలె ఉండడం వల్లమృగములు వచ్చితమకండుయాన్నితీర్చుకొనేవి.మృగములకండుయాన్నితీర్చినవాడుకనుకఆయన్నుమృకండుమహర్షిఅనిపిలిచేవారు. మరుధ్వతిఅనేమహాసాధ్విఆయన భార్య,వారికి ఉన్నఏకైక లోటు సంతానం లేకపోవడం,పుత్రులు లేకపొతేపైలోకాల లో ఉన్నత గతులు ఉండవని భావించి కాశీలో తపస్సు చేయను సతీసమేతంగాబయలుదేరుతాడు. కాశీలోవారు రెండులింగాలుప్రతిష్ఠించి,పరమశివునిగురించిఘోరతపస్సుచేస్తారు.మహాదేవుడుతపస్సుకిమెచ్చిప్రత్యక్షమైమృకండు మహర్షిని మరోమారు పరీక్షింపదలచి,'సద్గుణుడై16ఏళ్ళుమాత్రమేజీవించే కుమారుడు  కావాలాలేక దుర్గుణు డైన చిరంజీవికావాలా 'అనిఅడగ్గామృకండు మహర్షి సద్గుణుడైన 16 ఏళ్ళు బ్రతికేపుత్రుడుచాలంటాడు.శివుడుసంతసించి ' అలాంటి పుత్రుడ్ని ఇచ్చాను 'అని చెప్పి అదృశ్యమౌతాడు.

    మహాదేవునిమాటప్రకారం మరుధ్వతిగర్భవతై,దివ్యతేజస్సుకలిగిన పుత్రుడ్ని ప్రసవించింది. మృకండుమహర్షి కొడుకుకనుక వానికి 'మార్కండేయుడు' అని నామకరణం చేశారు.7సంవత్సరాలు 3నెలలునిండినవెంటనేమార్కండే యుడికిఉపనయనంచేశారు.ఒకరోజుమృకండమహర్షినిచూడనుసప్తఋషులురాగామార్కండేయుడువారికినమస్కరిం చగా వారు దీర్ఘాయుష్మాన్ భవా!అని దీవిస్తారు. మృకండుమహర్షిఇదివినితనకొడుకునిజంగాచిరంజీవిఅవుతాడా!’అనిఅడగ్గాసప్తఋషులు దివ్యదృష్టితో శివుడు మృకండుతో అన్నమాటలు గ్రహించి,మార్కండేయునిబ్రహ్మవద్దకుతీసుకువెళ్ళిఆయనచేతనూ 'చిరంజీవా!అని దీవింపచేస్తారు.మార్కండేయుడినినిరంతరశివారాధనచెయ్యమనిచెప్తారు.16సంవత్సరాలునిండినరోజుయమకింకర్లుమార్కండేయుడిప్రాణాలుతీసుకొనుటకైవస్తారు.యమకింకరులుమార్కండేయుడి తేజస్సుచూసి మార్కండేయుడిప్రాణాలుతేవడంతమవల్లకాదని యముడికి చెబుతారు. వెంటనే యముడు తన దున్నపోతుమీదమార్కండేయుడిప్రాణాలుతీయడానికిబయలుదేరతాడు.అకుంఠితభక్తితోశివారాధనచేస్తున్నమార్కండేయుని పైయముడుతనపాశాన్నివిసిరేసరికిమార్కండేయుడుశివలింగాన్నికౌగలించుకొని'చంద్రశేఖరాష్టకాన్నిభక్తితోపఠిస్తాడు,‘శివామహాదేవాకాపాడు!అనిమార్కండేయడు అన్నవెంటనే శివలింగం నుంచి మహాదేవుడు ఉద్భవించి కాలరూపుడై యముడిపైకి వస్తాడు.దీన్నిచూసియముడు భయపడిమహాదేవా! క్షమించు కరుణించమనిప్రార్ధిస్తాడు. శివుడు  " చిరంజీవిగా జీవించమని ' మార్కండేయుని దీవించాడు.అలా మహర్షి మృకండు తన అకుంఠితభక్తిని కుమారనికి అభ్యసింపజేసి చిరాయువైన కుమారుని పొందు తాడు. 

*************************************** ఆదూరి.హైమవతి.

మృకండు మహర్షి జయంతి సందర్భంగా ఆగష్టు 2వతేదీనవార్త దినపత్రిక చెలి,ప్రచురితము.

Monday, 8 July 2013

ఎవరి పనివారే!

చిన్నారి 

ఎవరి పనివారే!

apr -   Mon, 8 Jul 2013, IST
పూర్వ పళనివర్మ రాజ్యంలో రామన్న పాలెం అనే గ్రామం ఉండేది. ఆ ఊరి చెరువు చాలా పాతది అందులోనూ పెద్దది. వచ్చేది వర్షాకాలం కావడంతో చెరువు గండి పడుతుందని గ్రామస్తులంతా గ్రహించారు. ఊరి రచ్చబండ దగ్గర గ్రామపెద్దతో కలిసి ఈ విషయం చర్చించారు. చెరువును బాగు చేయాలని కోరుతూ రాజుకు ఒక విన్నపాన్ని పంపాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా రైతుల్లో చదువొచ్చిన రంగప్పచేత ఒక విన్నపాన్ని రాయించి, అందరూ వేలి ముద్రలు వేశారు. వినతి పత్రాన్ని తీసుకుని తహసీల్దారుకు అందజేశారు. పై అధికారులకు, రాజాస్థానానికి, చివరకు రాజుకు చేరింది.
మహారాజు పళనివర్మ ఆ వినతి పత్రాన్ని పూర్తిగా చదివి సమస్యను అర్థం చేసుకున్నారు. అంతేకాక ఆ చెరువును బాగు చేయడానికి ఎంత సమయం, డబ్బు అవసరము అవుతాయో అంచనా వేయమని మంత్రులను ఆదేశించాడు. ఆయన కింది స్థాయి అధికారులకు చెప్పగా, వారు తహసీల్దారుకు పురమాయించారు. ఆయన చెరువు చుట్టూతా కలియ తిరిగి ఎక్కడెక్కడ ప్రమాదముంది? ఏ ప్రాంతం బాగా దెబ్బతిన్నది, ఎంత డబ్బు, సమయం అవసరమవు తాయో తెలుపుతూ ఆయన ఒక నివేదికను సిద్ధం చేశారు. దానిని ఎప్పటిలాగే పై అధికారులకు, వారు రాజాస్థానా నికి,  అక్కడ నుంచి పళనివర్మ సముఖమునకు చేరింది. ఈ తతంగమంతా పూర్తయ్యేసరికి వేసవికాలం పోయి తొలకరి రానేవచ్చింది. వర్షాలు బాగా పడుతుండడంతో చెరువు నిండి పోయింది. ఇక మరోపెద్ద వర్షం వస్తే చెరువు కట్ట తెగిపోతుంది. అనుకోకుండా ఆ ఊళ్లో బలాదూర్‌గా తిరిగే వీరన్న ఆ చెరువును గమనించాడు.మరో వర్షం వస్తే ఊరే మునిగి పోతుందని గ్రహించిన వీరన్న తోటి సావాసగాళ్లను పలుగు, పార, గునవపం, తట్టా, బుట్టలూ తెమ్మని పురమాయించాడు. వారంతా కలిసి కొండరాళ్లను తెచ్చి గండి పడుతుందని భావించిన చోట అడ్డుగా వేశారు. అలుగుపారే ప్రాంతం వద్ద కాలువను లోతుగా తవ్వి ఆ మట్టిని రాళ్లమీద పోశారు. పూడుకుపోయిన కాలువను తవ్వి నీరు వేగంగా బయటకు పోయేందుకు ఏర్పాట్లు చేశారు. మిగిలిన చిన్నచిన్న మరమత్తులు చేసేసి హాయిగా ఇంటికి వెళ్లిపోయారు.
యువకులు చేసిన పని ఆనోట ఈనోట పడి చివరికి గ్రామపెద్దకు చేరింది. అదే సమయంలో ఒక రాచకార్యం నిమిత్తం అక్కడికి వచ్చిన పళినివర్మ యువకులు చేసిన పనిని మెచ్చుకున్నారు. అంతేకాక వారికి తన కొలువులో ఉద్యోగాలు కూడా ఇచ్చారు.
నీతి-ఎవరిపని వారు చేసుకుంటే కష్టనష్టాలే ఉండవు.
- ఆదూరి హైమావతి, చికాగో(అమెరికా).
ఆంధ్రప్రభ ఆదివారం[ 7/7/2013 ] ' చిన్నారి ' శీర్షికలో ప్రచురితం.

Thursday, 20 June 2013

రాజోద్యోగి అవినీతిని బయటపెట్టిన కస్తూరి తైలం

రాజోద్యోగి అవినీతిని బయటపెట్టిన కస్తూరి తైలం


apr -   Sat, 15 Jun 2013, IST


  hyd

ఆనందపాలుడు ఆ వినతిపత్రం చదివి, వెంటనెె ఒకసైనికుని పిలిపించి, అతనికి ఏదోవిషయం రహస్యంగా చెప్పి పంపాడు. ''నాయనా! ఏదీ నీవు శిసు ్తచెల్లించి న పత్రం?'' ని దగ్గరగా పెట్టుకుని పరిశీలించి,'' నీవు శిస్తుకట్టడానికి ఎంత సొమ్ము ఇచ్చావు?'' అని అడిగాడు. దానికినాగప్ప'' అయ్యా! నేను పది బంగా రుకాసులు ఇచ్చా ను. నాకు ఐదువెండికాసులు తిరిగి ఇవ్వవల సి ఉండగా, అవి ఇవ్వకనే రసీదుపత్రం ఇచ్చాడు లేఖకు డు , 'ఇదేమినిటి?' అడిగితే, వెళ్ళి దిక్కు న్న చోట చెప్పుకోమ న్నాడు. రెక్కా డి లేకానిడొక్కడని నిరుపేదలం, మా మొర ఆలకించేవారెవరు? మీరే న్యాయం చేయాలి''అని విన యంగా కోరాడు. ఆనందపాలుడు లేఖకుని పిలిపించి'' దీనికి నిసమాధానమేమి'' అని ప్రశ్నిం చాడు. ''ప్రభూ! నేను తిరిగి ఇవవ్వలసిన ఐదు వెండి కాసులూ ముందుగా ఇచ్చేసీ, ఆపైన, రాజ ముద్ర వేసి శిసు ్తరసీదు ఇచ్చాను. ఐతే ఆసమయంలో అక్కడెవ్వరూలేనందున నేను సాక్ష్యం చెప్పించలేను'' అన్నాడు భయభయంగా.
మీరెవ్వరూసాక్ష్యం చెప్పినవసరంలేదు. నేనే చెప్పాను దోషమెవరిదో!'' అంటూ మహారాజు విజయవర్మ సమీపానికి వెళ్ళి, ఆ రశీదు పత్రాన్ని ఇచ్చి రహస్యంగా ఏదో చెప్పాడు. ఆ రసీదు అందుకుని దగ్గరగా పెట్టుకుని చూశాడు విజయవర్మ. ''ఆనందపాలా! నీవే ఈసమస్యను పరిష్కరించు'' అన్నాడు. మహారాజా! మనం మన రాజోద్యోగులకు జీతాలు పెంచి చాలా కాలమైంది. ముందుగా చిరు ఉద్యోగుల కు ఈ మాసం నుండీ జీతాన్ని పెట్టింపు చేయవలసినదిగాను, చిరుద్యోగుల కుటుంబాలకు ఉచిత వైద్య సౌకర్యం కూడా కలిగించమని, ఈ రైతుకు ఇవ్వలసిన ఐదు వెండికాసులకూమరో ఐదు కలిపి పది కాసులు ఖజానా నుండీ చెల్లించవలసినది గాను, పేదరైతులకు శిస్తు సొమ్ము సగానికి తగ్గించి వారిని ఆదుకోవలసినదిగాను, మనవిచేసుకుంటున్నాను. ''అన్నాడు. ఆ తీర్పు విని మహారాజు ఆశ్చర్యపోగా సభికులంతా అయోమయంలో పడ్డారు. ఉద్యోగులంతా కరతళధ్వనులు చేశారు. విజయవర్మ ''ఆనందపాలా! నీనిర్ణయాలు ఆమోదిస్తున్నాను, నీవే సభికులకు విష యం వివరించ కోరుతున్నాను. నీవు గుర్తు చెసే వరకూ నా కర్తవ్యం మరచి నందుకు బాధపడుతున్నాను''అన్నాడు రాజు.
ఆనందపాలుడు తన స్థానం నుంచి లేచినిలబడి, స్వరంసవరించుకుని ''ప్రభూ! సభి కులారా! మన నిత్యజీవన సంభా రాలన్నీ సామాన్యులకు అందుబా టులోలేని విధంగా ధరలన్నీ పెరిగి పోయాయి. సామాన్యుల జీవనం భారమైంది. కనుకే చిరుద్యోగులు వారికి అందుబాటు లో ఉన్నంత మేరకు ప్రజలనుండీ కొంత సొమ్ము మిగిలించు కోజూడటం జరుగుతు న్నది. ఈ విషయం నాకు చూచాయ గా తెలుస్తునే ఉంది చారుల వలన. కానీ అది ప్రభువుల సమక్షానికి వచ్చిన ప్పుడు వారే పర్యవసానం ప్రస్తావించాలని ఇంతకాలం ఆగా ను. నేను పంపిన సేవకుడు వెళ్ళి ఈ లేఖకుని ఇంటి పరిస్థితి పరికించి వచ్చి చెప్పాడు. వయోభారంతో అనా రోగ్యం తో ఉన్న తల్లి, వింత వ్యాధి తో బాధపడుతున్న భార్య దిక్కుతోచని పరిస్థితుల్లో ఇతడు వారికి వైద్య సేవలు అందించడానికి కావల్సిన డబ్బుల కోసం ఇలా చేశాడు. అది అతడి తప్పుకాదు.
అతని పరిస్థితి గ్రహించిన నేను ప్రభువుల వారిని చిరు ఉద్యోగుల జీతభత్యాలు పెంచమని కోరాను. అంతేకాదు అన్ని నాణాల సంచు లలోనూ కస్తూరీతైలం ఉంచుతాను. అది ఎవ్వరికీ తెలీయదు.
కాసులను తీసే సమయంలో ఆ తైలం వారికి చేతులు అంటుకుని రసీదు
పత్రానికి అంటుకుంటుంది. జాగ్రత్తగా పరిశీలిస్తే దాని నివాసన తెలుస్తుంది ఈ రైతుకువెండికాసులు ఇవ్వలేదని తైలం అంటనందున తెల్సుకున్నాను. మహారాజా! ఎవ్వరూ పుట్టుకతో దొంగలూ, లంచగొండులుకారు. వారిపరిస్థితులు, వారినలా చెస్తాయి. ప్రభువులు ప్రజల, ఉద్యోగుల అవసరాలు గుర్తిస్తే ఈ ఇబ్బందులు ఏర్పడవు. నేనే ముందుగా ప్రభువులకు విన్నవించుకోకపోవడం నాదే పొరబాటు.'' అని ముగిం చాడు. ఆనంపాలుడి తెలివిని అభినందిస్తూ.. ఆయన చేసిన సూచనలను ఆమో దించాడు రాజు.
ప్రజల బాధల గుర్తించే ప్రజ్ఞ పాలకులకుంటే అంతటా నీతినిజాయితీలు కలకాలముంటాయి.
http://www.prabhanews.com/childrenspecial/article-378247
ఆంధ్రప్రభ దినపత్రికలో బాలప్రభ లో శనివారం జూన్ 15 న ప్రచురితం.