Friday, 11 January 2013

జనవరి12 -వివేకానందుని జయంతి .

                                  వివేకానందుని జయంతి.
బెంగాలీ ' షామీ బిబేకానందో ' గా  ప్రసిద్ధి గాంచిన 'హిందూ యోగి ' స్వామీ వివేకానంద. ఈయన మొదటి పేరు ' నరేంద్ర నాథ్ దత్తా '. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ ,తత్త్వ శాస్త్రములలో సమాజం పై  అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్రలో ను భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠ  వ్యవస్థాపకుడు.

భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండులలో యోగ, వేదాంత శాస్త్రము లను తన ఉపన్యాసాల ద్వారా, వాదనల తోనూ  పరిచయము చేసిన ఖ్యాతి అతనికి దక్కింది. గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం పై ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యుల య్యారు.  పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి వివేకానందుడే! ' తూర్పు దేశాల తత్త్వాన్ని ' అమెరికాలోని ' షికాగో ' లో జరిగిన ప్రపంచ మత సమావేశంలో ,' పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్ 'లో 1893 లో ప్రవేశపెట్టాడు.  షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు.

      అమెరికా పర్యటనానంతరం తిరిగి భారత దేశం వచ్చి 'రామకృష్ణ మఠాన్ని 'స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. 39 సం. అతితక్కువ జీవనకాలంలో అతి ఎక్కువ గా భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని పాశ్చాత్య దేశాలలో చాటిని మహామహుడు వివేకానందుడు.జనవరి 12, 1863న జన్మించిన ఈయన  - ముప్పై తొమ్మిదవయేట జులై 4న 1902 లో ఏళ్ళ వయసు లోనే మరణించాడు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మ దినాన్ని "జాతీయ యువజన దినోత్సవం" గా ప్రకటించింది.
   
     కలకత్తాలో ఒక ఉన్నత కుటుంబానికి చెందిన విశ్వనాధ్ దత్త , భువనేశ్వరి దేవి దంపతులకు నరేంద్ర నాధుడు జన్మించాడు. చిన్నప్పటి నుంచే ధ్యానం చేసే వాడు. బాలుడిగా ఉన్నపుడు నరేంద్రుడు చాలా ఉల్లాసంగా, చిలిపిగా ఉండేవాడు. సన్యాసుల పట్ల యోగుల పట్ల అమితమైన ప్రేమను కనబరిచేవాడు. వారు ఏదడిగినా సరే  లేదనకుండా ఇచ్చేసేవాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న్నట్లుగాచిన్నప్పటీ నుంచే అతనికి నిస్వార్థత , ఇంకా ఔదార్య గుణాలు అలవడ్డాయి.

      నరేంద్రుడు ఆటలలోనూ, చదువులో కూడా అందరికంటే ముందుండేవాడు. ఏకసంథాగ్రాహి. పాఠాన్ని ఒక్కసారి చదివితే మొత్తం గుర్తుంచుకునేవాడు. ఆయన పఠనావేగం అందర్నీ అబ్బుర పరచేది.అతని జ్ఞాపకశక్తి అమోఘమైనది. 17 సం.వయస్సులోనే  మెట్రిక్యులేషన్ పరీక్షలో  ఉత్తీర్ణుడై కళాశాలలో చేరాడు. రోజు రోజుకూ అతని జ్ఞాన తృష్ణ అధికంకాసాగింది. దైవం గురించి తెలుసుకోవాలని ఎంతో ఆసక్తితో ఉండేవాడు. చరిత్ర ఇంకా  సైన్సు తోపాటు పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని కూడా ఔపోసన పట్టాడు. అలా చదువులో ముందుకెళుతున్న కొద్దీ అతని మదిలో అనుమానాలు, సందేహాలు, అస్పష్టత ఎక్కువ కాసాగాయి. భ్గవత్తత్వాన్ని,బ్రహ్మతత్త్వాన్నిఆకళింపుచేసుకోలేక పోయాడు.నరేంద్రుడు తనకు వచ్చిన సందేహాలను  అనేక మందిపండితుల ముందు వెలిబుచ్చాడు. వారంతా వాదనలలో ఆరి తేరిన వారు. కానీ వారి వాదనలేవీ నరేంద్రుడిని సంతృప్తిపరచలేకపోయాయి. వారు ఆలోచిస్తున్నమార్గం కూడా వివేకానందుడికి నచ్చలేదు.   వారెవరికీ భగవంతునితో ప్రత్యక్ష అనుభవం లేదు.

      అల్లాంటిసమయంలో నరేంద్రునికి  రామకృష్ణపరమహంసతో పరిచయం కలిగింది.రామకృష్ణ పరమ హంస కాళికాదేవి ఆలయంలో పూజారి. ఆయన పండితుడు కాదు కానీగొప్పభక్తుడు.అతనుభగవంతుని దర్శించాడని  జనం  చెప్పుకుంటుండగా నరేంద్రుడు విన్నాడు. ఏ పండితుడైనాసరే ఆయన దగ్గరకు వెళితే వారు ఆయనకు శిష్యులు కావలసిందే. ఒకసారి నరేంద్రుడు తన మిత్రులతో కలిసి ఆయనను కలవడానికి దక్షిణేశ్వర్ వెళ్ళాడు. రామకృష్ణ పరమహంస తన శిష్యులతోపాటు కూర్చుని ,భగవంతుని గురించిన విషయాలు చర్చిస్తున్నారు. నరేంద్రుడు తన స్నేహితులతోపాటు ఒక మూలన కూర్చుని వారి సంభాషణ ను ఆలకించసాగాడు. ఒక్కసారిగా రామకృష్ణ పరమహంస దృష్టి నరేంద్రుడి మీదకు మళ్ళింది. ఆయన మనసులో కొద్దిపాటి కల్లోలం మొదలైంది. ఆయన సంభ్రమానికి గురయ్యారు. ఏవేవో ఆలోచనలు ఆయనను చుట్టుముట్టాయి.పాతజ్ఞాపకాలేవో ఆయనను తట్టిలేపుతున్నట్లుగా ఉంది. కొద్ది సేపు అలాగే నిశ్చలంగా  నరేంద్రుని  ఆకర్షణీయమైన రూపం, మెరుస్తున్న కళ్ళు చూస్తూ ఆయనను ఆశ్చర్యానికి గురయ్యారు. ' నీవు పాడగలవా? 'అని నరేంద్రుడిని ప్రశ్నించాడు. అప్పుడు నరేంద్రుడు తమ మృధు మధురమైన కంఠంతో రెండు బెంగాలీ పాటలు గానం చేశాడు. ఆయన ఆ పాటలు వినగానే అదోవిధమైన తాదాత్మ్యత (ట్రాన్స్) లోకి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తరువాత నరేంద్రుని తనగదికితీసుకు వెళ్ళాడు. చిన్నగా నరేంద్రుడి భుజం మీద తట్టి, ఆయనతో ఇలా అన్నారుట, 'ఇంత ఆలస్యమైందేమి? ఇన్ని రోజులుగా నీ కోసం చూసి చూసి అలసి పోతున్నాను. నా అనుభావాలన్నింటినీ ఒక సరైన వ్యక్తితో పంచుకోవాలనుకున్నాను. నీవు సామాన్యుడవు కావు. సాక్షాత్తు భువికి దిగివచ్చిన దైవ స్వరూపుడవు. నీ గురించి నేనెంతగా తపించానో తెలుసా?' అంటూ కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు.

ఆయన ప్రవర్తన నరేంద్రుడికి వింతగా తోచింది. 'ఈయన పిచ్చి మనిషేమో !' అనుకున్నాడు. 'నీవుమళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తావు ?' అని రామకృష్ణుడు అడగ్గానే , ఆయన నుండీ ఎప్పుడు తప్పించుకుందామా అని చూస్తున్న నరేంద్రుడు, ' త్వరలోనే' అనిచెప్పాడు.  ఆయన బోధన పూర్తయ్యాక, నరెంద్రుడు ' మీరు భగవంతుని చూశారా? 'అని ప్రశ్నించాడు. దానికి  'అవును చూశాను నేను నిన్ను చూసిన విధంగానే, ఆయనతో మాట్లాడాను కూడా, అవసరమైతే నీకు కూడా చూపించగలను. కానీ భగవంతుని చూడాలని ఎవరు తపించిపోతున్నారు? ' అన్నాడాయన. 'ఇప్పటి దాకా ఎవరూ తాము భగవంతుని చూశామని చెప్పలేదు, కానీ ఈయన మాత్రం నేను భగవంతుని చూశానని చెప్తున్నాడు. ఎలా నమ్మడం?, ఇతను మతి తప్పి మాట్లాడుతుండవచ్చు. కానీ సరైన అవగాహన లేనిదే ఏ అభిప్రాయం ఏర్పరుచుకోకూడదు 'అని మనసులో అనుకున్నాడు నరేంద్రుడు.
                         ఒక నెల రోజులు గడిచాయి. ఒకరోజున నరేంద్రుడు ఒక్కడే దక్షిణేశ్వర్ కు వెళ్ళాడు. రామకృష్ణులవారు మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్నారు. నరేంద్రుని చూడగానే ఆయన చాలా సంతోషించారు. మంచం మీద కూర్చోమన్నారు. అలాగే ధ్యానంలోకి వెళ్ళి ఆయన కాలును నరేంద్రుడి ఒడిలో ఉంచారు.మరుక్షణం నరేంద్రుడికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆయనకేదో అయిపోతున్నట్లుగా అనిపించసాగింది.' నన్నేమి చేస్తున్నావు? నా తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారు. నేను మళ్ళీ వారి దగ్గరకు వెళ్ళాలి.' అని అరిచాడు. రామకృష్ణుల వారు చిరునవ్వు నవ్వుతూ 'ఈరోజు కిది చాలు 'అని చెప్పి తన కాలును వెనక్కి తీసేసుకున్నారు. నరేంద్రుడు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. రోజులు గడిచేకొద్దీ ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులవసాగారు.ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు.

      నరేంద్రుడి గొప్పతనాన్ని తెలుసుకోవడానికి రామకృష్ణులవారికి ఎంతో సమయం పట్టలేదు. కాళికా దేవి ఆయనకు మార్గనిర్దేశం కూడా చేసింది. కానీ నరేంద్రుడుమాత్రం ఆయనను పరీక్షించేవరకూగురువు గా నిర్ణయించుకోకూడదనుకున్నాడు. 'భగవంతుని గురించి తెలుసుకోవాలంటే స్త్రీలగురించిధనంగురించి వ్యామోహాన్ని విడనాడాలని చెప్పేవాడు' రామకృష్ణులు. నరేంద్రుడు ఆయనకు ప్రియతమ శిష్యుడు. అలాగని నరేంద్రుడు చెప్పిన అన్ని విషయాలతో ఆయన ఏకీభవించేవాడు కాదు. విగ్రహారాధన చేసే వారిని నరేంద్రుడు బాగా విమర్శించేవాడు. అద్వైతాన్ని కూడా వ్యతిరేకించాడు. అలౌకిక అనుభవాల మీద అంతగా నమ్మకం లేదు.' నేనే బ్రహ్మను ,నేనే శివుణ్ణి 'అనేలాంటి వాక్యాలేవీ అతనిని అంతగా ప్రభావితం చేసేవి కావు. కానీ ఎప్పటికప్పుడు రామకృష్ణులవారు నరేంద్రుని సరైన మార్గంలోకి తీసుకువచ్చేవాడు.
           నరేంద్రుడు నెమ్మదిగా ప్రాపంచిక సుఖాలపై వ్యామోహం తగ్గి సన్యాసం వైపు మొగ్గు చూపడం ప్రారంభించాడు. అది తల్లిదండ్రులు గ్రహించారు. అప్పుడు నరేంద్రుడు  బియ్యే పరీక్షకు తయారవు తున్నాడు. 1884లో బియ్యే పాసయ్యాడు. అతని స్నేహితుడొకడు పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీలో నరేంద్రుడు పాట పాడుతుండగా తెలిసింది పిడుగు లాంటి వార్త. తండ్రి మరణించాడని. వెనువెంటనే ఆ కుటుంబాన్ని పేదరికం ఆవరించింది.సంపాదనలేకపోడం, దైనందిక జీవితానికి ఖర్చుపెట్టుకోనుకుడా ధనంలేకపోయింది. దారిలేక చేబదుళ్ళుచేయటంతో  , అప్పులిచ్చిన వాళ్ళు వేధించడంమొదలుపెట్టారు. కొద్దిమంది న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. నరేంద్రుడు ఉద్యోగం కోసం కాళ్ళరిగేలా తిరిగాడు. బట్టలు మాసిపోయి చిరిగిపోయాయి. రోజుకొకపూట భోజనం దొరకడం కూడా గగనమైపోయింది. చాలా రోజులు ఆయన పస్తులుండి తల్లికి, చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకు తిండి పెట్టేవాడు. వారితో తను స్నేహితులతో కలిసి తిన్నట్లు అబద్దం చెప్పేవాడు. కొన్నిసార్లు ఆకలితో కళ్ళు తిరిగి వీధిలో పడిపోయేవాడు. ఇంత దురదృష్టం తనను వెన్నాడుతున్నా ఎన్నడూ భగవంతుని మీద విశ్వాసం కోల్పోలేదు. 'నీవు కాళికా దేవికి మరియు తోటిప్రజలకు సేవ చేయాల్సిన వాడివి, నీవు ధైర్యంగా ఉండాలి 'అంటూ రామకృష్ణుల వారు నరేంద్రుని ఓదార్చేవారు.
     తరువాత నరేంద్రుడు కొద్దిరోజులపాటు 'విద్యాసాగర్ 'పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు. ఇప్పుడు కుటుంబానికి కనీసం తినడానికి తిండైనా దొరుకుతున్నది. బోధకుడిగా పనిచేస్తూనేతనన్యాయ విద్యను కొనసాగించాడు. గురువుగారి ఆరోగ్యం క్షీణించింది. ఆయనకు గొంతు క్యాన్సర్ సోకింది. నరేంద్రుడు తన ఉద్యోగం, చదువు రెండు మానేసి గురు శుశ్రూషలో మునిగిపోయాడు. రామకృష్ణుల వారికి మరణం సమీపిస్తోంది. చివరి రోజున ఆయన నరేంద్రుడిని పిలిచి అతడితలపై చేయి ఉంచి అలా మృదువుగా తాకాడు. ఆయన ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ నరేంద్రుడికి ధారపోసి ఇలా అన్నాడు. 'నరేన్! నీవు ఇప్పుడు సర్వశక్తిమంతుడవు. వీళ్ళంతా నా బిడ్డలవంటి వారు. వీరిని చూసుకోవాల్సిన భాద్యత నీదే 'అన్నాడు. నరేంద్రుడి హృదయం బాధతో నిండిపోయింది. గదిలోంచీ బయటకు వెళ్ళిపోయి చిన్న పిల్లవాడిలా దుఖించడం మొదలుపెట్టాడు.రామకృష్ణులవారుచనిపోయినతరువాతఆయనశిష్యులందరూ కలిసి 'బరనగూర్‌లో' ఒక అద్దె ఇంట్లో నివాసం ప్రారంభించారు. ఆ ఇల్లు చాలా పాతది అయినప్పటికీ నగరం యొక్క రణగొణ ధ్వనులకు చాలా దూరంగా గంగానది ఒడ్డున ఉండేది. అక్కడినుండి రామ కృష్ణుల వారి సమాధి చాలా దగ్గరగా ఉండేది. అక్కడే 'రామకృష్ణ మఠం 'స్థాపించడం జరిగింది.అక్కడున్న యువసన్యాసులకు రెండే లక్ష్యాలు ఉండేవి. ప్రజలకు సేవ చేయడం , ముక్తిని సాధించడం. కొద్ది మంది యువకులు తమ కుటుంబాల్ని వదిలిపెట్టి సన్యాసులు గా మారారు. నరేంద్రుడు కూడా సన్యాసిగా మారి ఆమఠానికి నాయకుడయ్యాడు. ఆ యువ సన్యాసులు తిండి, బట్ట గురించిపెద్దగాఆలోచించేవారుకాదు.  ఉపవాసం ఉన్నపుడు కూడా తమ చదువును ధ్యానాన్ని నిర్లక్ష్యం చేసేవారు కాదు. నరేంద్రుడు వారికి సంస్కృతాన్ని బోధించేవాడు. మఠానికి వచ్చే వారికి  గురువుగారి బోధనలను విడమరిచి చెప్పేవాడు.
                       నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకానందుడిగా మారాడు. భారతదేశమంతా అతని గృహమైంది.     ఇక్కడి ప్రజలు అతని సోదర, సోదరీమణులయ్యారు. దురదృష్టవంతులైన తన సోదరుల కన్నీళ్ళు తుడవడం అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించేది. దేశమంతా పర్యటించాడు. తనకున్న ఆస్తి అంతా ఒక కాషాయ వస్త్రము, ఒక కమండలము, శిష్యగణం మాత్రమే. తన  పర్యటనలో అతను ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించాడు. దారి మద్యలో గుడిసెల్లోనూ, సత్రాలలోనూ నివసించేవాడు, కటిక నేలమీదనే నిద్రించేవాడు. అనేక మంది సాధువుల సాంగత్యంలో గడిపాడు. ఆధ్యాత్మిక చర్చలతో, పవిత్ర కార్యాల గురించిన చర్చలతో సమయం గడిపేవాడు. చాలా దూరం కాలినడకనే నడిచేవాడు. ఎవరైనాఆయన్ని   ఆహ్వానిస్తే   వారి వాహనాల్లో ఎక్కేవాడు. ఆళ్వార్ దగ్గర కొద్ది మంది ముస్లింలు కూడా ఆయనకు శిష్యులయారు. ఎవరైనా రైలు ప్రయాణానికి టిక్కెట్టు కొనిస్తేనే రైలులో ప్రయాణం చేసేవాడు. చాలాసార్లు తన దగ్గర డబ్బులేక పస్తుండాల్సి వచ్చేది. 


మైసూరులో స్వామికి దివాను శేషాద్రి అయ్యర్ , మైసూరు మహారాజా వారితో పరిచయం కలిగింది. పండితుల సభలో స్వామీజీ సంస్కృతం లో చేసిన ప్రసంగం మహారాజా వారిని ముగ్ధుల్ని చేసింది. భారతదేశం వివిధ మతాల , వివిధ తత్వాల సమ్మేళనం. పాశ్చాత్యులు సైన్సులో మంచి పురోగతి సాధించారు. ఈ రెండు కలిస్తే మానవజాతి ఎంతో ముందుకు సాగగలదు. కనుకనేను అమెరికా వెళ్ళి అక్కడ వేదాంతాన్ని వ్యాప్తి చెయ్యాలనుకుంటున్నాను 'అని స్వామీజీ మైసూరు మహారాజాతో అన్నాడు. 'ఐతే ఆ ఖర్చులన్నీ నేనే భరిస్తా'నన్నాడు. మాహారాజా. స్వామీజీ ఆయనకు కృతజ్ఞతలు తెలిపి 'సమయం వచ్చినపుడు తప్పకుండాసహాయం తీసుకుంటానని 'చెప్పి సెలవు తీసుకున్నాడు.
తర్వా త స్వామీజీ భాస్కర సేతుపతి పరిపాలిస్తున్న రామనాడును సందర్శించాడు. 
         అక్కడి రాజు స్వామీజీని మిక్కిలి గౌరవించాడు. మీరు అమెరికాలో జరగబోవు సర్వ మత సమ్మేళనానికి తప్పకుండా హాజరవాలి. అందుకయ్యే ఖర్చంతా నేను భరిస్తాను అన్నాడు. దానిని గురించి తప్పకుండా ఆలోచిస్తానని ఆయనకు మాట ఇచ్చి అక్కడి నుంచి రామేశ్వరానికి వెళ్ళి చివరకు కన్యాకుమారి చేరుకున్నాడు. కొద్ది దూరం ఈదుకుంటూ వెళ్ళి ఒక రాయి మీద కూర్చున్నాడు. పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ భారతదేశపు ఆధ్యాత్మిక విలువల్ని వారికి వివరించడం తన ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నాడు. తరువాత స్వదేశానికి తిరిగి వచ్చి నిదురపోతున్న భారతజాతిని మేల్కొల పాలనుకున్నాడు. అతని ప్రయాణానికి ఖర్చుల నిమిత్తం దేశం నలుమూలల నుంచీ విరాళాలు వచ్చి పడ్డాయి. కానీ అతడు మాత్రం తన ప్రయాణానికి ఎంత కావాలో అంతే స్వీకరించాడు. మిగిలిన ధనాన్ని దాతలకు తిరిగి ఇచ్చివేశాడు. అతను ఎక్కిన నౌక బొంబాయి తీరం నుంచి 1893, మే 31వ తేదీన బయలు దేరింది.
   జులై నెలలో స్వామీజీ చికాగో నగరానికి చేరుకున్నాడు. సర్వమత సమ్మేళనాన్ని గురించి వాకబు చేశాడు. అప్పటికి ఆ సదస్సుకు మూడు నెలల వ్యవధి ఉంది. చికాగో నగరం చాలా ఖరీదయిన నగరం కావడంతో స్వామీజీ బోస్టన్ నగరానికి వెళ్ళాడు. దారి మధ్యలో ఒక మహిళ స్వామికి పరిచయం ఐంది. ఆయనతో కొద్ది సేపు మాట్లాడగానే ఆమెకు ఆయన గొప్పతనమేమిటో అర్థమంది. ఆయన సామాన్యుడు కాదని తెలిసి కొద్ది రోజులు ఆమె ఇంటిలో బస చేయమని కోరింది. స్వామీజీ అందుకు అంగీకరించాడు. అప్పుడప్పుడు చుట్టుపక్కల జరిగే చిన్న సభలలో ఉపన్యసించేవాడు. వీటిలో ప్రధానంగా భారతీయ సంస్కృతి మరియు హిందూ ధర్మం ప్రధాన అంశాలుగా ఉండేవి. నెమ్మదిగా చాలామంది పండితులు ఆయనకు మిత్రులయ్యారు. వారిలో ఒకరు జాన్ హెన్రీ రైట్. అతడు హార్వర్డ్ విశ్వవిద్యాలయం లో గ్రీకు విభాగంలో ఆచార్యుడు. సమ్మేళనానికి హాజరయ్యే సభ్యులంతా నిర్వాహకులకు పరిచయపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కానీ స్వామీజీ తన పరిచయ పత్రాన్ని ఎక్కడో పోగొట్టుకున్నాడు. అప్పుడు రైట్ పరిచయ పత్రాన్ని రాశాడు. ఆ పత్రంలో స్వామీజీ చాలా మంది ప్రొఫెసర్ల కన్నా మంచి పరిజ్ఞానం కలవాడని రాసి పంపించాడు.  సర్వమతసదస్సు 1893, సెప్టెంబర్ 11న ప్రారంభమైంది.వివేకానందుడు చికాగో వచ్చిసదస్సుకు హాజరయ్యాడు.  దేశవిదేశాల నుంచి వచ్చిన వేలాది మంది ప్రతినిధులు అక్కడ చేరారు. వివేకానంద వారందరిలోకెల్లా చిన్నవాడు. అతను మాట్లాడే వంతు వచ్చేసరికి గుండె వేగం హెచ్చింది. అందరు సభ్యుల దగ్గర ఉన్నట్లు ఆయన దగ్గర ముందుగా తయారు చేసిన ఉపన్యాసం లేదు.అందువల్లా తన ప్రసంగాన్ని చివరలో ఉంచమని అధ్యక్షుడికి వివేకానందుడు విజ్ఞప్తి చేశాడు. ఉపన్యసించడానికి ముందు గురువైన రామకృష్ణులవారినీ, సరస్వతీ దేవిని మనస్పూర్తిగా ప్రార్థించాడు.

   "అమెరికా దేశపు ప్రియ సహోదరులారా! "అని స్వామీజీ తన మృధు మధుర కంఠస్వరంతో అనగానే సభ మూడు నిమిషాలపాటు చప్పట్లతో దద్దరిల్లింది.శబ్దం ఆగిన తరువాత తనప్రసంగాన్నిఆరంభించాడు.  అక్కడున్న ప్రతీ ప్రతినిధి స్వామీజీ ప్రసంగాన్ని ప్రశంసించారు. వార్తాపత్రికలు ఆయన వ్యాసాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. అక్కడి ప్రజలకు ఆయన ఆరాధ్యుడయ్యాడు. ఆయన మాట్లాడడానికి లేచాడంటే చాలు, చెవులు చిల్లులుపడే శబ్దంతో చప్పట్లు దద్దరిల్లేవి. కొన్ని సంస్థలు సభ జరుగు తున్నపుడు మధ్య లోనే తమ సంస్థకు ఆహ్వానించేవి.అనతి కాలంలోనే స్వామీజీకి ప్రపంచ ప్రఖ్యాతి లభించింది. ఎక్కడికి వెళ్ళినా స్వామీజీ తన ప్రసంగంలో భారతదేశపు విలువల్ని చాలా సేపు వివరించే వాడు. చరిత్ర అయినా, సామాజిక శాస్త్రం అయినా, తత్వశాస్త్రం అయినా, సాహిత్యమైనా ఎటువంటి తడబాటు లేకుండా ఉపన్యసించేవాడు.సన్యాసి వస్త్రధారణ ,హిందూ మతాన్ని చక్కగా తెలుపగల నైపుణ్యం, వికాసవంతమైన వ్యక్తిత్వం,ఈ మూడు గుణాలతో ఆయన అందరి హృదయాలను గెలవ గలిగాడు.వాదనలలో ఆయనను ఓడించగలిగిన వారు లేరు.ఆయన ఆంగ్ల నైపుణ్యం అపారం. అటువంటి మహోన్నత వ్యక్తి  
యుగానికి ఒకరే పుడతారు.ఆయనను సజీవంగా చూస్తూ ఆయన బోధనలను వినడం నిజంగా మనం చేసుకున్న పుణ్యం అని ఒక పత్రికవ్యాఖ్యానించింది.
స్వామీజీ కృషి వల్ల ఒక్క అమెరికాలోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ భారతదేశం పట్ల గౌరవం ఏర్పడింది. ఆయన ఎక్కడ ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళినా జనం గుమికూడి ఎంతో ఓపికగా ఎదురుచూసేవారు. ఉపన్యాసం ఐపోగానే,ఆయన్ని తమ ఇళ్ళకు ఆహ్వానించి ఆదరించేవారు. ఇంగ్లాండు నుంచి కూడా ఆయనకు ఆహ్వానం లభించింది. ఆయనకు అక్కడ ఘనస్వాగతం లభించింది. వార్తా పత్రికలు ఆయనను ఘనతను, వాగ్ధాటిని శ్లాఘించాయి. ఎంతోమంది ఆయనకు శిష్యులయ్యారు. వారిలో ముఖ్యులు సిస్టర్ నివేదిత గా మార్పు చెందిన మార్గరెట్ నోబుల్. తరువాత ఆమె భారతదేశానికి వచ్చి ఇక్కడే ఉండిపోవడం జరిగింది.
         నాలుగు సంవత్సరాల పాటు విదేశీ పర్యటన తరువాత స్వామీజీ తిరిగి భారతదేశానికి విచ్చేశాడు. ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన కీర్తి దశదిశలా వ్యాపించిపోయింది. జనవరి 15, 1897 ఆయన కొలంబో లో దిగగానే ఆయనకు చక్రవర్తికి లభించినంత స్వాగతం లభించింది. మద్రాసుకు చేరుకొనే టప్పటికి ఆయన అభిమానులు రథం మీద లాగుతూఊరేగించారు.లెక్కలేనన్నిపూలమాలలు,  సందేశాలు లభించాయి. ఎక్కడికి వెళ్ళినా తమ గురువు చెప్పిన సందేశాన్ని వ్యాప్తి చేశాడు.ఆయన దగ్గరకు మార్గదర్శకత్వం కోసం వచ్చేవారికి ఆధ్యాత్మిక విలువల యొక్క ప్రాధాన్యాన్ని బోధించేవాడు. అదే స్పూర్తితో, లక్ష్యంతో1897 లో రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు. తరువాత రెండు సంవత్సరాలలో గంగానది ఒడ్డున గల బేలూర్ వద్ద స్థలాన్ని కొని మఠం కోసం భవనాల్ని నిర్మించాడు.
         వివేకానందుడు గొప్ప తాత్వికుడు. అతని ముఖ్య బోధనల ప్రకారం అద్వైత వేదంతము తత్త్వ శాస్త్రములో నే కాకుండా , సామాజికంగా రాజకీయంగా కూడా ఉపయోగ పడుతుంది. రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో 'జీవుడే దేవుడు' అనేది అతని మంత్రముగా మారింది. 'దరిద్ర నారాయణ సేవ' ,పేదల సేవే భగవంతుని సేవ, అనే పదాన్ని ప్రతిపాదించాడు. "విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనము మనని గొప్ప వారని ఇతరులు తక్కువ వారని ఎలా అనుకుంటాము?" అనే ప్రశ్న తనకు తాను వేసుకుని ఈ తేడాలన్నీ మోక్ష సమయములో కలిగే దివ్యజ్యోతి లో కలిసి పోతాయని తెలుసు కున్నాడు. అప్పుడు పుట్టే ప్రేమ నుండి, తమలోని బ్రహ్మాన్ని తెలుసుకోలేని మనుష్యులను ఆదుకునే సత్ప్రవర్తన పుడుతుంది.అందరు తనవార నుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వానికి చెందిన వ్యక్తి వివేకానందుడు. వ్యక్తిగత మోక్షము పై వ్యామోహాన్ని  వదిలివేసి, ఇతరులను బంధ విముక్తులను చెయ్యడమే మనిషికి జ్ఞానోదయమని నమ్మిన మహామహుడుఆయన. రామకృష్ణా మిషన్ను (రామకృష్ణా మఠము) "వ్యక్తి మోక్షమునకు, ప్రపంచ హితమునకు" అనే నినాదము మీద స్థాపించాడాయన.

    'సిద్ధాంతాలు, పిడివాదాలు, సంప్రదాయాలు, దేవాలయాలు మున్నగువాటిని గురించి ఆలోచించక, మనిషి హృదయంలో దీపిస్తూన్న ఆత్మ వస్తువుతో సరిపోల్చితే అవి ఎందుకూ కొరగావు. ఆ వస్తువే ఆధ్యాత్మిక శక్తి. మొదట ఈ శక్తిని సముపార్జించండి. ఇతర ధర్మాలను నిందించవద్దు. ప్రతి మతంలోను, ప్రతి సిద్ధాంతంలోను, ఎంతోకొంత మంచి వుంటుంది.సోదర ప్రేమ గురించి ఊరికే ప్రసంగించక,ఆ ప్రేమను కార్యరూపంలో ప్రదర్శించండి.త్యాగ, సాక్షాత్కారాలను పొందినవాడే ప్రపంచంలోని సర్వమతాలలోని ఏకత్వాన్ని దర్శించగలడు. వ్యర్థ వాదాలకు ఆస్కారం లేదని గ్రహింపగలడు. అపుడే మానవాళికి సహాయం చేయగలడు. వాస్తవానికి అన్ని మతాలు ఒకే సనాతన ధర్మంయొక్క అంశాలు.' అని వివేకానందుడు బోధించాడు.

 వివేకానందుడు గొప్ప తాత్వికుడు. అతని ముఖ్య బోధనల ప్రకారం అద్వైత వేదంతము తత్త్వ శాస్త్రములో నే కాకుండా , సామాజికంగా రాజకీయంగా కూడా ఉపయోగ పడుతుంది. రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో 'జీవుడే దేవుడు' అనేది అతని మంత్రముగా మారింది. 'దరిద్ర నారాయణ సేవ' ,పేదల సేవే భగవంతుని సేవ, అనే పదాన్ని ప్రతిపాదించాడు. "విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనము మనని గొప్ప వారని ఇతరులు తక్కువ వారని ఎలా అనుకుంటాము?" అనే ప్రశ్న తనకు తాను వేసుకుని ఈ తేడాలన్నీ మోక్ష సమయములో కలిగే దివ్యజ్యోతి లో కలిసి పోతాయని తెలుసు కున్నాడు. అప్పుడు పుట్టే ప్రేమ నుండి, తమలోని బ్రహ్మాన్ని తెలుసుకోలేని మనుష్యులను ఆదుకునే సత్ప్రవర్తన పుడుతుంది.అందరు తనవార నుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వానికి చెందిన వ్యక్తి వివేకానందుడు. వ్యక్తిగత మోక్షము పై వ్యామోహాన్ని  వదిలివేసి, ఇతరులను బంధ విముక్తులను చెయ్యడమే మనిషికి జ్ఞానోదయమని నమ్మిన మహామహుడుఆయన. రామకృష్ణా మిషన్ను (రామకృష్ణా మఠము) "వ్యక్తి మోక్షమునకు, ప్రపంచ హితమునకు" అనే నినాదము మీద స్థాపించాడాయన.

  'ఉత్తిష్టత జాగ్రత ప్రాప్తవరాన్నిబోధత' - అనేనినాదంతో  భాజాతికీర్తిపతాకాలను విశ్వవ్యాప్తంగా ఎగరేసి. ప్రపంచజనాలనూ, యువతనూ మేల్కొలిపిన మహా మహుడు వివేకానందుని ఆయన జయంతి సందర్భంగా ఈ రోజు జనవరి 12న  స్మరించడం మనకనీస కర్తవ్యంగా భావించాలి.    

Wednesday, 2 January 2013

నూతన సంవత్సర శుభాకాంక్షలు2013


బ్లాగ్ మిత్రులందరికీ!  2013
నూతన సంవత్సర శుభాకాంక్షలు !
  కాలం దైవ స్వరూపం !
       కాలం అత్యంత విలువైనది !
            కాలం ఎవ్వరికోసం ఆగదు ! 
                    కాలం ఎవ్వరినీలెక్కచేయదు.
                            శ్రమించి ఇతరుల మంచికోసం తపించేవారిని ఆశీర్వదించి విజయం సిధ్ధింపజేస్తుంటుంది .
                                     పరులను చూచి అసూయపడేవారిని చూసి నవ్వుకుంటుంటుంది   ,
                                             పరులకీడుకాంక్షించేవారినీ,దుర్మార్గులనూ అసహ్యించుకుంటుంది.
                                                         ఎవ్వరూ ఎవ్వరినీ  క్రిందికి త్రోయలేరు. 
                                                                  మంచి మంచినిపెంచితే చెడు  చెడునే చేకూర్చుతుంది .
ఈ నూతన వత్సరంలోనైనా మానవమృగాల దాడులు ఆగి ' నిర్భయం  ' గా సమాజంలో ఆడపిల్లలు జీవించే కాలం 'ముందుందిలే  ' అని ముచ్చటపడేరోజులు వస్తాయని భావిద్దామా!
       ఆడతనం ఆగ్రహిస్తే భూమాత ఉరుముతుందని , ఉప్పెన పెనుముప్పైకమ్మి, మానవతనే మసిచేసే కలియుగ కౌరవులను కబళించేస్తుందని  అంతా గ్రహించేరోజుకోసం ఎదురుచూద్దామా! సమసమాజం సమసమాజం అని అరిచే నోళ్ళకు కళ్ళుకూడా ఇవ్వమని  దేవుని ప్రార్ధిద్దామా!     
            మగవాడినికన్న ఏతల్లీ తన అమ్మతనానికి సిగ్గుపడే రోజు భువిపైరానేరాదని ఆశిద్దామా!  
                 ఆశే ఆశాజీవులమైన మనకు   ఆశాజ్యోతని విశ్వసిద్దామా !
[ ఒక్కరోజు ఆలస్యంగా చెప్తున్నందుకు మరోలా భావించకండి,ఢిల్లీ మానవమృగ దాడులతో మనస్సుచిన్నబోగా  ఆస్తకూడగట్టుకుని ఆలస్యంమైనా  అందరితోఈ ఆవేదన పంచుకోవాలని  ]



Sunday, 23 December 2012

డిసెంబర్ 22 - మేథమెటిక్స్ డే--ß---- శ్రీనివాస రామానుజన్‌ జయంతి.

                                  
            డిసెంబర్ 22 - మేథమెటిక్స్ డే--ß---- శ్రీనివాస రామానుజన్‌ జయంతి.

         ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త  శ్రీనివాసరామానుజన్‌కు నివాళిగా 2012 సంవత్సరాన్ని’ జాతీయ గణిత శాస్త్ర సంవత్సరం’గా ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు.. రామానుజన్ పుట్టిన రోజైన డిసెంబర్ 22ను ఏటా’ జాతీయ గణిత దినోత్సవం ‘గా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
            భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త శ్రీనివాసరామానుజన్. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు శ్రీనివాసరామానుజన్‌ . తమిళనాడులో ' కోమలతామ్మాళ్‌, శ్రీనివాస అయ్యంగార్‌ 'దంపతులకు , ఓ పేద బ్రాహ్మణ కుటుంబంలో ,డిసెంబర్ 22వతేదీన 1887 వ సంవత్సరంలోజన్మించారు  శ్రీనివాసరామానుజన్‌. విద్యార్థి దశ నుంచే గణితశాస్త్రం పట్ల అమితాసక్తి కలిగిఎన్నోగణితసిద్ధాంతాలను ఆవిష్కరించారు.
     చిన్నతనంనుంచేరామానుజన్గణితంపట్లఅద్భుతమైనతెలివితేటల్నిప్రదర్శించేవాడు .13ఏళ్లచిరుప్రాయం లోనే గణితశాస్త్రంలోని’ ట్రిగనోమెట్రీ (త్రికోణమితి) ‘అనే క్లిష్టమైన అంశంపై పట్టు సాధించాడు. లెక్కల పుస్తకాల్లోని అనేక సిద్ధాంతాల్ని రూపొందించారు. రామానుజన్ కఠినమైన లెక్కల్నిసునాయాసంగా చేసేవాడు, చదువులో పెద్దపెద్ద డిగ్రీలు లేకపోయినప్పటికీ గణితశాస్త్రంలో అసమాన ప్రతిభ కనబర్చిన మహనీయుడు శ్రీనివాస రామానుజన్. 15 ఏళ్ల వయసులో ఆయన చేసిన లెక్కల పుస్తకాలని ఈనాటికీ గణిత శాస్తవ్రేత్తలు అధ్యయనం చేస్త్తూనే ఉన్నారు.

రామానుజన్ తండ్రి కె శ్రీనివాస అయ్యంగార్ ఒక చీరల దుకాణంలో గుమస్తాగా పని చేసేవారు. ఈయన తంజావూరు జిల్లాకి చెందిన వారు.తల్లి కోమలటమ్మాళ్ గృహిణి మరియు ఆ ఊరిలోని గుడిలో పాటలు పాడేది. వీరు కుంబకోణం అనే పట్టణంలో, సారంగపాణి వీధిలో, దక్షిణ భారతదేశ సాంప్రదాయ పద్దతిలో నిర్మించబడ్డ ఒక పెంకుటింట్లో నివాసం ఉండేవారు. దాన్నిప్పుడు మ్యూజియం గా మార్చారు.. డిసెంబరు 1889 లో రామానుజన్ కుమశూచి (అమ్మవారు) వ్యాధి సోకింది. కానీ ఎలాగో బ్రతికి బయట పడగలిగాడు. తరువాత రామానుజన్ తల్లితోపాటు చెన్నైకి దగ్గరలో ఉన్న కాంచీపురంలో ఉన్న అమ్మమ్మ వాళ్ళింటికి చేరాడు.
రామానుజన్ అదే ఊళ్ళో ఉన్న చిన్న పాఠశాలలో ప్రాధమిక విద్యాభ్యాసాన్ని ప్రారంభించాడు. రామానుజన్ తాత కాంచీపురం న్యాయస్థానం లోని ఉద్యోగం పోవడంతో రామానుజన్ తల్లితో సహా తిరిగి కుంబకోణం వచ్చి అక్కడ’ కంగయాన్ ప్రాథమిక పాఠశాల’లో చేరాడు. అతడిప్రాధమిక విద్య సరిగాఒకే చోట సాగలేదు, మద్రాసు, కుంభకోణం కాంచీపురం అలామారసాగింది.
  రామానుజన్ తండ్రి రోజంతా పనిలో లీనమవడంవల్ల  చిన్నపుడు అతని భాద్యతలు తల్లే చూసేది. కాబట్టి తల్లితో చాలాగాఢమైన అనుబంధం కలిగిఉండేవాడు. ఆమెనుంచి రామానుజన్ సాంప్రదాయాల గురించి, కుల వ్యవస్థ గురించి, పురాణాల గురించి తెలుసుకున్నాడు. భక్తిగీతాలు ఆలపించడం నేర్చు కున్నాడు. ఆలయాలలో పూజలకు తప్పక హాజరయ్యేవాడు. మంచి ఆహారపు అలవాట్లు అలవరచు
కున్నాడు. ఒక మంచి బ్రాహ్మణబాలుడిగా ఉండాలంటే ఈలక్షణాలన్నీ తప్పనిసరి.కంగయాన్ పాఠశాల లో రామానుజన్ మంచి ప్రతిభావంతమైనవిద్యార్ధిగా పేరుతెచ్చుకున్నాడు.పదేళ్ళకేఆంగ్లం,తమిళం  ,  భూగోళ శాస్త్రం, గణితంలోనూ ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. పదేళ్ల వయస్సు నుంచే గణితంలో ప్రజ్ఞను ప్రదర్శించిన ఆయన.. గణితంలో కష్టసాధ్యమైన 'త్రికోణమితి' విభాగంపై పన్నెండేళ్ల వయస్సులోనే పూర్తిగా పట్టు సాధించారు. 17 ఏళ్ల వయస్సులోనే 'బెర్నౌలీసంఖ్యలు, యూలర్ అనంత సంఖ్యల సిద్ధాంతా'లపై పరిశోధనలు చేశారు. ఆయన ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం కుంభకోణంలోని కళాశాలలోచదువుకోవడానికిస్కాలర్‌షిప్ ఇచ్చింది.కానీకేవలం గణితంతప్ప మిగతాగణితేతర సబ్జెక్టుల్లో ప్రతిభచూపకపోవడంతో ఆతరువాత స్కాలర్‌షిప్‌ను నిలిపివేశారు.
1909, జులై 14వ తేదీన అంటే ఆయన 22వయేట రామానుజన్ కు జానకీ అమ్మాళ్ అనే తొమ్మిదేళ్ళ బాలికతో వివాహ మైంది.. తరువాత ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాడు.మద్రాస్ పోర్టుట్రస్టు కార్యాల యం లో గుమాస్తా గా చేరి, ఆ డబ్బుతో మరో కాలేజీలో చదువుతూ.. గణిత పరిశోధనలు చేశారు.
అప్పట్లో కొత్తగా ఒక గణిత శాస్త్ర సమాజాన్ని ఏర్పరిచిన డిప్యూటీ కలెక్టర్ రామస్వామిని రామానుజన్ కలుసుకున్నాడు. ఆయన పని చేసే ఆఫీసులో ఒక చిన్న ఉద్యోగంకోరి ఆయనకు తాను గణితం మీద రాసుకున్న నోటు పుస్తకాలను చూపించాడు. వాటిని చూసిన అయ్యర్  ఆనోటుపుస్తకాలలోని అపార మైన గణిత విజ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయాడు.అంతటి గొప్ప విజ్ఞానికి ఈచిన్న రెవెన్యూ విభాగంలో ఉద్యోగం ఇవ్వలేక,రామస్వామి రామానుజన్ ను కొన్నిపరిచయలేఖలురాసిమద్రాసులోతనకుతెలిసిన గణిత శాస్త్రవేత్తల దగ్గరకు పంపించాడు. అతనిపుస్తకాలను చూసిన కొద్దిమంది అప్పట్లో నెల్లూరు జిల్లా కలెక్టరుగా పనిచేస్తున్న రామచంద్రరావుదగ్గరకు పంపించారు.ఈయనభారతీయగణితశాస్త్రసమాజానికి కార్యదర్శి కూడా. రామచంద్రరావు కూడారామానుజన్ పనితనం చూసిఅబ్బురపడి, అవిఅతని రచన లేనా అని సందేహం కూడావచ్చింది. అప్పుడు రామానుజన్ తాను కలిసిన ఒక బొంబాయి ప్రొఫెసర్
’ సల్ధానా’  గురించి, అతనిరచనలు ఆ ప్రొఫెసర్ కు కూడా అర్థం కాలేదని చెప్పాడు.
        నారాయణఅయ్యర్, రామచంద్రరావు, E.W.మిడిల్‌మాస్ట్ మొదలైనవారురామానుజన్ పరిశోధన లనుఆంగ్ల గణితశాస్త్రవేత్తలకు చూపించడానికి ప్రయత్నించారు.లండన్ యూనివర్సిటీకాలేజీకి చెందిన ఎం.జే.ఎం. హిల్ అనే గణితజ్ఞుడు రామానుజన్ పరిశోధనల్లో కొన్నిలోపాలున్నాయని వ్యాఖ్యానించాడు.  హిల్ ,రామానుజన్ ను విద్యార్థిగా స్వీకరించేందుకు అంగీకరించలేదుగానీ, రామానుజన్ పరిశోధనలపై మంచి సలహాలు మాత్రం ఇచ్చారు. ఆయన ఆవిష్కరించిన 120 గణిత సిద్ధాంతాలను కేంబ్రిడ్జ్‌ ప్రొఫెసర్‌ జి.హెచ్‌. హార్డీకి పంపారు.రామానుజన్‌మేధస్సుకుఆశ్చర్యపడినహార్డీఆయననుబ్రిటన్‌కుఆహ్వానించారు.  అంతేకాక, 28-12-1918 న రామానుజన్‌ను 'ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటీ'మెంబర్ గా ఎన్నుకున్నారు. దీంతో రాయల్‌ సొసైటీలో ఫెలోషిప్‌ పొందిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందారు. కేవలం 30 ఏళ్ళ వయస్సులోనే గణితంలో అనేకచిక్కుసమస్యలనుపరిష్కరించి,ఎన్నోకొత్తసిద్ధాంతాలనుఆవిష్కరించారు.
రామానుజన్ ఆ కాలంలో సుప్రసిద్దులైన ఆయిలర్, గాస్, జాకోబి మొదలైన సహజసిద్ధమైన గణిత మేధావులతో పోల్చదగిన వాడు. రామానుజన్ లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన హార్డీ ‘అసలు తను గణిత శాస్త్రానికి చేసిన అత్యుత్తమ సేవ రామానుజాన్ని కనుగొనడమే !’అని వ్యాఖ్యానించడం విశేషం.1914లో రామానుజన్ ఇంగ్లండుకుప్రయాణమయ్యాడు.శాఖాహారపుఅలవాట్లుగలరామానుజన్ ఇంగ్లండులో స్వయంపాకం చేసుకునేవాడు. సరిగ్గా తినకపోవడం మూలాన, నిరంతర పరిశోధనల వల్ల కలిగిన శ్రమ వలన, ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల చాలా తీవ్రమైన పరిశ్రమ చేసి 32 పరిశోధనా పత్రాలు సమర్పించాడు. శరీరం క్రమంగా వ్యాధిగ్రస్థమైంది.తీవ్రమైనఅనారోగ్యంతోఉన్నపుడు  కూడా హార్డీతో 1729 సంఖ్య యొక్క ప్రత్యేకతను తెలియజెప్పి ఆయన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేశాడు. ఈ సంఘటన గణితంపై ఆయనుకున్న అవ్యాజమైన అనురాగాన్ని, అంకిత భావానికి నిదర్శనం. ఆకొద్ది కాలంలోనే రామానుజన్ దాదాపు 3200 ఈక్వేషన్స్‌ను, ఐడెంటీటీస్‌నుసాధించారు. 'రామానుజం ప్రైమ్, రామానుజంటీటా ఫంక్షన్'లను రూపొందించారు.. కొద్దిరోజులకే రాయల్ సొసైటీ, ట్రి నిటీ కళాశాల ఫెలోషిప్‌లను పొందారు

       క్షయవ్యాధికి గురై ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 1919 మార్చిలో భారతదేశానికి తిరిగి వచ్చాడు.బొద్దుగా,కొంచెంనల్లగా కనిపించే ఆయన ఇంగ్లండు నుంచి పాలిపోయిన అస్థిపంజరం వలే తిరిగి వచ్చిన రామానుజన్ నుచూసిఆయనఅభిమానులుచలించిపోయారు.అనేకరకాలవైద్యవసతులు కల్పించినాఆయనకోలుకోలేక పోయారు.దాంతోఆయన పిన్నవయస్సులోనే 1920,ఏప్రిల్26నపరమప దించారు. శుద్ధగణితంలో’ నంబర్ థియరీ ‘ లోని ఇతనిపరిశోధనలు, స్ట్రింగ్ థియరీ, క్యాన్సర్ పరిశోధ నల వంటి ఆధునికవిషయాలలోఉపయోగ పడుతూ ఉన్నాయి. రామానుజన్ చివరిదశలో’ మ్యాక్-తీటా ఫంక్షన్స్’ పైచేసినపరొశోధనలు  చాలా ప్రసిద్ధమైనవి. ఆయన ప్రతిపాదించిన కొన్ని అంశాలు కొన్నిఇప్పటికీఅపరిష్కృతంగానేఉండటంవిశేషం.
..
  రామానుజన్ చాలా సున్నితమైన భావాలు, మంచి పద్దతులు కలిగిన వాడు కాస్త బిడియస్తుడు. ఆయన కేంబ్రిడ్జిలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని గడిపాడు. ఆయన జీవిత చరిత్రను రాసిన మొట్టమొదటి రచయితఆయన్నుశుద్ధసాంప్రదాయవాదిగాపేర్కొనడంజరిగింది. తనకు సంక్రమించిన సామర్థ్యం అంతా తమ ఇలవేల్పు దేవత అయిన’ నామగిరి’ ప్రసాదించినదేనని రామానుజన్ బలంగా విశ్వసించేవాడు. తనకు ఏ కష్టంకలిగినాఆమెసహాయంకోసంఎదురుచూసేవాడు.  ఆమె కలలో కన్పించి ఎటువంటి సమస్యకైనా పరిష్కారంచూపించగలదనిభావించేవాడు.
’ భగవంతునిచే  ప్రాతినిథ్యం వహించబడని ఏ ఆలోచనా సూత్రం కానేరదు ‘అని అప్పుడప్పుడూ అంటేవాడు. రామానుజన్ అన్ని మతాలు ఒకటిగా నమ్మేవాడని హార్డీ ఒకసారి పేర్కొన్నాడు.
రామానుజన్ స్వరాష్ట్రమైన తమిళనాడుప్రభుత్వం , ఆయన సాధించిన విజయాలకు గుర్తుగా ఆయన జన్మదినమైన డిసెంబరు 22 ను ‘రాష్ట్ర సాంకేతిక దినోత్సవం’గా ప్రకటించింది. భారత ప్రభుత్వం 1962 వ సంవత్సరంలో ఆయన 75వ జన్మదినం నాడు, సంఖ్యా శాస్త్రంలో ఆయన చేసిన విశేష కృషిని కొని యాడుతూ ‘స్మారక తపాలా బిళ్ళ’ను విడుదల చేసింది.
      అంతమేధావి మరికొంతకాలం జీవించి ఉంటే గణితశాస్త్రంలో  భారతదేశప్రతిభను ఇంకా దశదిశలా వ్యాపింపజేసేవాడే!ఈరోజున భారతీయులమంతాఆయనకునివాళులర్పించడంమనధర్మగా భావించాలి. దేశవ్యాప్తంగా ఉన్నఅన్నిపాఠశాలల్లో గణితపోటీలునిర్వహించి,రామానుజన్ పేర బహుమతులు ఇచ్చి బాలలకంతా గణిత ప్రఙ్ఞాశాలి ఐన ఆయన గురించీ తెలియజెప్పడమూ మన బాధ్యతగా  భావించాలి.      

Tuesday, 11 December 2012

ప్రపంచ జంతువుల ,మానవ --హక్కుల దినం - డిసెంబర్‌10.


 ప్రపంచ జంతువుల హక్కుల దినం - డిసెంబర్‌10.

          డిసెంబర్ 10.అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవమేకాక నోరులేని ప్రాణులైన జంతువుల హక్కులదినోత్సవంకూడా. ఈరోజును  ‘ప్రపంచ జంతువుల హక్కుల దినం’గా జరుపుకుంటున్నాం...
                         తనూజ తెల్లవారుఘామునే లేచి వాకిలి ముందు చిమ్మి చక్కని రంగవల్లులు తీర్చి దిద్దుతుంటుంది.దానికోసంఆమెప్రతినెలాఐదుకేజీలబియ్యంమరపట్టించుకునిఆపిండిదాచుకుంటుంది.పట్టణంనుండీ
దీపావళికిపుట్టింటికివచ్చినఆమెఆడపడుచుఆనంది"మీపల్లెవాసులకింకాఈపిచ్చివదల్లే
దన్నమాట! "   అంది  వేళాకోళంగా.
" వదినా!నీవు పుట్టిపెరిగింది ఈపల్లేలోనే అని మరువకు.ఈరంగవల్లులుఎందుకేస్తున్నామోమరచావా! వాకిలి ముందున్నపిండితినను ఎఱ్ఱచీమలు వరుసల్లోవచ్చి వాటి ఆహారం అవి తీసుకు పోతుంటాయి .ఉదయాన్నే  ఇదేమనం చేసేమొదటి మంచిపని " అని చక్కాలోపలి కెళ్ళి పోయింది తనూజ.
  ఆనంది ఆలోచనలోపడింది. 'ఔను కదా! తానుపుట్టిపెరిగిన వాతావరణాన్నే మరచేంత పట్నవాసపు వాతావరణంలో పడిపోయిన తనపట్ల తనకే అసహ్యం వేయటం లేదూ !? ' అని ప్రశ్నించుకుంది ఆమె.

   భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అఖండమైనవి. ఉదయం లేచి చేసే ప్రతి పనీ తమచుట్టూ ఉన్న సూక్ష్మ ప్రాణులకు సైతం జీవితాన్నిచ్చేవిగాఉంటాయి. మొదటిముద్ద అన్నం గోడమీద కాకుల కోసం పెట్టడం, అన్నం తిన్నాక  ఓముద్ద ఇంటిముందుండే కుక్కకు వేయడం,నూకలుచెట్లక్రిందచల్లడం ,గుళ్ళ వద్ద పండ్లు,అక్కడి కోతులకు పెట్టడం, ఇవన్నీ మన చుట్టూ జీవించే జంతు జాలాలకోసం మానవులు చేసేసహాయం.భారతదేశంలో ' పశువుల పండుగ'జరుపుతాం,ఆరోజునగోవులకూ,గేదెలకూకొమ్ములకు పసుపు కుంకుమలు పూసి , పూలమాలలు వేసి పూజిస్తాం .  వాటివలన మనంపొందే సేవలకు కృతఙ్ఞతచూపేవిధానమది.      

     రానురానూ మనిషి తనస్వార్థం కోసం ప్రకృతిని, పరిసరాలను కబళించి కలుషితం చేస్తూ జీవితం సాగిస్తున్నాం .  జంతువులు, పక్షులుతమకోసంకాక,ప్రకృతిలోభాగంగాజీవిస్తూ,మనుషులదుర్మార్గానికి బలైపోతూ మనుగడ అతికష్టం మీద సాగిస్తున్నాయి.కొన్ని పక్షులు ,జంతువులూ కనుమరుగై పోతు న్నాయి, సెల్లు సొల్లు  కబుర్లకు మనిషికిరెండేసి కొనిపెట్టుకుని తినే తిండినుండీ తాగే సిగరెట్టువరకూ, చూసే పనికిమాలిన టి.వీ. సీరియల్ నుండీ పాకశాలలో వండుకుతినే వంటకాలవరకూ చెప్పుకోను సాగించే కబుర్లతో పిచ్చుకల ప్రాణాలు పోతున్నాయి. నగరాల్లో చెట్లునరికేసి అపార్టుమెంట్లుకడుతూ అనేకరకాలపక్షులకు,  కోతులకు జీవించను చోటు లేకుండా చేస్తున్నాం. 
 మనిషి తన ఉనికి కోసం, ఆహారం, వినోదం కోసం వెంపర్లాడుతూ జంతుజాలాన్ని జీవించే అవకాశం పోగొడు తున్నాడు. జంతువులను,పక్షులనూ పంజరాల్లో బంధించి, బానిసలుగా మార్చి వాటి స్వేచ్ఛను, ప్రాణాలను హరించి తన స్వార్థానికి వాడుకుంటున్నాడు. జంతువులు, పక్షుల నుంచి మనిషి పొందుతున్న ప్రతిఫలానికి కనీస కృతజ్ఞత కూడా లేకుండా వాటి పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యం, హద్దులు మీరిన హింస క్షమించరాని నేరంగానే మిగిలిపోతోంది.
                  మానవులు తమకు ఏ చిన్న కష్టం వచ్చినా , ఇబ్బంది జరిగినా ,అనేక సంఘాలు తమ ఉనికిని కాపాడుకునేందుకూ, రాజకీయనాయకులు తమస్వార్ధంకోసం అనేకపనికిమాలినకారణాలకుధర్నాలు,ఆందోళనలు, బందులు,న్యాయ పోరాటాలు అంటూఅనేకం చేస్తుంటారు.హక్కులుహరించుకు పోతున్నాయంటూ వార్తా పత్రికలు పతాక శీర్షికలువేసి సొమ్ము చేసుకుంటుoటాయి. ఐతేనోరూవాయీ లేని పక్షులూ, పశువులూ, జంతువులూ  ఎవ్వరికీ చెప్పుకోలేవు, మానవుల్లా బందులూ, హర్తాళ్ళూ చేయలేని అమాయక ప్రాణులు.అందుకే మానవులం వాటిప్రాణాలను సులువుగా హరించి వేస్తున్నాం. జంతువులకు, పక్షులకు ఏమి అన్యాయం జరిగినా ఎంత కష్టం కలిగినా కూడా అవి ఏమీచేయలేవు పాపం  వాటికీనీ కొన్ని హక్కులుంటాయని మనుషులు ఎందుకు గుర్తించ రన్నది అందరూ ఆలోచిం చాల్సినవిషయం.సృష్టిలోని ప్రతిప్రాణీ జీవించడానికి సమాన హక్కులు ఉండాలి. ఒక జీవి ప్రాణాలను హరించే హక్కు మరో జీవికి లేదు, ఉండకూడదు.

                       మనిషికి రక్షణ, ఆహారం, ఆరోగ్యాలను ప్రసాదిస్తున్న జంతుజాలంపై కృతజ్ఞతాభావంతో మెలగా ల్సిందిపోయి, క్రూరంగా హింసించడం అమానుషం. దాన్ని గుర్తించి జంతువులు, పక్షుల సంక్షే మం కోసం ఎంతో కృషి సాగించిన ‘సాధు టీఎల్ వాస్వాని’ పుట్టిన రోజైన నవంబర్ 25ను ప్రతి సంవ త్సరం జంతు ప్రేమికులు, జంతు సంరక్షణా సంస్థలు ఇండియాలో‘జంతువుల హక్కుల దినం’గా పాటిస్తున్నాయి. ఆ రోజును ‘నో మీట్ డే’గా పాటించాలని ఆ సంస్థలు కోరడం అందరూ ఆహ్వానించ దగ్గ అంశం. అలాగే, జంతువులు, పక్షులకు కూడా కొన్ని హక్కులు ఉంటాయన్నది బాధ్యత గల ప్రతి ఒక్కరూ గుర్తించి వాటి రక్షణకు కృషి చేయాలి. పురాణాల కాలం నుంచీ మనుషులకు జంతువులకు అవినాభావ సంబంధం ఉంది. నేటికీ వాటి ద్వారానే మనుషులు ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని పొందుతు న్నారు. బిడ్డకు తల్లిపాలు చాలకపోతే ఆవు పాలు పడతాం. మనిషి ఆహారంలో సగభాగం కోసంవాటిని చంపి  మాంసాన్ని వాడటం బాధాకరం.
     ఇంటి కాపలాకేకాక ఇంటిముందుకుక్క ఉండటం ఒక హోదాగామనం భావిస్తాం, , నేర పరిశోధనకూ కుక్కలను గణనీయంగా వినియోగిస్తాం.వ్యవసాయానికిఎద్దులనూ,దున్నపోతులనూ,కొండప్రాంతాల్లో ,  మంచు కొండల్లో, ఎడారుల్లో మనుషులను గమ్యానికి చేరవేయడానికి ఆప్రాంతాల్లో జీవించే జంతువు లను ఉపయోగిస్తాం. సర్కస్ వంటి ప్రదర్శనల్లో ఎన్నో జంతువులు, పక్షులతో పాటుగా క్రూరమృగా ల నూ ఆడిస్తూ అనేక విన్యాసాలు చేయిస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే, మనమంతా  జంతువులపై ఆధారపడి జీవిస్తున్నాం . జంతువులు కేవలం ప్రకృతిపై ఆధారపడి జీవిస్తున్నాయి.వాటిఆహారం అవి సంపాదించుకుని బతుకుతున్నామనమ్మాత్రం వాటినిబ్రతుకనీయక ,వాటిని వెంటాడి, వేటాడి హరించ డం క్షంతవ్యం కాదు. మనుషుల నుంచి తప్పించుకోవడానికి జంతువులకు ఉన్నఆవాసమైనఅడవు ల్లో తలదాచు కుంటుంటాయి. దాన్ని కూడా వదల కుండా నేడు మనంవాటిప్రాణాలు  హరిస్తున్నాం. మాంసం కోసం, చర్మాల కోసం జంతువులను వేటాడే వాళ్లు కొందరైతే, కేవలం వినోదక్రీడగా కాలక్షేపానికి క్రూరంగా వేటాడిచంపేవారు మరికొందరు.. దీని ప్రభావంతోనే, 1972లో ‘వన్యప్రాణులసంరక్షణాచట్టం’ రూపొందింది. దీని ప్రకారం వన్యప్రాణులను వేటాడటమే కాదు, పట్టుకుని బంధించడం కూడా నేరమే. ఇక పెంపుడు జంతువుల పేరుతో కూడా అవి అనేక హింసలకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్టు, నోరు లేని మూగ జీవాలకు స్వేచ్ఛ, సంరక్షణ కల్పించడానికి అనేక సంస్థలు నడుం బిగించడం గర్వించదగిన మంచి పరిణామం.’   పీపుల్స్ ఫర్ ఏనిమల్స్, ‘జీవ రక్షా సమితి, జీవ బంధు, బ్లూ క్రాస్ ‘వంటి సంస్థలు జంతువుల రక్షణకు ఎన్నో కార్యక్రమాలు, ఉద్య మాలు నిర్వహించడం మూలంగా కొంతైనా ఉపశమనం లభిస్తోందన్నది వాస్తవ విషయం. దీనికి వీలున్నంతగా మనమంతాసహకరించడం మనకనీస కర్తవ్యం.  
    హక్కులు కేవలం మనిషికే కాదు జంతువులకూ ఉండాలన్న ఉద్దేశ్యంతో’ యూనివర్సల్ డిక్లరేషన్ యానిమల్ రైట్స్‌ని‘ప్రకటించారు.ఈడిక్లరేషన్‌ని1998లోప్రపంచదేశాలుఆమోదించాయి.మానవహక్కుల దినమైన డిసెంబర్10న జంతువులహక్కులదినంగాచేయడంద్వారాజంతువులనుమానవులు తమ హక్కైన ప్రాణ రక్షణ నుపొందేహక్కూ వాటికీ ఉందనే  సందేశం అందరికీ అందిం చడమే ప్రధాన లక్ష్యం.
డిసెంబర్ 10.అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం.
           
ఇహ నోరుండి తమహక్కులకోసం పోరాటాలుజరిపే మానవుల హక్కులదినోత్సవాన్ని గురించీ కాస్తంత చెప్పు కుందాం.   భూమిపై పుట్టిన ప్రతిమానవునికీ జీవించడానికి కొన్ని హక్కులుంటాయి.    ఇందులో జాతి,మత,కుల భాష,లకుసంబంధంలేదు.మనిషిగా జీవించే హక్కు కలిగి ఉండడమే ప్రధాన ఉద్దేశ్యం.అలాంటి మానవ హక్కుల దినాన్ని 10.12.1948న ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అప్పటి నుండి ప్రతిసంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా డిసెంబరు 10వ తేదీ ని అంతర్జాతీయ మానవహక్కుల దినోత్స వంగా జరుపుకుంటున్నాం. వివక్షత లేనటువంటి మానవ సమాజ నిర్మాణమేఈఅంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవ లక్ష్యం.అసలు ఈ ఉత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నామో ,ఎందుకోసం  జరుపుకోవాలో ముందుమమనంఆలోచించాలి.

                  మానవ హక్కులను రక్షించేందుకు, మరిన్ని సౌకర్యాలు కలిగించేందుకు అమెరికా 1945 నుండి ప్రయత్నిస్తోంది. ఆ దేశ జనరల్‌ అసెంబ్లీ  అధికార ప్రకటనలను గౌరవించే ఉద్దేశంతో 1948వ సంవత్స రంలో డిసెంబర్‌ 10వ తేదీని’ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌గా’ (యు.డి.హెచ్‌.ఆర్‌) నిర్ణయించారు. మరి రెండేళ్ళ తర్వాత 1950 డిసెంబర్‌ 4వ తేదీన జరిగిన 317వ జనరల్‌ అసెంబ్లీ ప్రత్యేకసమావేశంలో మానవ హక్కుల దినోత్సవానికి సాధారణ ప్రణాళిక రచించి అమలు జరిపారు. ఆరోజున అన్ని రాష్ట్రాల అధికార ప్రతినిధులనూ ఆహ్వానించడమే కాకుండా ఆసక్తి ఉన్న సంస్థలు ఈరోజున మానవ హక్కుల దినోత్సవం జరిపినట్లయితే ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందని జనరల్‌ అసెంబ్లీ సూచించింది.

        ప్రతీ మనిషికి దక్కవలసిన హక్కులు దక్కుతున్నాయా? హక్కులు పరిరక్షించేందుకు మనమంతా మన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నామా?మనహక్కులనుకాపాడుకోగల్గుతున్నామా?కోట్లాదిమంది అశాంతితో,  అభద్రతాభావంతో తల్లడిల్లిపోతున్నారుకనుకనే’మానవ హక్కులదినోత్సవం ‘అనేది పుట్టుకొచ్చింది.ఇతరదేశాలతో  పోల్చినప్పుడు అమెరికాలో ఈరోజుకు చాలా ప్రాధాన్యత వుంది.   ‘న్యూయార్క్ సిటీ హెడ్‌ క్వార్టర్స్‌ క్యాలండర్‌లో ‘డిసెంబర్‌ 10వ తేదీ హైలైట్‌ చేసిచూపుతుంది.పైస్థాయి రాజకీయ సభలు, సమావేశాలు అలాగే సాంస్కృతిక సంస్థలకు సంబంధించినప్రదర్శనలు,సాంప్రదాయ నృత్యాలు మొదలైనవన్నీ ఈ ప్రత్యేకదినాన ఏర్పాటు చేస్తారు.

       ఐదేళ్ళకోసారి అమెరికా సంయుక్త రాష్ట్రాలు 'మానవహక్కులకోసంపోరాడినవారికిఇచ్చేపురస్కారం, ఇంకా అత్యున్నత నోబెల్‌ బహుమతి అందుకున్నవారిని ఈరోజున సత్కరిస్తారు.అనేకప్రభుత్వ,ప్రైవేటు సంస్థలు మానవ హక్కుల రంగంలో చురుగ్గా పాల్గొంటారు. ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తారు. సాధారణ, సాంఘిక సమస్యలను చర్చి చేస్తారు.వాటిని పరిస్కరించేప్రయతనం చేస్తారు.

        2006వ సంవత్సరంలో మానవ హక్కుల దినాన్ని పురస్కరించుకుని పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం సలిపారు. నిజంగా తిండి, బట్ట, గూడు లాంటి కనీస అవసరాలు తీరకపోవడం ఎంత విషాదం?! ఈ సందర్భంగా ఎందరో వాటి పరిష్కారానికి సంబంధించిన ప్రకటనలు విడుదల చేశారు. పేదరికాన్ని రూపుమాపాలని, అందుకు మనమంతా కృషిచేయాలని మేధావులెందరో అభిప్రాయపడ్డారు. 2008 డిసెంబర్‌ 10న యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ 60వ వార్షికోత్సవం జరిగింది. '  యునైటెడ్‌ నేషన్స్  సెక్రటరీ జనరల్‌ 'ఆ ఏడాది అంతా మానవ  హక్కుల పరిరక్షణకు సంబంధించిన ప్రణాళికలు, ఉపన్యాసాలతో సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు. యు.డి.హెచ్‌.ఆర్‌ రూపొందించిన డాక్యుమెంట్‌ 360 భాషల్లోకి అనువాదమై ప్రపంచ రికార్డు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకుతమ హక్కులేంటో తెలియజేయడం,అవసరమైన సహకారం అందించడం ధ్యేయంగా పెట్టుకుని అనేకసంస్థలు పనిచేస్తున్నాయి. 1998లో మాల్దావా ''ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్‌ ది యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్' అంటూ ఒక పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. తైవాన్‌లో షియామింగ్‌టెహ్‌1979లోహ్యూమన్‌ రైట్స్ ప్రదర్శనలు నిర్వహించింది. 2004లో చైనా, మాల్దీవులు, వియత్నాం దేశాల్లో ఖైదీలుగా ఉన్న ‘సైబర్‌ డిసిడెంట్స్'  ను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇంటర్నేషనల్‌ పెన్‌ ప్రదర్శనలు నిర్వహిం చింది. అమెరికా, ఆఫ్రికా, యూరప్‌ దేశాలు మానవ హక్కుల సంరక్షణకోసం యథాశక్తి ప్రయత్నిస్తు న్నా యి. మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మనమంతామనబాధ్యతలనుసక్రమంగా, నిజాయితీగా నిర్వహించాలనే అంకిత భావానికికట్టుబడిఉంటామనిప్రమాణంచేద్దాం.మనకనీసహక్కుల కోసం నిస్సంశయంగా పోరాడుదాం. ''బ్రతుకు, బ్రతకనివ్వు'' అనే సిద్ధాంతాన్ని నమ్ముదాం, ఆచరిద్దాం.