బ్లాగ్ మిత్రులందరికీ! 2013
నూతన సంవత్సర శుభాకాంక్షలు !
కాలం దైవ స్వరూపం !
కాలం అత్యంత విలువైనది !
కాలం ఎవ్వరికోసం ఆగదు !
కాలం ఎవ్వరినీలెక్కచేయదు.
శ్రమించి ఇతరుల మంచికోసం తపించేవారిని ఆశీర్వదించి విజయం సిధ్ధింపజేస్తుంటుంది .
పరులను చూచి అసూయపడేవారిని చూసి నవ్వుకుంటుంటుంది ,
పరులకీడుకాంక్షించేవారినీ,దుర్మార్గులనూ అసహ్యించుకుంటుంది.
ఎవ్వరూ ఎవ్వరినీ క్రిందికి త్రోయలేరు.
మంచి మంచినిపెంచితే చెడు చెడునే చేకూర్చుతుంది .
ఈ నూతన వత్సరంలోనైనా మానవమృగాల దాడులు ఆగి ' నిర్భయం ' గా సమాజంలో ఆడపిల్లలు జీవించే కాలం 'ముందుందిలే ' అని ముచ్చటపడేరోజులు వస్తాయని భావిద్దామా!
ఆడతనం ఆగ్రహిస్తే భూమాత ఉరుముతుందని , ఉప్పెన పెనుముప్పైకమ్మి, మానవతనే మసిచేసే కలియుగ కౌరవులను కబళించేస్తుందని అంతా గ్రహించేరోజుకోసం ఎదురుచూద్దామా! సమసమాజం సమసమాజం అని అరిచే నోళ్ళకు కళ్ళుకూడా ఇవ్వమని దేవుని ప్రార్ధిద్దామా!
మగవాడినికన్న ఏతల్లీ తన అమ్మతనానికి సిగ్గుపడే రోజు భువిపైరానేరాదని ఆశిద్దామా!
ఆశే ఆశాజీవులమైన మనకు ఆశాజ్యోతని విశ్వసిద్దామా !
[ ఒక్కరోజు ఆలస్యంగా చెప్తున్నందుకు మరోలా భావించకండి,ఢిల్లీ మానవమృగ దాడులతో మనస్సుచిన్నబోగా ఆస్తకూడగట్టుకుని ఆలస్యంమైనా అందరితోఈ ఆవేదన పంచుకోవాలని ]
No comments:
Post a Comment