Tuesday, 4 September 2012

' సరస్వతీ నమస్తూభ్యం '


                                         ' సరస్వతీ నమస్తూభ్యం '    
        సిస్టం ముందుకూర్చుని సీరియస్ గా పనిచేసుకుపోతున్న హరి తన సెల్ మోగటంతో తీసు కున్నాడు"హలో!హరీ!నేనురాసూరిని!"అనేమాటలువిని,ఆశ్చర్యంగా"ఓ!నువ్వా!సూరీ!ఎక్కడ్నుంచీ!ఎన్నాళ్ళైందిరా! నీగొంతువిని! ఎక్కడ్నుంచీరా ఫోన్?"  
" అవన్నీ తర్వాత ముందునీవు  అర్జంట్గా బయల్దేరి ఇంటికొచ్చెయ్ !అదే రా బందర్లోని మాపాత ఇల్లే కారుందిగా ! బయల్దేరు "  అనిఫోన్ కట్ చేసిన సూరిని తల్చుకుని’ వీడెప్పుడూ ఇంతే ఆకాశంలో మెరుపులామెరుస్తుంటాడు. తప్పుతుందా! ప్రాణ స్నేహితుడాయె!' అనుకుంటూ లేచి తనక్యాబిన్  లోంచీబయటపడి  ,బాస్ వద్ద లీవ్ తీసుకుని బయల్దేరాడు హరి. డ్రైవ్ చేస్తుంటే హరి కారు ముందు కెళుతుండగా అతడిమనస్సు వెనక్కు మళ్ళింది .
                              **********************
   ఆరోజుల్లోతానూసూరిఎంతస్నేహంగా ఉండేవారు!తనకెంతోగుర్తుఒకటోక్లాస్లోసూరిజాయినవ్వడం , అందరికీబొరుగులూబెల్లాలూ,పలకలూ,బలపాలూ, పిప్పరమెంట్లూపంచి,సూరి చేత తరగతి టీచరైన  సరస్వతిగారికిపాదాలకునమస్కారంచేయించారు,ఆమెకుపండ్లుపులుఇప్పించారు.వాడినాన్నగారు.
పలకమీద’ ఓంనమశ్శివాయ’అనిటీచర్ రాసి,సూరికి అక్షరాభ్యాసంచేయించినరోజునవాడినితనపక్కనే కూర్చోబెట్టారుటీచర్. అంతేఆరోజునుండీసూరి,తనూ బెస్ట్ ఫ్రండ్సఐపోయారు . 
       వాడేమో ప్రతిరోజూ సరస్వతీ టీచర్ గారి పాదాలకు నమస్కరించందే క్లాస్ లోకూర్చునేవాడుకాదు, తానేమోకనీసంఆమెకునమస్కారంమన్నాపెట్టేవాడుకాదు. సూరికి 'స 'పలికేదికాదు’.స’బదులు’చ’ పలికే వాడు,టీచర్ని’చరచ్వతీ’ టీచర్అనిపిలిచేవాడు.మిగిలినపిల్లలతాఊరికే’టీచర్!’అంటేసూరిమాత్రం ' చరచ్వతీ టీచర్ !' అనేవాడు.ప్రతిరోజూటీచర్ వాడికి’ స స ‘అనిపలికిస్తేవాడు’ చ చ ‘అంటుంటే అంతా నవ్వుకునేవారం. చీదర్,ఆచ,చరణ్,చచి,చేచు అంటూ శ ష, స లకు బదులూ అన్నింటికీ చ నే పలికే వాడు. కావాలనివాడికి’స’తోఉన్నపదాలుచెప్పిపలకమనినవ్వుకునేవాళ్లంఅంతా.స్కూల్ అనమంటే వాడు చ్కూల్ అనేవాడు.తర్వాత్తర్వాతవాడుక్లాస్ లోఫస్ట్ వచ్చేవాడు,ఏక్లాస్ కెళ్ళినావాడు ఫస్టే !తాము   టెంత్ క్లాస్ కెళ్ళినా సూరి సరస్వతీటీచర్ గారికిపాదనమస్కారంచేయందేక్లాస్కెళ్ళేవాడుకాదు .వాడికి ఆటీచరంటేఅంతభక్తి ,ఆమెకూసూరిపైఎంతోఅభిమానం,తానుమాత్రంవాడిపక్కనేఉన్నాకనీసంచేతులెత్త కపోయినా’నమస్కారం’అనన్నా,చెప్పేవాడుకాదు.ఐనా టీచర్మాత్రంముందుగాతననే పలకరించేవారు .
" ఏమోయ్! హరీ! బావున్నావా!' అనో బాగా చదువుతున్నావా! ' అనో అడిగేవారు.   
తానూ సూరి స్నేహంతో పట్టుదలగా చదివి టెంత్ లో వాడు స్టేట్ ఫస్ టైతే ,తాను సెకండ్ వచ్చాడు. స్కూల్ లో తమకెంత గౌరవం! అదంతా సూరి స్నేహంవల్లే ! వాడిపట్టుదలేతనకూఅబ్బింది.ఆతర్వాత తాము జూనియర్ కాలేజ్ లో చేరారు. కావాలని సరస్వతీ టీచర్ స్కూల్ కువచ్చేచుట్టుదారెంటే సూరి వచ్చేవాడు కాలేజ్ కి. దార్లో సరస్వతీటీచర్ కనపడగానేరోడ్లోనేవంగి’పాదనమస్కారం’ చేసేవాడు సూరి , తానుమాత్రంపక్కకు తప్పుకునేవాడుఆవిడదూరంగావెళ్ళేవరకూ." ఒరే సూరీ! నీకిదేంపిచ్చిరా!ఎక్కడో ఒకటో తరగతిలోచదువుచెప్పెన ఆటీచర్ కుఇలానడిరోడ్లోనూ పాదనమస్కారం చేయాలిట్రా! అందరూ నవ్వుతున్నార్రా మనల్నిచూసి" అంటే " ఒరే హరీ! నీవేంఆమెకునమస్కారం చేయట్లేదు,నేనూ నిన్ను ఎప్పుడూఆమెకునమస్కారంచేయమని చెప్పనూలేదు.ఇహనీకేంబాధరా! నవ్వేవారునన్నుచూసిగానీ నిన్నుచూసికాదుగా!నేనంతేరా!ఆటీచర్గారిదయవల్లేనాకు'స,శ,ష'లకుబేధంతెల్సిసరైనఉఛ్ఛారణనేర్చి
పదాలుసరిగాపలకడమేకాక,గణితంపట్లఆటీచర్ నాకుఏర్పరచినఆసక్తివల్లేఈనాడునేనింతబాగాచదువు తున్నాను, అదంతాఆమెనాకుప్రసాదించినవరంరా! నేనింతే హరీ !" అనేవాడు." “ఐతేనేనీదారినరానురా!మనకుదగ్గరదారివదలి,నడుచుకుంటూఈచుట్టుదారినఆటీచర్ కోసం రావడం చాదస్తం రా! " అనితానంటే , " ఒకే హరీ ! రేపట్నుంచీనీవుఆదగ్గరదారినేవెళ్ళు,నేనుమాత్రంఇటేవస్తాను " అన్నాడు .తనకెంతో గుర్తు,నాల్గురోజులుసూరినివదలితానువంటరిగావెళ్తే ఏదోలోటుగా ,దిగులుగ అని పించింది.సూరిచెప్పేవాడు" సరస్వతీటీచర్ నిన్నురోజూఅడుగుతూనేఉన్నార్రా!నీఫ్రెండ్రావట్లేదేమని”    . ఆరోజు తనకు తలకొట్టేసినట్లైంది ,తాను ఏనాడూనమస్కరించకున్నా,టీచర్ నాగురించీఅడిగేరంటే ఆమెకు తనపైనా సూరిపైనున్నంత ప్రేమాభిమానాలున్నాయనీ, టీచర్లు తమకు తమస్టూడేంట్స్ నమస్కరించాలనికాక వారు క్షేమంగాఉంటూ ,చదివి వృధ్ధిలోకి రావాలనిమాత్రమే కోరుకుంటారని! .
ఆమర్నాడుతానూసూరితోపాటుఆచుట్టుదారంటేవెళ్ళడం, సరస్వతీటీచర్ గారికినమస్కరించడం ప్రారంభించాడు.ఆరోజు టీచర్ సూరిలాకాక , చేతులుజోడించినమస్కరిస్తున్నతనతలపై చేయివేసి అప్యాయంగా తడుతూ," హరీ ! నీనమస్కారంకోసంకాదోయ్నీగురించీఅడిగింది,మీరిద్దరూవిడబాయని జంటకదా! నీవుకనిపించకపోడంతోనాకేదోలోటుగాఅనిపించి అడిగానంతే! అదేంటో నోయ్ !  మీరిద్దరూ కనిపించనిరోజు నాకేదో వెలితిగా ఉంటుంది " అన్నారు.ఆతర్వాతతానుఇంజనీరింగ్లోచేరడంతో బందర్ వదిలేసివరంగల్ వెళ్ళిపోయాడు.తానైతేఆస్కూల్ నూసరస్వతీటీచర్ నూఒకరకంగామరచిపోయినట్లే!  సూరిహైదరాబాద్ లోజె.ఎన్ టి యు లో చేరి,తనలక్ష్య మైన ఐ.ఏ.ఎస్ కోచింగ్ సైతంఏకకాలంలో తీసు కుంటూ,చివరకుతనలక్ష్యంసాధించాడు.ఇప్పుడువాడుజిల్లాకలెక్టర్ !తమస్నేహాన్నినెమరువేసుకుంటూ ఎంతస్పీడ్ గాకారు డ్రైవ్ చేశాడోగానీ విజయవాడనుండీబందర్ చేరిపోయాడు.
      గేట్లోఅడుగుపెట్టగానే,ఎదురొచ్చి" నాకు తెల్సుహరీ! నీవింతత్వవగావచ్చేస్తావని, పదపద వెళదాం " అంటున్న సూరిని వింతగా చూసి ," ఎక్కడికిసూరీ! " అడిగాడుహరి. " చెప్తాపదవోయ్ ! " అంటూ హరి కార్లోనే ఇద్దరూ ఎక్కి బయల్దేరారు." హరీ నీకు గుర్తుందా ! ఆరోజునేనుమొదటిసారిబడికి వచ్చినపుడు, నేనునీపక్కనేకూర్చున్నాను, నీవు నాపెద్ద బలపంతీసుకునినీచిన్నబలపం నాకిచ్చావు. నేను పెద్దగా ఏడుస్తూ " చరచ్వతీటీచర్ చరచ్వతీ టీచర్ ! వీడునాపెద్ద బలపంతీచేచుకున్నాడు " అని అరిచాను. టీచర్ మనవద్దకువచ్చిపెద్ద బలపాన్నిసగానికితుంచి " ఇదో ఇప్పుడుఇద్దరికీ సమానమైన బలపాలు సరా! చక్కగా రాసుకోండి, కొట్లాడకూడదు, ఒకరివి ఒకరు తీసుకోకూడదు, ఒకరికున్నవిమరొకరితో  సమంగా పంచుకోవాలి సరా! ఏమైనా కావలిస్తే నన్నడగండి" అనిమొదటినీతిపాఠంనేర్పారు, ఆక్షణం మహిమేంటో గానీమనం ఇద్దరంమంచిస్నేహితులమై, మనంతయారుచేసుకున్ననోట్సులు పంచుకుని శ్రధ్ధగాచదివిఇంతవారమయ్యాం ,ఆమెనేర్పినంమొదటినీతిపాఠంనామదిలోనిల్చిపోయిందిహరీ!దేశానికి ఏదైనా మంచిచేయాలని,నేను కలెక్టర్నైపేదలకుచేతనైనసాయంచేయాలనేనాకోరికఇలానెరవేరనుచిన్న తనంలోమనసరస్వతీటీచర్చెప్పిననీతులుమనస్సులోనాటుకోడమే !నేనుసరస్వతీటీచర్ చక్కగా చెప్పే పాఠాల గురించీమాట్లాడితే నీవుఅనేవాడివిగుర్తుందా !వాళ్ళుప్రభుత్వంనియమించినఉపాధ్యాయులు, చదువుచెప్పడంవారిధర్మం,ఎందుకంటేవారుప్రభుత్వంజీతంతీసుకుంటున్నారుగనుక' ,అనేవాడివి. ఎందుకోరా నాకు మాత్రం  మొదటఅక్షరాలు దిద్దటం నేర్పించిన సరస్వతీ టీచరంటే అభిమానం!ఆమె చిన్నప్పుడు చెప్పిన నీతికధలూ, పాటలూ, షేరిగ్ గేంస్ నాకింకా గుర్తు.ఆటీచర్ నునేనుమరువలేను, ఆమెఆశీస్సులతోనే మనమింతవారమయ్యాం, గురుదీవెనఅమోఘమైనది " అంటున్నసూరితో
“ సూర్యనారాయణఐ.ఏ.ఎస్.గారుమంచిపరిపాలనఅందివ్వటమేగాకబాగానేఉపన్యాసాలూఇస్తారన్న
మాట!ఎంతైనా నీవు సరస్వతీ ప్రియుడివోయ్ ! ఆమాత దయతోపాటు సరస్వతీ టీచర్ గారి దీవెనలూ నిన్ను గొప్పవాడ్ని చేశాయేమో!" అన్నాడు హరి..
" నీవుమాత్రం తకువా హరీ! ఇంజనీర్ గా మంచి పేరు తెచ్చుకుంటున్నావ్!గొప్పజీతం తీసుకుంటున్నావ్! " స్నేహితుని భుజం తడుతూ సూరి అన్నాడు. ఇంతలో" కారాపు హరీ "అని సూరిదిగి, ఒక మంచి కంచిపట్టుచీర ,శాలువా, ఒకబుట్టెడురకరకాలపండ్లూ,ఒకపెద్దపూలమాల ,బొకే తీసుకుని కారెక్కాడు. కలెక్టర్ క్యాంప్ ఉందనితెల్సియ.ఆర్.ఓ ,ఇతరఆఫీసర్లంతావచ్చిపాఠశాలముందు బారులుతీరారు,వినతిపత్రాలుఅందించాలనిఎంతోమందిప్రజలూవచ్చిగుంపుగాచేరారు.సూరికారుదిగ్గానే యం.ఆర్వో.వచ్చి , నమస్కరించి మెడలో దండవేయబోతూ "సార్!కాదనకండిమొదటిమారుమాఊరికి వచ్చారు " అనగాసూరిమర్యాదగావారించి,"రండిలోపలికి"అంటూపాఠశాల్లోకిదారితీశాడు.అప్పటికేవచ్చి ఉన్నబిళ్ళబంట్రోతు సూరికంటి చూపుఅర్ధంచెసుకున్నట్లు కార్లో ఉన్నబుట్టలన్నీదింపుకుతెచ్చాడు. 
హెడ్మాస్టర్తోఏదోమట్లాడిఅతడుదారిచూపగాఒకతరగతిగదిలోప్రవేశించారుకలెక్టర్సూర్యనారాయణతోపాటుగా అంతా. గదిలోపాఠంచెప్తున్నఏజ్డ్లేడీటీచర్వారినంతాచూసిభయంగాలేచినమస్కరించారు.హెడ్మాస్టర్ "మన జిల్లాకొత్త  కలెక్టర్ గారు " అని పరిచయంచేయగా ఆమెమరోమారునమస్కరించికుర్చీచూపారు. కలెక్టర్ సూర్యనారాయణ ఆమెదగ్గరగా వెళ్ళి ముందుగా ఆమెకు పాదనమస్కారంచేసి, తాను తెచ్చిన పూలమాలవేసి , చీరరవిక,పసుపుకుంకుమలూ, పూలూ పండ్లూ ఉన్నపెద్ద ట్రే ఆమెకుఅందించి, శాలువాకప్పి,నమస్కరించాడు. తెల్లబోయిచూస్తున్నఆమెతో " బావున్నారా చరచ్వతీ టీచర్ ! వీడు నాపెద్దబలపంతీచుకున్నాడుచరచ్వతీ టీచర్ ! "అంటూ హరిని చూపాడు.
ఆమెసంభ్రమంతో"ఓసూరీ!ఇతనుహరిఔనా!!"అన్నారు."ఔనుటీచర్ !మీరెలాఉన్నారు?మిమ్మల్నిచూసిఎంతకాలమైంది!పెద్దవాళ్ళైపోయారుటీచర్! ఈరోజుమిమ్మల్నిచూసిమీదీవెనలుఅందుకోవాలనివచ్చాం " అన్నాడు హరి." హరీ! సారీ ! కలెక్టర్ సూర్యనారాయణగారు మీరు ! " అంటున్నటీచర్ నువారించి ,
" మేం మీకెప్పటికీ సూరి, హరీలమే టీచర్! మీ దీవెనలవల్లే ఇంత వాళ్ళమయ్యాం,మనహరిపెద్ద ఇంజనీర్ టీచర్ త్వరలోఅమెరికాకూడా వెళ్ళబోతున్నాడు " అన్నాడు సూరి. " ఇంతగొప్పవాడివైనా ఒకటో క్లాస్ లో ఓనమహాచెప్పిన టీచర్ను మరువలేదంటే నీవునిజంగాఎంత గొప్పవాడివో అందరికీ అర్ధ మవుతున్నది, హరీనీవూనన్నుగుర్తుంచుకునిచూడనురావటంచాలా సంతోషమయ్యా! ఇలానా విద్యార్ధులిద్దరూఇప్పటికీ ఎడబాయని జంటగాఉండటంనాకెంతో గర్వంగాఉంది." అంటూ "ఈపురస్కారం నీకేతగునయ్యా!"అంటూతనమెడలోనిపెద్దపూలమాలతీసిసూరిమెడలోవేస్తుండగామీడియాకెమెరాలన్నీ వారిని క్లిక్ చేశాయి. హరినవ్వుతూ" బావుంది పరస్పర పురస్కారం , ఇద్దరూ ఈపురస్కారానికి తగినవారే !గురువుకు తగిన శిష్యుడు " అంటూ ఆపూలమాలను ఇద్దరిమెడల్లోనూసర్ది ," ఇప్పుడూ తీయండయ్యా ఫోటోలు "అన్నాడు.  కరతాళ ధ్వనులతో ఆ పాఠశాలప్రాంగణం  మారుమ్రోగింది...   

******వార్త దినపత్రిక చెలిలో ఉపాధ్యాయ దినోత్స్వం సందర్భంగా సెప్టెంబర్ 5 న ప్రచురితం ***********

Sunday, 2 September 2012

అల్లంబెల్లం చట్నీ రెస్పీ


     
అల్లంబెల్లం చట్నీ రెస్పీ:- 

1అల్లం ఒక చిన్నకప్పు, 

2. బెల్లం అంతే కప్పు.

3.మినప్పప్పు- 2స్పూన్స్ 

4,. ఆవాలు 1స్లూన్.

5. ధనియాలు-3స్పూన్స్.

6.మెంతులు 1స్పూన్ .

7. కొద్దిగా ఇంగువ.

8. ఎండుమిర్చి -4,5 [ కారాని బట్టి]

9. చింతపండు ఒక [ అదేకొలత] కప్పు.

10. ఉప్పు- తగినంత.

తయారుచేసేవిధానం -  ముందుగా మూకుడు స్టౌ మీద ఉంచి వెలిగించి 4 స్లూన్స్ నూనె వేయాలి. నూనెకాగాక పోపుసామానంతా వేసి బాగా బంగారు రంగువచ్చేవరకూ వేయించి, పక్కన పెట్టుకోవాలి. ముందుగా చింతపండు నీళ్ళలో నానబెట్టి ఉంచుకుని నానాక గుజ్జుతీసి ఉంచుకోవాలి, పోపుసామాను 
మిక్సీలోవేసి గ్రైండ్ చేసి , బాగామెదిగాక అల్లం వేసి అది మెదిగాక చింతపండు గుజ్జు, బెల్లం [తురిమినది] , ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి, తగినంత నీరు పోసి గరిట జారుగా చేసుకోవాలి. ఇది ఇడ్లీల్లోకి, వడల్లోకీ, దోసె, బజ్జీ , చపాతీ, పూరీల్లోకి కూడా చాలారుచిగా ఉంటుంది.

ఒకమారు తిన్నారంటే వదలరు. చేసి చూస్తారుగా! 

హిమాలయం

                 హిమాలయం
                ------------
        పర్వతం  పర్వతం-హిమాలయపర్వతం
                           హిమ మయమీ పర్వతం 
     1.చల్లదనం - తెల్లదనం 
      స్వచ్చ మైన ఔన్నత్యం 
       హిమాలయం పెన్నిధి 
       భరతావని  నున్నది                                          : పర్వతం:  
                              2.జీవ నదుల జన్మ స్థలి      
                                మునులకిది  తపోస్థలి 
                                వన మూలిక లందించే  
                                వన దేవత నిలయమిది                :పర్వతం:  
                                               3.ఘనమైన లొయలతో 
                                                  గొప్పపుణ్య తీర్ధాలతొ
                                                  అలరా రే శిఖరాలతొ 
                                                 నెలకొన్నది ఉత్తరాన       :పర్వతం:
                     4. మన ఎల్లగ నిలచింది  
                        మనజీవన దేవతైంది 
                        సహజ వనరుల ఖజాన  
                        కట్టనిమన కోట ఇది.                                   :పర్వతం: 
 
ఒక సమావేశంలో శ్రోతలకోరికపై హిమాలయం గురించీ ఆశువుగా చెప్పినకవిత.
                         
                                          

నేతగాని నేర్పితనం


                                         నేతగాని నేర్పితనం 
పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్ళి , చెట్టుపైనుండీ శవాన్ని దించి, భుజాన వేసుకుని ఎప్పటిలగే మౌనంగానదవసాగాడు.సవంలోని కరాళుడు " రాజా!ణీకు శ్రమకలుగకుండా ఒక కధ చెప్తా ను విను.తనకు ఎంతో ఆదాయం లభిస్తుందని తెలిసినా , తన వృత్తిలోని వారు సుఖపడాలనే మంచి స్వభావంగల నేత వీరయ్య కధవిను."అని ఇలాచెప్పసాగాడు 
                                   వెంకటగిరి సంస్థానంలో ప్రతియేటా తమ నగరపు నేతగాళ్ళు నేసిన జరీ పట్టునేత బట్టల ప్రదర్సన జరిపి అందరూ ప్రసంసించే బట్టలకు బహుమతు లీయడం'  రాజా రామ రాయలు 'వాడుక .ఆయేడాది ప్రదర్శనకు ఎన్నో రాజ్యాల రాజులు తమ అంతఃపుర రాణి వాసంతో తరలి వచ్చారు.  మహారాణులంతా అన్నింటికంటే అందమైన , విలువైన చీరలు ముందుగా తామే కొను బడిచేసి స్వంతం చేసుకోవాలనే ఉబలాటంతోఉన్నారు.రాజారామరాయలవారుపచ్చజండా   ఊపి ప్రారంభాన్ని చాటగానే సాధారణ జనంతోపాటుగా మహారాణులుసైతం,ప్రదర్శానలోకిజొరబడ్డారు .ఆఏటి మేటి చీరను తామే కొనాలని వారిపంతం.
               వెంకటగిరి సంస్థానంలో ఎంతోకాలంగా ' మంచి నేర్పరని ' పేరుగాంచిన నారయ్యమనుమడు  వీరయ్య నవయువకుడు.బాగాచదువుకుని, చిత్రలేఖనంలోనూ అందెవేసినచేయిగా పేరుగాంచాడు.తన తాతలనాటి వృత్తినే నమ్ముకుని  నేతలోమరింత  నేర్పరితనాన్ని తాత,తండ్రుల పని చూసి నేర్చుకుని , రాత్రింబవళ్ళూ శ్రమించి ఒక గంధపువన్నె జరీపట్టుచీరను నేశాడు. దాన్ని ఒక పెద్ద కొయ్య బొమ్మకు కట్టి  ప్రదర్శనలో ఉంచాడు.చీర కట్టినతీరు ఎంత చాక చక్యంగా ఉందంటే అతగాడు నేసిన ఉద్దేశ్యాన్ని చక్కాగా చూపుతోంది.ప్రదర్శకులంతా గుంపుగా చేరి దాని అందాన్ని చూడసాగారు.ముందుగా అక్కడి కి వచ్చిన ఉదయగిరిమహారాణిఆశ్చర్యంగాఅక్కడేనిల్చిపోయింది.బొమ్మఎడమభుజంపైనుండీ   నెమలి తల,పింఛం  క్రిందికి వచ్చి  చాతీమీదకుతల , కళ్ళు రాగా మెడ కుడి చేతిక్రిందనుండీ వెనక్కు పోయి , వీపుపైకి పొట్ట రెక్కలు వచ్చి ముందుకుచ్చిళ్ళపైకి నెమలి' పురివిప్పి 'ఉన్నట్లు అద్భుతంగాచూపరుల ను ఆకట్టుకుని కళ్ళు  త్రిప్పనీయకుండా చేసిన, ఆచీరకట్టినతీరుచీరఅందాన్నిపూర్తిగాచూపుతున్నది. 

                          మైసూరి మహారాణి వచ్చి చూసి ఆశ్చర్యంతో అచేతన ఐంది. మణిపురి రాణి,ఉదయ పురి రాణి, ప్రశాంతిపురమహారాణి  వచ్చి అలాగే నిల్చిపోయారు.ముందుగా వచ్చిన ఉదయగిరి రాణి , ఆచీరవెల అడిగింది.వీరయ్య " మన్నించాలి మహారాణీ వారు. ఇది మావెంకటగిరి రాణీవారికిఅర్పించనే  తయారుచేశాను.వెలకోసంకాదు. తమరి శలవైతే  మరొకటి తయారుచేసి సమర్పించుకుంటాను ." అన్నాడు వినయంగా.   ఉదయగిరిరాణి మరేమీ అనలేక " మంచిది నాకు వీలున్నoత స్వల్ప వ్యవధి లో ఇలాంటి చీరతయారుచేసి సమర్పించుకో. ఈచీర నేతకు ఎంత వెండి పట్టిందో దానికి రెండురెట్లు ధనం నేను ఇస్తాను." అంటూ,విచారించి  పదివేల వెండి రూకలు సంచీతో ఇచ్చివెళ్ళింది.
           ఆతర్వాత  విషయంవిన్న మైసూరురాణి "  వీరప్పా !నాకూ ఇలాంటి చీరేకావాలి.ముందునాకే నేసివ్వు" అంటూ 20వేల వెండినాణాలు ఇచ్చి పోయింది.తర్వాత మణిపురి, ఉదయపురి,ప్రశాంతిపురి రాణులు వచ్చి వరుసగా ముందుతనకే ఇవ్వాలని 40వేలు,80వేలు 160వేల వెండి రూకల సంచీలు ఇచ్చి పోయారు.వీరయ్యకు ఆయేటీ మేటి నేత గాని ' బహుమతి వచ్చినా ,భయంపట్టుకుంది ఆమహా రాణు లందరికీ ఎలా సరైనసమయానికి ' ఆనెమలి ' చీరలు నేసి ఇవ్వాలా అని .తన శక్తి సామర్ధ్యాలపై నమ్మక మున్నా , తాత తండ్రుల సాయంతో రాత్రింబ వళ్ళూ శ్రమించ సాగాడు. ముందుగా ఉదయగిరి మహారాణికి పంపాడు. అలా వరుసగా అందరికీ చీరలను త్వర త్వరగా  పంపాక , వారంతా తమతమ చీరలనుఇతరులతోపోల్చుకునిఅందరివీఒకేలాఉన్నాయోలేదోతాముఅడిగినట్లుతమకేముందుగాపంపాడోలేదోతెల్సుకోవాలనిఅనుకున్నారు.ఇంతలోవారoతాకల్సుకునేసమయంరానేవచ్చింది .అదే  మైసూరు  మహారాణి ' పుట్టినరోజు 'పండుగ. అంతా మైసూరుతరలివచ్చారు.దేనికైనా మంచిదని వారంతా చీర ల నేతగాడైన వీరయ్యను వెంటబెట్టుకురమ్మని కోరారు.వెంకటగిరిమహారాణి వీరయ్యను రమ్మని కబురం పింది.అంతా మైసూర్లో కలసి విందుభోజనాలయ్యాక తమవెంట తెచ్చిన వెంకటగిరి నెమలి చీరలను బయటికి తీశారు. మడతల్లోవున్న చీరలు ఒక్కోరిచీర ఒక్కో విధంగా కనిపించి , ఆగ్రహంతో వీరయ్యను పిలిపించారు." ఏం వీరయ్యా! ఈపనేంటి? మనరాజ్యపు పరువు తీశావు,మహారాజు గారికి అపకీర్తి తెస్తావా?  ఈచీరలనేతేంటి, ఇంత వ్యత్యాసంగాఉంది? అంతా ముందుగానే నీకు పైకంచెల్లిం చా రుగదా!" అని గద్దించింది వెంకటగిరిమహారాణి.
           " మహారాణీ! మన్నించండి , తమరు మడతల మీంచీ చూస్తే అలాగేఉంటుంది . తమరంతా వాటిని ధరించి చూడండి.తప్పుంటే శిక్షించండి ." అన్నాడు  వినయంగా వీరయ్య." అలాగే " అని మహా రాణులంతా  అంతః పురంలోనికెళ్ళి తమ, తమ చీరలు ధరించి వచ్చారు, వెంకటగిరిమహారాణి తో సహా.అంతా అద్దం ముందు నిల్చుని చూసుకున్నారు.అందరికీ చీరలు వీరయ్య కొయ్యబొమ్మకు కట్టినట్లే వచ్చాయి.  ఆశ్చర్యంగా  వారంతా వీరయ్యను చూడగా , వీరయ్య తమ ప్రభువైన ' వెంకట రిగి  రాజా రామరాయలు వైపు చూశాడు . ఆయనతలపంకించి , మీసమ్మెలేసి " భళీ! వీరయ్యా  ! నీ చాతుర్యo మహాగొప్పది " అని తన మెడలోని వరహాల హారాన్ని బహూకరిoచాడు. "మహా ప్రభో ! మహారాజు లందరికీ నాదొకమనవి , మైసూరు ప్రాంతం పట్టు తయారీకి నాణ్యమైనతావు , తమరూ మాప్రభువులలానేతగాళ్ళనుప్రోత్సహిస్తే ,మాకంటేఉత్తమమైన ,అందమైనచీరలునేయగలరు  ,బహుదూరం నుండీ మీరు వచ్చేశ్రమ తప్పుతుంది, మాకూ సుదూరప్రాంతాలకు సత్వరమే అందించే కష్టమూతప్పుతాయి. తమరు ప్రోత్సహించాలేగానీ  మీప్రాంతపు నేతగాళ్ళు తీసిపోయినవారేంకారు. నిన్నంతా తమరి రాజ్యంలో తిరిగి నేతపనులు చూసివచ్చాను.మన్నించండి ఎక్కువ మాట్లాడి నట్లు న్నాను.తోటినేతగాళ్ళ ఇబ్బందులు చూసి ఈమాటలు చెప్పాలనిపించింది.శలవు." అన్నాడు ఎంతో వినయంగావీరయ్య.అంతాతలలుఊపారు."వీరయ్యా!నీమంచిమనస్సుకుసంతోషిస్తున్నాం  .మాకుఇంతకాలంగా తోచని విషయాన్ని తెలియజేసినందుకు ఆనందంగాఉంది.  , నీతోటి వృత్తివారిపట్ల నీవు చూపుతున్న బాధ్యతకు , నీనిజాయితీకి ఇదిగో బహుమానం " అంటూ మైసూరుమహారాజు మరో హారాన్ని అందించాడు.  " ఇహ నీవు వెళ్ళవచ్చు " అని అనుమతించగానే వీరయ్య  తన ఊరికి గుఱ్ఱం మీదతిరుగు  ప్రయాణమయ్యాడు.
“"ఓ విక్రమాదిత్య మహారాజా!రామరాయలుకు ,వెంకయ్యకుమాత్రమేఅర్ధమైనఆరహస్యమేంటి? రాణులకు చీరలు మడతలపైనుండీ వేరుగా కనిపించినా చీరలు కట్టుకున్నాక ఒకేవిధగా నెమలిని చుట్టుకున్నట్లు  కనిపించాయికదా ! ఎందువల్ల? వీరయ్య చీరలను అందరికీ సరైన సమయానికి పంపాడా  ?ఎలా? తాను నేతగాడైనా  , తన ఆదాయంపోతుందని భావించక వీరయ్య , మైసూరు మహారాజుతో సహా అందరికీ తమ రాజ్యంలో నేతవారిని ప్రోత్సహించమని ఎందుకు సలహా ఇచ్చాడు ?    రాజా !ఈప్రశ్నలకు సమాధానంతెలిసికూడా చెప్పకపోయావో నీతల వేయివక్క లవుతుంది " అన్నాడు శవంలోని కరాళుడు.
                అందుకు విక్రమాదిత్యుడు   " ఉదయగిరిమహారాణి వెంకటగిరి రాణికంటే కొచెం మందం, ఆమెకంటే ఒక్కోరూ కొంచెంకొంచెం లావవటాన మడతల్లో ఉన్నచీరతేడాగాకనిపించింది.   కట్టుకున్నాక అందరూనెమలినిధరించినట్లే, చుట్టూనెమలి పురివిప్పినట్లే అద్దంలో తమను చూసుకుని మురిసి పోయారు..వారికి  తేడాలోనిమర్మo  అవగతంకాలేదు ,రాజాగారికితప్ప,ప్రతియేడదీ చీరలకు బహు మతులిస్తున్న అనుభవశాలిగనుక  . ఇహ వీరయ్య మంచి మనస్సు గలవాడుకావడoతో ,మైసూరు వెళ్ళినా అక్కడి తన లాంటి నేతగాళ్ళనుకలిసి వారి కష్ట సుఖాలు విచా రించి వారి వేదనను అర్ధం చేసుకుని  , వారికి సహాయం చేయగలనేమో అని మైసూరు మహారాజుగారికిఅలాచెప్పాడు  .అందరికీ ఒకే సారి చీరలను ఐదుమంది ద్వారాపంపాడు దగ్గరనే ఉన్న ఉదయ గిరికి  త్వరగా అందింది. దూర ప్రాంతాల వారికి  ప్రయాణ సమయాన్ని బట్టి అందింది.ఈవిషయంలో వీరయ్య తను చదివిన తెలివిని ఉపయోగించి వారుకోరిన విధంగా చీరలను అందించగలిగాడు.” అన్నాడు విక్రమార్కుడు .రాజుకు ఈవిధంగా మౌనభంగం కాగానే శవంతోసహా కరాళుడు మళ్ళీ చెట్టెక్కాడు.
               ****చంద్రబాల పిల్లలమాసపత్రికలో ప్రచురితం..****