Tuesday, 29 October 2013

శాంతి చిరునామా


చిన్నారి 

శాంతి చిరునామా

apr -   Mon, 28 Oct 2013, IST
ధర్మాపురం అనే గ్రామంలో ధర్మన్న అనే వ్యాపారి ఉండేవాడు. పేరులో తప్ప ఆయనలో ధర్మం అనేది వీసమెత్తు లేదు.   ఎంగిలి చేత్తోకాకిని తోలని వ్యకి. వ్యాపారంలో అదృష్టంకొద్దీ విపరీతంగా లాభాలు వచ్చేవి. అయినా తన పిసిని గొట్టు బుద్ధిని ఏ మాత్రం మార్చుకోలేదు. పైపెచ్చు అది ఇంకా పెరిగింది. తన కింద పనిచేసే గుమాస్తాలకు, ఇతర ఉద్యోగులకు సమయానికి జీతం కూడా ఇచ్చేవాడు కాదు. ఆయన భార్య సితమ్మకు, పిల్లలకు మంచి బట్టలు, తిండి కూడా ఉండేది కాదు. వాళ్లు అడిగీ అడిగీ విసుగెత్తిపోయారు. మంచి బట్టలు లేక సీతమ్మ ఊళ్లో జరిగే ఏ శుభకార్యాని కి వెళ్లేది కాదు.
ధర్మన్న మాత్రం వచ్చిన లాభాలను 'ఎక్కడ దాచాలి? కొత్తగా ఏ వ్యాపారం లాభసాటిగా ఉంటుంది?' వంటి ఆలోచనలు చేస్తూ కాలం గడిపేవాడు. చదువుకోవడానికి స్కూలు ఫీజులు అడిగే పిల్లలమీద, భార్యా, ఇతర ఉద్యోగస్తుల మీద డబ్బులు అడుగుతున్నారని కోపం తెచ్చుకునేవాడు. ఎప్పుడూ ఎవరో ఒకరిమీద కోపంతో అరుస్తూ అశాంతిగా ఉండే వాడు.
ధర్మన్న కొట్లో పనిచేస్తూ ఆయన ఇంటిముందు చిన్న గుడిసెలో ఉండేవాడు ఆనందుడు. అతడి పేరులోనేకాదు అన్నింటా ఆనందంగా గడిపేవాడు. చిన్న గుడిసెలో తనకున్నదాంట్లోనే  తృప్తిగా గడుపుతూ, తన వద్దకు వచ్చిన వారికి చేతనైన సాయం చేస్తూ కాలం గడిపేవాడు.
ఒక రోజు ధర్మన్న మేడమీద కిటికీలోంచి అనుకోకుండా.. ఆనందుడు, భార్య పిల్లలతో సంతోషంగా గడుపుతున్న దృశ్యాన్ని చూశాడు. అంత చిన్న గుడిసెలో, తినడానికి ఏమీ లేకపోయినా అంత సంతోషంగా ఎలా గడుపు తున్నా డని  ఆలోచిస్తూ ఉండిపోయాడు. చివరకు ఎంత ఆలోచించినా ధర్మన్నకు విషయం అర్థం కాలేదు.
ఉదయాన్నే పనిలోకి వచ్చిన ఆనందుడిని పిలిచాడు ధర్మన్న. ''మీకు ఏమీ లేకపోయినా అంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నా వు ?'' అని ప్రశ్నించాడు. దానికి ''బాబుగారు మీరేం అనుకోనంటే చెప్తాను అన్నాడు'' ఆనందుడు.
''మేము మాకున్న దానితో కలోగంజో అంతా కలిసి హాయిగా తాగుతాం. ఉన్నదాంట్లో తృప్తిగా బతుకుతాం. మీకు అదిలేదు'' అన్నాడు ఆనందుడు.
ఉన్నదాంట్లో తృప్తిగా బతకడం తెలుసుకున్నాక ధర్మన్న జీవితమే మారిపోయింది. కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టక, ఉద్యోగులను అన్నదమ్ముల్లా చూస్తుడటంతో అందరూ ధర్మన్నతో మంచిగా ఉండడం మొదలు పెట్టారు.

---- ఆదూరి హైమావతి, చికాగో.
******************
ఆంధ్రప్రభ  27సెప్టెంబర్ ఆదివారం  లో ప్రచురితం

5 comments:

  1. dharmanna laanti dhramannalu manalo unnaru konchem maarandi baabu.
    totalgaa post adubutamgaa undi
    http://www.googlefacebook.info/

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ అజయ్ గారూ!

      Delete
  2. మీరిచ్చే ప్రోత్సాహమే నాకుఊతం.

    ReplyDelete