ఇస్తే వస్తాయ్...
రఘురాం ఒక సాధారణ గుమాస్తా.ఆయన భార్య రాగిణి తమ మితమైన రాబడితో తన పిల్లలిద్దరినీ ఎంతో క్రమశిక్షణతో పెంచుతున్నది .రాము , రాణి కవలలు. ప్రతి రోజూ రాత్రివారికి భారత భాగవత రామాయణ గాధలుచెప్తుంటుంది.చదువుతోపాటుగా చక్కని అలవాట్లు పిల్లలకు నేర్పేది.. .పిల్లలిద్దరూ చదివేస్కూల్ ప్రభుత్వపాఠశాల కావడంతో ఉచితవిద్యే ఐనా యూనిఫాం తప్పని సరి.పిల్లలిద్దరూ ఉదయాన్నే లేచి తయారై 2కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్కు నడిచివెళ్ళేవారు. ఎంతోమందికి సైకిళ్ళున్నాయనీ తమకూ కొనివ్వమనీ రాము తండ్రిని అడుగు తుండేవాడు. తల్లి రాగిణి " చూడు రామూ ! కాళ్ళులేనివారినెపుడైనా చూశావా?వారు నడవలేక డేకుతారు పాపం , నీకు భగవంతుడు చక్కగానడవను కాళ్ళు ఇచ్చినందుకు సంతోషించు.ఇతరులను చూసి అవన్నీ కావాలను కోడంకంటే నీకంటే తక్కువగా ఉన్నవారిని చూసి నీకు లభించిన వాటి తో తృప్తిపడటం మంచిలక్షణం. "అని చెప్పింది. " నీవెప్పుడూ ఇలాగే చెప్తావమ్మా!" అని విసుక్కున్నాడు రాము. చిన్నవాడైన రాము అప్పుడపుడూ తనతరగతిలోని పిల్లలనుచూసి వారికున్నవి తనకూ కావాలని అడగడం, తనవద్ద ఉన్న స్పేర్ పెన్స్ కానీ నోట్బుక్స్ కానీ అవసరమైతే రాణికి ఇవ్వను ఇష్టపడక అక్కతో పేచీపడటంచూసినతల్లిరాగిణివాడికిబుధ్ధిచెప్పేసమయంకోసంవేచిచూడసాగింది.. .
ఆరోజు తమ తరగతిలో క్రొత్తగాచేరిన 'నీరజ 'చాలా పాత డ్రెస్ వేసుకుని వచ్చింది స్కూల్కు. అంతా ఆమెను చూసి నవ్వు కున్నారు. ఎవ్వరూ ఆమెతో మాట్లాడలేదు. రాణి వెళ్ళి పక్కనకూర్చుని స్నేహంగానవ్వింది.నీరజ ఎంతోసంతోషించింది.అలావారి స్నేహం మొదలైంది. ఎన్నాళ్ళైనా నీరజ యూనిఫాం వేసుకు రాకపోడంతో టీచర్సంతా ఆమెను క్లాస్ లో నిల్చోబెట్టసాగారు." చూడూ నీరజా ! స్కూల్ నిబంధనలు పాటించాలి, నీవు ఒక్కదానివే ఇలాయూనిఫాంలేకుండా రాడం బావులేదు " అని మందలించారుకూడా. ఓరోజున ఆమెను క్లాస్ లోకి రానివ్వక పోడంతో ఆమెచాలాబాధపడింది.నీరజ తండ్రి కూలిపనిచేసి తనముసలి అమ్మనాన్నలతో సహా ఆరుమందిని పోషిస్తున్నాడు,నీరజ తల్లి ఆరోగ్యం బావుండదు.యూనిఫాం కుట్టించేస్థోమత ఆయనకు లేదు. నీరజ కూడా ఎంతో కష్టపడి ఇంట్లో పని చేసి స్కూల్కు ఎలాగో వస్తున్నది. ఆమెకు చదువంటే ప్రాణం. రాణి మరునాడు అమ్మ నడిగి తన యూనిఫాం రెండోజత తెచ్చి నవీనబ్యాగ్ లో ఉంచింది."నవీనా ! నీవు ఈ యూనిఫాం వేసుకుని రా !నేను ఇచ్చినట్లు ఎవ్వరికీ తెలీదుసుమా!" అని ఒక లెటర్ వ్రాసి ఉంచింది. మరునాడు నవీన ఆయూనిఫాం వేసుకుని స్కూల్ కువచ్చింది ,కృతఙ్ఞతగారాణిని చూసి నవ్వింది.మరుసటివారం రాణిపుట్టినరోజుపండుగ రాగా ఆమె అమ్మమ్మా తాతా , మామా, అత్తా ,బాబాయ్ వచ్చి తలో జత బట్టలూ తెచ్చి బహూకరించారు." చూశావా! రామూ ! అక్క తనకున్న రెండుజతల యూనిఫాం లో ఒకజత నన్నడిగి , నవీనకు ఇచ్చింది గుట్టుగా ఎవ్వరికీ తెలీకుండా , అక్కకు ఎన్ని జతల బట్టలు వచ్చాయో చూశావా? ఇస్తే వస్తాయ్ ! తెల్సుకో , నీవద్ద ఉన్న వాటిని ఇతరులతో పంచుకోడం నేర్చుకో ." అని చెప్పింది.
[హైదరాబాద్ నుండీ ప్రచురితమయ్యే ' బాలవికాస్ ' పిల్లలమాగజైన్లో గతనెలలో ప్రచురితం ]

No comments:
Post a Comment