Saturday, 30 June 2012

శక్తిహీనత స్వయంకృతమే

      
                   

                                        శక్తిహీనత స్వయంకృతమే



వేసవి సెలవ్ఞలు ప్రారంభం కావడంతో మా ఇంట్లో సందడి ప్రారంభమైంది. ''అమ్మమ్మ ఊరెళ్దాం.. మమ్మల్ని ఎప్పుడో చిన్నతనంలో తీసుకెళ్లావ్ఞ. మాకసలు గుర్తేలేదు. ఈ ఏడాది వెళ్లాల్సిందే! అంటూ పిల్లలిద్దరూ గొడవ మొదలెట్టారు. ''అది చిన్న పల్లెటూరు. కరెంటు ఉండదు. ఏసి లేదు. టివి రాదుఅని నేను అక్కడి ఇబ్బందులు ఏకరువ్ఞ పెట్టేలోగానే నా మాటలు కట్‌చేస్తూ ''ఓకే..ఓకే అవేవీ లేకపోయినా పరవాలేదు.
 నీవ్ఞ అమెరికాలో ఉండగా రోజూ చెప్పి ఊరించేదానివే అమ్మమ్మ చేతివంట గారెలు, బూరెలు, బొబ్బట్లూ, ఆవకాయ, పులిహోర, వేడివేడి పకోడీలు, మామిడితో పూలు, కొబ్బరిబోండాలు, నదిలో ఈతలు ఊ అనెసే§్‌ు అంటూ వేధించసాగారు. నాకూ అవన్నీ చూసి, అమ్మచేతి వంట తిని హాయిగా ఉండాలని ఉన్నా, గృహిణిగా నా బాధ్యతల్ని తోసేసి వెళ్లలేని గుజాటన! అందుకే ''అన్నీ సరే! పాపం మరినాన్న ఒంటరిగా మనం లేకుండా బయట

 భోంచేస్తూ అని నేను అంటుండగానే, మా శ్రీవారు వచ్చి ''§్‌ు అనూ! వారం క్రితమే చెప్పారో§్‌ు! మర్చిపోయాను నీకు చెప్పడం. రాత్రే కన్‌ఫ్మరైంది చికాగో ఆఫీసులో నెల రోజులు ట్రైనింగట. నేను రేపే బయల్దేరి అమెరికా వెళ్లాలి. నా బట్టలవీ రెడీ చేసె§్‌ు అనగానే పిల్లలిద్దరూ ఓఓ అని అరవసాగారు కాలం కల్సి వచ్చిందని.

అమ్మింటికి వెళ్లాలన్న ఉత్సాహంతో ఆన్‌లైన్‌లో టిక్కెట్స్‌ బుక్‌చేద్దామని చూడగా దొరకలేదు.  మా నిరాశ గమనించి శ్రీవారు చూడు అను ఎటూ మనం ఉండట్లేదు! కారు నెలరోజులు వాడకుండా ఊరికే ఉంచితే గరేజ్‌ కెళ్లితే  పదివేలు వదులుతాయి. నీకు తెల్సుగా యూజ్‌ ఆర్‌ లూజ్‌ . టెన్‌ థౌజెడ్స్‌! నీవ్ఞ డ్రైవర్తో వెళ్లు వాడ్ని తిరిగి ఏరోజు రావాలో చెప్పు. అక్కడ నీవే తిప్పుకో సరదాగా ఉంటుంది.
 పిల్లలుకూడా ఒకే అని చెప్పారు.  ఆయనలా అమెరికా ఫ్లయిట్‌ ఎక్కగానే అమ్మకు ఫోన్‌చేసి మేము బయల్దేరాం నా పుట్టింటికి.

ఆ చిన్నపల్లె ఇప్పుడెలా ఉందో. చూసి పదేళ్ల వ్ఞతోంది. పెళ్లయ్యాక అమెరికాలో కొంతకాలం ఆ తర్వాత ఒకటి రెండు దేశాలు తిరిగి ఇప్పుడిప్పుడే స్వదేశానికి వచ్చి, మాతృదేశపు గాలి పీల్చు కుంటున్నాం. ఇప్పుడు 'జననీ జన్మభూమిశ్చ అని పుట్టిన ఊరు చూడబోడం పిల్లలకంటే నాకు ఉత్సా హంగా ఉంది. ఇండియారాగానే అమ్మనాన్న వచ్చి చూడటం తప్ప  నేను వెళ్లడానికి వీలేకాలేదు. ఆ పెద్ద పెంకుల భవంతి.
 చల్లని వేపచెట్లగాలి. మల్లెజాజి పందిళ్లు. బంతులు, చేమంతులు. నా  ఊహ వెనక్కు వెళ్లసాగింది. కారు ముందుకు సాగుతుండగా ఇంటి ముందు కారాగగానే అమ్మానాన్న గబగబా ఎదురు వచ్చారు. పిల్లలు కారుదిగి అమ్మమ్మను చుట్టుకు పోయారు. ఇటీవలే చూడటం వల్ల వారు అమ్మమ్మకు బాగా మాలిమయ్యారు. అమ్మ అప్పుడే బియ్యం నాన బోయించి దంపిస్తోంది. అతిరసాలకు, మణుగుబూ లకు, బియ్యం దంపుతున్న బాచమ్మను చూసి

 ''ఏం బాచమ్మా, బావ్ఞన్నావా? అని పలుకరించగానే 65ఏళ్ల ఆమె మహదానందపడిపోయింది. ''మామ్మే అమెరికా వెళ్లి వచ్చినా నన్ను మర్చిపోలేదా తల్లీ! అంటూ నా బుగ్గలు పట్టుకుని నిమిరింది.

బాచమ్మ నా చిన్నతనం నుండీ మా ఇంట్లో పని చేసేది. పాలేరు పుల్లయ్య భార్య. నా పెళ్లి నాటికే ఆమెకు 50దాటింది. ఇంకా ఎంత చకచకా బియ్యం దంపుతోంది. ఆశ్చర్యమేసింది. నాకు ఇహ పుల్లయ్య సరేసరి! మేం రావడం పండుగలా మామిడాకులు తెచ్చి తోరణాలు కట్టడం, కొబ్బరితోట కెళ్లి కొబ్బరి బోండాలు కొట్టడం ఎంత హుషారుగా చేస్తున్నాడో అలుపెరగక. ఇహనాన్న ఈ పనులు అజమాయిషీతో నిలబడకుండా తిరుగుతున్నాడు.
 మరీ సమయం లేకుండా పోయిందీ అంటూ.

నాకు 35 దాటకుండానే కీళ్లనొప్పులు, కాళ్ల నొప్పులు, 3మానికల బియ్యం అవలీలగా దంపి, అమ్మ వేయించి పోసిన కందులు తిరగల్లో వేసి తిప్పేసింది. ఆపైన మా అందరిబట్టలూ సబ్బుపూసి జాడించి ఆరేసింది. గారెలపిండి రుబ్బింది. నేను ఆమె చేసే పనులన్నీ గమనిస్తూనే ఉన్నాను. పిల్లలూ ఆమె పనులు చూసి ''మమ్మీ! అంత పెద్దావిడ ఎలాగా ఇన్ని పనులు చేస్తోంది అనినన్ను ప్రశ్నించారు.
అవ్ఞను, శరీరమూ ఓ యంత్రమే కదా! వాడు తుంటేనే నట్స్‌ బావ్ఞంటాయి. వాడకపోవడం వల్ల నట్సు తుప్పుపడతాయి. మనకీళ్లే మననట్స్‌. పల్లెల్లో ప్రజలు, కూలీచేసే జనం, నిత్యం నడుస్తూ, బరువ్ఞలు మోస్తూ, శరీరశ్రమ అధికంగా చేస్తూ రాగిఅన్నం, గంజితాగుతూ, అధికంగా నీళ్లు తాగుతూ తేలికైన బల మైన తిండి, పూర్తి శారీరక శ్రమ వల్ల వారి నట్స్‌ అదే కీళ్లు, నరాలు ఏవీ తుప్పుపట్టవ్ఞ. నగరవాసులు మిక్సీ,
 గ్రైండర్‌, వాషింగ్‌మెషీన్‌, వ్యాక్యూం క్లీనర్‌ వంటి ఆధునిక ఎలక్ట్రానిక్‌ వస్తువ్ఞలు వాడకంతో, చివరకు చేటతో చెరగడం సైతం లేని నవనాగరిక సమాజంలో చేతులు రెక్కలు, గూళ్లు, కీళ్లు, మోకాళ్లు అన్నీ తగిన శ్రమలేక తుప్పు పడుతున్నాయి. బాచమ్మవంటివారు దంచడం, రుబ్బడం, తిరగలి విసరడం, చెరగడం, నీళ్లు చేదడం, బయట ఊడ వడం అర ఎకరమున్న లోగిలి చీపురుతో చిమ్మి కళ్లాపు చల్లడం వంగి

 ముగ్గులేయడం, ఇవన్నీ చేయడం వల్ల 65ఏళ్ల వయస్సులోనూ ఆరోగ్యంగా గట్టి శరీరంతో ఉండ గలుగుతున్నారు. పనిచేయడం వల్ల చమటపట్టి, ఆ శ్రమకు తగినట్లు నిండుగా నీరు తాగడం వల్ల లోపలి భాగాలన్నీ చల్లబడి, లోపల ద్రవాలన్నీ బాగా ఊరి, జిగటపదార్థాలన్నీ తగినంత ప్రమాణంలో తయారై, ఆరోగ్యంగా, కీళ్లన్నీ బాగా తిరగగలుగుతాయి. అందుకే యంత్రాలైనా, శరీరయంత్రమైనా యూజ్‌ ఆర్‌ లూజ్‌ అన్నారు. ఈ మారు

 తిరుగలి రోలు తప్పక తీసుకెళ్లాలని గట్టి నిర్ణయం తీసుకుని అమ్మ, బాచమ్మతో కల్సి చేసిన అతిరసాలు రుచిచూడను వంటశాలలోకెళ్లాను.
                       [     సోమవారం , ఏప్రిల్ 02 ,2012- వార్తలో ప్రచురితం ]




No comments:

Post a Comment