Sunday, 18 August 2013

కదళీ ఫలం

చిన్నారి 




కదళీ ఫలం


ap -   Sun, 18 Aug 2013, IST


కదళీ ఫలం,andhra prabha,telugu, news paper,epaper,hyderabad,online games for girls, telugu news, hot,cinema,show,sunday book,breaking news,telangana,vidyaprabha, corparate accounting,student voice,kulasa,naika,balaprabha,chintana,business,sports

దుర్వాస మహర్షి తన భార్య అయిన 'కదళి'తో కలిసి ఒక పర్ణశాలలో నివస్తున్నాడు. అక్కడే భార్య సహకారంతో జపతపాదులు చేసు కుంటూ కాలం గడుపుతున్నాడు.
భర్త కోపం గురించి తెలిసిన కదళి ఎంతో జాగ్రత్తగా ఆయనకు సపర్యలు చేస్తుండేది.
ఒక రోజు సాయంత్రం అలసటగా ఉండడంతో మహర్షి ఆశ్రమం బయట నడుం వాల్చాడు. ఇంతలో సాయం సంధ్యా సమయం మించిపోతోంది. సంధ్యావందనం చేసుకునే సమయం దాటిపోతుండడంతో భర్తను లేపడం తన కర్తవ్యంగా భావించింది కదళి.
మంచి నిద్రలో ఉన్న దుర్వాసుడిని ఆమె తట్టి లేపింది. నిద్రాభంగం కావడంతో కోపం తెచ్చుకున్న ఆయన తీవ్రంగా కదళివైపు చూశాడు. అంతే ఆ తీక్షణతకు తట్టుకోలేక కదళి భస్మమయి పోయింది.
ముందు వెనుక ఆలోచించక తెచ్చుకున్న కోపంతో జరిగిన ఆనర్థానికి బాధపడ్డాడు దుర్వాసుడు.
కొన్నాళ్ల తరువాత కదళి తండ్రి తన కుమార్తెను చూసేందుకు ఆశ్రమానికి వచ్చాడు. అయితే జరిగిన విషయం చెప్పడానికి భయపడ్డాడు దుర్వాసుడు. చివరికి ఆయన పదేపదే అడగ్గా జరిగిన విషయం చెప్పి క్షమించమని వేడుకున్నాడు.
అంతేకాక తన తపో శక్తితో కదళి భస్మం నుండి ఒక చెట్టును సృష్టించాడు. అదే కదళృ వృక్షం. ఆ ఫలమే కదళీ ఫలం.
ఆ ఫలాన్ని మామగారికి ఇస్తూ నేటి నుంచి మీ కుమార్తె కదళీ అందరికీ ఇష్టురాలై దేవతా కార్యక్రమాల్లో, శుభకార్యాల్లో ముఖ్య భూమిక పోషిస్తుందని మాట ఇచ్చారు.
ఇప్పటికీ మనం అరటిపండును (కదళీ ఫలం)ను దేవుడిముందుంచి కదళీ ఫళం సమర్పయామి అని చెప్పి నైవేద్యం పెడుతున్నాం.
- ఆదూరి హైమావతి, చికాగో.
*****************************************
ఆదివారం 18-8-2013 ఆంధ్రప్రభ ' చిన్నారి 'లో ప్రచురితం.

Sunday, 11 August 2013

అసూయ అనర్థ హేతువు

చిన్నారి 




అసూయ అనర్థ హేతువు


apr -   Sun, 11 Aug 2013, IST


రాజుపాలెం అనే గ్రామంలో భూకామందు మాధవయ్య కొడుకు కుమార్‌, పేదవాడైన కొమరయ్య కొడుకు కిట్టయ్య ఒకే స్కూళ్లో చదువుకుంటున్నారు. కొమరయ్య అతడి భార్య కూలికి వెళ్లి వచ్చిన డబ్బులతో గంజి తాగి బతికేవాళ్లు. వాళ్లుండే గుడిసెలో ఏ లైట్లు లేవు. చమురు దీపపు వెలుగులో గడిపేవారు. చీకట్లో గంజి తాగుతూ
తమ బిడ్డకు ధనం కన్నా గుణం గొప్పదని, ధనం కోసం ఏ దుర్మార్గాలూ చేయరాదని, అంతా మన ప్రవర్తనను బట్టే జరుగుతుందని చెప్పేవారు.
తల్లిదండ్రులు చెప్పే మాటలతో కిట్టయ్య చిన్నప్పటినుంచి మంచి విద్యార్థిగా పేరుతెచ్చుకున్నాడు. తరగతిలో వాడే ఫస్ట్‌ మార్కులు తెచ్చుకునేవాడు. వాడి చేతిరాత ఎంతో బాగుంటుందని ఎన్నోసార్లు పంతులుగారు బోర్డుపై రాయించేవారు.
చిరిగిన పాతగుడ్డలతో వచ్చే కిష్టయ్యకు మంచిపేరు రావడం, పంతులుగారు ఎప్పుడూ వాడిని మెచ్చుకోవడాన్ని కుమార్‌ భరించలేకపోయేవాడు. ఆ ఏడాది ఆగస్టు 15 పండుగ నుద్దేశించి జరిపిన ఆటల పోటీలు, చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు ఇలా అన్నీ కలిపి ఓ పది బహుమతులు కిట్టయ్య సొంతం చేసుకున్నాడు. కిట్టయ్యకు అన్ని బహుమతులు రావడం చూసి అకారణంగా కోపం
పెంచుకున్నాడు కుమార్‌. ఎలాగైనా వాడిని బాధించి సంతోషించాలని ఆలోచించసాగేడు. ఒకరోజు చెరువు గట్టుమీద అమ్మ నేర్పిన

పద్యాలను వల్లె వేసుకుంటూ వస్తున్నాడు. కిట్టయ్యను చెరువులోకి తొయ్యాలని ఒక చెట్టుకింద కాపు కాస్తున్నాడు కుమార్‌. కిట్టయ్య తన దగ్గరకి రాగానే కుమార్‌ గభాలున నీళ్లలోకి తోసాడు. అయితే అదే ఊపుతో కుమార్‌ కూడా నీళ్లలో పడ్డాడు.
తండ్రివెంట చేపలవేటకు వెళ్లే అలవాటున్న కిట్టయ్య నీళ్లలోంచి ఈదుకుంటూ బయటకు వచ్చాడు. అయితే ఈత రాని కుమార్‌ రక్షించండి! రక్షించండి! అంటూ నీళ్లలో కేకలు వేయసాగాడు. మళ్లిd నీళ్లలోకి దూకి కుమార్‌ను ఒడ్డుకుతీసుకువచ్చాడు. అక్కడే కడుపులోంచి నీళ్లను బయటకు కక్కించి ఇంటికి తీసుకెళ్లాడు. తను చేసిన పనికి సిగ్గుతో తలదించుకున్న కుమార్‌ క్షమించమని కిట్టయ్యను వేడుకున్నాడు. కిట్టయ్య ఇద్దరం కలిసుందామని స్నేహహస్తాన్ని చాచాడు.
-- ఆదూరి హైమావతి, చికాగో
ఆదివారం ఆంధ్రప్రభ 11ఆగస్ట్ లో ప్రచురితం.

Thursday, 8 August 2013

మృకండుమహర్షిచరిత్ర .


మృకండుమహర్షిచరిత్ర  .        

  మృకండుమహర్షి మృగశృంగమహర్షి కుమారుడు.మృగశృంగమహర్షితపశ్శక్తిచేచనిపోయినసువృత్తను  తిరిగి బ్రతికించగా, సువృత్తతండ్రినుచథ్యుడుతనకుమార్తెనుఅతనికిచ్చివివాహంచేస్తాడు.సువృత్తకుమారుడే మృకండుడు. శాలగ్రామమనే మహాతీర్ధంలో సర్వప్రాణుల హితంకోరితపస్సుచేసి శ్రీమహావిష్ణువును మెప్పించిదర్శనంపొందుతాడు, విష్ణువుమృకండు భక్తికిమెచ్చిఅతనికి కుమారునిగాజన్మిస్తాననిఅతడు కోరకుండానే వరమిస్తాడు.మృకండు సార్థక నామధేయుడు.ఆయనతపస్సులో లీనమైనిశ్చలుడై ఉన్న సమయంలోఆయన శిలవలె ఉండడం వల్లమృగములు వచ్చితమకండుయాన్నితీర్చుకొనేవి.మృగములకండుయాన్నితీర్చినవాడుకనుకఆయన్నుమృకండుమహర్షిఅనిపిలిచేవారు. మరుధ్వతిఅనేమహాసాధ్విఆయన భార్య,వారికి ఉన్నఏకైక లోటు సంతానం లేకపోవడం,పుత్రులు లేకపొతేపైలోకాల లో ఉన్నత గతులు ఉండవని భావించి కాశీలో తపస్సు చేయను సతీసమేతంగాబయలుదేరుతాడు. కాశీలోవారు రెండులింగాలుప్రతిష్ఠించి,పరమశివునిగురించిఘోరతపస్సుచేస్తారు.మహాదేవుడుతపస్సుకిమెచ్చిప్రత్యక్షమైమృకండు మహర్షిని మరోమారు పరీక్షింపదలచి,'సద్గుణుడై16ఏళ్ళుమాత్రమేజీవించే కుమారుడు  కావాలాలేక దుర్గుణు డైన చిరంజీవికావాలా 'అనిఅడగ్గామృకండు మహర్షి సద్గుణుడైన 16 ఏళ్ళు బ్రతికేపుత్రుడుచాలంటాడు.శివుడుసంతసించి ' అలాంటి పుత్రుడ్ని ఇచ్చాను 'అని చెప్పి అదృశ్యమౌతాడు.

    మహాదేవునిమాటప్రకారం మరుధ్వతిగర్భవతై,దివ్యతేజస్సుకలిగిన పుత్రుడ్ని ప్రసవించింది. మృకండుమహర్షి కొడుకుకనుక వానికి 'మార్కండేయుడు' అని నామకరణం చేశారు.7సంవత్సరాలు 3నెలలునిండినవెంటనేమార్కండే యుడికిఉపనయనంచేశారు.ఒకరోజుమృకండమహర్షినిచూడనుసప్తఋషులురాగామార్కండేయుడువారికినమస్కరిం చగా వారు దీర్ఘాయుష్మాన్ భవా!అని దీవిస్తారు. మృకండుమహర్షిఇదివినితనకొడుకునిజంగాచిరంజీవిఅవుతాడా!’అనిఅడగ్గాసప్తఋషులు దివ్యదృష్టితో శివుడు మృకండుతో అన్నమాటలు గ్రహించి,మార్కండేయునిబ్రహ్మవద్దకుతీసుకువెళ్ళిఆయనచేతనూ 'చిరంజీవా!అని దీవింపచేస్తారు.మార్కండేయుడినినిరంతరశివారాధనచెయ్యమనిచెప్తారు.16సంవత్సరాలునిండినరోజుయమకింకర్లుమార్కండేయుడిప్రాణాలుతీసుకొనుటకైవస్తారు.యమకింకరులుమార్కండేయుడి తేజస్సుచూసి మార్కండేయుడిప్రాణాలుతేవడంతమవల్లకాదని యముడికి చెబుతారు. వెంటనే యముడు తన దున్నపోతుమీదమార్కండేయుడిప్రాణాలుతీయడానికిబయలుదేరతాడు.అకుంఠితభక్తితోశివారాధనచేస్తున్నమార్కండేయుని పైయముడుతనపాశాన్నివిసిరేసరికిమార్కండేయుడుశివలింగాన్నికౌగలించుకొని'చంద్రశేఖరాష్టకాన్నిభక్తితోపఠిస్తాడు,‘శివామహాదేవాకాపాడు!అనిమార్కండేయడు అన్నవెంటనే శివలింగం నుంచి మహాదేవుడు ఉద్భవించి కాలరూపుడై యముడిపైకి వస్తాడు.దీన్నిచూసియముడు భయపడిమహాదేవా! క్షమించు కరుణించమనిప్రార్ధిస్తాడు. శివుడు  " చిరంజీవిగా జీవించమని ' మార్కండేయుని దీవించాడు.అలా మహర్షి మృకండు తన అకుంఠితభక్తిని కుమారనికి అభ్యసింపజేసి చిరాయువైన కుమారుని పొందు తాడు. 

*************************************** ఆదూరి.హైమవతి.

మృకండు మహర్షి జయంతి సందర్భంగా ఆగష్టు 2వతేదీనవార్త దినపత్రిక చెలి,ప్రచురితము.

Monday, 8 July 2013

ఎవరి పనివారే!

చిన్నారి 

ఎవరి పనివారే!

apr -   Mon, 8 Jul 2013, IST
పూర్వ పళనివర్మ రాజ్యంలో రామన్న పాలెం అనే గ్రామం ఉండేది. ఆ ఊరి చెరువు చాలా పాతది అందులోనూ పెద్దది. వచ్చేది వర్షాకాలం కావడంతో చెరువు గండి పడుతుందని గ్రామస్తులంతా గ్రహించారు. ఊరి రచ్చబండ దగ్గర గ్రామపెద్దతో కలిసి ఈ విషయం చర్చించారు. చెరువును బాగు చేయాలని కోరుతూ రాజుకు ఒక విన్నపాన్ని పంపాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా రైతుల్లో చదువొచ్చిన రంగప్పచేత ఒక విన్నపాన్ని రాయించి, అందరూ వేలి ముద్రలు వేశారు. వినతి పత్రాన్ని తీసుకుని తహసీల్దారుకు అందజేశారు. పై అధికారులకు, రాజాస్థానానికి, చివరకు రాజుకు చేరింది.
మహారాజు పళనివర్మ ఆ వినతి పత్రాన్ని పూర్తిగా చదివి సమస్యను అర్థం చేసుకున్నారు. అంతేకాక ఆ చెరువును బాగు చేయడానికి ఎంత సమయం, డబ్బు అవసరము అవుతాయో అంచనా వేయమని మంత్రులను ఆదేశించాడు. ఆయన కింది స్థాయి అధికారులకు చెప్పగా, వారు తహసీల్దారుకు పురమాయించారు. ఆయన చెరువు చుట్టూతా కలియ తిరిగి ఎక్కడెక్కడ ప్రమాదముంది? ఏ ప్రాంతం బాగా దెబ్బతిన్నది, ఎంత డబ్బు, సమయం అవసరమవు తాయో తెలుపుతూ ఆయన ఒక నివేదికను సిద్ధం చేశారు. దానిని ఎప్పటిలాగే పై అధికారులకు, వారు రాజాస్థానా నికి,  అక్కడ నుంచి పళనివర్మ సముఖమునకు చేరింది. ఈ తతంగమంతా పూర్తయ్యేసరికి వేసవికాలం పోయి తొలకరి రానేవచ్చింది. వర్షాలు బాగా పడుతుండడంతో చెరువు నిండి పోయింది. ఇక మరోపెద్ద వర్షం వస్తే చెరువు కట్ట తెగిపోతుంది. అనుకోకుండా ఆ ఊళ్లో బలాదూర్‌గా తిరిగే వీరన్న ఆ చెరువును గమనించాడు.మరో వర్షం వస్తే ఊరే మునిగి పోతుందని గ్రహించిన వీరన్న తోటి సావాసగాళ్లను పలుగు, పార, గునవపం, తట్టా, బుట్టలూ తెమ్మని పురమాయించాడు. వారంతా కలిసి కొండరాళ్లను తెచ్చి గండి పడుతుందని భావించిన చోట అడ్డుగా వేశారు. అలుగుపారే ప్రాంతం వద్ద కాలువను లోతుగా తవ్వి ఆ మట్టిని రాళ్లమీద పోశారు. పూడుకుపోయిన కాలువను తవ్వి నీరు వేగంగా బయటకు పోయేందుకు ఏర్పాట్లు చేశారు. మిగిలిన చిన్నచిన్న మరమత్తులు చేసేసి హాయిగా ఇంటికి వెళ్లిపోయారు.
యువకులు చేసిన పని ఆనోట ఈనోట పడి చివరికి గ్రామపెద్దకు చేరింది. అదే సమయంలో ఒక రాచకార్యం నిమిత్తం అక్కడికి వచ్చిన పళినివర్మ యువకులు చేసిన పనిని మెచ్చుకున్నారు. అంతేకాక వారికి తన కొలువులో ఉద్యోగాలు కూడా ఇచ్చారు.
నీతి-ఎవరిపని వారు చేసుకుంటే కష్టనష్టాలే ఉండవు.
- ఆదూరి హైమావతి, చికాగో(అమెరికా).
ఆంధ్రప్రభ ఆదివారం[ 7/7/2013 ] ' చిన్నారి ' శీర్షికలో ప్రచురితం.

Thursday, 20 June 2013

రాజోద్యోగి అవినీతిని బయటపెట్టిన కస్తూరి తైలం

రాజోద్యోగి అవినీతిని బయటపెట్టిన కస్తూరి తైలం


apr -   Sat, 15 Jun 2013, IST


  hyd

ఆనందపాలుడు ఆ వినతిపత్రం చదివి, వెంటనెె ఒకసైనికుని పిలిపించి, అతనికి ఏదోవిషయం రహస్యంగా చెప్పి పంపాడు. ''నాయనా! ఏదీ నీవు శిసు ్తచెల్లించి న పత్రం?'' ని దగ్గరగా పెట్టుకుని పరిశీలించి,'' నీవు శిస్తుకట్టడానికి ఎంత సొమ్ము ఇచ్చావు?'' అని అడిగాడు. దానికినాగప్ప'' అయ్యా! నేను పది బంగా రుకాసులు ఇచ్చా ను. నాకు ఐదువెండికాసులు తిరిగి ఇవ్వవల సి ఉండగా, అవి ఇవ్వకనే రసీదుపత్రం ఇచ్చాడు లేఖకు డు , 'ఇదేమినిటి?' అడిగితే, వెళ్ళి దిక్కు న్న చోట చెప్పుకోమ న్నాడు. రెక్కా డి లేకానిడొక్కడని నిరుపేదలం, మా మొర ఆలకించేవారెవరు? మీరే న్యాయం చేయాలి''అని విన యంగా కోరాడు. ఆనందపాలుడు లేఖకుని పిలిపించి'' దీనికి నిసమాధానమేమి'' అని ప్రశ్నిం చాడు. ''ప్రభూ! నేను తిరిగి ఇవవ్వలసిన ఐదు వెండి కాసులూ ముందుగా ఇచ్చేసీ, ఆపైన, రాజ ముద్ర వేసి శిసు ్తరసీదు ఇచ్చాను. ఐతే ఆసమయంలో అక్కడెవ్వరూలేనందున నేను సాక్ష్యం చెప్పించలేను'' అన్నాడు భయభయంగా.
మీరెవ్వరూసాక్ష్యం చెప్పినవసరంలేదు. నేనే చెప్పాను దోషమెవరిదో!'' అంటూ మహారాజు విజయవర్మ సమీపానికి వెళ్ళి, ఆ రశీదు పత్రాన్ని ఇచ్చి రహస్యంగా ఏదో చెప్పాడు. ఆ రసీదు అందుకుని దగ్గరగా పెట్టుకుని చూశాడు విజయవర్మ. ''ఆనందపాలా! నీవే ఈసమస్యను పరిష్కరించు'' అన్నాడు. మహారాజా! మనం మన రాజోద్యోగులకు జీతాలు పెంచి చాలా కాలమైంది. ముందుగా చిరు ఉద్యోగుల కు ఈ మాసం నుండీ జీతాన్ని పెట్టింపు చేయవలసినదిగాను, చిరుద్యోగుల కుటుంబాలకు ఉచిత వైద్య సౌకర్యం కూడా కలిగించమని, ఈ రైతుకు ఇవ్వలసిన ఐదు వెండికాసులకూమరో ఐదు కలిపి పది కాసులు ఖజానా నుండీ చెల్లించవలసినది గాను, పేదరైతులకు శిస్తు సొమ్ము సగానికి తగ్గించి వారిని ఆదుకోవలసినదిగాను, మనవిచేసుకుంటున్నాను. ''అన్నాడు. ఆ తీర్పు విని మహారాజు ఆశ్చర్యపోగా సభికులంతా అయోమయంలో పడ్డారు. ఉద్యోగులంతా కరతళధ్వనులు చేశారు. విజయవర్మ ''ఆనందపాలా! నీనిర్ణయాలు ఆమోదిస్తున్నాను, నీవే సభికులకు విష యం వివరించ కోరుతున్నాను. నీవు గుర్తు చెసే వరకూ నా కర్తవ్యం మరచి నందుకు బాధపడుతున్నాను''అన్నాడు రాజు.
ఆనందపాలుడు తన స్థానం నుంచి లేచినిలబడి, స్వరంసవరించుకుని ''ప్రభూ! సభి కులారా! మన నిత్యజీవన సంభా రాలన్నీ సామాన్యులకు అందుబా టులోలేని విధంగా ధరలన్నీ పెరిగి పోయాయి. సామాన్యుల జీవనం భారమైంది. కనుకే చిరుద్యోగులు వారికి అందుబాటు లో ఉన్నంత మేరకు ప్రజలనుండీ కొంత సొమ్ము మిగిలించు కోజూడటం జరుగుతు న్నది. ఈ విషయం నాకు చూచాయ గా తెలుస్తునే ఉంది చారుల వలన. కానీ అది ప్రభువుల సమక్షానికి వచ్చిన ప్పుడు వారే పర్యవసానం ప్రస్తావించాలని ఇంతకాలం ఆగా ను. నేను పంపిన సేవకుడు వెళ్ళి ఈ లేఖకుని ఇంటి పరిస్థితి పరికించి వచ్చి చెప్పాడు. వయోభారంతో అనా రోగ్యం తో ఉన్న తల్లి, వింత వ్యాధి తో బాధపడుతున్న భార్య దిక్కుతోచని పరిస్థితుల్లో ఇతడు వారికి వైద్య సేవలు అందించడానికి కావల్సిన డబ్బుల కోసం ఇలా చేశాడు. అది అతడి తప్పుకాదు.
అతని పరిస్థితి గ్రహించిన నేను ప్రభువుల వారిని చిరు ఉద్యోగుల జీతభత్యాలు పెంచమని కోరాను. అంతేకాదు అన్ని నాణాల సంచు లలోనూ కస్తూరీతైలం ఉంచుతాను. అది ఎవ్వరికీ తెలీయదు.
కాసులను తీసే సమయంలో ఆ తైలం వారికి చేతులు అంటుకుని రసీదు
పత్రానికి అంటుకుంటుంది. జాగ్రత్తగా పరిశీలిస్తే దాని నివాసన తెలుస్తుంది ఈ రైతుకువెండికాసులు ఇవ్వలేదని తైలం అంటనందున తెల్సుకున్నాను. మహారాజా! ఎవ్వరూ పుట్టుకతో దొంగలూ, లంచగొండులుకారు. వారిపరిస్థితులు, వారినలా చెస్తాయి. ప్రభువులు ప్రజల, ఉద్యోగుల అవసరాలు గుర్తిస్తే ఈ ఇబ్బందులు ఏర్పడవు. నేనే ముందుగా ప్రభువులకు విన్నవించుకోకపోవడం నాదే పొరబాటు.'' అని ముగిం చాడు. ఆనంపాలుడి తెలివిని అభినందిస్తూ.. ఆయన చేసిన సూచనలను ఆమో దించాడు రాజు.
ప్రజల బాధల గుర్తించే ప్రజ్ఞ పాలకులకుంటే అంతటా నీతినిజాయితీలు కలకాలముంటాయి.
http://www.prabhanews.com/childrenspecial/article-378247
ఆంధ్రప్రభ దినపత్రికలో బాలప్రభ లో శనివారం జూన్ 15 న ప్రచురితం.

Friday, 3 May 2013

అఖండ తేజోమూర్తి ఆంజనేయస్వామి

http://www.pushkarinee.com/?q=content/%E0%B0%85%E0%B0%96%E0%B0%82%E0%B0%A1-%E0%B0%A4%E0%B1%87%E0%B0%9C%E0%B1%8B%E0%B0%AE%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%86%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B1%87%E0%B0%AF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AE%E0%B0%B--పుష్కరిణి -ఆధ్యాత్మిక అంతర్జాలపత్రిక--ఈ లింక్ ద్వారాచూడవచ్చు.
పుష్కరిణి -ఆధ్యాత్మిక అంతర్జాలపత్రికలో  -నవంబర్ 2012లో ప్రచురితం.


అఖండ తేజోమూర్తి ఆంజనేయస్వామి.

ఆదూరి హైమవతి
బెంగళూరు.
యత్ర యత్ర రఘునాధ కీర్తనం -తత్ర తత్రకృతమస్తకాంజలిం......'
http://www.pushkarinee.com/sites/default/files/images/eh%281%29.bmpక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయస్వామి ప్రత్యక్షమవుతారని మన విశ్వాసం. ఎక్కడ హనుమ ఉంటారో అక్కడ శ్రీరామచంద్రులవారు తప్పక ఉంటారు. శ్రీరాముని పేరు వినగానే  మనకు ఆంజనేయస్వామి తప్పక గుర్తువస్తారు. హిందువులంతా హనుమంతుని ఆంజనేయుడనీ, మారుతి అనీ ఇంకా అనేక నామాలతో కొలిచి కీర్తిస్తుంటారు. రామాయణంలో రాముని కున్నంత ప్రాముఖ్యం హనుమకూ ఉంది. హనుమాన్ అంజనాదేవి, కేసరిల సుతుడు. చైత్ర శుధ్ధపౌర్ణమినాడు, మూలానక్షత్రాన, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరంలోజన్మించినట్లు ఒక కథ.

వేదముల కథ ఆధారంగా, అంజనాదేవి ఒక అప్సరస అనీ, శాపవశాన భూలోకంలో వానర వంశంలోజన్మించిందనీ, రుద్రదేవుడైన శివుని వరం వల్ల ఆమెకు పుత్రుడు జన్మించాక ఆమె శాప విముక్తురాలవుతుందని చెప్పబడింది. అందువల్ల ఆమె భర్తతో కూడి శంకరుని అతిభక్తితో ధ్యానించి , రుద్రుని వరంతో, ఆయన అంశతో ఆంజనేయుని పుత్రునిగా పొందిందిహనుమకు 28 మహిమలు లభించాయి, ఆకాశగమనం, శరీరాన్ని పెంచడం, కుంచించడం వంటివి.
మఱొక చారిత్రక కధనం ప్రకారం - కర్ణాటకలోని, హంపీవద్ద గల ' గుంలవ్య తోట ' అనే గ్రామానికి18 కిలోమీటర్ల దూరంలో ఆంజనేయ పర్వతంలోని 'అంజని గుహ 'లో , పంపానదీ తీరం వద్ద ఆంజనేయ స్వామి జన్మించినట్లు ఉంది. వాల్మీకి రామాయణంలోని యుధ్ధకాండలో కేసరి బృహస్పతి కుమారుడనీ, రామరావణ యుధ్ధసమయంలో ఆయన రాముని సేనలో చేఱి యుధ్ధంచేసినట్లు ఉంది. అయోధ్యలో దశరధ మహారాజు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు , యజ్ఞపురుషుడు ప్రసాదించిన పాయసాన్ని, మహారాజు ముగ్గుఱు రాణులకూ పంచగా, సుమిత్రభాగమున్నపాత్రను ఒక గ్రద్ద తన్నుకుని ఆకాశంలో వెళుతూ విడచి వేయడంతో అదివెళ్ళి శివుని భక్తితో ప్రార్ధిస్తున్న అంజనాదేవి దోసిట్లోపడినట్లూ, ఆమె దాన్ని దైవప్రసాదంగా భావించి భక్తితో స్వీకరించగా , ఆమెకు ఆంజనేయులు జన్మించినట్లు రామాయణంలోఉందిఅందుచేతే శ్రీరాముడు హనుమను తన నాల్గవ సోదరునిగా ఆదరించారు.
          
ఆంజనేయులు బాల్యంలో సూర్యుని పండుగా భావించి నోట కఱచుకోగా, దేవేంద్రుని వజ్రాయుధ ఘాతానికి చెంప ఉబ్బడంతో ' హనుమ 'అనే నామం వచ్చినట్లు కూడా చెప్తారు. సూర్యుని హనుమ తన గురువుగా భావించి సేవించి , సూర్యదేవుని నుండి సకల శాస్త్రజ్ఞానం పొంది , గురుదక్షిణగా సూర్య కుమారుడైన , సుగ్రీవుని సేవించను అంగీకరిస్తాడు. ఇది ఆయన సత్య వాగ్ దీక్షకూ, గురుభక్తికీ  తార్కాణం.
మహిరావణుడు యుధ్ధసమయంలో రామలక్ష్మణులను పాతాళంలో దాచినపుడు , oజనేయస్వామి వెళ్ళి, మహిరావణుడు వెలిగించిన ఐదు అఖండ దీపాలను ఆర్పవలసివచ్చి పంచముఖాలతో - అనగా వరాహ ముఖంతో ఉత్తర దిశన, నరసింహ ముఖంతో దక్షిణ దిశన, గరుడముఖంతో పడమర దిశన, హయగ్రీవముఖంతో ఆకాశంవైపు, తన హనుమ ముఖంతో తూర్పు దిశన ఉన్న ఐదు దీపాలను ఒకేసారి ఆర్పేందుకు ' పంచముఖ ఆంజనేయులుగా రూపుదాల్చారు. ఇది ఆయన స్వామి కార్య దీక్షకు నిదర్శనం .
యుధ్ధానంతరం హనుమ హిమాలయ పర్వతం మీద నివసిస్తూ 'హనుమద్రామాయణాన్ని’   తన గోళ్ళతో వ్రాసినప్పుడు వాల్మీకి మహర్షి వచ్చి, రామాయణాన్నిచదివి, అసంతృప్తిని వ్యక్తపఱచగా , హనుమ కారణం అడుగుతాడట!, అప్పుడు వాల్మీకి మహర్షి ' రామాయణంలో హనుమ పాత్రను చిత్రించనందున అది అసంపూర్తిగా ఉన్నది కనుక తనకు అసంతృప్తికలిగించినదని ' చెప్పారు. అప్పుడు హనుమ తన రామాయణాన్ని ఉపసంహరించుకున్నారు ! ఎంత నిరాడంబరత !! అందుకే హనుమను ధ్యానిస్తే మంచి గుణాలు కలుగుతాయని, గర్వాహంకారాలు పోతాయనీ అంటారు. అందుకే అందఱూ హనుమను పూజిస్తారు రామునితో సమానంగా ! అందుచేత భారతదేశంలోనే గాక ప్రపంచ దేశాలలో కూడా హనుమాన్ ఆలయాలు విలసిల్లి ఉన్నాయి  .
    
హిమాచల్ ప్రదేశ్ రాజధాని ఐన ' శిమ్లా ' లోని 'జాఖూ ' హనుమాన్ ఆలయం ప్రసిధ్ధి చెందినది. కొండపై యక్ష, కిన్నర గంధర్వ కింపురుషులు    నివసించేవారనీ  , హనుమ ఆకాశం పైకి ఎగరను కాలూనగా కొండసగానికి భూమిలోకి దిగిపోయిందని  , హనుమ కాలూనిన చోట ఆలయం వెలిసిందనీ చెప్తారు.
క్రీ.. 883 నాడు ఖుజరహో లో ఆజనేయ ఆలయం ఉన్నట్లు శిలాశాసనాల వలన తెలుస్తోంది. ’సంకటమోచన హనుమాన్ మందిరంపంజాబ్ లోనిఫిల్లూర్లో ఉంది. తమిళనాడులోనినమ్మక్కళ్ ' లో ఉన్నఆంజనేయ విగ్రహంఎత్తు 18 అడుగులు. తూర్పుముఖంగా ఉన్న ఆంజనేయ విగ్రహం ఎదురుగా ఉన్నలక్ష్మీ నారాయణ స్వామికి నమస్కరిస్తున్న భంగిమలో ఉంటుందిఈవిగ్రహం స్వయంభువు ఐనందున పెఱుగుతూనే ఉన్నారనీ, అందువల్ల పైన కప్పువేయను వీలుకాలేదని ఆలయ కధనం వలన తెలిస్తోంది.
వెల్లూరు జిల్లాలోని ఆర్కోణానికి 30 కిలోమీటర్ల దూరంలోయోగ నరసింహ ఆలయానికి సమీపంలో యోగాజనేయ ఆలయం చిన్నకొండ మీద ఉంది .ఆలయాన్ని చేఱను 480 మెట్లు ఎక్కవలసి ఉంటుందిఆంజనేయమూర్తి చతుర్భుజాలతో ,రెండు చేతులతో శంఖ చక్రాలు, మఱో రెండు హస్తాలతో జపమాల ధరించియోగ నరసింహస్వామిని వీక్షిస్తున్నట్లు ఉంటుంది . ’యోగ నరసింహస్వామి ‘, యోగామృత వల్లి ఉండే ఆలయం లోనికి పెరియవై కొండ మీదకు1305 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. భక్తులు ఎంత శ్రధ్ధగా శ్రమపడి ప్రార్ధిస్తారో దేవుని అనుగ్రహం అంత అధికంగా లభిస్తుందనేది భక్తులనమ్మకం.
కర్ణాటక రాష్ట్రం రాజధాని బెంగుళూర్ లోని జె.పి.నగర్లో వెలసి ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం ఒక గుట్టపై ఉంది. దీనిని మహామహిమాన్వితమైన ఆలయంగా భక్తులు సేవిస్తారు. మహారాష్ట్ర రాజధాని ముంబాయ్ లోని  ఎస్.. .ఎస్  కాంప్లెక్స్ లోని హనుమాన్ విగ్రహం ఎత్తు 33అడుగులు [ 10.మీటర్లు] 12..ఎత్తైన ప్లాట్ ఫాం మీద ప్రతిష్టించబడి ఉంది. మొత్తం విగ్రహం ఎత్తు భూమినుండి 456..[14.మీ] . వెండి కవచంతో మారుతీ విగ్రహం కప్పబడి ఉంది.
         

1989
లో చెన్నయ్ లోని నంగనల్లూర్ లో ఒకే ఱాతితో చెక్కబడిన 32..[10.మీ] ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహం చెప్పుకోదగినది. ఒరిస్సాలోని రూర్కెలా లో హనుమాన్ వాటిక ఆలయ కాంప్లెక్స్ లో 72 .. హనుమాన్ విగ్రహం ఉంది.
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పొన్నూరులో 30.. అంజనేయస్వామి విగ్రహం భక్తులకు కొంగు బంగారంగా వెలసి ఉంది. అవధూతదత్త పీఠాధిపతిగణపతి సచ్చిదానందస్వామివారిచే 85.. [26.మీ] ఎత్తైన ఆంజనేయస్వామివారి విగ్రహం ప్రతిష్ఠ చేయబడి ఉంది.
135..ఎత్తైనఆంజనేయవిగ్రహం హైదరాబాద్ వద్ద గల పరిటాలలో 2003 లో ప్రతిష్టింపబడింది. సాగరపురంలో ప్రతిష్టింపబడిన ఆంజనేయ విగ్రహం దుష్టగ్రహాలను దూరం చేసేదిగా ప్రసిధ్ధి పొందినది. ప్రతిష్ఠాసమయంలో సజీవంగా కదిలిందని చెప్తారు.
తమిళనాడులోని కన్యాకుమారికి సమిపంలో 8 . ఎత్తైన మారుతీ విగ్రహం ఉంది. కేరళ తిరువళ్ళుర్ కు 5, 6 కి.మీ.దూరంలోఉన్న' చిన్నకవియూర్ 'లోని శివాలయంలో వంద సంవత్సరాల క్రితం పంచ లోహాలతో నిర్మించబడిన హనుమాన్ విగ్రహం ఉంది. కుంభకోణంలో 40..ఎత్తైన [12.మీ] పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం గ్రానైట్ ఱాతితో మలచబడి ఉంది. తిరువళ్ళూర్లో పంచముఖ ఆంజనేయ విగ్రహం భక్తుల భయాలు దూరంచేసే అభయమూర్తిగా నిలచిఉంది .
హనుమాన్ ఒక్కడే శని ప్రభావం సోకని వానిగా చెప్తారు. రావణుని నుండి విముక్తి పొందిన శనిదేవుడు, హనుమాన్ పట్ల కృతజ్ఞతగా మారుతిని పూజించే వానికి తన దృష్టి  ' సోకదని వాగ్దానం చేశాడట!
కేరళ రాష్ట్రంలోని తిరువళ్ళూర్ వద్దగల  , మల్లాపురం జిల్లాలోవశిష్ఠులవారిచే 3 వేల సం.క్రితం. [1,000.బి.సి} ప్రతిష్టింపబడిన హనుమాన్ మూర్తి అతిప్రాచీనమైనదిగా గుర్తింపబడి ఉంది. అలధియూర్ లోని హనుమాన్ ఆలయంలోఒక పెద్ద వేదికపైనున్నఒక గ్రానైట్ ఱాతిపై సముద్రచిత్రం చిత్రించి ఉండగా భక్తులు దూరం నుండీ పరుగుతీస్తూ వచ్చి హనుమాన్ సముద్రాన్ని లంఘించినదానికి చిహ్నంగా  ఱాతిపైనుండి దూకుతారు  . దీని వల్ల భక్తుల బాధలు, కష్టాలు తీఱిపోయి, ఆరోగ్యం, భాగ్యం, దీర్ఘాయువు కల్గి, అదృష్టం కలసి వస్తుందని విశ్వాసం. అలధియూ హనుమాన్ఆలయదర్శనం భక్తుల మానసిక శారీరక రుగ్మతలు బాపడమేగాక వారి సర్వకోరికలూ ఈడేరుతాయనే సంపూర్ణ నమ్మకం ఉంది. అందువల్లే భక్తులు తప్పక జీవితంలో ఒక్క సారైనా అలధియూర్హనుమను దర్శించి తరిస్తారు.

అహమ్మదాబాద్ లోని కంటోన్ మెంటు ప్రాంతంలోషహీబాగ్ సమీపంలోని ' క్యాంప్  ' హనుమాన్ ఆలయం పండిట్ గజాననప్రసాద్ నూఱు సంవత్సరముల క్రితం కట్టించారుభారత ప్రధానులైన, అటల్ బిహారీ వాజ్ పేయ్, ఇందిరాగాంధీ వంటి ప్రముఖులు ఆలయాన్ని దర్శించినట్లు చెప్తారు.
రామ చరిత మానస్, హనుమాన్ చాలీసా వ్రాసిన తులసీదాస్ [1532-1623] ఢిల్లీలోని హనుమాన్ ఆలయాన్ని దర్శించిన దాఖలాలు ఉన్నాయి. ఆలయంలో 24 గంటలూ 'శ్రీరామ జయ రామ జయజయ రామ' అనే మంత్రాన్ని1964 ఆగస్టు ఒకటవ తేదీ నుండి నిరాటంకంగా జఱుగుతూండటం విశేషం.
ప్రస్తుత అమెరికా అధ్యక్షుడైన 'బరాక్ ఒబామా' అధ్యక్షునిగా పోటీ చేస్తున్న సమయంలో , ఆలయమూర్తి ఐన హనుమ విగ్రహాన్ని , ఆయన శ్రేయోభి లాషులు ఆయన విజయాన్ని కాంక్షించి ఆయనకు బహుమతిగా ఇచ్చినట్లు మనం వార్తాపత్రికల్లో చదివాం.15 కె.జిల బరువైన , బంగారు పూతతో ఉన్న హనుమాన్ విగ్రహాన్ని పవిత్రంగా పూజించి ఆయనకు అందజేశారు. ఆయన దాన్ని భక్తితో స్వీకరించడం, విజయం సిధ్ధించడం జఱిగింది.
          
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని' గొడుగుపేట ' లోని ప్రసన్నాంజనేయ ఆలయం  ప్రసిధ్ధి చెందిన మఱో మారుతీ ఆలయం. ఆగమశాస్త్ర ప్రకారం దక్షిణ ముఖంగా ఉన్న ఆంజనేయస్వామి వారిని దర్శించిన వారి కోర్కెలు తీఱుతాయని నమ్మిక. ఆలయ సంప్రోక్షణ సమయంలో 19 శతాభ్ధిలో కుర్తాళం మఠాధిపతి పూజ చేస్తున్న సమయంలో వర్షం అతిగా కుఱిసి , అలయం చుట్టూతా ఉన్న వీధులు వఱద తాకిడికి గురైనా, ఆలయం లోపల మాత్రం ఒక్కనీటి చుక్కైనా పడలేదట!  
మఱొక యోగాంజనేయ ఆలయం చెన్నయ్ లోనిక్రోంపేట ' వద్ద ఉంది.1930 లో ప్రాంతంలో నివసించే 13 సంవత్సరాల బాలికకు కలలో ఆంజనేయస్వామి కనిపించి ప్రాంతంలో తనకు ఆలయం నిర్మించమని ఆదేశించారట. ఆమె తన తల్లి దండ్రులకు చెప్పింది. తరువాత కంచి మఠపీఠాధిపతులు చంద్రశేఖర సరస్వతీ స్వామీజీవారు ప్రాంతానికి వచ్చినపుడు బాలిక స్వామిజీతో తన స్వప్నం విషయం చెప్పింది. స్వామీజీ తన భక్తులతో,ఆలయ ప్రాంతంలో వెదికించగా, ప్రస్తుతం ఆలయం నిర్మించబడి ఉన్న ప్రాంతంలో ఆంజనేయ విగ్రహం లభించినట్లు, తర్వాత ' తిరుమల తిరుపతి దేవస్థానంవారు ఆలయాన్ని నిర్మించినట్లు ఆలయ చరిత్ర ఆధారంగా తెలుస్తోంది .

భక్తులెవఱైనా కష్టాలూ , మానసిక రుగ్మతలూ కలిగినా , పసిపిల్లలకు దడుపు , అనారోగ్యం వంటివి కలిగినా, కార్యసిధ్ధికి ముందుగా పూజించేది హనుమనే. హనుమాన్ చాలీసా పారాయణం, రామరక్షా కవచం, సుందరాకాండ పారాయణ ఇవన్నీ హనుమద్ భక్తుల పాలిటి కల్పవృక్షమనీ, ఆయన కోరిన వెంటనే అండగా నిల్చే వేలుపనీ భావిస్తాం. ఇలాంటి హనుమదాలయాల దర్శనం మనకందఱికీ సుఖశాంతుల నిచ్చు గాక! !
                    జయ జయ హనుమా! జయ జయ హనుమా.
                         
వానర దూతా వాయుకుమారా !
                           
అతి బలవంతా ! అంజని పుత్రా!
                  
జయ జయ హనుమా !   జయ జయ హనుమా ! !.