ఆధారాలు-
నిలువు-
1. పంకజముఖి సీత,శంకరుని వంటిదైవమ్ముందుచేరిన వంకగల కూర.[అక్షరాలు3]
2.బీరాలు పలికే సొరసోదరి.[2]
3.విపరీతంగా పొగడటామంటే ఈ చెట్టెక్కించడమే ![3]
4.పువ్వే కానీ ఫుల్ ఐరన్,ఈ కూర రిచి మహా రిచ్చే, ' ఏమిటని?' హిందిలో' క్యా బే?'అని అడుగుతుంది ముందే![3]
6.వేప పేరులో ఉన్నా వేములేని ఆకు , కమ్మని వాసనతప్ప, ఐనా తినేప్పుడు ఏరిపారేస్తాం పక్కన,బంగారం ఉంటుందిట![4]
7. ఒక లోహం పేరేకానీ, ఒక మాగాణి పంట ఒక ధాన్యం , క్రిందనుండీ పైకెళ్ళింది[2]
10.క్యాట్ -కు తెలుగుతో మొదలయ్యే ఈ పంటను పశువుల తిండికోసం వేసేవారు.పెసరకు సోదరి.[5]
11.బ్రహ్మ చారి ముదిరినా ఇది ముదిరినా పనికిరాదుట! పేరు మాత్రం మహా గొప్ప! ఆడవాళ్ళ వేళ్ళని![2]
13.నల్లవిత్తనాల మెత్తని , రుచిగల పండు. 'స్ ' కారంతో మొదలు.[3]
18. పచ్చిగా ఎంత ముఖ్యమో , పండుగానూ అంతే ! మిడి మిడి కాదు, మనిషి వెళ్ళటమే! వేసవి ఫలం.[3]
20. దీనికి లేని దురద కత్తి పీటకెందుకని సామెత! బచ్చలితో దీనికూర రుచికి పేరు.[2]
22. ఒక దుంపే , ఆలూ సోదరి.దురదతో దూరం చేసుకుంటుంది మరి[2]
24. అల్లం తర్వాతి రూపం, జల్;ఇబుకు, గృహవైద్యానికీ ముఖ్యం, జలుబుచేస్తే ఈ కాఫీ పూర్వం త్రాగే వారు.ఇదిశోధిస్తుందని పేరు.[2]
26. అమ్మ ఇదీ ఒకచోట ఉండారుట! ఇది ఉంటే ఏమైనా చేయగలం.ఊరగాయలకూ, ఉప్పిండికీ, పులిహోరకూ అన్నిటికీని, చెట్టు పైకెక్కింది.[2]
అడ్డం:-
3.ఆకారంలో క్యారట్, రంగులో తెలుపు, పూర్తి సి విటమిన్ , చిల్లంగి [3]
5.చేదైనా చక్కెరవ్యాధిగ్రస్తులకు ఆరోగ్యానికి మంచిచేసే కరకర [3]
8.జామ వంటి ఒక కాయ బేహారి మధ్య అక్షరం తీసేస్తే మొదలవుతుందికానీ గజిబిజైంది.[4]
9.నగ ఉన్న గింజ , మసాలావడలు చేసే పప్పుధాన్యం.[3]
12. నస పేరులో ఉన్నా రుచి అధికం , చింపిరి చింపిరి గుడ్డల సోగ్గాడు.[3]
14.తల్లి చేసే మేలు కంటే ఎక్కువట!ఐనా కంపే, తరుగుతుంటే దుఖమే![2]
15. తీగ కూరగాయ వేపుడు కరకర మహారువి దొంగకాయకాదు దొరే![2]
16.చివర రాళ్ళుకట్టకపోతే వంకర్లు తిరిగే స్వభావ్మ, మనిషి బుధ్ధికి ఉదాహరణ.పముపోలిక, పొర్లుతో పోట్లాట?[2]
17. ఎర్రని పండు, అన్ని వంటకాలో స్థానం ప్రత్యేకం. ముఖ్యంగా రసానికి ఎటుచదివినా ఓకే![3]
19. జొన్న, గారిల మెట్ట సోదరి.కంకిధాన్యం.[2]
20.పప్పు, సాంబారులకు దీనిస్థానం అతిముఖ్యం,ఈపచ్చడిమిదకధ ఉంది.రేటు నేడు వెల అతి ఎక్కువ {2]
21. బీరపెద్దన్న!లేలేత కాయలకోత బీరాలు చెప్పట మని అంటారు [2]
23. కడవంతదైనా కత్తి పీటకు లోకువని నానుడి- అమెరికాలో దీనిపేర పెద్ద పండుగ అక్టోబర్ 30న.కత్తికి బెదిరి వెనక్కు తిరిగింది[3]నుండీ ఎరుపు, ఆతర్వ
25.' మంచి 'చివరనున్న ఒక చిన్న గురిగింజవంటి పండు, కంటికి ఎంతో మేలుచేసే ఈకాయ మూడు రంగులు మారుస్తుంది,. పచ్చ నుండీ ఎరుపు, చివర్న నీలం, పచ్చి మిరపవంటి మొక్క , మధ్యలో సున్న కోల్పోయింది..[3]
27. పండు ఎంత ఉపయోగమో కాయా అంతే!అన్నికాలాల్లో లభ్యం.తెలుగు అక్షరమాల మొదలయ్యే మొదటి అక్షరం. [3]
published in sathyasaibalavikas monthly magazine 2013
No comments:
Post a Comment