Saturday 6 April 2019

అత్త తొక్కింది పాతకుండ, కోడలు తొక్కింది కొత్తకుండ.


అత్త తొక్కింది పాతకుండ, కోడలు తొక్కింది కొత్త కుండ.
                స్వాతంత్య్ర దినోత్సవం ముందురోజు ముంగమూరు పంచాయితీ ఆఫీసులో మరునాటి వేడుకలకోసంఏర్పాట్లుజరుగు తు న్నాయి
      పంచాయితీ ఆఫీసరు, పంచాయితీ  ప్రెసిడెంట్ దగ్గరుండి ఏర్పా ట్లు చూస్తున్నారు.
మూడు స్కూళ్ళ పిల్లలు మూడు వందల మంది, ముప్పై మంది ఉపాధ్యాయులు ఉదయాన్నే ఊరేగింపుగా పంచాయితీ ఆఫీసు కు వచ్చి, కొన్ని కార్యక్రమాలు పాటలు, నృత్యాల వంటివి చేయబోతున్నారు
         దానికోసం వేదిక, ఇంకా అనేక ఏర్పాట్లూ ఘనంగా చేయి స్తున్నారు. పంచాయితీ ప్రెసిడెంట్ గారు గెలిచాక వస్తున్నమొద టి పండుగ అదే. పిల్లలందరికోసమే కాక ఊర్లో పండుగ చూడను వచ్చే వారందరికోసం లడ్డూలు చేయిస్తున్నారాయన
    పెద్ద పాఠశాల పెద్దపంతులు గారు కూడా వారి కోరికపై అక్కడ ఏర్పాట్లలో పాలుపంచు కుంటున్నారు.

               ఒక కూలీ వ్యక్తి ఒక పెద్ద ఎత్తైన బల్ల ఎక్కి వేదిక చుట్టూ తోరణాలు కడుతున్నాడు. ఇంతలో పెద్ద శబ్దంతో బల్ల విరిగి వ్యక్తి క్రిందపడ్దాడు. పెద్దగా దెబ్బ తగల్లేదుకానీకొద్దిగా  గాయాల య్యాయి. బల్ల మాత్రం మధ్యలో చెక్క విరిగి పోయింది

        పంచాయితీ ప్రెసిడెంట్ వచ్చిచూసి, "ఏమోయ్ ! జాగ్రత్త ఉండద్దూ! ఇలా బల్లలన్నీ విరగ్గొట్టుకుంటూ పోతే మన పంచా యితీ సంపద ఏమైపోనూ! చూసుకుని వాడుకోవద్దూ!" అంటూ కోప్పడ్డాడు.

    క్రిందపడ్డ ఆవ్యక్తి మోకాళ్ళు డోక్కుపోయి చిన్న పాటి గాయాల య్యాయి. అక్క డే ఉన్న పెద్దపంతులుగారు "లేదు లెండి ప్రెసి డెంట్ గారూ బల్ల చాలా పాతది. గత ఏడాదే దీన్ని రిపేర్ చేయించమని చెప్పాను. పాత ప్రెసిడెంట్ గారు విన్నారు కాదు." అంటూ తన బ్యాగ్ లోని ప్రధమ చికిత్స పెట్టేతీసి క్రింద పడ్డ వ్యక్తికి ఫస్ట్ ఎయిడ్ చేశారు
      ఆ తర్వాత మరొకరు ఎత్తైన నిచ్చెన తెచ్చి తోరణాలు కట్టారు. తర్వాత అక్కడ కట్టిన బ్యానర్ లో తన పేరు బాగా కనిపిస్తున్నాదా, లేదాని చూడను ప్రెసిడెంట్ గారు పక్కనే ఉన్న ఒక బల్లమీద ఎక్కి చూస్తుండగా, బల్ల ఆయన బరువుకు మధ్యలో కన్నంపడి ఆయన పైనుంచీ క్రిందకు జారి పోయాడు

        అందరూ వచ్చి ఆయనకు చేయిచ్చి పైకి లాగారు.
"ఏమయ్యా! మంచి బల్ల చూసి ఇక్కడ పెట్టవద్దూ! పాత పాతవి తెచ్చి పెట్టి ఇలా చేస్తారా!" అంటూ అందరి మీదా నోరుచేసు కున్నాడు.

   పెద్దపంతులుగారు వచ్చి "సార్! ఇది రోజే కొని తెచ్చిన కొత్త బల్ల. దాని బలం అంతబాగా ఉంది. దాన్ని తయారు చేసిన వారి చాతుర్యం ఇంత గొప్పగా ఉంది." అని సర్ది చెప్పారు.

 దూరంగా రంగు కాయితాలు కట్టిస్తున్న పంచాయితీ ఆఫీసరు దగ్గరికొచ్చి పెద్ద పంతులుగార్ని "ఏమైంది మాస్టారూ!" అని అడి గారు
        దానికి పెద్ద పంతులుగారు "ఏమీ లేదండీ! ‘అత్త తొక్కింది పాతకుండ, కోడలు తొక్కింది కొత్తకుండ. అంతే పదండి మిగతా ఏర్పాట్లు చూద్దాం" అని నవ్వుతూ కదిలారు.
                                                             ***

No comments:

Post a Comment