Saturday 6 April 2019

పుస్తకం హస్తభూషణం.


పుస్తకం హస్తభూషణం.

   తాతగారి గదిలో పుస్తక అలమార దగ్గర హర్ష కుదురుగా కూర్చు ని, ఒకపెద్ద గ్రంధం తీసి చూస్తున్నాడు. తాతగారు పూజ ముగిం చి వచ్చారు.
"ఏరా హర్ష! ఏం గ్రంధం చదువుతున్నావ్!" అని అడిగారు ఆశ్చ ర్యంగా.
"లేదు తాతగారూ! భాష నాకేం అర్థమవుతుందీ! అంతా కొత్త పదాలే. బొమ్మలు చూస్తున్నానంతే." అని అన్నాడు.

     "బావుందిరా హర్షా! నీలాంటి వాళ్ల కోసమే పుట్టినట్లుంది సామెత. 'పుస్తకం హస్త భూషణం' అని." అని అన్నారు తాతగారు.

  "అదేంటి తాతగారూ! కాస్త అర్థమయ్యేలా చెప్పరూ! హస్తమంటే ఏంటీ?"
"హస్తమంటె చెయ్యిరా! పద! ఆలా తోటలో కూర్చుని చెప్పు కుందాం." అంటూ మనవడితో కలిసి తోటలోకి నడిచారు

     ఇద్దరూ చప్టామీద కూర్చున్నారు పూలబాలకేసి చూస్తూ.
"త్వరగా చెప్పండి తాతగారూ! మళ్ళా మా స్నేహితులు వస్తారు, వారితో కొద్దిసేపు ఆడుకోవాలి" అంటూ తొందరచేస్తున్న మనవడి కేసి చూస్తూ అదేరా హర్షా! నా అనుభవం చెప్తాను, విను.  
   అవి నేను ఉపాధ్యాయ వృత్తిలో చేరిన తొలిరోజులు. రోజుకో పుస్తకం చదివి కొత్త విషయాలు నేర్చుకోందే నాకు తోచేదికాదు. మా గురువులు 'ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి. రోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉండాలని చెప్పిన మాటలు పాటించేవాడిని. రోజూ స్కూలయ్యాక గ్రంధాలయంకేసి వెళ్లే వాడిని. గ్రంధాలయం చాలాదూరం ఐనందున టౌన్ బస్ లో వెళ్లేవాడ్ని. ఆగ్రంధాలయంలో చాలా పుస్తకాలు ఉండేవి. చందా కడితే ఇంటికీ ఇచ్చేవారు.
అలారోజూ బస్ లో వెళుతుండగా నేనొక వ్యక్తిని గమనించేవాడ్ని. తెల్లని నేత పంచె లాల్చీ ధరించి , తలపాగాకూడా పెట్టుకుని, నుదుట పెద్ద ఎర్రని కుంకుమ బొట్టు విభూతి ధరించి, చూట్టానికి పెద్ద పండితునిలా ఉండేవాడు. ఒక పెద్ద గ్రంధాన్ని చేతిలో ఉంచుకుని బస్సెక్కి, దిగేవరకూ దాన్ని చదువుతూ, గ్రంధాల యం రాగానే పుస్తకం ఇచ్చేసి, మరో పెద్ద పుస్తకం పట్టుకు పోయేవాడు. అక్కడ కూర్చుని మా అందరిలా చదివేవాడుకాదు. అందువల్ల అతడితో మాట్లాడటానికి అయ్యేదికాదు
   అతనికి నేను అనేక సార్లు బస్ లో సీటు కూడా ఇచ్చాను. బస్ చాలా రద్దీగా ఉండటాన అక్కడ పలకరించను అయ్యేదికాదు.

         ఒకరోజున నేను కాస్త స్కూల్లో అలస్యమై లేటుగా బస్టాప్ కెళ్ళాను. రోజూ నేనెళ్ళే బస్ వెళ్లిపోయింది. ఆతర్వాతి బస్సెక్కి వెళ్ళాను. ఆపాటికే పండితుడు తన అలవాటు ప్రకారం కొత్త పుస్తకం తీసుకుని బయటికొస్తున్నడు. దొరికిన అవకాశాన్ని నేను వదులుకోదలచలేదు. 
      ఎదురుగా వెళ్లి "నమస్కారమండీ! తమరితో చాలా కాలంగా మాట్లాడాలనుకుంటున్నాను, నాకున్న కొన్ని సందేహాలూ తీరు స్తారేమోని" అంటూ మెల్లిగా నవ్వాను
    అతడూ నవ్వాడు. "మరి పేరు తెల్సుకోవచ్చా! ఇప్పటికి ఎంత కాలంగా గ్రంధాలయాన్ని పావనం చేస్తున్నారు? ఎన్ని గ్రంధా లు చదివారు?" అని అడిగాను
    దానికి అతడి నవ్వే సమాధానమైంది. మెల్లిగ తలూపి బయల్దే రాడు. ఆరోజు ఎలాగైన ఆతడి ఇంటికెళ్ళి నా సందేహాలు తీర్చు కోవాలనే పట్టుదలతో నేను అతడి వెనకాలే వెళ్ళాను
  అతడు ఒక ఇంటిముందు ఆగాడు. అతడితో పాటుగా నేనూ లోనికెళ్ళాను. అతడు ఇంట్లో ఒక గదిలో కుర్చీలో కూర్చుని ఉన్న ఒక ముదుసలి వ్యక్తికి గ్రంధం ఇచ్చాడు
   ఆ ముసలి వ్యక్తి ఆత్రంగా గ్రంధం తీసుకొని చదవడంలో మునిగిపోయాడు. నేను దగ్గరగా వెళ్ళి "నమస్కారమండీ!" అన్నాను
      ఆ ముసలాయన తలెత్తి చూసి "ఎవరు బాబూ! కూర్చో! నారా యణా! కుర్చీపట్టుకురా!" అన్నాడు. 
 ఒక వ్యక్తి కుర్చీతెచ్చి వేసి వెళ్ళిపోయాడు
  నేను కూర్చుని "అయ్యా నేనొక ఉపాధ్యాయుడ్ని. రోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోందే నాకు నిద్రపట్టదు. తమరికి పుస్తకం తెచ్చిచ్చిన పండితుల వారితో మాట్లాడి నా సందేహాలు తీర్చుకోవాలని నా ఆశ." అని అన్నాను
   అతడు పెద్దగా నవ్వాడు, చాలాసేపు. "వాడా! ఒరే నారాయణా! ఇలారా!" అని పిలిచాడు. ఇందాక నాకు కుర్చీతెచ్చి వేసిన వ్యక్తి వచ్చాడు
  "వీడేనండీ ! పండితుడు. వీడికి చదువంటే చాలా ఇష్టం. కానీ అబ్బలేదు. నా దగ్గర పనిచేస్తుంటాడు. ఇలా నా దుస్తులు ధరించి గ్రంధాలయానికి వెళ్లి నాకు పుస్తకాలు తెచ్చి ఇస్తుంటా డు. రాగానే దుస్తులు మార్చేసుకుంటాడు. అంతా అతడ్ని పండి తుడని భ్రమపడతారు. వీడికి పుస్తకమే హస్త భూషణం." అని నవ్వాడు.
అదిరా హర్షా! చదువులేకుండా ఊరికే పుస్తకాలు పట్టుకు తిరిగే వారిని చూసి సామెత చెప్తారు. అన్నారు తాతగారు. ఇంతలో బయటినుంచి హర్షా అని వినిపించగానే హర్ష 
   "థ్యాంక్యూ తాతా! టాటా| అంటూ బయటకురికాడు.
                                                ***


No comments:

Post a Comment