Sunday 18 August 2013

కదళీ ఫలం

చిన్నారి 




కదళీ ఫలం


ap -   Sun, 18 Aug 2013, IST


కదళీ ఫలం,andhra prabha,telugu, news paper,epaper,hyderabad,online games for girls, telugu news, hot,cinema,show,sunday book,breaking news,telangana,vidyaprabha, corparate accounting,student voice,kulasa,naika,balaprabha,chintana,business,sports

దుర్వాస మహర్షి తన భార్య అయిన 'కదళి'తో కలిసి ఒక పర్ణశాలలో నివస్తున్నాడు. అక్కడే భార్య సహకారంతో జపతపాదులు చేసు కుంటూ కాలం గడుపుతున్నాడు.
భర్త కోపం గురించి తెలిసిన కదళి ఎంతో జాగ్రత్తగా ఆయనకు సపర్యలు చేస్తుండేది.
ఒక రోజు సాయంత్రం అలసటగా ఉండడంతో మహర్షి ఆశ్రమం బయట నడుం వాల్చాడు. ఇంతలో సాయం సంధ్యా సమయం మించిపోతోంది. సంధ్యావందనం చేసుకునే సమయం దాటిపోతుండడంతో భర్తను లేపడం తన కర్తవ్యంగా భావించింది కదళి.
మంచి నిద్రలో ఉన్న దుర్వాసుడిని ఆమె తట్టి లేపింది. నిద్రాభంగం కావడంతో కోపం తెచ్చుకున్న ఆయన తీవ్రంగా కదళివైపు చూశాడు. అంతే ఆ తీక్షణతకు తట్టుకోలేక కదళి భస్మమయి పోయింది.
ముందు వెనుక ఆలోచించక తెచ్చుకున్న కోపంతో జరిగిన ఆనర్థానికి బాధపడ్డాడు దుర్వాసుడు.
కొన్నాళ్ల తరువాత కదళి తండ్రి తన కుమార్తెను చూసేందుకు ఆశ్రమానికి వచ్చాడు. అయితే జరిగిన విషయం చెప్పడానికి భయపడ్డాడు దుర్వాసుడు. చివరికి ఆయన పదేపదే అడగ్గా జరిగిన విషయం చెప్పి క్షమించమని వేడుకున్నాడు.
అంతేకాక తన తపో శక్తితో కదళి భస్మం నుండి ఒక చెట్టును సృష్టించాడు. అదే కదళృ వృక్షం. ఆ ఫలమే కదళీ ఫలం.
ఆ ఫలాన్ని మామగారికి ఇస్తూ నేటి నుంచి మీ కుమార్తె కదళీ అందరికీ ఇష్టురాలై దేవతా కార్యక్రమాల్లో, శుభకార్యాల్లో ముఖ్య భూమిక పోషిస్తుందని మాట ఇచ్చారు.
ఇప్పటికీ మనం అరటిపండును (కదళీ ఫలం)ను దేవుడిముందుంచి కదళీ ఫళం సమర్పయామి అని చెప్పి నైవేద్యం పెడుతున్నాం.
- ఆదూరి హైమావతి, చికాగో.
*****************************************
ఆదివారం 18-8-2013 ఆంధ్రప్రభ ' చిన్నారి 'లో ప్రచురితం.

No comments:

Post a Comment