Saturday 13 July 2019

ఈ పాప మెవరిది ?


                         పాప మెవరిది ?
ఏడెనిమి నెలల పసికూన నేలమీదపడి ఏడుస్తున్నాడు. పక్కనే సోఫాల్లో విడివిడిగా వాడి అమ్మా నాన్నాతమ ల్యాప్ ట్యాప్స్ లో టక టకా ఏదో కొట్టు కుంటున్నారు.  వాడి ఏడ్పు తారస్థాయికి వెళ్ళింది.
 " ఏయ్ రంజనీ !వాడ్ని చూడూ! ఏంటా వెధవగోల?" కోపంగా అరిచి తిరిగి తన టకటకా ల్లో పడి పోయాడుదినేష్
" నాకు ముఖ్యమైన పవర్ పాయింట్  ప్రెజెంటేషన్ ఉంది ఈరోజు. పని ఆపి కాస్త నీవే చూడు దినేష్! " తనూ అదే స్థాయిలో అరచి , తిరిగి తన టకటాకల్లో పడిపోయింది ఆమె ,అదే రంజని  .
 పిల్లవాడి ఏడ్పు మరికాస్త పెరిగింది. " ఏయ్ నిన్నే ! వాడి ఏడ్పు వినిపిం చ ట్లేదా! వాడి ఏడ్పు ఆపు, నాకు విసుగ్గా  ఉంది. " మొరి గాడు దినేష్.
" నీవే చూడు దినేష్ ! నాకు టైం లేదు.500 మంది ముందు నా ప్రెజెం టేషన్ ఉంది ."అంటూ తానూ మొరిగి,తిరిగి పనిలో పడిందిరంజనిఆమె ఒళ్ళో  ల్యాప్ ట్యాప్  క్రిందపడి ఏడుస్తున్న వాడిని చూసి నవ్వింది. నీ  స్థానం లో నేను పర్మె నెంట్ ఐపోయా నని. అదేం తెలీని ఆపసివాడు ఆకలికీ , డైపర్ నిండి ఇబ్బంది పె డు తున్న పుప్పూ ,పిప్పీలకూ  వాడి ఆయుధమైన ఏడ్పు పెంచాడు.   
" ఏయ్ ! చెవుడొచ్చిందా ! ఎన్ని సార్లు చెప్పాలి నీకు ? వాడి ఏడ్పు విని పించట్లేదా! "ఉరిమాడు దినేష్ .
" దినేష్ ! నిన్నే చూడమని నేనూ చెప్పాను, నాకు అర్జెంట్ ప్రెజెంటేషన్ ఉంది.  " తనూఉరిమింది  రంజని.
" నీవు తల్లి వేనా బిడ్డ ఏడుస్తుంటే కదలవుకసిగా కసిరాడు దినేష్.       
" నీవు తండ్రివి కాదా వాడికి! ఒక్కరోజు చూస్తే ఏంటవు తుంది?" తానూ కసిగా కసిరింది రంజని.
" ఆడమనిషి  చేయాల్సిన  పనులు  నేను చేయటమేంటి? నేను మగాడ్ని"
" మగవాళ్ళు చేసే ఉద్యోగాలు చేసి మేము సంపాదిస్తే మీమగజాతి అను భవించట్లేదా? ఆడట ఆడ!"
" మితి మీరు తున్నావ్ ! అసలు వీడ్ని మీ అమ్మ వద్దకు పంప మంటే విన్నావా?"
" ఏం మీ అమ్మచూడలేదా? మా అమ్మ నాకు వేవిళ్ళంటే వచ్చి  ఏడాది పాటు ఉందిక్కడ. మా నాన్న గారికి వంట్లో బావులేదంటే వెళ్ళింది.మీ అమ్మవద్ద దింపిరమ్మన్నాను  , విన్నావా?"
" ఆవిడెక్కడ చూస్తుంది ? మా తాతా తోనే సరిపోతుంది."
" మరెందుకు మనవడు కావాలని తొందర పెట్టి కనిపించింది. కాన్పు కోసం పెట్టిన రెండు నెలల సెలవు ల్లో  నా కెరీరంతాపా డైందివీడ్ని కనమన్నావిడ  చూడలేదాఏం?"
" వీడ్ని కనింది కేవలం మా అమ్మకోసమేనా?"
" కాక మరేంటి ? నాకోస మనుకున్నావా? ఆరోజే చెప్పాను , నాకి ప్పుడే పిల్లల్నుకనాలని లేదనినీవూ నీ అమ్మా కల్సి నా ప్రాణం తీశారు, ఇప్పు డేమో వీడ్నిచూడను తనవల్ల కాదంటుందా ఆవిడ?"      
"ఏంటే మా అమ్మ నీ కొడుకును  చూడాలా?"
" ఆహా! నీ క్కాదా కొడుకు? నీ ప్రమేయం లేకుండా నే వాడు పుట్టు కొచ్చా  డా! నీ బలవంతం మీదే కన్నాను."
" తెలివితక్కువగా మాట్లాడకు. ఎవరిపిల్లల్ని వాళ్ళు పెంచుకోవాల ని కూడా తెలీదా నీకు?"
" అదే అంటున్నాను, వీడ్ని పెంచటంలో నీకూ భాగముందని , ఈరోజు వీడ్ని నీవే చూడాలి ,వెళ్తూ వెళ్తూ దార్లోడేకేర్లోదించివెళ్ళి సాయంకాలం తీసుకురా! నేను వచ్చేసరికి   లేటవుతుంది." అంటూ ల్యాప్ టాప్ బ్యాగ్ లో వేసుకుని లేచింది .
" ఏంటే మరీ రెచ్చిపోతన్నావ్! చేతిలోకారు  , క్రెడిట్ కార్డూ ఉన్నా యని పొగరా!"
" షిట్ !మాట్లాడకు ,నాసంపాదన మాత్రమే వాడుతున్నాను ,ఇంటి ఖర్చు లకు సైతం, షేర్ చేసుకోను చేతకాని వాడివి ఎందుకు కనమ న్నావ్ వీడ్ని? " అంటూ కారు తాళాలు తీసుకుని వెళ్ళిపోయింది .               
" బుల్ షిట్ ! " అంటూ స్నానాల గదికెళ్ళిపోయాడు దినేష్,పసివాడ్ని  వాడిఖర్మానికి వాడ్నివదిలేసి
 పిల్లాడి ఏడ్పు గంటనుంచీ వింటున్న పక్కింటి పార్వతమ్మ ఇహ ఆగ లేక  గబగబా వచ్చింది . పిల్లాడు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లాడు. వాడి డైపర్ మార్చి, వంట గదిలోకెళ్ళిపాలు వేడిచేసి తెచ్చి పట్టింది. పాలుత్రాగి , ఆకలి ,శరీరబాధ తీరగానే అలసటతో వాడు నిద్రలోకి జారుకున్నాడు
          ఈలోగా దినేష్  తయారై  వచ్చి చూశాడు. నిద్రపోతున్న పిల్లడ్నీ, పార్వతమ్మగారినీనీ.                                      
 " అయ్యో ! పిన్నిగారూ ! మీరా! వీడు ఉదయం నుంచీ ఒకటే  ఏడ్పు." అన్నాడు నొచ్చుకుంటున్నట్లు
" విన్నాన్నాయనా! మీ ఆవిడ లేనట్లుంది ఇంట్లో , అందుకే పిల్లడి ఏడ్పు గంటనుంచీ  వింటూ మరి ఉండలేక వచ్చాను, ఏమీ అనుకో కునాయనా! పాతకాలం వాళ్ళం పిల్లలేడుస్తుంటే వింటూ ఉండలే ము బాబూ ! వస్తా ను." అంటూ ఆవిడవెళ్ళగానే , తానీరోజు వీడ్ని డేకేర్లో  ‘దించి  వెళ్ళాలని గుర్తువచ్చి  , బేబీ సీట్ తీసి కార్లో వేసి  , నిద్రపోతున్న పిల్లడ్ని తీసి కారు సీట్లో పెట్టి , ఇంటికి తాళంవేసి బయల్దేరాడు. కారు స్టార్ట్ చేయగానే , ఆఫీస్ నుండీ ఫోన్. మొబై ల్లో  మాట్లాడుతూ ఆఫీస్ కెళ్ళిపోయాడు దినేష్కారు పార్క్ చేసి పరు గులాంటి నడక తో   తన ఛాంబర్ కేసి వెళ్ళి ,  సీట్లో కూర్చుని పని మొదలెట్టాడు.
రాత్రి పదయ్యాక  ఆరోజుకు అంగడి కట్టేసి వచ్చి కార్లోకూర్చోగానే తిరిగి కాల్ రావటంతో,మాట్లాడుతూనే డ్రైవ్ చేస్తూ ఇల్లు చేరి సోఫా లో కూర్చుని మాట్లాడసాగాడు .
         రాత్రి 11గంటలకు ఇల్లు చేరిన రంజని అల సటతో సోఫాలో వాలి పోయి ,పది నిముషాలయ్యాక ,
 " ఏయ్! దినేష్ ! బాబేడీ!నిద్రపోతున్నాడా!"అంది.
మొబైల్ పక్కనపడేసి " బాబా! నాకేంతెల్సు?" అన్నాడు.
" ఉదయం నిన్నుడే కేర్లోదింపి సాయంకాలం తెమ్మన్నాగా ! తేవ టం మర్చిపోయావా? " అంది.
" నన్ను తెమ్మన్నావా!" 
" ఔను నిన్నే దింపి , తెమ్మన్నాను కూడా"
" ఉండుండు " అంటూ కారు తాళాలు తీసుకుని  గరేజ్ లోకి పరు గెట్టాడు దినేష్ .రెండునిముషాలకు,
" రంజనీ! రంజనీ !" అని పెద్దగా అరిచాడు. అరుపులు రంజని తో పాటు ఇరుగుపొరుగుకు అంతా విని పించాయి.
 రంజని గరేజ్ లోకి దూకి తలుపు తీసి ఉన్నకార్లోకి చూసి మ్రాన్పడి , పెద్ద గా అరుస్తూ క్రింద పడి పోయింది. పక్కింటి పార్వతమ్మ కుటుంబం , అప్పు డే నిద్ర పోబోతున్న ఇరుగుపొరుగు వారంతా వచ్చి  జరిగిన ఘోరాన్ని చూసి   " అయ్యో !అయ్యో ! బిడ్డడు చచ్చిపోయాడు! ఎలాజరిగిందీ ఘోరం ?!" అంటూ ప్రశ్నించ సాగారు.
రోజూ జరిగేవి వద్దన్నా గోడే అడ్డంకనుక అంతా చూచాయగా తెలు  సున్న పార్వతమ్మ మాత్రం ,                                                                               
   " పెంచలేని వాళ్ళకే బిడ్డలనిస్తాడు   భగవంతుడు! పండంటి బిడ్డ ! పాపం ఎవరిది?" అంటూ లోని కెళ్ళిపోయింది , కళ్ళుతు డుచు కుంటూ.    
ఔను ఆపాపం ఎవరిఖాతాలో రాస్తాడు యమధర్మరాజు? వాళ్ళకు పెళ్ళి చేసిన పెద్దలకా? వద్దను కుంటూనే బిడ్డనుకన్న తల్లికా? కన్నామాతృ ధర్మంమరచిన  తల్లికా?   తన వృత్తిధర్మం  తప్పపితృధర్మం’  తెలీని తండ్రికా? మగ వాళ్ళకుదీటుగా  ఉద్యోగాలు పంపకం చేస్తూ,వారికి ఉద్యో గా లిచ్చినసంస్థకా?ప్రమోషన్లవేటలో పడి తల్లిదండ్రులమని తమ ధర్మం మరచిన వారిద్దరికీనావారికి పండంటి బిడ్డనిచ్చిన బ్రహ్మదేవుని దా?  ఎవరిది ఈపాపం?      
                                              ****

                  

9 comments:

  1. Present generation ది ఆ పాపం, పోటీ ప్రపంచంలో బతికే పిల్ల బతుకుతున్నది లేకపోతే తల్లిదండ్రులు చేతిలోనే చనిపోతున్నారు.

    ReplyDelete
  2. నైస్ బ్లాగ్ అండి . భలే బావుంది
    మానసికంగా ఒకరితో పెళ్లికి సిద్ధమయ్యాక, వేరే అబ్బాయి తన మనసుదోస్తే, చివరకు ఆ అందాల ముద్దుగుమ్మ ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది?
    ప్రేమ ఎంత మధురం – ఒక ముద్దుగుమ్మ ప్రేమ కథ
    Prema Entha Madhuram | Latest Telugu Love Film | Directed by Ravikumar Pediredla
    https://www.youtube.com/watch?v=RywTXftwkow

    ReplyDelete
  3. హృదయవిదారకమైనకథ...ఆదూరి హేమలత వారూ..ఇలాంటి కథల్ని..ఆఫీసు రెస్టురూముల్లో పెట్టాలి.
    రైల్వేస్టెషన్ లలో బస్టాండుల్లో..డిస్ప్లే చేయాలి..ప్రమాదంలో ఉన్న పిల్లాడిఫోటోతో పాటు..ఈ..పాపం ఎవరిదన్న కాప్షున్ తో..చైతన్యంకోసం

    ReplyDelete
  4. magnificentincense.com
    24K Monkey Classic Incense 10g
    AK-47 – X10 / PREMIUM
    Bizarro Incense
    Buy Black Mamba Incense Online
    Buy WTF Herbal Incense
    Cloud9 Mad Hatter Incense
    Crazy Monkey Incense
    k2 spray on paper
    k2 paper sheets
    Klimax Potpourri 15xxx Coconut(10g)
    Crazy Monkey Incense
    Cloud9 Mad Hatter Incense
    Buy Purple Diesel Incense Online
    Buy Pure Fire Herbal Incense Online
    Buy Kisha Cole Incense (11g) online
    Buy KUSH HERBAL INCENSE online
    Buy Mind Trip Incense Online
    Buy Platinum XXX Herbal Incense online
    buy Orange Platinum Caution 10G
    Buy OMG HERBAL POTPOURRI 10G online

    ReplyDelete
  5. magnificentincense.com
    24K Monkey Classic Incense 10g
    AK-47 – X10 / PREMIUM
    Bizarro Incense
    Buy Black Mamba Incense Online
    Buy WTF Herbal Incense
    Cloud9 Mad Hatter Incense
    Crazy Monkey Incense
    k2 spray on paper
    k2 paper sheets
    Klimax Potpourri 15xxx Coconut(10g)
    Crazy Monkey Incense
    Cloud9 Mad Hatter Incense
    Buy Purple Diesel Incense Online
    Buy Pure Fire Herbal Incense Online
    Buy Kisha Cole Incense (11g) online
    Buy KUSH HERBAL INCENSE online
    Buy Mind Trip Incense Online
    Buy Platinum XXX Herbal Incense online
    buy Orange Platinum Caution 10G
    Buy OMG HERBAL POTPOURRI 10G online

    ReplyDelete
  6. https://k2incenseonlineheadshop.com/
    k2incenseonlineheadshop
    info@k2incenseonlineheadshop.com
    Buy liquid incense cheap
    Buy liquid incense cheap For Sale At The Best Incense Online Shop
    K2 Spice Spray | Liquid K2 | Liquid Spice | K2 Spray for sale
    https://k2herbalblendshop.com/

    ReplyDelete
  7. https://bestmjstrainsonline.com/

    Buy Liquid Incense Cheap
    Buy K2 E-Liquid online
    Cheap Herbal incense

    Buy K2 Infused paper spray online, order K2 Spray online +1 (925) 526-5453

    https://bestmjstrainsonline.com/product/5-co2-cannabis-oil-cartridges/



    ReplyDelete